''అభౌతిక స్వరం''పోయిన సంవత్సరం లో
నేను చదివిన ఒక మంచి పుస్తకం.
పెద్ద వాళ్ళల జీవితం లో ఒక సంక్లిష్ట క్షణాన్ని
తీసుకొని దానిని వారు ఎలా ఎదుర్కున్నారో
లేదా ఆలోచించారో రచయిత ''మాధవ్ .శింగరాజు''
గారు చాలా చక్కగా వ్రాశారు.కవితా శైలిలో సాగిన
వచనం పుస్తక ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది
అందు లో సందేహమే లేదు.
పుస్తకాలు ''కినిగే''లో మరియు ''నవోదయ''లో లభ్యం.
ఎవరికైనా దొరకక పొతే ఈ నంబర్ కు ఫోన్ చేసుకోవచ్చు.
9848618166
''అభౌతిక స్వరం''పేరు వినగానే
నేను చదివిన ఒక మంచి పుస్తకం.
పెద్ద వాళ్ళల జీవితం లో ఒక సంక్లిష్ట క్షణాన్ని
తీసుకొని దానిని వారు ఎలా ఎదుర్కున్నారో
లేదా ఆలోచించారో రచయిత ''మాధవ్ .శింగరాజు''
గారు చాలా చక్కగా వ్రాశారు.కవితా శైలిలో సాగిన
వచనం పుస్తక ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది
అందు లో సందేహమే లేదు.
పుస్తకాలు ''కినిగే''లో మరియు ''నవోదయ''లో లభ్యం.
ఎవరికైనా దొరకక పొతే ఈ నంబర్ కు ఫోన్ చేసుకోవచ్చు.
9848618166
''అభౌతిక స్వరం''పేరు వినగానే
దేని గూర్చి అని కొంత
కుతూహలం.దానిని తీరుస్తూ
ముందు మాటలోనే వ్రాశారు
రచయిత''అభౌతిక స్వరం
అంటే మంద్ర స్వరం.జీవిత
అనుభవాలతో రాటు దేలిన
మనిషి భౌతికంగా మెత్తబడినా
అభౌతికంగా అది పదును
తేలిన మృదు బాషణ''
మాధవ్.శింగరాజు గారు
సాక్షి ఫ్యామిలీ లో వ్రాసిన ''నేను''
శీర్షిక లో వచ్చిన గొప్పవాళ్ళ
స్వగతాలు ఇవి.ఇప్పుడు ఈయన
సాక్షి లో పనిచేస్తున్నారు.
అంతకు ముందు వార్తలో పని చేస్తూ
వెనుక పేజ్ ''ఛాయాచిత్రాలు''
మాధవ్ గారిగా అందరికి పరిచితుడు.
ఇది మొదటి పుస్తకం.
గొప్పవారి జీవితం లో
ఏదో ఒక సందర్భం లో వారి
అంతరంగ ఘర్షణ స్వరంగా మార్చి
అక్షరాలుగా కూర్చి మన ముందు
ఉంచారు రచయిత.
''వచనం కవిత గా మారితే
స్వరం గా మారి అలరిస్తుంది''
ఒకరు ఇద్దరు కాదు
యాబై మంది పైగా ప్రసిద్ధుల
ఆలోచనలోతుల్లోకి మనలను
అలవోకగా తీసుకొని వెళ్లి ...అరె
అంతలోనే అయిపోయిందా?
అనుకునేలా చేస్తారు రచయిత.
(ఇంకా చాలా మందివి
పుస్తక కూర్పులో లేవు.
కాగితపు కొరత కాబోలు)
పేరుకు మంద్ర స్వరమే
కాని వ్యక్తుల స్వభావాలను బట్టి
వారి అంతరంగాలు
మధ్య స్తాయిలో,హెచ్చు స్తాయిలో
భావాలను మన ముందు పరుస్తాయి.
ఒక వైపు ఐన్ స్టీన్ మనతో గాంధీజీ
ఆత్మను పంచుకుంటూ ఉంటె
ఇంకో వైపు అలగ్జాండర్ ''ఖండాలు
సరిపోని వాడైనా పుడమి కడుపులో
ఇమిడిపోవాల్సిందే''అని తాత్వికతను
పులుముతుంటాడు.
శాలింగర్ ఏకాంతపు కారణం
అక్షరాలకు అద్దుతూ ''ఏమి చెప్పమంటారు?
నేను ఇష్టపడే వ్యక్తుల పై మొహం మొత్తి
జబ్బున పడ్డాను.నేను గౌరవించే వ్యక్తీ కావాలి ''
అని అన్వేషణ లో ఉంటాడు.
అంతలోనే నోస్ట్రాడామస్ తనను గౌరవించె వాళ్ళతో
''దివ్యదృష్టి దైవ సృష్టి ....
ఆయన ఊదే ఒక బూరను మాత్రమె ''
అని తన ఉనికికి ఊపిరి ఎవరో చూపుతుంటాడు.
జ్యోతీబా పూలే,జేమ్స్ కుక్,జెరో నీమో,రమణ మహర్షి,
ఆర్.కే.లక్ష్మణ్ ,సలీం ఆలి ఎంతో
మంది ఆలోచనలు మాధవ్ గారి
అక్షరాలతో కొత్త సొబగులు దిద్దుకొని
కాగితం పై అలవోకగా వొదిగి
మన దృష్టి ని పుస్తకం నుండి మరలనీవు.
అసలు ఆడవాళ్ళ అంతరంగాలు
మగ వాళ్ళు ఎలా వ్రాయగలరు
అనే సంశయం వస్తే
''బిల్లీ జాన్ కింగ్''టెన్నీస్ లో
బాబి రిగ్స్ ని ఓడించినపుడు
తన భుజం తట్టిన తీరు.....
''కల్పనా చావ్లా''కళ్ళలో ఆత్మా విశ్వాసం
అక్షరాలుగా రగిలినపుడు....
చూపు తగ్గినా ''మేడం క్యూరీ ''
విజయం నుండి చూపు తిప్పనపుడూ...
అంతరంగావిష్కారానికి కావాల్సింది
అంతర్నేత్రం తప్ప జెండర్ కాదు
అనిపిస్తుంది.
చక్కటి శైలి,భావ పుష్ఠి
మనలను అలరిస్తాయి.పుస్తక ప్రియులు
తప్పక చదవ వలసిన పుస్తకం.
రచయిత ముందు ముందు
ఇంకా మంచి రచనలు
తీసుకుని వస్తారని ఆశిద్దాం.
1 comment:
here is the link to Kinige eBook http://kinige.com/kbook.php?id=1204&name=Abhoutika+Swaram
Post a Comment