మీరు నిజంగా భారతీయులేనా?
అవును మరి మీరు ఎప్పుడు నిజంగా
భారతీయ పౌరులు అవుతారు అంటే పద్దేనిమిది
సంవత్సరాలు నిండిన తరువాత మీకు వోటర్
ఐడింటిటి కార్డ్ వచ్చి మీరు వోటు వేస్తేనే మీరు ఈ
దేశ పౌరుడు అయినట్లు.
తమాషా ఏమిటంటే చక్కగా అన్ని విషయాలలో ముందు
ఉన్న వాళ్ళు దేశం మీద అంతో ఇంతో ప్రేమ ఉన్న వాళ్లకు
కూడా వోటు హక్కు లేక పోవడం.....ఉన్నా వేయక పోవడం.
మేము ఎలెక్షన్ డ్యూటీ కి వేళుతున్టాము కాబట్టి
మాకు తెలుసు నిరక్ష్యరాసులు ఎలాంటి పరిస్తితిలో
వచ్చి వోటు వేస్తారో.అసలు చదువుకున్న వాళ్ళే
వోటు విలువ తేలీక,అక్కడ మంచి వాళ్ళు లేరు
మేము ఎందుకు వోటు వెయ్యాలి అని వచ్చి వోటు వెయ్యరు.
అసలు మీకు తెలుసా సమస్యాత్మకం కాని ప్రదేశాల్లో
కూడా పోలింగ్ శాతం అరవై దాటటం లేదు.నలబై నుండి
అరవై శాతం పోలింగ్ జరిగితే దానిలో ముప్పై శాతం
వోట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు.అంటే డెబ్బై శాతం
మంది వీళ్ళను కావాలి అనుకోవడం లేదు.వీళ్ళు
ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనం దానికి బాధ్యులం
కావాలి.గ్యాస్,కరంట్,పన్నులు,ఒకటి అనేమిటి మనం వోటు
వేయని పాపానికి మన మీద పడే భారం అదంతా.....
ఎందుకంటె చదువుకున్న వాళ్ళు వోట్లు వేసారు అనుకోండి ...
కొంత వరకు వీళ్ళు డబ్బుకు లొంగరు.విజ్ఞతను
పాటిస్తారు.దాని వలన పార్టీలు కొన్న వోట్ల మీదే
ఆధార పడలేవు.వీళ్ళ వోట్లు కావాలి అంటే కొంత వరకు
మంచి పాలన చూపాలి.ఇంకా ఎన్నికల ఖర్చు తగ్గించి
పాలన పై శ్రద్ధ చూపిస్తారు.......నిజంగా జరుగుతుందా
అంటే లేకుంటే ''ఒబామా''ఎలా గెలిచాడు అక్కడ.
మరి చదువుకున్న వాళ్ళు ''మంచి పౌరులుగా''
నిలబడాలి.
ఎందుకు ఇదంతా చెపుతున్నావు అంటే....
ఇప్పుడు చెప్పే విషయం అందరికి చెప్పండి.
పద్దెనిమిది నిండిన వాళ్ళు,ఓటు హక్కు లేని
వాళ్ళు వోటు హక్కు కోసం ఆన్ లైన్ లో అప్ప్లై
చేసుకోవడానికి చివరి తేది ''31-10-2012''
వోటర్ కార్డ్ కోసం ఇప్పుడే అప్ప్లై చేసుకోండి.
మీ దగ్గరి వాళ్లకి చెప్పండి.ఒక మంచి భారత దేశాన్ని
కోరుకునే వాళ్ళుగా అది మీ బాధ్యత.
దీనికి అప్లై చేసుకోవడానికి కింది లింక్ ఉపయోగించండి.
(వోటర్ కార్డ్ కు అప్లై చేయటానికి లింక్ ఇక్కడ )
ఈ రోజు శ్రీ లక్ష్మి గారి గురించి చదివిన తరువాత
చాలా సంతోషం వేసింది.యెంత అంటే అంత...
దానికి కొలతలు ఎక్కడ ఉంటాయి ?
ఇక్కడ ''వైజాగ్ ఆలిండియా రేడియో స్టేషన్''లో
అనౌన్సర్ గా పని చేసే తను భర్త వృత్తి రీత్యా
వాషింగ్టన్ వెళ్లి పోయారు.కాని తనకు ఇష్టమైన
రేడియో ని వదలలేక తన సొంత డబ్బులతో
వాషింగ్టన్ లోని మేరీల్యాండ్ కేంద్రంగా ''మన తెలుగు రేడియో''
ప్రారంబించారు.తనకు తెలిసిన టేక్నాలిజీని ఇలా ఉపయోగించుకోవడం
అందులో తెలుగు కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు
ప్రసారం చేయడం యెంత అభినందనీయం.
తనతో మాట్లాడితే యెంత సంతోషంగా ఉన్నారో
తను చేసే పని పట్ల.నిజంగా మనం చేసే పనిలో మనం
అనునాదం చెందితే అలాగే మాట్లాడుతాము అనుకుంటాను....
మరి ''కుంచెన పల్లి .శ్రీలక్ష్మి''గారిని మనం కూడా మంచి
మనసుతో అభినందిద్దాము.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటె
''WWW.MANATELUGURADIO.COM''
లోకి వెళ్లి ప్రసారాలు వినండి.
(రేడియో లింక్ ఇక్కడ )
నీవు పొంగిన వేళ....తను వరద గోదారి
నీ సంతోషాన్ని పంచుకుంటూ ....
నీవు కుంగిన వేళ .....తను ఆసరా
నీకు సంజీవనిలా శక్తి నిస్తూ.....
నీ అహం వంగని వేళ ....తన ప్రేమ అండ
స్పర్శను అమృతం లా చేసి.....
నీ చెడు దారి వదలని వేళ.....ఆదలించే తల్లి
దారిని చూపే దిక్సూచి.....
చెడు ది పై చేయి అయిన వేళ ......దుష్టుని దునుమాడె శక్తి
జ్యోతి గా గౌరవించిన వేళ .....వెలుగును పంచె దైవం ....
''నిజం గా ఒక శక్తి ని వాదనలు లేకుండా గౌరవించి
తమ జీవితాలను ఆనందమయం చేసుకోవడం
మన పెద్ద వాళ్లకు తెలిసినంత మనకు తెలీదు ఏమో''
''అందరికి విజయ దశమి శుభాకాంక్షలు
మీకు అన్ని విషయాలలో విజయం కలగాలి
అని కోరుకుంటున్నాను''
విజయ దశమి గూర్చి కొంత
ఏమ్మా బ్లాగ్ లో రివ్యు పెట్టవా?(ఇదేదో పెద్ద రివ్యు అంట
వాళ్ళ భ్రమ)''కెమరామాన్ గంగతో రాంబాబు''
చూసినాక పిల్లలు అడిగారు.
''టాట్...పెట్టను''విసుగ్గా చెప్పాను.
''అమ్మా ఘోరం...తమన్నా బీర్ తాగిందని పెట్టవా?
నిజం చెప్పు కొంచెం కూడా నచ్చలేదా?''ఇద్దరు
విసిగించేసారు.ఇద్దరు ఓటు హక్కు వచ్చిన పిల్లలు ఏదో
ఫీల్ అయ్యారు అంటే ఏదో కొంత ఉన్నట్లే కదా....అయితే మేము
ఏదో పాత విప్లవ సినిమాలు చూసాము కాబటి మాకు పెద్ద
అనిపించలేదు కాని వీళ్ళు ఇలాంటి కవిత్వాలు,సినిమాలు
చూడలేదు కాబట్టి వాళ్లకు నచ్చినట్లుగా ఉంది.
కధ విషయానికి ఆస్తే .....రాంబాబు మెకానిక్ .అయినా పేపర్ లో
ఏ న్యూస్ చూసినా వెళ్లి వాళ్ళను కొట్టి అయినా సమస్య తీరుస్తుంటాడు.
ఇది చూసి ఒక టి.వి.చాన్నేల్ లో కెమరా మాన్ గా పని
చేస్తున్న గంగ ....రాంబాబుని జర్నలిస్ట్ గా చేసేస్తుంది.
ఇక ముఖ్య మంత్రి ,అతన్ని పదవిలో నుండి కిందకు దింపి
తానూ ఎత్తులు వేసే ప్రతి పక్ష నేత,అతని కొడుకు .....వాళ్ళ
జిత్తులు రాంబాబు తన మాటలతో చిత్తు చేస్తుంటాడు.
కొడుకు ప్రకాష్ రాజు తన నాన్ననే చంపేసి తన తెలుగు రాష్ట్ర
ఉద్యమం అడ్డు పెట్టుకొని గద్దె పైకి రావాలని అనుకుంటాడు.
ఇక తరువాత మలుపులు.....చివరికి రాంబాబు చానల్స్ లో
మెసేజ్ ఇచ్చి జనాలను రాజకీయాలు జరుగుతున్నా హోటల్ దగ్గరకు
వచ్చేట్లు చేసి విలన్ ను చంపెయ్యటం.మొత్తం మీద ప్రజలు
తిరగ బడితే పార్టీలు కొట్టుకు పోతాయి .....తమ ధనం యెంత
ఎలా వేస్ట్ అవుతుందో,అది తమ నుండే మళ్ళా వసూలు చేస్తారు
తెలుసుకోమని సారాంశం.
సరే పూరి చాలా చక్కగా డైలాగ్స్ వ్రాసారు.పవన్ చేత కష్టపడి
పలికించారు.బాగుంది.ఇక సంగీతం ''మణి శర్మ''జోష్
బాగుంది.ఆపరేటర్ చెప్పిన దాని బట్టి మొదటి రోజే లక్ష
కలక్షన్ వచ్చిందంట.క్లాస్సా?మాసా?అని అడిగితె మీరే
చూడండి మేడం అని చెప్పి వెళ్లి పోయాడు.మొత్తానికి అవేరేజ్.
కాకుంటే తమన్నా ను డీ గ్రేడ్ చేయడం నచ్చలేదు.
అసలు తన పాత్రను చాలా చక్కగా పరిచయం చేసారు.
దుస్తులు కూడా బాగున్నాయి.అసలు కెమరా మాన్
చేయడం కష్టం.మొదట పేరు చూసి గంగ ఎవరు అని కూడా
అనుకున్నాము.
నేను ''ఎక్స్త్రార్దినరీ''అంటూ ఉంటుంది.అంటే తను వృత్తి
పరంగా చెపుతుంటుంది కాని ఎప్పుడూ తానూ అందగత్తె
అని అసామాన్యం అని చెప్పదు.నిజానికి ఆ వృత్తి తీసుకోవడం
అసామాన్యమే ....కాకుంటే వృత్తి మీద అంత డెడికేషన్
ఉన్న అమ్మాయి తాగడం ఏమిటి?''అసిన్''ని సిగిరెట్
తాగించిన పూరి ఇంత ఘోరం చేస్తాడు అనుకోలేదు.
ఇప్పటి పిల్లలు కొంచెం నాగరికత పేరుతొ పబ్ లు
తిరగటం మామూలే.....కాని ఈ అమ్మాయి చిత్రీకరణ వేరు గా
ఉంది.పవన్ ని హీరో చెయ్యడం కోసం తనను అంత
డీ గ్రేడ్ చెయ్యక్కర్లేదు.
తానూ యెంత అసామాన్యం అనుకునే స్త్రీ అయినా తన
హృదయం కోసం తపించి నపుడు,తన కొరకు ద్రవించి నపుడు
కను కోలుకుల్లో జారే కనీటి చుక్క తప్పకుండా తను
మామూలు ఆడదాన్ని అని గుర్తు చేస్తుంది.
పవన్ చేత అలాగా డైలాగ్స్ పలికిన్చక్కర్లేదు.
అంత మంచి స్తానం లో నిలిపిన తమన్నాను అలాటి స్తాయి లోనే
చూపించి ఉంటె బాగుండేది.
ఒక్క బీర్ బాటిల్ తాగినంత మాత్రాన అందరు ఫాల్లో
అయిపోతారా?అంటే ......''ఒక్క పాతిక మంది ఎం.ఎల.ఏ.లు
మరింత మాత్రాన మీ తల రాతలు మారి పోతాయి''
అనే ఒక్క డైలాగ్ తొ అందరికి ఆలోచన వస్తుందా?
వస్తుంది అనేది నిజం అయితే...ఇది కూడా నిజమే.
అసలే యువత ఎలాటి దారుల్లో నడుస్తుందో అందరికి
తెలిసిందే.
అయితే డబ్బు కోసమే సినిమాలు తీసే ఈ రోజుల్లో
కొంత ఆలోచింప చెయ్యాలి అనే సినిమా రావడం స్వాగతించాలి.
బ్రదర్స్ కూడా చారులత లాగా దెయ్యం .కాం అనుకొని
కామ్ గా ఉన్నాను.కాని కాదు అని నిన్న పేపర్ చూస్తె తెలిసింది.
సరే సూర్యా తొ సెలవలు శుభారంభం చేద్దాము అని
మా వారి చెవిలో వేసాను.హమ్మయ్య ఒప్పేసుకున్నారు.
వెళ్లేసరికి మామూలే మొదలు అయింది.ఏదో ప్రకటన ...
ఏమి మిస్ కాలేదు లెండి ఏదో ప్రకటన అన్నాను.
కాని అది కూడా సినిమాలోదే .''ఎనేర్జియాన్''అనే ఫుడ్
డ్రింక్ తయారు చేస్తూ ఉంటాడు రామ చంద్ర తన ఫ్యాక్టరీలో.
దాని వలన అతను కోట్ల డబ్బు,హోదా సంపాదించి ఉంటాడు.
అతనికి అఖిల్,విమల్ అనే అవిభక్త కవలలు ఉంటారు.
వేరు చేస్తే ఒకడే మిగులు తాడు అని వేరు చెయ్యరు.
హీరోయిన్ అంజలి వాళ్ళ ఫాక్టరీ లోనే పని చేస్తూ ఉంటుంది.
విమల్ మంచి క్లేవేర్.బుక్ రీడర్.ఇక్కడ తిలక్ కవిత్వం గూర్చి
హీరోయిన్ తొ మాట్లాడుతూ ''ప్రేమించిన వాళ్ళు కవిత్వం
వ్రాయకుండా ఉండలేరు,తిలక్ కవిత్వం చదివిన వాళ్ళు
ప్రేమించకుండా ఉండలేరు''....అసలు వీళ్ళు విడిగా లేరే
పెళ్లి ఎలా చేసుకుంటారు అనిపించింది.
(అర్జెంట్ గా ఆ తిలక్ గారి పుస్తకం ఒకటి సంపాదించి చదవాలి
లేకుంటే ఈ అరవోల్లు ప్రతి సినిమాలో మనం మన బాషని
గౌరవించం అని యెగతాళి చేస్తూ ఉంటారు)
రఘు కూడా ఆ ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఉంటాడు.కొంచెం అమాయకమే
కాని జీనియస్.అంజలిని ప్రేమించాను అని వెంటపడి
చెపుతూ ఉంటాడు.
అంజలి అఖిల్ వాళ్లకు ''ఓల్గా''అనే రష్యా జర్నలిస్ట్ ని
పరిచయం చేస్తుంది.ఆ అమ్మాయి రామ చంద్రాఫాక్టరీ
వివరాలు అనీ కూపీ లాగుతుంటుంది.ఎందుకు అంటే
అదే సస్పెన్స్.ఆమె రఘుని కూడా వివరాలు ఇవ్వలేదు అని
చంపేస్తుంది.కాని తరువాత ఆమె కాదు రామ చంద్ర తన ఫాక్టరీ
బండారం బయట పడుతుందని చంపేస్తాడు అని విమల్ కి
తెలుస్తుంది.ఈ లోపల అంజలి తొ సినిమాకి వెళతారు.
అక్కడ చక్కని హాస్యం చిన్నగా అరికాలు ని గిలిగింతలు
పెట్టినట్లు....అన్ని సీట్ల లోని వారు నవ్వులే నవులూ.
ఇక పాట ఎందుకులే పాతాళ గంగ మీద పుట్టే లో
ఊగుతూ వెళుతున్నంత హాయిగా....అసలు ఫోటోగ్రఫి
సీనరీస్....రెండు కళ్ళు చాలవు....బ్రెయిన్ లో ఉండే మెమొరీ
సరిపోతుందా...భలే తీసారు.హ్యరీస్ సంగీతం చాలా
బాగుంది.
తరువాత ఓల్గా మేటర్ కలెక్ట్ చేసిందని తెలిసి తనని చంపమని
రామ చంద్ర మనుషులను పంపుతాడు.కాని ఆ అమ్మాయి తనను
మిద్దె పై నుండి తోసే టపుడు పెం డ్రైవ్ మింగి చని పోతుంది.
దానిని పోస్ట్ మార్తుం తరువాత అంజలి సంపాదించి
విమల్ కి ఇస్తుంది.అది తెలుసుకున్న రామ చంద్ర
కొడుకుల మీదకే రౌడీలు పంపుతాడు.ఆ పోరాటం లో
విమల్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది.అందుకని అతని హార్ట్
అఖిల్ కి పెట్టి అతన్ని మాత్రమె బ్రతికిస్తారు.
వేరు అయిన తరువాత పాటలో అఖిల్ తన తమ్ముడ్ని
గుర్తు చేసుకుంటూ బాధ పడటం మనల్ని కంట తడి
పెట్టిన్చేస్తుంది.ఇంటర్వెల్.ఈయన ''మంచి సినిమా శశి''
హమ్మయ్య అనుకున్నాను.
తరువాత అఖిల్ వాళ్ళ నాన్న చేసే తప్పుడు పౌడర్ వలన
నలబై లక్షల మంది పిల్లలు నరాల జబ్బుతో చనిపోతారుకొన్ని
రోజుల తరువాత అని తెలుస్తుంది.తరువాత ఉక్రెయిన్ కి
అంజలిని తీసుకుని వెళ్లి ఏమి చేస్తాడు...సస్పెన్స్.
లాస్ట్ లో రామ చంద్రా అఖిల్ పుట్టుక గూర్చి ఒక నిజం
చెపుతాడు.చెప్పి ''నువ్వు నాకు కుక్క తొ సమానం
చెత్త నా కొడకా''అంటాడు.సూర్య బాధతో తండ్రిని వదిలేస్తే
తండ్రి ఏమి అవుతాడు?మారుతాడా?
మరి సినిమాకి వెళ్లి చూడండి.పాపం హాల్స్ అన్నీ
వెల వెల పోతున్నాయి.మంచి వినోదాన్ని ఇచ్చే సినిమా
వస్తే అన్నా చూడాలి కదా.మంచి స్క్రీన్ ప్లే.డైరక్షన్.
మంచి సినిమా చూసిన అనుభూతి ఉంటుంది...
చివరలో కొంచెం తెలుగు సినిమా మసాలా కలపకుండా
ఉండి ఉంటె.....కాని చూడొచ్చు.బాగుంది .
హా....చెప్పు ....టి.వి.సీరియల్ మధ్యలో కరంట్
పొతే విసుక్కున్నట్లు ....తూగుతుంటే లేపిన
పెద్ద మనిషిని విసుక్కుంటూ తెల్ల కాగితం ,పెన్
తీసుకున్నాడు చేతిలోకి....
''పేరు ఏమిటి?''....చెప్పాడు
''ఎక్కడ ఉంటారు?''చెప్పాడు అతను.
''ఏమి పోయింది?ఎప్పుడు?''
చెప్పినది విని మన్మోహన్ గారు మాట్లాడితే వినపడి నట్లు
ఉలిక్కి పడ్డాడు.
''ఏమిటి అది పోయిందా?నిజమా?''
''నిజమండి''బాధగా చెప్పాడు అతను.
''నిండుదా?ఖాళీదా?''అడిగాడు.
''అయ్యో ఖాలీది వాడు ఏమి చేసుకుంటాడు చెప్పండి
నిండుదే '' దిగులుగా తరుక్కుని పోయిన గుండెతో
భారంగా చెప్పాడు.
నిలబడ్డాడు రైటర్ ....''అయితే మీరు ఏమి చేస్తున్నారు
ఇప్పుడు"రైలు ప్రమాదం జరిగితే కాపాడకుండా
ఫోటోలు తీసే మొహం వేసుకొని...
''ఏమి చేస్తాము చెప్పండి.ఉదయాన్నే తోటకూర,గోంగూర
మన్ను కూర శుబ్రం చేసి తరిగి తగు మోస్తర ఉప్పు వేసి
....''చెపుతూ ఉన్న అతనికి అడ్డు తగిలాడు రైటర్ ...
ఉండు వ్రాసుకోవాలి.
అతను చెప్పసాగాడు''మశానం కూర ముళ్ళు లేకుండా చక్కగా
గిల్లుకొని అన్నీ కలిపి మిక్సీ లో వేసుకొని తగినంత నీరు పోసుకొని
......కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు....''తరువాత సరిగా
గుర్తు లేదు''
''లేదు..లేదు గుర్తు చేసుకొని చెప్పు''అదిలించాడు రైటర్.
తప్పదా అన్నట్లు చూసి....మూడు సార్లు బుర్ర,
పది సార్లు మోకాలు గోక్కున్నాడు.సరే సహాయం కావాలో
ఏమో అని తన వంతుగా తానూ కూడా గీరాడు రైటర్.
''హా గుర్తుకు వచ్చింది''...''చెప్పు''ఆసక్తిగా చేతిలోని
పెన్నుతో ముందుకు వంగాడు రైటర్.
''అవన్నీ మిక్సీ లో వేసి వడ గట్టాలి ...తరువాత కొంచెం
జిలకర పొడి,మిరియాల పొడి కలుపుకొని
తాగాలి''తన్మయంగా చెప్పు కొని పోతునాడు.
''ఆపు...ఆపు''అరిచాడు రైటర్ ...వస్తున్న ఎస్.ఐ.ని
చూసి సాల్యుట్ చేస్తూ.
ఏమిటి సంగతి కళ్ళతో అడిగాడు.....చెప్పాడు.
ఉలిక్కి పడ్డాడు ఎస్.ఐ.
''ఏమిటి నిండుదే''
''అవును''తల పంకించాడు.వ్రాస్తున్న మేటర్ చూసాడు.
ఆనందం తొ ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.
గుడ్ నాకు ఒక కాపీ వ్రాసి పెట్టు.....
అని పక్కకు పిలిచాడు.
చిన్నగా గుస గుస....''దొరికితే ఇంటికి పంపెయ్యి
మేం సాబ్ ఆర్డర్''చెప్పి వెళ్లి పోయాడు.
తనకే సొత్తు అని ఆనంద పడిన రైటర్ మొహం వాడి పోయింది.
సరే ఈ వివరాలు అన్నా తెలుసుకుందాము అని
అతని వైపు తిరిగి ఇంకా ఉన్నాయా?చెప్పు.....
అతను తన్మయంగా చెప్పుకు పోతునాడు.
మధ్యాహ్నం ....కెరట్ ఒక సెంటిమీటర్ ముక్కలుగా
తరిగి బీర కాయ పీచు తీయకుండా ,పచ్చి మిర్చి తొ
కలిపి తొక్కి దానిని కెరట్ లో కలపాలి.
దానిలో బీట్ రూట్ తురుము ,తేనే కలిపి....
చెప్పుకుంటూ పోతునాడు.అర బస్తా కాగితాలు వ్రాసి
నిట్టూ ర్చాడు రైటర్....ఇప్పుడు దీనికి రెండో కాపీ
రాయాలి ......గుట్టను దిగులుగా చూసాడు.
''సరే దొరికితే చెపుతాము పో''చెప్పి పంపేసాడు.
@@@@@@@
''సార్ దొరికింది''సంతోషం గా వెళ్లి చెప్పాడు ఎస్.ఐ.కి.
దెబ్బకి మొహం నూనెలో వేసిన పూరిలాగా పొంగింది.
(ఎన్ని రోజులు అయింది పూరి తిని అనుకుంటూ)
ఉన్నట్లుంది చిల్లు పొడిచిన పూరి లాగ అయిపోయాడు
వచ్చిన ఫోన్ కాల్ విని....''ఎవరు సార్''
''నా మొగుడు...ఎలా తెలిసిందో ఏమో దొరికిందని''
''ఇప్పుడేమి చేద్దాము సార్ ?''
''ఏమిటి చేసేది నా మొహం ఆడకు పంపించు''
ఆ కాగితాల కట్ట తీసుకొని సరే ఇవే ప్రాప్తం
అనుకుంటూ వెళ్లి పోయాడు.
@@@@@@@@
చాలా రోజుల తరువాత వచ్చాడు ...అతను .
కాని మొహం లో దీనత్వం లేదు,
ఏదో తేజస్సుతో వెలిగి పోతుంది.
''ఇంకా రోజులు పడతాది దొరకటానికి
దొరికితే పిలుస్తాము పో ''కసురుకునాడు రైటర్ .
''అయ్యో వద్దు సార్...దొరికినా ఇవ్వొద్దు అని చెప్పటానికి
వచ్చాను''నవ్వుతూ అన్నాడు.
'అదేమిటి''వింతగా అడిగాడు రైటర్.
''మరే ఆ గ్యాస్ బండ పోయినప్పటి నుండి దరిద్రం వదిలి పోయింది.
చక్కగా కూర గాయాలు తిని కొలెస్టరాల్ లేదు,
గ్యాస్ ప్రాబ్లెం లేదు.మ ఆవిడా సన్న పడింది.
ఇంటి బడ్జెట్ మిగులు లోకి వచ్చింది.పిల్లలకు ఫీ కట్ట గాలుగుతునాము'
ఇప్పటికే ఫ్లాట్ కొన్నాము ...ఇల్లు కట్టాలి అని ప్లాన్ చేస్తున్నాము''
ఓర్నీ గ్యాస్ ఇంట్లో లేక పొతే ఇంత సంతోషమా?
వెంటనే ఆ బండ ను వదిలిన్చుకోవాల్సిందే.
ప్రభుత్వాన్ని అందరు తిడతారు కాని ఇంత మంచి
చేస్తుందని తెలుసుకోరు.
భక్తిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి దణ్ణం పెట్టాడు.
కల కాలం ఉండమని ......
ప్రక్రుతి లో ఏ జీవి కూడా ఇతర జీవులు లేక
దానికి మనుగడ లేదు.
అందుకే పెద్ద వాళ్ళు సంస్కృతీ,సాంప్రదాయం పేరుతొ
విష జీవుల్ని అయినా,చెట్లని అయినా,భూమిని అయినా
గౌరవంగా పూజించాలి అని నేర్పించారు.
దానిలోని పరమార్ధాన్ని అర్ధం చేసుకోకుండా
ఆచరించటం వలన అవి మూఢనమ్మకాలుగా
మారిపోయాయి.కనీసం మనలను అవహేళన చేసే వారికి
ఇది ఎందుకు పాటిస్తున్నామో కూడా చెప్పలేని
పరిస్తితి లో ఉన్నాము.
మన తరువాతి తరాలకు ధనం కాదు ....
వాళ్ళ మనుగడకు కావాల్సిన చక్కని ప్రకృతిని
అందించటం...
మన వాళ్ళు మన కిచ్చిన సంస్కృతీ సంప్రదాయాలలోని
ఆంతర్యాన్ని వారికి వివరించటం మంచి పౌరులుగా
మన భాద్యత.
ఈ భాద్యత నన్ను ఇక్కడ ఉన్న శ్రీహరి కోట మీద
ఆర్టికల్ వ్రాసే వైపు నడిపింది.నిజంగా నా అన్ని
ప్రచురణలు కంటే ఈ ఆర్టికల్ ప్రచురణ నన్ను ఎంతో
ఆనందింప చేసింది.
''ఈ రోజు (9/10/2012) ఆంద్ర ప్రభ డైలీ లోని లైఫ్ పేజ్ లో
నా ఆర్టికల్ చూడండి ''
''ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు''సందర్భంగా
నెల్లూరు జిల్లా లోని ''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''
లో అన్ని స్కూల్స్ నుండి టాపర్స్ అయిన వారిలో
యాబై మందిని సెలెక్ట్ చేసి వారికి గురు,శుక్ర వారాల్లో
పోటీ పరిక్షలు ,క్యిజ్ ''జి.ఎస్.ఎల్ .వి.''అవార్డ్ కోసం
నిర్వహించారు.
దీనిలో విశాఖ పట్నం కు చెందిన ఎం.పరిణీత మొదటి బహుమతి,
హైదరాబాద్ కు చెందినా నూతి.ప్రణవ్ రున్నర్ అప్ గా నిలిచారు.
వాళ్ళకు అక్కడ శాస్త్రవేత్తలు అనీ చూపించి అక్కడ చేస్తున్న
ప్రయోగాలు గూర్చి వివరించారు.ఇప్పుడు వాళ్లకు
అక్కడ పెద్ద అయిన తరువాత వాళ్ళ ప్రయోగాల లో
పాలు పంచుకోవాలి అని ఉంది అని చెప్పారు.
ఇది నిజమే అయితే మంచి పరిమాణమే.యువత ఇలాగే
ఆలోచించాల్సి ఉంది.
అయితే ఎక్కడ ఉన్నా ....
''ఏ దేశమేగినా
ఎందు కాలిడినా
ఏ పీటం ఎక్కినా
ఎవ్వరు ఎదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవం''
ఇవి గుర్తు ఉంచుకుంటే బాగుంటుంది.
వారికి నా ఆశీస్సులు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి.మనం ఇస్రో లో ఎలా ఉంటుందో
వాళ్ళు అన్నీ చూపిస్తారో లేదో అని అనుకుంటాము.
కాని అది నిజం కాదు అక్కడ గర్వం లేకుండా మనలను
అనీ తిప్పి చక్కగా వివరిస్తూ చూపుతారు.
రాకెట్ ప్రయోగాలు లేక పొతే మనలను బుధవారం
అనుమతిస్తారు.ఇంకా పి.ఆర్.ఓ.గారికి ఫోన్ చేసి అనుమతి తీసుకోవచ్చు.
అక్కడ పులికాట్ సరసు,ప్రయోగ కేంద్రం చక్కని వాతావరణం
సముద్రం,వాళ్ళు ఆ ద్వీపాన్ని అప్పటిలాగే కాపాడటం
మన అదృష్టం బాగుంటే నవంబర్ నుండి డిసంబర్ వరకు
దూర తీరాల నుండి వచ్చి పిల్లలను పొదిగి పెద్ద చేసుకొనే
పెలికాన్స్,ఫ్లేమింగోస్ మొదలగునవి చూడటం చాలా గొప్ప
అనుభవం.మీకు.మీ పిల్లలకు ఈ యాత్ర విజ్ఞానదాయకం,
సంతోషం కలిగిస్తాయి.
p.r.o. gari phone number:0862322618336
యెంత సంపద ఉంటె ఏమి లాభం ....
ఎంత ఆస్తి ఉంటె ఏమి లాభం ....
మేము కొత్త చీరలు కట్టుకొని మహా లక్ష్మి
లాగా ఇంట్లో తిరగక పొతే....
సరే ...సరే మీరు మంచి వాళ్ళు
డబ్బులు ఇస్తారు,తెచ్చుకోమంటారు.
మరి మంచి చీర కుదరొద్దా?
అందరి కళ్ళను లాగోద్దా?
మన గొప్పలు చెప్పోద్దా?
ఇవన్నీ లేక పొతే మేము జీవించి ఏమి లాభం
మరి నా కధ చీరల షాపింగ్ మీద
మాలిక పత్రిక లో చూడండి ))
''చీరల సందడి''
మాలిక లో నా కధ లింక్ ఇక్కడ)
పాత సామాన్లు కొంటాము ......
పాత సామాన్లు కొంటాము....
వీధి అంతా మార్మోగి దడుచుకునే టట్లు అరుస్తున్నాడు
వాడు.వాడి బాధ వాడిది ...ఇప్పటి టి.వి .సీరియల్స్
గొడవలో వాడి గొంతు వినిపిస్తుందో లేదో అని .
మెల్లిగా బయటకు వస్తున్నారు అందరు.
న్యూస్ పేపర్లు,బుక్స్ కట్టలుగా చేరుతున్నాయి.
బండి నిండి పోతూ ఉంది.
బాబు పాత సామాను తీసుకుంటావా?
అవి కూడా చేరుతున్నాయి.మరి ఎలాగు తీసుకొని
వెళ తాడో....
మంచి గంగాళాలు.....
కుర్చీలు...
ఫర్నిచర్....
వీధి అంతా శబ్దాలే ...
బాబోయ్ ఇంత మంచివి వేసేస్తున్నారు ఎందుకని?
''బోర్ కొట్టింది లేవయ్యా''
సరే మనోడు అరుపు మార్చాడు
''బోర్ కొట్టేవి కొంటాము...బోర్ కొట్టేవి కొంటాము''
ఒక ఇంటి ముందు ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు.
''బాబు ఏది బోర్ కొట్టినా తీసుకొని వెళతావా?''
''వెళతాను బాబయ్యా''
''బోర్ కొట్టేస్తుంది.ఇన్నేళ్ళ బట్టి చూసి..చూసి...
అప్పటి కంటే మారి పోయింది...ఇచ్చేస్తాను
పట్టుకెళ్ళు ''
''సరే బాబయ్యా''
''రెడీ గా గోతం పట్టుకో దానిలోకి విసిరేస్తాను''
రివ్వున వెళ్లాడు ఇంట్లోకి....
సర్రుమని గోతం లోకి పడిన శాల్తీని ఎవరో చూడకుండా
కట్టేశాడు.
''ఒరేయ్ విప్పారా...నేనేరా...''లబ లబ లాడాడు.
విప్పుకొని బయటకు రాగానే దబీమని తలుపు మూసినా చప్పుడు.
''ముసిలోడా నీకు నేను బోర్ కొట్టేశాన?
నువ్వు మాత్రం బాగున్నావా ఏమిటి?
అక్కడే పడి చావు నాకు బోర్ కొట్టేసావు...''
''ఒసే ఒసే...చంపవాకే...నా మాటలు ఎవరో నీకు
తప్పుగా విశ్లేషించారే......నా మాట విని తలుపు
తియ్యవే'' ....రామాయణం కొనసాగుతూనే ఉంది.
''నిజమే పాత కూడా వింతగానే ఉంది''
అనుకొని వెళ్లాడు వాడు .
ఒక్క సారి బ్రాడ్ బ్యురీ గురించి తెలిసింది ఈ రోజు సాక్షి చదివితే.
తెలీటం ఏమిటి అంటే మరి ఆయన ఇంతకూ ముందు తెలీదు.
కాని విచిత్రం ''భూమి ఉరిమితే ''థీం నాకు తెలుసు...
ఎక్కడో చదివాను అలాగే గుర్తుకు ఉండిపోయింది.
చదవటం మొదలు పెట్టగానే... అరె ఇది అదే కదా అని
ఆశ్చర్య పోయాను.ఇది ఇంత ఫేమస్ అని ...ఇన్ని ముద్రణలకు
నోచుకుందని నాకు అప్పుడు తెలీదు.
సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ డబ్బులు తీసుకొని
మనలను గతానికి కాని వర్తమానానికి కాని పంపిస్తుంది.
(ఆదిత్యా 369 లాగే .... కాని ఇక్కడ జీవ వైవిద్యం యెంత ముఖ్యమో
చూపిస్తాడు మనకు రచయిత)
ఒక వేటగాడు రాక్షస బల్లుల కాలానికి వెళ్లి దానిని వేటాడాలి అని
కోరుకుంటాడు.అప్పుడు గైడ్ నిచ్చి పంపిస్తారు.వాళ్ళు చెప్పిన దానినే
చంపాలి.ఇక ఒక్క గరికను కాని తుమ్మేదను కాని చంపకూడదు అంటారు.
ఎందుకు అంటాడు వేటగాడు.అప్పుడు చెపుతారు నువ్వు ఒక్క తుమ్మేదను
చంపినా దాని ద్వారా ఇప్పటి కాలం వరకు పుట్టగల లక్షల తుమ్మెదలు
లేకుండా పోవటానికి కారణం అవుతావు అని.ఆతను అంటాడు
''చచ్చిపోతాయి అంతే కదా''అని.
వాళ్ళు చెపుతారు వాటి మీద ఆధారపడే ప్రాణులు అన్నీ
ఆహారం లేక చచ్చి పోతాయి.అప్పుడు నువ్వు చూసే ప్రపంచం ఇలాగ ఉండదు.
అంటే జీవ గొలుసులో ఒక్క తీగను పీకేసినా గొలుసు ఏర్పడే రూపమే
మారిపోతుంది అని.
వేటగాడు అంటాడు మరి నేను రాక్షస బల్లిని వేటాడితే అపుడు
గొలుసు తెగిపోదా?
గైడ్ చెపుతాడు ఆల్రెడి ప్రకృతిలో చెట్టు పడి చనిపోయే దానినే నువ్వు
వేటాడుతున్నావు కాబట్టి ఏమి మార్పు రాదు.
సరే ఆతను రాక్షస బల్లి రాగానే బయపడుతూ కాలుస్తాడు.
మళ్ళా దాన్ని శరీరం లోని బుల్లెట్స్ తెమ్మంటారు.
వాళ్ళు తిరిగి ఈ లోకం లోకి వచ్చి చూస్తె వాళ్ళు పోయినపుడు
ఉన్న జీవ లోకం అలాగే ఉండకుండా మారి ఉంటుంది.
కారణం ఏమిటంటే వేటగాడు తెలీక ఒక సీతాకోక చిలుకను
అక్కడ తొక్కి చంపేస్తాడు.తరువాత సంగతి సరే....
అసలు ఈ ఫిక్షన్లు వీళ్ళకు ఎలా వస్తాయో గాని భలే ఉంటాయి.
అవి నిజం కావటం కూడా మనం చూస్తుంటాము.
''మిషన్ టు ది మార్స్''అని ఒక సినిమా చూసాను.
దానిలో శుక్ర గ్రహం పైకి వెళ్ళిన రాకెట్ నుండి దానిలోని మనుషులు
ఒక రోవర్ ని పంపితే అది తిరుగుతూ మనిషి మొహం లాగా ఉండే
రాయి దగ్గరకు వస్తుంది.
అప్పుడు వాళ్ళు వెళ్లి దాని లోపలి వెళ్ళే మార్గం కనుక్కొని...
ఇక అంతా భలే ఉంటుంది చెప్పలేము.
చిత్రం ఏమంటే నిన్న నాసా వాళ్ళు పంపిన రోవర్ పిరమిడ్ లాంటి
రాయి కనుక్కుంది.మరి దాని కింద ఏముంటుందో అని అప్పుడప్పుడు
ఆ సినిమా గుర్తు చేసుకొని సస్పెన్స్ గా ఎదురు చూస్తూ ఉంటాను.
ఇంకోటి ''మెన్ ఇన్ ది బ్లాక్''ఈ రచయితా ఇంకా గొప్పోడు ...
గ్రహాలూ ఏమి ఖర్మ ..ఏకంగా గెలాక్సీ నే ఒక గ్లోబ్ గా చేసి
ఈ సినిమాలో పిల్లి మెడలో కట్టేస్తాడు.మనిషి విజ్ఞానం అందుకునే
లోపలే ఇంకా పైకి నిచ్చెనలు వేస్తాయి ఫిక్షన్లు...ఒక రకంగా
మనం రాజి పడకుండా కదిలేటట్లు అవే స్పూర్తిని ఇస్తున్నాయో ఏమో.
ఎలాగో ''జీవ వైవిధ్య సదస్సు''అక్టోబర్ ఒకటి నుండి పంతొమ్మిది వరకు
మన హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భం లో మనం
జీవ వైవిద్యం లో వేలు పెట్టకుండా వాటినే వదిలేస్తే ప్రక్రుతి
చూసుకుంటుంది సమ తౌల్యత గూర్చి అనేది గుర్తు చేసుకుంటాము.
ఎందుకంటె వేలు పెడితే ఏమి అవుతుందో ''జురాసిక్ పార్క్''
లో చూసాము కాదా.మనకు ఏదైనా కనిపెట్టడమే తెలుసు.
కాని ప్రకృతికి ఆ కనిపెట్టినది వికృతి కాకుండా విరుగుడు ఇవ్వటమూ
తెలుసు.
ఈ సందర్భం లో మన తెలుగు రచయితా మల్లాది గారి
''నత్తలు వస్తున్నాయి''జ్ఞాపకం చేసుకుందాము.
స్తూలంగా కధ ఏమిటి అంటే ఒక ఆతను ఆఫ్రికా లో
పనిచేసేటపుడు అక్కడ దొరికే రాక్షస నత్తలు చాలా
ఇష్టంగా తినే వాడు.కాని అవి అక్కడ నుండి తీసుకు రావాలి అంటే
ప్రభుత్వం నిషేధం.ఎందుకంటె అవి చాలా తొందరగా సంతాన ఉత్పత్తి చేసుకుంటాయి.
రోజుల్లోనే వేలుగా మారి యే వస్తువునైనా తినేస్తాయి.
కాని మన హీరో గారు ఎలాగో భారత దేశానికి తీసుకు వచ్చి
గుడ్లు పెరగకుండా వేడి నీళ్ళ లో చంపి కావాల్సిన వరకే
పెంచుకుంటూ ఉంటాడు.ఒక సారి పొరపాటున ఒక్క గుడ్డు
మిస్ అయిపోతుంది.
ఇక చూడండి ఎక్కడ చూసినా నత్తలే ...మిల్లులు,ఇల్లు,బజార్లు
దేనిని వదలకుండా తినేస్తూ...దానికి విరుగుడు లేదు .
మన హీరో గారే చివరికి ఆఫ్రికా అడివికి వెళితే అక్కడ ఆటవిక
జాతుల వాళ్ళకి
''రాక్షస నత్తల''వలన అనర్ధాలు ఎందుకు లేవు అని చూస్తె
దీన్ని చంపగల ఒక నత్త వేరేది దొరుకుతుంది.అంటే దీనికి
విరుగుడు ప్రక్రుతి అక్కడ పెట్టి ఉంది.అది తెచ్చి ఇండియా ని
కాపాడుతాడు ఇంక జీవుల విషయం లో వేలు పెట్టకూడదు
అని లెంపలు వేసుకొని....మనం కూడా కొత్త ప్రయోగాలు
చెయ్యకుండా లెంపలు వేసుకుంటే బాగుండును అనిపిస్తూ
ఉంటుంది నాకు .