Monday, 22 October 2012

పూరి...సర్వ మంగళం

ఏమ్మా బ్లాగ్ లో రివ్యు పెట్టవా?(ఇదేదో పెద్ద రివ్యు అంట 
వాళ్ళ భ్రమ)''కెమరామాన్ గంగతో రాంబాబు''
చూసినాక పిల్లలు అడిగారు.
''టాట్...పెట్టను''విసుగ్గా చెప్పాను.
''అమ్మా ఘోరం...తమన్నా బీర్ తాగిందని పెట్టవా?
నిజం చెప్పు కొంచెం కూడా నచ్చలేదా?''ఇద్దరు 
విసిగించేసారు.ఇద్దరు ఓటు హక్కు వచ్చిన పిల్లలు ఏదో 
ఫీల్ అయ్యారు అంటే ఏదో కొంత ఉన్నట్లే కదా....అయితే మేము 
ఏదో పాత విప్లవ సినిమాలు చూసాము కాబటి మాకు పెద్ద 
అనిపించలేదు కాని వీళ్ళు ఇలాంటి కవిత్వాలు,సినిమాలు 
చూడలేదు కాబట్టి వాళ్లకు నచ్చినట్లుగా  ఉంది.



కధ విషయానికి ఆస్తే .....రాంబాబు మెకానిక్ .అయినా పేపర్ లో 
ఏ న్యూస్ చూసినా వెళ్లి వాళ్ళను కొట్టి అయినా సమస్య తీరుస్తుంటాడు.
ఇది చూసి ఒక టి.వి.చాన్నేల్ లో కెమరా మాన్ గా పని 
చేస్తున్న గంగ ....రాంబాబుని జర్నలిస్ట్ గా చేసేస్తుంది.
ఇక ముఖ్య మంత్రి ,అతన్ని పదవిలో నుండి కిందకు దింపి 
తానూ ఎత్తులు వేసే ప్రతి పక్ష నేత,అతని కొడుకు .....వాళ్ళ 
జిత్తులు రాంబాబు తన మాటలతో చిత్తు చేస్తుంటాడు.
కొడుకు ప్రకాష్ రాజు తన నాన్ననే చంపేసి తన తెలుగు రాష్ట్ర 
ఉద్యమం అడ్డు పెట్టుకొని గద్దె పైకి రావాలని అనుకుంటాడు.
ఇక తరువాత మలుపులు.....చివరికి రాంబాబు చానల్స్ లో 
మెసేజ్ ఇచ్చి జనాలను రాజకీయాలు జరుగుతున్నా హోటల్ దగ్గరకు 
వచ్చేట్లు చేసి విలన్ ను చంపెయ్యటం.మొత్తం మీద ప్రజలు 
తిరగ బడితే పార్టీలు కొట్టుకు పోతాయి .....తమ ధనం యెంత 
ఎలా వేస్ట్ అవుతుందో,అది తమ నుండే మళ్ళా వసూలు చేస్తారు 
తెలుసుకోమని సారాంశం.

సరే పూరి చాలా చక్కగా డైలాగ్స్ వ్రాసారు.పవన్ చేత కష్టపడి 
పలికించారు.బాగుంది.ఇక సంగీతం ''మణి శర్మ''జోష్ 
బాగుంది.ఆపరేటర్ చెప్పిన దాని బట్టి మొదటి రోజే లక్ష 
కలక్షన్ వచ్చిందంట.క్లాస్సా?మాసా?అని అడిగితె మీరే 
చూడండి మేడం అని చెప్పి వెళ్లి పోయాడు.మొత్తానికి అవేరేజ్.

కాకుంటే తమన్నా ను డీ గ్రేడ్ చేయడం నచ్చలేదు.
అసలు తన పాత్రను చాలా చక్కగా పరిచయం చేసారు.
దుస్తులు కూడా బాగున్నాయి.అసలు కెమరా మాన్ 
చేయడం కష్టం.మొదట పేరు చూసి గంగ ఎవరు అని కూడా 
అనుకున్నాము.
నేను ''ఎక్స్త్రార్దినరీ''అంటూ ఉంటుంది.అంటే తను వృత్తి
పరంగా చెపుతుంటుంది కాని ఎప్పుడూ తానూ అందగత్తె 
అని అసామాన్యం అని చెప్పదు.నిజానికి ఆ వృత్తి తీసుకోవడం 
అసామాన్యమే ....కాకుంటే వృత్తి మీద అంత  డెడికేషన్ 
ఉన్న అమ్మాయి తాగడం ఏమిటి?''అసిన్''ని సిగిరెట్ 
తాగించిన పూరి ఇంత ఘోరం చేస్తాడు అనుకోలేదు.
ఇప్పటి పిల్లలు కొంచెం నాగరికత పేరుతొ పబ్ లు 
తిరగటం మామూలే.....కాని ఈ అమ్మాయి  చిత్రీకరణ వేరు గా 
ఉంది.పవన్ ని హీరో చెయ్యడం కోసం తనను అంత
డీ గ్రేడ్ చెయ్యక్కర్లేదు. 
తానూ యెంత అసామాన్యం అనుకునే స్త్రీ అయినా తన 
హృదయం కోసం తపించి నపుడు,తన కొరకు ద్రవించి నపుడు 
కను కోలుకుల్లో జారే కనీటి చుక్క తప్పకుండా తను 
మామూలు ఆడదాన్ని అని గుర్తు చేస్తుంది.
పవన్ చేత అలాగా  డైలాగ్స్ పలికిన్చక్కర్లేదు.
అంత  మంచి స్తానం లో నిలిపిన తమన్నాను అలాటి స్తాయి లోనే 
చూపించి ఉంటె బాగుండేది.

ఒక్క బీర్ బాటిల్ తాగినంత మాత్రాన అందరు ఫాల్లో 
అయిపోతారా?అంటే ......''ఒక్క పాతిక మంది ఎం.ఎల.ఏ.లు 
మరింత మాత్రాన మీ తల రాతలు మారి పోతాయి''
అనే ఒక్క డైలాగ్ తొ అందరికి ఆలోచన వస్తుందా?
వస్తుంది అనేది నిజం అయితే...ఇది కూడా నిజమే.
అసలే యువత ఎలాటి దారుల్లో నడుస్తుందో అందరికి 
తెలిసిందే.
అయితే డబ్బు కోసమే సినిమాలు తీసే ఈ రోజుల్లో 
కొంత ఆలోచింప చెయ్యాలి అనే సినిమా రావడం స్వాగతించాలి.

6 comments:

రాజ్ కుమార్ said...

గట్టిగా చురక కాదు కాదు వాత అంటించారు గా ;)
రివ్యూ బాగుందండీ ;)

జయ said...

బాగుందండి:) మీకు దసరా శుభాకాంక్షలు.

పల్లా కొండల రావు said...

అయితే డబ్బు కోసమే సినిమాలు తీసే ఈ రోజుల్లో
కొంత ఆలోచింప చెయ్యాలి అనే సినిమా రావడం స్వాగతించాలి.

sathish said...

seetha badha seethadi.. peetha baadha peethadi ante idhe..

శశి కళ said...

raaj :)))


jaya gaaru thamk you


pallaa gaaru thank you

satishgaru :))

thanooj said...

wow wat an intelligent review never ever read review like this in my entire life . i am going crazyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy