Friday 20 May 2011

హృదయమా ......నీవెక్కడా?

ప్రపంచం నాకు ఏదో ఒక ఆవకాశం ఇస్తూనే ఉంది.ఆ రోజుకు ఏదో ఒక పేరు 
పెట్టి.మానవుల హృదయాలన్ని నా ప్రేమ శక్తితో స్పృశించి దైవత్వంతో మేలుకొలిపేలా.
"మానవులలో ఒక ఛానల్ ఉంటుంది.అది అభివ్రుద్దిచెందినపుడువిశ్వ మేధస్సు కి,విశ్వ ప్రేమకి,విశ్వ లక్ష్యానికి అనుసందానిమ్పబడతారు.ఆ రోజు మీ జీవితంలో కూడా తప్పక ఉంటుంది.విత్తనం ఈ రోజు విత్తనం రూపంలో 
ఉన్న దానిలోపల మొక్కగా మారటానికి కావలసినవి రూపుదిద్దుకొంటూ 
ఉండవచ్చు.ఒక నిమషం లో మార్పు జరిగి పోతుంది.విత్తనం బద్దలు 
కొట్టుకొని మొక్కగా రూపొందుతుంది.అది ఎన్నటికి తన పాత రూపాన్ని పొందడు. ఇంకా కొన్ని విత్తనాలు ఇస్తూ ప్రపంచానికి మేలు చేయటం తప్ప.
మీలో మీ హృదయం లో ప్రేమను ,శాంతిని కాంక్షిస్తూ ఆ మార్పు జరుగుతూఉంది.తప్పక స్వార్ధాన్ని బద్దలు కొట్టుకొని హృదయం లో మొలకెత్తిన నిస్వార్ధ ప్రేమతో విశ్వ ప్రణాళికలో బాగం అవుతారు .ప్రేమ శాంతులు పంచుతారు."
బుద్దుడు ,బుద్దుడు కాకా ముందు మన లానే ఉండేవాడు,మదర్ తెరిస్సా 
హృదయ వాణి వినక ముందు మనలానే ఉంది.క్రీస్తు, ఫ్లారెన్సు నైట్ ఏంగిల్ 
అందరు వాళ్ళ హృదయం విశ్వ ప్రణాళికకు అనుసందానిన్చనపుడు మన లాగానే ఉన్నారు.ఒక క్షణం లో అంతా మారిపోయింది.అదే మన జీవితంలో కూడా జరుగుతుంది.
"మీరు చేయాల్సిందల్లా ప్రపంచం శాంతి తో ప్రేమతో నిండిపోవాలని కోరుకోవటమే.మీ హృదయంతో మీ వాళ్ళ కోసం చేసే ప్రార్ధనలో ఈ కోరికను 
కలుపుకోండి చాలు.అంతే జరిగి పోతుంది."
గొప్ప విషయాలు ఇంతే సులభం .చిన్న స్వార్ద విషయానికి కూడా చాల ప్రణాళిక అవసరం.
"చూడటానికి ఇది వింతగా అనిపిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా హింస మరియు 
ప్రతి చోట వినాశనం జరుగుతుంది.అదే సమయంలో ప్రపంచమంతా శాంతి ప్రేమలను కోరుతూ ధ్యానం చేయాలనే ఉత్స్హాహం ప్రజలలో ఏర్పడుతుంది.
కొత్త తరాన్ని ఆహ్వానిస్తుంది."------vera stanley alder(5th dimension)
 (కావాలంటే చూడండి ఇప్పటి తరం వారికి ఉద్యోగం వచ్చినాక వారి కోరికలు 
తీర్చుకొంటూనే ప్రజలకు ఏదో మేలు చేయాలని సమాజ సేవకు అన్కితమవుతున్నారు.పాత తరం లో ఇది కనపడదు.మన వరకు ఇంకొకరి 
జోలికి పోకుండా చూసుకొందాము అనుకొంటారు.
"మన వరకే అనుకొంటే మానవత్వం.ఇతరులకు కూడా అనుకొంటే దైవత్వం.
మానవత్వాన్నున్డి దైవత్వానికి ప్రయాణం.
నేనేమి చేయగలను నాకు సమయం లేదు అనుకొంటే హృదయాన్ని తెరచి మీ జీవితంలో ప్రవర్తించండి చాలు .అదే అందరిని ప్రభావితం చేస్తుంది.
అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ కూడా అందరి హృదయాలను తెరువగలదు.
ఎలా అంటారా?చిన్న బిడ్డ ముళ్ళ పొదలలో పుట్టగానే విసిరివేయబడి ముళ్ళు 
గుచ్చుకొని ఏడ్చి ఏడ్చి చనిపోయింది అని చదివామనుకోండి.చదివిన వారి హృదయాలు ఆ బిడ్డ తెరువడా?వారిలోని దైవత్వాన్ని స్ప్రుశించాదా?
శాంతిని కాం క్షించండి.హృదయంతో ఉండండి.
        మృత్యు ఘంటారావం 
 నగరంలో నరమేధం 
నిర్నిమేషంలో విసిరిన యమపాశం 
నడివీధిలో మృత్యువు వికట్టట్టహాసం
 ఏమిటిది పిడుగా?
రక రకాల మనుషులు ,రక రకాల మనసులు 
జన జీవన స్రవంతిలో అనుక్షణం ఉరకలు 
మరు క్షణం అన్ని మాయం 
మసలుతున్న నిశ్శబ్దం 
విసిరివేయబడిన శవాల గుట్టలు 
మదమెక్కిన పిశాచాల మూర్కపు పన్నాగం 
మది మది ని కదిలిస్తే 
మహాత్ములై కదిలోస్తే 
ఉన్మాదాన్ని కరిగించాలి 
మరో ప్రపంచాన్ని సృజించాలి 
మిన్న అయిన దైవమా ఆలకించు 
ప్రేమా అమృతంతో మరో లోకాన్ని సృజించు..........

No comments: