Saturday, 21 May 2011

scooty -నేను -జీవిత sathyaalu

నేను ఈ రోజు నా ఉద్యోగం లో జిల్లా స్థాయి ,రాష్ట్ర స్థాయిలో అవార్డ్లు ,రివార్డ్లు తీసుకోవటం వెనుక ఒకరి సహాయం ఉందండీ.మా వారే అనుకొంటే మీరంతా పప్పులో కాలేసినట్లే ముందు కాళ్ళు ,మనసు కడుక్కొని రండి చెపుతాను.
అది ఎవరంటే నా scooty సరే సౌలభ్యం కోసం బండి అందాము.ఎంటమ్మ పెద్ద మీ వారేమి చేయలేదా అంటే 
దాని తరువాత వారికే కదా నేను థాంక్స్ చెప్పేది.మరి బండి అయితే నేను సహాయం చేసాను అని పది సార్లు అనదుకదా.
  ఇదే నండి మొదటి సత్యం 
1 .మనం మన వాళ్ళకు సహాయం చేస్తే మనకే కదా చేసాము అనుకోని మర్చిపోవాలి.అంతే కాని పది సార్లు చెప్పుకోకూడదు.

 ఈ ఊరికి వచ్చిన మొదటి రోజే బండి లేక పోతే స్కూల్ కి పోలేమని అర్ధం అయింది.వెంటనే పైన చూసారుగా దానిని మా వారు తెచ్చారు.ఇక దానిని నేను డ్రైవ్ చేయటం నేర్చుకోవాలి.సరే స్కూల్ కి పోయేటపుడు నేర్పిస్తానని 
చెప్పారు.ఇక్కడ నేను long ...long...ago...pride  నేర్చుకో బోయి దానిని ఏమి చేసానో ఒక భయంకర మైన   flashback  చెప్పాలి(అంత భయంకరం కాదులెండి.కొంచెమే)
అప్పట్లో మావారికి నా తెలివి మీద గొప్ప నమ్మకం ఉండేది.pride కొత్తగా తెచ్చారు.
వారు వెనుక కూర్చొని రెండు రౌండ్స్ తిప్పి "ఇంతే శశి నువ్వు డ్రైవ్ చేయి"అని ఇచ్చేసారు.నేను అంత కంటే గొప్పగా నాకు break ,accelator తెలవగానే అబ్బో చాల వచ్చు అనుకోని (విధి ఆడే వింత లీల)రయ్యిన వెళ్ళిపోయాను.ఎక్కడికి అనుకొన్నారు?నేరుగా ముళ్ళ చెట్లలోకి .అందరు చుట్టూ దూరంగా మూగి అరుస్తున్నారు ఏదో హెల్ప్ చేయాలని నాకు మాత్రం ఏమి చేయాలో తెలీక భూమి మొత్తం తిరిగి వచ్చాను(నిజం అండి break ఎక్కడుందో చూడటానికి)
మొత్తానికి బుర్ర పనిచేయక బండి వదిలేసి in gin ఆపేసాను.మా వారి అదృష్టం బాగుండి నేను ,బండి క్షేమం.
ఇక ఎవరైనా బండి నా చేతికి ఇస్తారంటార?(కాని ఒక ఉపాయం వచ్చింది.ఇంకా ఎప్పుడైనా నేర్చుకోవాలంటే 
break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలని)
 ఇదే రెండో జీవిత సత్యం 
మనం ఎంత మేధావులమైన మన బుర్ర పనిచేయని క్షనాలుంటాయి
 ఇప్పటి time కి  వచ్చేయండి.ఎలాగోలా నేర్చుకోవాలి తప్పదు కాబట్టి మా వారు నేర్పించటం మొదలు పెట్టారు.
రోజు వెనక కూర్చుని నేర్పిస్తారు కదా కొంచం సేపు హేండిల్ పట్టుకొని వదిలేస్తారు.నేను నడుపుతూ ఉంటాన జాగ్రత్త అంటారు.అంతే హేండిల్ పెండులంలాఊగుతుంది.నేనేమోరోడ్డుమీదగుంటలుచూస్తుంటాను.ఆయనేమో రోడ్డు మీద మనుషులు చూస్తుంటారు.(వాళ్ళని నేను చూడను.ఎందుకంటె మనుషులు కదా వాళ్ళే తప్పుకోవాలని నాకు గట్టి అభిప్రాయం).ఇలా అయితే ఎన్ని రోజులైనా (అప్పటికే మూడు నెలలు అయిపొయింది )ఇంతే అని మా వారు నువ్వే సొంతంగా నడుపు అలాగైతేనే వస్తుంది అని ఇచ్చి నన్ను ముందు పొమ్మని అయన దిగి వెనుక రాసాగారు.జై భోలో హనుమానకి అనుకొంటూ రివ్వున (10 కి మీ స్పీడ్ తో )వెళ్ళాను .బండి తూలుతుంది అటు ...ఇటు ..కొంపతీసి పెట్రోల్ బదులు ఇంకేమైనా ....(నా తప్పేమీ లేదని అనుకొన్నాను) 

అప్పుడు అర్ధం అయింది అప్పటి దాక బండి వాలితే ఈయన కాలు కింద పెట్టి బాలన్సు చేసేవారని 
ఇదే నండి ఇంకో సత్యం............
 పెద్దవాళ్ళు మన వెనుక ఉన్నపుడు వారి సహాయం అర్ధం కాదు వాళ్ళు లేనపుడే వారి విలువ తెలుస్తుంది 
మళ్ళా  బండి పడిపోయింది .ఇక్కడ ఎవరైనా నేర్చుకోనేవాళ్ళు ఉంటె ఒకటి చెపుతాను ,బండి పడిపోతుంది
అనుకుంటే వదిలేసి మనం నిల్చుకోవటం బెటర్.బండి మన కాళ్ళ మధ్య వాలి పోతుంది మన కేమి కాదు (బండి కేమైనా అయితేనా వెనక పరిగెత్తే వాళ్ళు చూసుకొంటారు)
బండి పడిపోతే మనం లేపకూడదు (ఎలాగు మనం లేపలేము)చుట్టూ పక్కల వాళ్ళకి ఆ ఆవకాశం ఇవ్వాలి.(ఎందుకంటె మా వారు పరిగెత్తుకొని వచ్చేసరికి కొంత టైం పడుతుంది)ఇదే ఇంకో సత్యం....
ఎవరికైనా  మనం సహాయం చేస్తేనే మనకు అవసరమైనపుడు వేరేవాళ్ళు సహాయం చేస్తారు.  
 ఇలాగ నేర్చుకొంటూనేఒక సంవత్సరం గడిచిపోయింది.(ఇంత కాలం బండి నేర్చుకొంటే gunnice బుక్ లో వేస్తారంటారా?)ఎలాగో ఒక మోస్తర నేర్చుకొన్నాను కాని బండి నా చేతికి ఇవ్వను ఆయనికి ధైర్యం చాలలేదు.
అడగను నాకు ధైర్యం లేదు.
ఇలా ....ఇలా...రోజులు గడిచి పోతుంటే మా స్కూల్లో సర్ ఒకరు "ఏమి madam ఇంకా బండి మీద రావటం 
లేదు"అని అడిగారు."దైర్యం చాలటం లేదు సార్"అన్నాను.వెంటనే ఆయన "ఊరుకోండి మీరు పోయే 20 కి మీ 
స్పీడు కి ఒక పిల్లవాడు మీ పక్కన పరిగెత్త గలడు.దానికే భయం ఎందుకు"అన్నారు.అంతే ఎందుకో దైర్యం
వచ్చింది. వెంటనే మధ్యాహ్నం ఇంటికి వచ్చి నేనే బండి తీసుకొని స్కూల్ కి వెళ్ళిపోయాను.తరువాత 
తెలిసిందండి. నాకు దైర్యం చెప్పిన సార్ కి దైర్యం లేక ఇంతవరకు సైకిల్ కూడా నేర్చు కోలేదని.ఇక్కడ నాకు ఇంకోసత్యం తెలిసింది.
అనుభవం లేకుండా చెప్పినా కొందరి సలహాలు స్పూర్తి ని ఇస్తాయని.
 ఇక ఇప్పుడు హ్యాపీ గా స్కూల్ కి సమయానికి వెళుతున్నాను.అన్నిటి కన్నా సంతోషం వేసిన విషయము 
ఏమిటంటే మా నాన్నని ఎక్కించుకొని బస్సు దగ్గర వదిలితే మా నాన్న సంతోషపడి "హేమ కి కూడా నేర్పించారాదా ?
అన్నారు.(మా నాన్నకి ఆడపిల్లలు బండి నేర్చుకొంటే ప్రమాదంలో పడతారని బయం)
ఇక్కడ ఇంకో సత్యం.(బోర్ కొడుతుందా చివరికి వచ్చేశాములే)
మనం చక్కగా ఏ పనిని చేసినా పెద్దవాళ్ళు ప్రోత్స్చాహం ఇస్తారు.
 (తప్పు చేస్తే తంతారని గుర్తు ఉంచు కావలెను.మళ్ళ నన్ను అనుకొంటే లాభం లేదు)
ఇప్పటి పరిస్థితి ఏమిటి అంటే?.............ఊర్లో రోడ్ మీద ఎవరు వాటర్ కనెక్షన్ తీసుకొంటే వారు ఒక speed
 breakerకడతారు కాబట్టి (రోడ్ వాళ్ళ నాన్న సోమ్మనుకొని)ఊరిలో చిన్నగా డ్రైవ్ చేసినా highway మీద ఎంత స్పీడ్ తో పోతానో తెలిస్తే మా వారు నిద్ర పోలేరు.
(ఎందుకంటె నేను స్కూటీ తో సహా అయన గుండెల్లో నిద్రపోతాను కాబట్టి)


 (all is just for fun.take it easy)
















4 comments:

రాజ్యలక్ష్మి.N said...

bagunnaayandi mee scooty anubhavaalu,
mee jeevita satyaalu...:)

రాజ్ కుమార్ said...

break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలని>>

హిహిహిహి.. ఒకసారి ఇలాగే గోకార్టింగ్ లో బ్రేక్ కీ, ఆక్సెలరేటర్ కీ కన్ఫ్యూజ్ అయ్యీ గోడకి గుద్దించేశాను.. హ్మ్మ్... అదో ఇసాద గాధ..

నైస్ పోస్ట్ అండీ...

శశి కళ said...

rajigaaru ,rajkumar gaaru thanks for ur encouragement
raj kumar gaaru meeru maatram break ani vraasukondi bandi meeda

Unknown said...

break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలని>>

(ఇంత కాలం బండి నేర్చుకొంటే gunnice బుక్ లో వేస్తారంటారా?)తప్పకుండ వేస్తారు.
నా మాట వినండి.
లేకపోతె మనమే ఒక gunnice బ్లాగ్ పెట్టుకుని టపా వేసేసుకుందాం.
అలా మనల్ని మనం encorage chesukunto ముందుకు పోదాం.