Wednesday 11 July 2012

రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం


  రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం 
రూం అంతా వేడిగా పొగలు సెగలుగా నిండి పోయి ఉంది.
పెద్ద మేడం హాట్ హాట్ గా ఉండేసరికి పార్టి పెద్ద తలకాయలు 
నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉంచుకొని గప్చిప్.....

చెప్పండి ....ఎందుకిలా అన్ని వైపులా ఓటమి ...
పార్టీయే మునిగేలా ఉంది.ఏదో ఒకటి చెప్పక పోయారో 
మీ బతుకు బస్సు స్టాండే....పొండి :పొయ్యి ఎలుకను తవ్వి 
కొండను పట్టుకు రాపొండి".

ఏమిటి సామెత కూడా పార్టీ లాగా తిరగ బడిందే  అనుకోని 
మనకు ఎందుకు ....మళ్ళా జాలిం లోషన్ తో పని 
అనుకోని తలలు అన్ని కోణాల్లో ఊగిస్తూ వెళ్లి పొయ్యారు.

మూడు రోజులు  తలకిందులుగా ఆలోచిస్తే మోకాల్లో మెదడు కొంచం 
యధాస్తానానికి వచ్చి ఆలోచించింది.అన్ని లుక లుక తమ వైపే ...
ఇది కాకుండా చిన్న సార్ కూడా ఇందులో వేలు పెట్టాడు.
దెబ్బకి "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా '' అని ప్రజలు 
పార్టీని కుట్టేసి ముక్కలు  చేసేసారు.ఈ విషయం పెద్ద మాడం కి చెపితే 
ఇంక ఏమైనా  ఉందా?

పాయింట్లు  అన్నీ తిరగేసి మరగేసి చూసారు వేరే వాళ్ళ మీదకు నెపం 
తోయ్యటానికి.....అందులో ఒక పాయింట్ కనిపించింది ఓటమికి. 
పెరిగిన ధరలు.

అయితే పెరిగితే మాత్రం దానికి తగ్గట్లు జీవించాలి కాని ఎందుకు అరవటం 
ఈ జనాలు....అసహనం గా  అరిచాడు ఒక చిదంబర తలకాయ.
అవును ఈ జనాలింతే.....యెంత రెట్లు పెరిగినా ఏ రోజైనా వోట్లేసే రోజు 
పంచుతూ ఉండే  సారా తగ్గించామా?
హూ...సకిలించాడు  ఇంకో పెద్ద తలకాయ.

అందుకే ఆయనెవరో అన్నాడు ''ఆసియా ప్రజలు తిండితోనే ఆహార 
కొరత అని....వీళ్ళు అంత అంత తినటం ఎందుకు ?ధరలు పెంచటం 
ఎందుకు?మనం పెంచాము అనే నింద మనకు ఎందుకు?''

చిదంబర తలకాయ కి ఇంకో మంచి ఆలోచన వచ్చింది.''యురేకా''
అరిచాడు గట్టిగా....దెబ్బకి అందరు అదిరిపడి తమ పంచెలు 
గట్టిగా పట్టుకొని ఆయన పంచె వైపు చూసారు....ఎక్కడ ఆనందంతో  
వీధి లోకి పరిగేడుతాడో అని ....హమ్మయ్య క్షేమం అని అనుకోని 
కారణం సెలవు  ఇయ్యమని వినయంగా అడిగారు 

చిద్విలాసంగా నవ్వి ''అసలు ఈ పేదలతో మనకు కష్టం లేదు.
వాళ్ళు తాగేది గంజి.గోప్పోళ్ళ తో కష్టం లేదు.వాళ్ళు బెంజి లో 
తిరిగినా సమయం లేక తినేది బ్రేడ్డే....వీళ్ళిద్దరికీ మన గూర్చి 
ఆలోచించే తీరిక అరిచే ఓపికా ఉండవు.

రేపు నేను మీడియా కి ఇచ్చే స్టేట్మెంట్  చూడండి....దెబ్బకి 
ధరల పెరుగుదల నింద మనపై లేకుండా పోతుంది.
మేడం కూడా చిన్న బాబు పై నింద వెయ్యనందుకు మెచ్చుకుంటారు అన్నాడు.

పక్క రోజు వార్త....''అసలు ఈ మధ్య తరగతి వాళ్ళ వల్లే ధరలు 
పెరుగుతున్నాయి(అంటే పెరిగినట్లు అందరికి తెలుస్తున్నాయి)
ఏమి బియ్యం ఒక్క రూపాయ పెంచితే మీ సొమ్ము ఏమి పోతుంది 
గలబా...గలభా...ఏమి ఐస్ క్రీంలు తినటం లేదా ?మినెరల్ వాటర్ 
తాగటం లేదా?ప్రభుత్వం కోసం ఈ మాత్రం అన్నింటి పైనా ఒక్క 
రూపాయి ....ఒకే ఒక్క రూపాయి పెంచాలేరా?

నిద్రపోతున్న చిదంబర తలకాయ ఆత్మని లేపి అడిగాడు 
అపరిచితుడు.....ఒక్క రూపాయ మీకిస్తే మా సొమ్ము పోతుందా?
పోదు చెప్పాడు...ఛి.త.......వంద రకాలపై ఒక్క రూపాయ మీకిస్తే 
మా సొమ్ము పోతుందా? పోదు...ఛి.త 
వంద కోట్లు మంది ఒక్కో రూపాయి,ఒక్కో వస్తువు మీద ఇస్తే 
సొమ్ము పోతుందా?

చిదంబర తలకాయ నవ్వింది....పోదు...ఎక్కడికి ...
స్విస్ బ్యాంక్ కి తప్ప......హ...హ...హ...
అంతే మధ్యతరగతి అపరిచితుడు....డమాల్ అని స్పృహ తప్పి పడి పొయ్యాడు.

చిదంబరం గారికి.....ఏదో మీ పుణ్యమా అని సాదారణ గృహిణిగా 
ముచ్చట్లు వ్రాసుకునే నేను ఇలా ''రాజ'కీ' యాలు'' వ్రాసుకొనే 
స్టేజ్ కి వచ్చాను.ఇలాగే నన్ను అభివృద్ధి చేసి ఏదో ఒక ఊరికి 
ఎం.ఎల్.ఏ.చెయ్యగలరని ప్రార్ధన.

7 comments:

Anonymous said...

తప్పకుండా!
మాదొంగఓట్లన్నీ మీకే!!

జలతారు వెన్నెల said...

భలే రాసారండి శశి గారు!

Unknown said...

హ హ శశి గారు :))

హనుమంత రావు said...

చిదంబర రహస్యమదా.యమ్.యల్.ఏ అవుదామనా ? విజయోస్తు... సెటైర్ బాగుంది... ఇంటరెస్ట్ గా ఉంది..

Anonymous said...

అయినా వొట్ ఫర్ కాంగీ.............మన ఖర్మ

శశి కళ said...

అనానమస్ గారు ))) థాంక్యు.


హనుమంత రావ్ గారు మరీ అంత లేదు...థాంక్యు

శశి కళ said...

వెన్నెల,శేఖర్ థాంక్యు