Wednesday 3 October 2012

అబ్బో...పాత కూడా వింతే

పాత  సామాన్లు కొంటాము ......
పాత  సామాన్లు కొంటాము....

వీధి అంతా మార్మోగి దడుచుకునే టట్లు అరుస్తున్నాడు 
వాడు.వాడి బాధ వాడిది ...ఇప్పటి టి.వి .సీరియల్స్ 
గొడవలో వాడి గొంతు వినిపిస్తుందో లేదో అని .

మెల్లిగా బయటకు వస్తున్నారు అందరు.
న్యూస్ పేపర్లు,బుక్స్ కట్టలుగా చేరుతున్నాయి.
బండి నిండి పోతూ ఉంది.

బాబు పాత సామాను  తీసుకుంటావా?
అవి కూడా చేరుతున్నాయి.మరి ఎలాగు తీసుకొని 
వెళ తాడో....

మంచి గంగాళాలు.....
కుర్చీలు...
ఫర్నిచర్....
వీధి అంతా శబ్దాలే ...
బాబోయ్ ఇంత మంచివి వేసేస్తున్నారు ఎందుకని?

''బోర్ కొట్టింది లేవయ్యా''

సరే మనోడు అరుపు మార్చాడు 
''బోర్ కొట్టేవి కొంటాము...బోర్ కొట్టేవి కొంటాము''

ఒక ఇంటి  ముందు ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు.
''బాబు ఏది బోర్ కొట్టినా తీసుకొని వెళతావా?''
''వెళతాను బాబయ్యా''

''బోర్ కొట్టేస్తుంది.ఇన్నేళ్ళ బట్టి చూసి..చూసి...
అప్పటి కంటే మారి పోయింది...ఇచ్చేస్తాను 
పట్టుకెళ్ళు ''

''సరే బాబయ్యా''

''రెడీ గా గోతం పట్టుకో దానిలోకి విసిరేస్తాను''
రివ్వున వెళ్లాడు ఇంట్లోకి....
సర్రుమని గోతం లోకి పడిన శాల్తీని ఎవరో చూడకుండా 
కట్టేశాడు.
''ఒరేయ్ విప్పారా...నేనేరా...''లబ లబ లాడాడు.
విప్పుకొని బయటకు రాగానే దబీమని తలుపు మూసినా చప్పుడు.

''ముసిలోడా నీకు నేను బోర్ కొట్టేశాన?
నువ్వు మాత్రం బాగున్నావా ఏమిటి?
అక్కడే పడి చావు నాకు బోర్ కొట్టేసావు...''

''ఒసే ఒసే...చంపవాకే...నా మాటలు ఎవరో నీకు 
తప్పుగా విశ్లేషించారే......నా మాట విని తలుపు 
తియ్యవే'' ....రామాయణం కొనసాగుతూనే ఉంది.

''నిజమే పాత కూడా వింతగానే ఉంది''
అనుకొని వెళ్లాడు వాడు .



7 comments:

Unknown said...

v v v nice

వనజ తాతినేని/VanajaTatineni said...

abba! ekkadi nundi.. ekkadiki tippaaru.? elaa ayinaa meeru vraase cheti teeru.. verayaa..!! :)

Anil Atluri said...

That was a stupid thing to say..I came across that report somewhere on the net.

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్.... మీరు ఫీలయితే అవతలి వాళ్ళు హర్టవ్వవలసిందే... good one ;)

Srini said...

హ్హహ్హహ్హ....

శశి కళ said...

రమేష్ గారు థాంక్యు

వనజక్కా ))


అవును అనిల్ గారు నాకు భలే కోపం వచ్చేసింది.
పదవి లో ఉంటె యెంత పడటిగా మాట్లాడాలి

శశి కళ said...

రాజ్ ,శ్రీనివాస్ రావ్ గారు థాంక్యు