Saturday 10 September 2011

అందరి తల్లి...మహా లక్ష్మి

మొన్న శుక్రవారం రాత్రి మా వారి ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ "రేపు టీచర్స్ 
అందరమూ శ్రీపురం పోతున్నాము ఇంకా రెండు టికెట్స్ ఉన్నాయి మీరు 
 వస్తారా?రాత్రికే ప్రయాణం "అన్నారు.మా వారు పిల్లలు ఎలా అంటుంటే 
"ఏమండీ ,లక్ష్మిదేవి అవకాశం ఇచ్చింది.ఇబ్బందులు లేవు.పిల్లలు ఏముందిలే
వాళ్ళ లైఫ్ పార్ట్ నర్స్ తో వెళతారు"అనేసి,వెంటనే రెడీ అయి వెళ్లి పోయాము.
శనివారం చూసుకొని రాత్రికి ఇంటికి వచ్చేసాము.

 శ్రీపురం లో మహాలక్ష్మి బంగారు గుడి ఉంది.ఇది "శ్రీ శక్తీ అమ్మ"అనే అతనికి 
 అమ్మవారు పూని కట్టించారని చెపుతున్నారు.ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా
లో వేలూరికి పది కి.మీ.దూరంలో ఉంది.ఉదయం 8 a.m.--8p.m.వరకు దర్శనం 
 గుడిఅనుమతిస్తారు.

(మేము రాత్రి గుడిఅందం చూడాలని ఎంతవరకు  గుడి ఉంటుందో తెలీక 
బలే టెన్షన్ పడ్డాము.అందుకే వ్రాస్తున్నాను)

చూడండి లక్ష్మి దేవి చాలా అందంగా ఉంది కదా?అసలు చుట్టూ నీటిలో బంగారు మండపం 
ప్రతిబింబిస్తూ,మండపం లో అమ్మవారిని చూస్తె స్వర్గంలో చూసినట్లు ఉంది.

(అబ్బ నేను స్వర్గానికి పోలేదులే ,ఉదయం ఉస్మాన్ ఖాన్ గారి స్వర్గ వివరణ చదివాను..
అలా అనిపించింది.చంపేస్తారా ఏమిటి నన్ను?
ఏదో పోనీలే అని మంచిగుడి గూర్చి చెపుతుంటే పే...ద్ద)
 

 








ఈ గుడి విహంగా వీక్షణం లోచూస్తె చుట్టూ నక్షత్ర రూపంలో క్యూ ఉండి,మధ్యలో
బంగారు గుడి ఉంటుంది.రాత్రి పూట ఆ క్యూలో నడుస్తూ కొన్ని సార్లు గుడికి దగ్గరగా,
కొన్ని సార్లు దూరంగా వస్తూ,పక్కన చెట్లు ,మధ్యలో అన్ని బాషలలో వ్రాసిన సూక్తులు 
చదువుతూ వెళ్ళటం ఒక అపురూపమైన జ్ఞాపకం గా నిలిచిపోతుంది.

ఇంకా ఇక్కడ గుడిముందుపద్మం లాగా ఒక శిల చెక్కి ఉన్నారు.
దానిపై చెవి పెట్టి దానిని తడితే లోహం పై తట్టినట్లు  వినిపిస్తుంది.

అలా గుడికి దగ్గరగా వచ్చి గుడి చుట్టూ ప్రదిక్షణం చేస్తాము.
అప్పుడు దాని అందం చూస్తూ నేను నోరు తెరిచేసాను 
నాకు తెలీకుండానే.

ఏమిటి  ఈగలు పోయాయా అని అడుగుతున్నారా?

(మీ ప్రపంచం లో మీకు బిల్ గేట్స్ గొప్ప కావొచ్చు.
కాని పసి పాప ప్రపంచం లో తూనిగే గొప్పది.)

ఇంతకీ చుట్టూ తిరిగి  అమ్మవారిని చూస్తుంటే  గుండె గతుక్కు మన్నది.

"అరె పిల్లలని తెచ్చి చూపించి వివరించి ఉంటె బాగుండునే "అని.

(ఏమిటో తల్లి పాత్ర లోకి వెళ్ళటమే కాని తిరిగి మన ప్రపంచం లోకి ఎప్పటికి రాలేమా?)

Website:WWW.sripuram.org

 కొన్ని సూక్తులు మీ కోసం  
1.మొదటి ధర్మం నీ బాధ్యత నువ్వు సరిగా నిర్వర్తించటమే.

2.మనిషి ఆధ్యాత్మిక జీవితం లేకుండా గడపగలడు కాని 
   లోఆధ్యాత్మికత లో గడపటం లో సంతోషం ,శాంతి లబిస్తాయి.

3.ఎందరో నన్ను గుడి కాకుండా హాస్పిటల్ కట్టొచ్చు కదా అన్నారు.కాని దీనిలో లబించే మంచి ఎనేర్జి వారిని హాస్పిటల్ కంటే కూడా బాగు చేసి మంచి మార్గంలో వ్యవస్థ వైపు మళ్ళిస్తుంది.

 (ఓషో అంటారు...ఒక సాదారణ వ్యక్తి బాద్యతలతో  అలిసిపోతే ఎక్కడకు వెళ్లి సేద తీరాలి?
 అతనిని ఓదార్చి సమాజంలోని బాద్యతల వైపు మళ్ళించడానికి ఇలాటివి అవసరం అని
 చెప్పారు.కాని ఏది అతిగా ఉండొద్దు.ఈ గుడి ఉండటం మంచిదే అనిపించింది నాకు)

 4.ఈ రోజు నువ్వు అనుభవించేది నీ గత జన్మల కర్మ పలితం 
అయితే,ఈ రోజుమంచి పనులు చేస్తేనే కదా రేపు మంచి జీవితాన్ని అనుభవించగలవు.
ఇక్కడ కర్మ అంటే నాకు ఒకటి గుర్తుకు వచ్చింది.కొందరికి మనం అనుకున్న వెంటనే
మెయిల్ చేస్తాము.కొందరికి ఎందుకనో చెయ్యాలన్న చేయలేము.

సాక్షి ఫండే లోG.R.Maharshi గారు మార్నింగ్ షో అని వ్రాస్తారు.
 అసలు ఒక సినిమా హాల్ యజమాని కూతురుగా అవన్నీ నేనెంతోఆనందంగా  అనుబవించాను.
 అసలు ఆయనికి నేను ఎప్పుడో మెయిల్ చేసి ఉండాల్సింది  నా సంతోషాన్ని తెలియ చేస్తూ.

ఒక  సారి సినిమా హాల్స్ పడిపోవటం గూర్చి వ్రాసారు.అప్పుడే మా నాన్న హాల్ పడగొట్టి 
ఉన్నారు.మా నాన్న మళ్ళా హాలె కట్టొచ్చు.ఏదైనా కట్టొచ్చు.కాని ఆ ఆర్టికల్ చదివి 
నాకు చాలా బాధ వేసింది.ఎందుకంటె సినిమా హాల్ అనేది ఒక వ్యాపారం కాదు.
ఎందరి జీవితాలలోని సంతోషాన్ని పంచుకొనే ఒక ఆత్మీయ స్థలం.

కాని ఎందుకో ఎప్పుడూ రాయలేకపోయాను.
ఇప్పుడు ఆయనఈ రోజే ఆ కాలమ్ ఆపేశారు .

వ్రాసిన మెయిల్స్ కంటే రాయనవే విలువ అయినవేమో.
మన జ్ఞాపకాలలో నిలిచి పోతాయి కాబట్టి....మహర్షి గారికి అభినందనలు.

అభినందన 
మొగలి  రేకులుమాయం...
తీయని జ్ఞాపికలుగా 
మారుతూ.....


10 comments:

రసజ్ఞ said...

నేను VIT లో పిజి చేసేటప్పుడు ప్రతీ శని, ఆదివారాలు అక్కడకి వెళ్ళి అమ్మవారి అలంకారం అదీ చేసేదానిని. అక్కడ అంతా బాగుంటుంది అత్యంత సుందరంగా ఉంటుంది ప్రకృతి ఒడిలో కాని చాలా మందికి తెలియని విషయాలని కొన్నిటిని ఇక్కడ చెప్పదలచుకున్నాను. నాకు అక్కడ నచ్చని వాటిల్లో ముఖ్యమయిన విషయం ఏంటంటే ఆ ఆలయాన్ని కట్టించిన అమ్మ అనబడే ఆయనని పూజించడంలో తప్పు లేదు ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందమే కాని ఆయనకి పాలాభిషేకాలు, కుంకుమార్చనలు అయితే తప్ప అమ్మవారి గుడి తలుపులు తీయకపోవడం. నాకు చాలా బాధగా అనిపించేది. మంచి టపా శశి కళ గారు.

రాజ్ కుమార్ said...

నైస్ పోస్ట్ అండీ.. దర్శనం బాగా జరిగిందా?
నేను ఎప్పటి నుండొ వెళదం అనుకుంటున్నా.. ఎప్పుడు అవుతుందో ఎమో.. ;(

శశి కళ said...

అవును రసజ్ణ గారు...వీళ్ళ పిచ్చి చూస్తె నాకు బాధ గానె ఉన్టుంది.


రాజ్...శీగ్రమెవ దర్శన ప్రాప్తిరస్తు.జై మహా లక్ష్మి.

Unknown said...

పోస్ట్ బావుంది.ఒకసారి నేను కూడా వెళ్ళాలి నాకు కూడా దర్శన ప్రాప్తి రస్తు అని అనేయండి.

శశి కళ said...

శైల...శుభం...శీవుడి తొ పొయి వచ్చెయ్యండి.
మహ లక్ష్మి కటాక్ష పల సిద్ది రస్తు.

kiran said...

వావ్ ..కేక టపా ....చాలా మంది చెప్తే విన్నాను ఈ గుడి గురించి...
ఎంత మంచి వారో..అన్ని చూసి మాకు చెప్పడమే కాక..బోలెడు మంచి మాటలు కూడా చెప్పారు.. :)

Anonymous said...

నేనూ చూసాను, కానీ ఎందుకో గుడికి వెళ్ళిన అనుభూతి కలగలేదు. అంతా commercialగా అనిపించింది.

శశి కళ said...

nijame ajaata gaaru kaani ...aa vaatavaranam ...raathri poota aa gudi choodatam...sooktulu...pina
punnami chandrudu...nijamgaa manchi
expeeriance...commercial ayite avaneendi...ramoji film city ki povatam ledaa...yemiti? ante...

శ్రీ said...

నేను మార్చిలో శ్రీపురం వెళ్ళానండి. సాయంత్రంకి అక్కడ చేరుకుని రాత్రి లైటింగులో గుడి చూసి ఇంటికి బయలుదేరాము. చాలా బాగా కట్టారు గుడి, నీళ్ళలో గుడి చాలా అద్భుతంగా ఉంటుంది.

సినిమహాలు మీద నాకు కూడా పెనవేసిన బంధాలు ఉన్నాయి. డెట్రాయిట్ లో నేను కూడా ఒక సంవత్సరం హాలు లీజు చేసాను, దానిని రెండు సంవత్సరాల ముందు పడగొట్టేసారు.

వ్యాపారం పక్కన పెడితే నిండిన హాలు చూసుకుంటే పెళ్ళికూతురు అయిన కూతురుని చూసినట్టు ఉంటుంది.

శశి కళ said...

thanks..sree..