ఎంత...ఎంత....దూరం....బావి...బావి....దూరం....
వానా ..వానా....వల్లప్పా....వాకిలి తెరువు...చెల్లప్పా...
ఏమిటి?అలా చూస్తున్నారు?మీరు చిన్నప్పుడు మీ తమ్ముడి తో
ఆడుకోలేదా?
(ఆడుకున్నారా?లేక మాలాగా కొట్టుకున్నారా?)
(ఆడుకున్నారా?లేక మాలాగా కొట్టుకున్నారా?)
వాడు పుట్టేసరికి నాకు మూడేళ్ళన్నమాట .అప్పటికి మా అక్క
పుట్టి ఉంది కాబట్టి ఆ ఇంట్లో నేను ఎక్స్ ట్రా నే.అప్పుడు నేను
కొంచం అల్లరి రాక్షసి.
(ఇప్పటి సంగతి ఏమిటి అని అడుగుతున్నారా
(ఇప్పటి సంగతి ఏమిటి అని అడుగుతున్నారా
ఇప్పుడు బాపు బొమ్మే కాకా పొతే కూసింత బొద్దు)
(ఇది మా పోటో కాదు.మేము ఇంకా అందంగా ఉంటామని ఉత్తమ
చదువర్లు గ్రహించగలరు)
మా అమ్మ ఒక రోజు "శశీ.."అని పిలిచింది.ఏమిటా అని గోడ పై
నుండి తొంగి చూసాను.
(నేను ఇంట్లో కంటే గోడలపైనే ఎక్కువ సేపు ఉండేదాన్ని).
(నేను ఇంట్లో కంటే గోడలపైనే ఎక్కువ సేపు ఉండేదాన్ని).
"శశీ తమ్ముడిని పోటో తీయించుకు రామ్మా"అని నా చేతిలో బుజ్జి
బాబుని పెట్టింది.వాడేన్చాక్కా మంచి బట్టలేసుకొని నెలవంక
బొట్టు పెట్టుకొని ఉన్నాడు.షాప్ లో పని చేసే అబ్బాయిని నాతో
పంపింది.నేను చక్కగా పోటో తీయించి తీసుకు వచ్చాను.
వాడు అంటే ఇంట్లో అందరికి బలే ఇష్టం.చిన్నారి యువ రాజే
(అబ్బ నేను కూడా యువ రాణే)
ఎంత ఇష్టం అంటే వాడు కోవా కావాలంటే మా ఊరిలో దొరకదని
వాడు అంటే ఇంట్లో అందరికి బలే ఇష్టం.చిన్నారి యువ రాజే
(అబ్బ నేను కూడా యువ రాణే)
ఎంత ఇష్టం అంటే వాడు కోవా కావాలంటే మా ఊరిలో దొరకదని
మా నాన్న మా వాన్ గూడురుకి (27 కి మీ)పంపి తెప్పించేవారు.
ఇలా....ఇలా......రయ్యిం....రయ్యిం.....రోజులు పోతూ ఉన్నాయి.
ఒకవినాయక చవితి రోజు మా అమ్మ తమ్ముడికి,పసుపు బట్టలు
తీసుకురా పోయి అని పంపింది.మేము వినాయకుని పూజ చేసేటపుడు
చిన్న కొత్త తెలుపు క్లాత్ ని పసుపులో ముంచి ఆయనకు ,
మా తమ్ముడికి కండువాలాగా వేస్తాము.
(అది నాకు తెలీదు.మాకు అన్ని షాప్స్ ఉన్నాయి)
ఎంచక్కా వెళ్లి మా తమ్ముడికిపసుపు డ్రెస్ గంటలో కుట్టించుకు వచ్చేసాను.
ఇంక ఆ డ్రెస్ చూసి అందరు నవ్వే నవ్వు వేమాల సామి లాగ
ఉన్నాడని.
(పొరపాటు చేశాను.వాడి పెళ్లి చూపులకు కుట్టించి ఉంటె
ఎంచక్కా రవి తేజ లాగ ఉండేవాడు.మీరెవరైనా ట్రై చేయండి నా మాట విని)
ఇంక ఒక దీపావళి రోజు మా అమ్మ పిల్లలు అందరు వెళ్లి చిచ్చు బుడ్డి
కాలుస్తూ పోటో తీయించుకొని రమ్మని నాకు చెప్పి పంపింది.
(మా అక్క పప్పు.అందుకని అన్నినాకే చెపుతుంది మా అమ్మ)
పోయి పోటో తీయమని అడిగితె వాడు "చిచ్చుబుడ్డి కాలిస్తే
స్టూడియో కాలుతుందని ఒప్పుకోలేదు.సరే మనం కూడా మొండి.
చివరికి ఒక్క కాకర పూవొత్తి కాల్పించి పోటో తీసాడు.
యెంత తమ్ముడంటే ఇష్టమైనా అన్నిటికి కొట్టుకోవటమే (కర్రలతో
కూడా).మా అమ్మను విసిగించేసే వాళ్ళం.
(మిమ్మల్ని విసిగించను లెండి.అలాఆఆఆఅ పెద్ద అయిపోయాము)
నాకు పెళ్లి కుదిరేసరికి వాడు ఇంటర్ .
(అయినా బలే కొట్టుకునేవాళ్ళం)
ఒక రోజు ఫ్యాన్ కింద పడుకోటానికి నేను అంటే నేనని గొడవ
పడుతున్నాము.ఇంతలో మా అమ్మ వచ్చి "దాన్ని పడుకోనీరా
అది ఇంక ఎన్ని రోజులు ఉంటుంది పాపం"అంది.
అంతే వాడు ఇచ్చేసి వెళ్లి పోయాడు.
నిజంగా కొట్టుకున్నప్పటి కంటే నాకు,వాడికి అప్పుడు చాలా బాద వేసింది.
పెళ్లి పిలుపులకు వాడిని మా అత్త గారి ఊరికి ఒక్కడినే పంపారు
వంద జాగ్రతలు చెప్పి.తీరా చూస్తె రాత్రి అయినా తిరిగి రాలేదు.
మాకేమో భయం వేసి పోతుంది.ఎమయ్యాడా అని.
చాలా సేపటి తరువాత సినిమా హాల్ వాళ్ళు వచ్చారు ఫోన్ వచ్చిందని .
విషయం ఏమిటంటే మా మరుదులు ,మా వారు
వీడిని సినిమా చూపించటానికి ఆపేశారు
(మరి బామ్మర్దా మజాకా...హలో ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఈ దారి దగ్గర
పెళ్లి కూతుర్ని కాకా పట్టటానికి ...ప్రొసీడ్)
పాపం వాడు బావ గారికి మర్యాదలు చేసి,కాళ్ళు కడిగి
ఇంక అంతే "నీ కాలి మీద పుట్టు మచ్చనై అక్కయ్యో..."
మా పిల్లలు,బారశాలాలు,పుట్టు వెంట్రుకలు తీసే మంగలి,
అలా....అలా......
ఇప్పటికి నేనంటే యెంత ప్రేమంటే నేను వెళితే చాలు
సెకండ్ షో ప్రోగ్రాం .నాకు నిద్ర వస్తుందిరా అన్నా వినడు.
చూసినంత చూద్దువులే అంటాడు.అలాగైనా నాతొ ఎక్కువగా
గడపొచ్చని.
ఇంకా యెంత ప్రేమంటే వాడి కూతురు కొంచం బొద్దుగా
ఉందంటే "మా శశి అక్క లాగా"అని మురిసి పోతుంటాడు.
మరి అంత ప్రేమకు నేనేమి ఇవ్వాలి.అందుకే ఈ పోస్ట్ మా
తమ్ముడు వాసు కి.ఇంకా అక్కచెల్లెళ్ళను బాగా చూసుకునే
అందరికి అంకితం.

హలో అక్కయ్యలు కళ్ళు తుడుచుకొని మీ తమ్ముళ్ళకు అర్జెంటు
ఫోన్ చెయ్యండి..........టాటా.
10 comments:
నాకు తమ్ముడు లేడని మీపై.. నాకు మహా కుళ్ళుగా ఉంది.బాగా చెప్పారు.ఎప్పుడు..ఇలాగే అనుబంధం ఉండాలని కోరుకుంటూ
బాగుందండీ! చాలా బాగా రాశారు. అక్క తమ్ముళ్ళ బంధానికి అవధులు ఉండవు.
బావుందండీ మీ అక్కా తమ్ముళ్ళ అనుబంధం.. నాక్కూడా మా తమ్ముడు గుర్తొచ్చాడు.. :)
పిండేసావ్ శశి....గుండెని పిండేశావ్! :((( మా తమ్ముడూ ఇంతే! ఏంటో పిచ్చి మొహాలు. కదా! బాధేస్తుంది.
కెవ్వ్వ్వ్వ్వ్వ్...ఆనందం పట్ట లెకున్నాను.
అక్కయ్య సంఘం...జిందాబాద్.
వాళ్ళ తమ్ముళ్ళు జిందాబాద్.
@వనజ గారు మా తమ్ముడిని మీకు పంచుతా
మా సంఘం లొ చెరిపొండి.
తమ్ముళ్ళూ ...ఏక్కడ ఉన్నా యెమైనా...
మీ సుఖమె మెము కొరుకుంటాం....
అయ్యో చిన్నప్పుడు కొట్టుకోడానికి నాకు తమ్ముడు లేడే!!!
ఓ చుక్క కన్నీరు కారుస్తూ......
సూపర్ సెంటిమెంట్..!!
మీ అక్క తమ్ముళ్ళ బంధం ఎప్పటికి ఇంతే స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ..:))
నేను ఏమి కుళ్ళు లేదు
ఎందుకంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.
రాస్తా నా బ్లాగ్ లో
కాని మీ ముచ్చట్లు బలే నచ్చాయి.
నిజమే శశిగారు,తమ్ముళ్ళు అక్కలంటే ప్రాణం పెడతారు.మీ ముచ్చట్లు బావున్నాయి.
ఎమయ్యాడా అని. అని లెటర్స్ కలర్లో కనిపిస్తే లింక్ ఉందేమో తొంగిచూస్తే కనిపిస్తాడేమో..అని పించింది...టెన్షన్ పడ్డాను కుడా...ఇంతలా ప్రేమించే తమ్ముడికి ఏమైందో అని ...ఇంట్లో ఉన్నప్పుడు తమ్ములకు అక్కల గురించి టెన్షన్ ఉండదు కాని...మేట్టినింటిలో అక్క హ్యాపీ గా లేక బాధలు పడుతున్నప్పుడు తమ్ములకు కలిగే బాధ అంతా ఇంతా కాదు..శశి గారు.
Post a Comment