Friday 16 September 2011

జై సంజీవిని మాత..మస్తుగుంటై కదలు 3

నా ఉద్యోగ నిమిత్తం నేను, మా వారు హనుమ కొండలో 
కాపురం పెట్టాము.అయితే అప్పుడు దసరా సెలవల ముందు 
పాలు పొంగించకూడదని వంట మొదలు పెట్ట లేదు.
మేము మాలాగే చిత్తూర్ నుండి వచ్చిన జంట ఉండేవారు.
అందరం కలిసి హోటల్ లో భోజనం చేసి దగ్గరలో 
వేయిస్తంబాల గుడి ఉంటె రాత్రి దాకా అక్కడ ఉండి
వచ్చే వాళ్ళం.(మరి ఇంకెక్కడకు పోయినా జేబులో 
డబ్బులు హుష్ ..కాకి..)

మా పాప ని మా అత్తగారింట్లో వదిలి వచ్చాము.
మా వారి అన్నగారు S.B.I.లో మేనేజర్ .వాళ్ళు మా 
పెళ్లి అయిన కొత్తల్లోనే ట్రాన్స్ ఫర్  అయి వేరే ఊరికి 
వెళ్లి పోయారు.అందుకని మా పాప వాళ్ళ ఇంట్లో అపురూపం.
యెంత అంటే ఈమెకి ఎక్కడ వేడి తగులుతుందో అని 
అప్పటి కప్పుడు కూలర్ కొని మా మరుదులు రోజు ఆమెకోసం 
వేసేవాళ్ళు.ఇంక మా ఆడ బిడ్డ చెప్పనే అక్కర్లేదు......
రోజుకొక డ్రెస్,బొట్లు...రక రకాలు..మా మామ గారు అయితే 
పాపకు కొత్త డ్రెస్ వేస్తె చాలు వెంటనే ఎదురుగా పోటో స్టూడియో 
లో పోటో తీయించేవారు.ఇక మా వారి అమ్మ ,పిన్నమ్మ,అమ్మమ్మ...
అబ్బో...చెప్పలేము ఈమె యువ రాణి.............

(అసలు అన్న పిల్లలు అంటే తమ్ముళ్ళకు చాలా 
ఇష్టం ఉంటుందేమో కదా)

పాపం పాప అమ్మా నాన్న దగ్గర లేరు అని
ఇంకా గారాబంగా చూసేవారు.
వాళ్లకు కిరాణా షాప్,టెంట్ హౌస్,ఎరువుల షాప్ ఉండేవి.

ఒక రోజు మా పెద్ద మరిది ఒక పురుగుల మందు బాటిల్ 
కొంచం లీక్ అవుతుంటే హాల్లో ఒక బీరువా కింద పెట్టాడు 
టౌన్ కి పోయేటప్పుడు తీసుకెళ్ళి రిటర్న్ ఇద్దామని.
మర్చి పోయి వెళ్లి పోయాడు.ఇంకేముంది పాప చక్కగా 
దోగాడుతూ వెళ్లి బాట్టిల్ పట్టుకొని నోట్లో పెట్టుకుంది.

అప్పుడే వాళ్ళ ముత్తవ్వ చూసి అందరిని పిలిచింది.ఇక చూడండి 
హడావిడి.అందరు వచ్చి గబా గబా పాప నోరు కడిగారు.
మా చిన్న మరిది ,ఆడ బిడ్డ ఎక్కిళ్ళు పెట్టి ఎడ్చారట.

అందరు ఏడుపే ఎమవుద్దో  అని.మా వారి అమ్మమ్మ అయితే 
"అయ్యో వాళ్ళ బిడ్డ మనం ఏమి సమాదానం చెప్పాలి?"
అని ఏడుపు.ఈ లోపల మా పెద్ద మరిది వస్తే డాక్టర్ దగ్గరకు 
తీసుకెళ్ళారు.దేవుడి దయ వల్ల పాప బాగానే ఉంది.ఇక అప్పటి నుండి 
మా మరుదులు పాపని సంజీవని మాత అని పిలిచేవారు.

మేము సెలవలకు వచ్చిన తరువాత ఈ విషయం చెప్పారు.
అప్పుడు ఏముందిలే ఏమి జరగలేదు కదా అని నేను పెద్ద 
పట్టించుకోలేదు.

మొన్న ఒక రోజు టి.వి.లో న్యూస్ లో చూసాను.ఒక ఆతను
అప్పుల బాద పడలేక పురుగుల మందు తాగి చనిపోతూ ,
చనిపోయే ముందు తన రెండేళ్ళ పాపను ముద్దు పెట్టుకొన్నాడు.
ఆ నురుగు తగిలి ఆ పాప కూడా చని పోయింది.తను సరే 
చనిపోయాడు,కాని పాప ను చంపే హక్కు అతనికి ఏముంది.
పాపం పాప....
(దోగాడే పిల్లలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి.)ఇంకో కధ 
ఈ సారి... ఎదురు చూస్తూ ఉండండి.మరింకేమిటి కామెంటండి.



12 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>అయితే అప్పుడు దసరా సెలవల ముందు
పాలు పొంగించకూడదని వంట మొదలు పెట్ట లేదు.

ఇలాంటి రూల్స్ నిజంగా ఉన్నాయా? లేక మీరే కనుక్కొన్నారా?

Unknown said...

శశి గారు మీరు చెప్పింది నిజం.
పసి పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్కోరు వెయ్యి కళ్ళతో కాపలా కాయాలి.
మీ పాప పేరు బావుంది జై సంజీవని మాత

kiran said...

హమ్మో ......పెద్ద గండమే తప్పింది..:)
ఆ దేవుడికి thanksulu ..:)
ఎం తిన్నారు ఆ రోజు హోటల్ లో...:P

శశి కళ said...

కిరణ్..థాంక్యు.ఒపిక చెసుకొని పని మధ్యలొ చదివావా?
గుడ్ అక్క అంటె ఆ మాత్రం ప్రెమ ఉండాలి.

బులుసు గారు ..థాంక్యు.మాలాయల పక్షాల
ముందు పాలు పొంగించరు.మీతొ ఒక సారి
మాట్లాడాలనుకున్నాను.మీ జ్ఞానం మాకు కూడా
కావాలి.

శశి కళ said...

శైలూ....ప్రెమంతా ఒకె సారి చూపించి అన్ని కామెంట్లు
పెడితె యెలాగమ్మా))))))))))))సమాదానం
ఇచ్చెది.అసలె నీ వెన్నెట్లొ గొదారి నుండి..ఆ ఫీల్
నుండి ఇంకా బయటకు రాలెదు.ప్రియ బాందవి
అయితె ఒహ్....యెవరికి వాళ్ళు చదివి ఫీల్
అవ్వాల్సిన్దె.థాంక్యు.

Raj said...

చాలాబాగా వ్రాశారండీ.. మొత్తానికి మీ పాపకి ఏమీ కాలేనందులకు మాకూ సంతోషం వేసింది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంతా జాగ్రత్తగా ఉండాల్సిందే..

శశి కళ said...

రాజ్ గారు,థాంక్యు.

రాజ్ కుమార్ said...

హమ్మో.. పెద్ద ప్రమాదం తప్పిందన్న మాట.
జై సంజీవని మాతా ;)

prabandhchowdary.pudota said...

నాది ఆ బాపతేనండి. చిన్నప్పుడు పురుగుల మందు కొలిచే చిన్న ప్లాస్టిక్ డబ్బా లొ అన్నం వెసుకొని తిన్నానంట..మా వాళ్ళు వచ్చేసరికి కిందపడి గుడ్లు తేలెసానంట..టైం కి చూసి ఆసుపత్రి కి తిసుకెలితే బ్రతికి బట్టకట్టానంట...మమ్మ చేప్తుండేది.

శశి కళ said...

thank u ..prabandh gaaru

రసజ్ఞ said...

అలాంటి పిల్లలని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు వాళ్ళ చేతికి ఏమి అందకుండా తగు జాగ్రత్తలో కూడా ఉండాలి. పాపకి ప్రమాదం తప్పింది అదే పది వేలు.
దోగాడే పిల్లలు అనే పదం వినలేదు అంటే పాకే పిల్లలనేనా?

శశి కళ said...

రసజ్న గారు...థాంక్యు..దొగాడటం అన్టే పిల్లలు పొట్ట
నెలకు తగలకుండా క్రిశ్నునిలా మొకాళ్ళ పై
అరిచెతుల పై పాకటం...