ఈ రోజు మానసిక వికలాంగుల మీద ఒక ఆర్టికల్
చదివి నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
రియ్యం...రియ్యం....రియ్యం...కొన్ని నెలల ముందు
మా బాబాయి వాళ్ళ పెళ్లి రోజని వాళ్ళతో మా నాన్న
వాళ్ళు మేము అలిమేలుమంగాపురం(తిరుపతి దగ్గర)
వెళ్లి అందరం స్వామీ వారి కల్యాణం చేయించాము.
తరువాత తిరుపతికి దగరలో చిత్తూర్ వెళ్ళే రోడ్ మీద
అక్షయ మానసిక వికలాంగుల కేంద్రం ఉంది.దానిలో
వాళ్ళ పెళ్లి రోజు సందర్బంగా ఏమైనా సహాయం
చేద్దామని వెళ్ళాము.
అది మధ్యలో షట్భుజి ఆకారం లో ఖాళి స్తలం వదిలి చుట్టూ
రూమ్స్ కట్టి ఉన్నారు.ఎక్కడ చూసినా మానసికంగా
ఎదగని పిల్లలే.ఏడ్చే వాళ్ళు,నవ్వు కొనే వాళ్ళు,గమ్ముగా
కూర్చుని అమాయకంగా చూసేవాళ్ళు...ఒక్కొక్కరి గూర్చి
చెపుతుంటే వారిని ఎలా పెద్ద వాళ్ళు వదిలేసేంది చెపుతుంటే
..వాళ్ళనలా చూస్తుంటే ఏమి పాపం చేసారని
ఇంత చిన్న పిల్లలకు ఈ శిక్ష ...అని హృదయం ద్రవించి పోయింది.
నేను మా పిన్నమ్మ అయితే చూడలేక కళ్ళ నీళ్ళు
పెట్టుకొని ఎడ్చేసాము.
తరువాత ఆ కేంద్రం నడుపుతున్న డాక్టర్ గారికి డబ్బులు
ఇస్తూంటే వారన్నారు "డబ్బులు ఇచ్చే వారు చాలా మంది
ఉన్నారు .సేవ చేసే వారే లేరు "అని.
చివరగా ఒక 18 ఏళ్ళ అమ్మాయిని చూసాను.అసలు హీరోయిన్
హన్సికా లాగుంది.కాని బుగ్గ మీద గీసుకొని రక్తం వస్తూంది.
అసలు మన లోకం లో లేదు.
అప్పుడు అక్కడ చూసుకొనే ఆయా చెప్పింది...
వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్ అంట.కాని ఆ అమ్మాయిని
ఎక్కడ కాపాడగలడు.అప్పుడు అప్పుడు వచ్చి చూసి వెళుతుంటాడు
కన్నీళ్లు నిండిన హృదయం తో..........
మరి వీళ్ళ మీద కూడా అత్యాచారం చేసే వారిని దేవుడైనా
క్షమిస్తాడా?అసలు ఆ న్యూస్ చదవగానే బాదతో ఒక కవిత రాసి
పంపాను.మానసా సంస్థ ,విజయవాడ వాళ్ళు మొన్న ఆదివారం పిలిచి
కవిత వింటారా?
హెంత మంచోల్లో.....అంతా వద్దులే కొంచం....
ఇలా పుట్టటమే పాపం అని తెలీక
విరబూయాల్సిన వసంతాలు
విరియాలని వచ్చిన హరివిల్లులు
పరుల కోరికల బలిపీటం పై
చేయని తప్పుకు శిలువలు ఎక్కి
విష సర్పాల కోరల..కోరికలు తీరుస్తూ..
చిన్నారి పావురాలు రక్తాశ్రువులు చిందిస్తూ
మరణపు అంచులు తాకుతూ
మానవత్వపు చిరునామా ఏదని
ఆరిపోతూ ప్రశ్నిస్తున్నాయి.....
ఇంకేమి రాయలేను..ఇప్పటికే కళ్ళు నీళ్ళతో నిండి పోతున్నాయి....
6 comments:
avunu..aa jaada Yekkada? mana kavitallonaa? akshaya naaku parichayame! seva chesevaare kaavaali Shashi. avunu yeppudu vacchaaru vijayawada ki. abhinandanalu.
చాలా చక్కగా రాసారండీ! ఏదో ఒక వైకల్యం కారణంగా పిల్లలని వదిలేస్తారు, ఏ కారణం లేకపోతే వెత్తుక్కుని మరీ వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో మానవత్వం అంటే అదే సినిమా అని అడిగే వాళ్ళున్నారు!
అలాంటిపిల్లలపై అత్యాచారలు చేసేవారే అసలైన మానసిక వికలాంగులు..దారుణం అండి..చిన్నపిల్లను కూడా కనికరించరు...hmm
>>> "డబ్బులు ఇచ్చే వారు చాలా మంది
ఉన్నారు .సేవ చేసే వారే లేరు "అని.
కన్నీరు కారుస్తాం. చేతనైతే ఎంతో కొంత ధన సహాయం చేస్తాం. అంతకు మించి మనమేం చేయలేము. ఇది చాలా బాధాకరం.
నాకు తెలుసు నాలా ఆలొచిన్చె వాల్లు చాలా మంది
ఉన్టారని.
@వనజ గారు...చాలా చక్కగా వ్రాసారు.18 సెప్టంబరు
వచ్చాను.థాంక్యు.
@అవును రసజ్ఞ్...మీరు చెప్పినది సత్యం..థాంక్యు.
@నెస్తం గారు...థాంక్యు.
@బులుసుగారు..చెయగలిగితె మాత్రం చెద్దాం.థాంక్యు.
ఓ నిమిషం కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి...!!
ఏమిటో...ఆ దేవుడు అప్పుడప్పుడు...ఎందుకు ఇలాంటి పనులు చేస్తాడో :(
Post a Comment