చూడండి స్పూర్తి కోసం ఎక్కడో పుస్తకాలలో చదవక్కరలేదు.
మన మధ్యే ఎంతో మంది ఉన్నారు .వాళ్ళను చూస్తె అబ్బ
మనం కూడా పుట్టిన దానికి జన్మ సార్ధకత చేసుకుంటే
బాగుండు అనిపిస్తుంది.
సిక్కిం లో భూకంపం వచ్చిన తరువాత యెంత ఘోరంగా
ఉందంటే పరిస్తితి అంత ఘోరంగా ఉంది.యెంత మంది దార్లు
మూసుకు పోయి "దేవుడు లేడా"అని అనుకుంటూ ఎదురు
చూస్తున్నారు......
"దైవం మానుష రూపేణా"అంటారు పెద్దలు.
దేవుడు ఎక్కడ నుండో రాడు
మనకు ఆ క్షణం లో సాయం చేసే వాడే దేవుడు.
అలా వచ్చిన వారే "పూర్ణిమా రనాడే""అరుణిమా విదాతే"
మహిళలు అనుకుంటే ఏ రంగం లో అయినా సేవ చేయగలరని చూపారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్సు తరుపున ఈ ఇద్దరు మహిళా పైలట్లు
దాదాపు 250 గంటలు పైనే రేస్క్యు ఆపరేషన్ లో పాల్గొని భూకంప
భాదితులకు సాయం చేస్తూ చక్కర్లు గొట్టారు.
ఇంత సేపు పని చేయటం అనేది శారీరిక నిర్మాణం దృష్ట్యా
ఆడవాళ్ళకు చాలా కష్టం.మరి మన అనుకున్నారు కాబట్టే
భాదితులకు సాయం చేయగలిగారు.(నాకైతే ఎక్కువ పని చేసాను
అనుకోండి ఎంచక్కా చెవుల్లో సిలోన్ radio station "కుయ్"
మని వచ్చేస్తుంది)
వారికి అందరం hatsoff చెప్పాలి.....కదా...
ఇంకో సంగతి చూద్దాము.ఇక్కడ నెల్లూరు జిల్లా లో మా
సూళ్ళూరు పేట మండలం లో అటకాని తిప్పలో జరిగింది.
ఇక్కడ ఆటకాని తిప్పలో గ్లోబల్ స్కూల్ నిర్మించారు.
దీనికి సాయం చేసింది బెల్జియం దేశం వారు.
అక్కడ "ఎంజిలిన్"అనే మహిళా వంద మీటర్ల పరుగు పందెం
లో వచ్చిన బహుమతి రూ..1.25 లక్షలు మొత్తం
ఖర్చు పెట్టి ఇక్కడ డైనింగ్ హాల్ కట్టించింది.
మరి వీరందరూ అవతలి వాళ్ళు ఎమవుతారని సాయం చేసారు.
కేవలం వాళ్ళు మనుషులే అనే చిన్న స్వార్ధం తప్ప......
మనిషి
దేవుడయ్యాడు
విశాల
హృదయం చూపి..........
9 comments:
hmm... హ్యాట్సాఫ్ వారికి..
It's Great thing. daivam maanusha roopeNaa ...
వనజగారు మీరు చాలా గ్రెట్ అండి...పెట్టగానె చదివెసి
నాకు బలె ఎంకరెజ్ చెస్తారు.థాంక్స్.
@రాజ్...బొల్డు థాంక్లు....నీ ఎంకరెజ్ మెంట్
యెప్పుడు ఉంటుందని నాకు తెలుసు.
250 గంటలు పని చేసారా? నిజంగా మనసున్న మనుషులే!
sree gaaru thank u for visiting my blog.
You are welcome. బాగా రాస్తున్నారు, రాస్తూ ఉండండి.
sree gaaru thank u.
నిజమే శశి గారు..అంత దయా హృదయం ప్రతి ఒక్కరికి రాదేమో...
మంచి మంచి టపాలు రాస్తున్నారు..:)
స్పూర్తి కోసం ఎక్కడో పుస్తకాలలో చదవక్కరలేదు..మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం .
Post a Comment