Thursday, 10 January 2013

బోలెడు నవ్వులు :))

ఈ రోజు జి.ఆర్.మహర్షి గారి ''కిస కిస''ఆర్టికల్
చదివినాక ఇప్పుడు మేము ఎదుర్కుంటున్న బోలెడు నవ్వులు
గుర్తుకు వచ్చాయి.
(జి.ఆర్.మహర్షి ఆర్టికల్ లింక్ ఇక్కడ )

అపార్ట్ట్ మెంట్ భలే చీప్ గా సాదించారే ఆటోలకు కూడా
అనుకూలంగా అని మిత్రులు అన్నప్పుడు జ.హా ఇచ్చేసి

డబ్బులకోసం పన్ను నొప్పి తగ్గడం కోసం చేతిలో
డెబ్బై వేల జీతం కాగితాలు పెట్టుకొని బయలుదేరినపుడు
మనకు కాక వేరే వాడికి ఎందుకు ఇస్తారని వి.హా చేసుకొని

రెండు నిమిషాలు అనుకున్న మనకు రెండు గంటల పైనే కూర్చో పెట్టి
ఇవ్వడం ఇష్టం లేదని తెలుస్తున్నా యేవో కాగితాలు తెస్తే
వచ్చే ఏడాది ఇస్తాము అది కూడా  మీకు కాబట్టి ఇస్తాము అని
బ్యాంక్ అన్నప్పుడు సూది వేసినా కనపడే మహా నంది కొలను
లాంటి మన మొహాన్ని కష్టపడి మొ.హా తో కప్పెసుకొని

ఒకరేమో సెలవు అంటారు ఒకరేమో అంత  ఇవ్వలేము  అంటే
నిజమే కాబోలు అని పక్కకు చూస్తె మన పక్కింటి కోటి గాడికి
కోటి రూపాయలు శాంక్షన్ అవ్వడం చూసి
గోచి గుడ్డ తో తిరిగేవాడు వ్యాపారం చేస్తాడు అని ఎట్టా  నమ్మారో
కోటి రూపాయలు ఆస్తి ఇస్తామన్న మనకు లక్షలు ఇవ్వటానికి నమ్మడం లేదే
అనుకోని మ.హా

ఎన్ని బ్యాంకులు తిరగాలని నీరసంగా అంటే నిన్ను చూడందే ఇవ్వరు
అని శ్రీ వారు అంటే పోనీలే డియర్ నీ కోసం ఎన్నిబ్యాంకులకు అయిన
వస్తాను అని కొర కొరలు కప్పేస్తూ వి.హా ఇచ్చేసి

లాస్ట్ బాంక్ ఇదేనని తెసుకెళితే వాడు అన్నీ విని అలాగే
ఇస్తాము అని చెప్పి ముందు కార్ లోన్ తీసుకోండి నాకు
టార్గెట్ పూర్తవుతుంది అని చెపితే మాడిపోయిన శ్రీవారి
మొహం చూసి లోల్


ఇంక వదిలేస్తావా అని అడిగితె లేదు వచ్చేస్తుంది
అని ధైర్యంగా లైఫ్ ఇన్స్యూరెన్స్  వైపు చూపిస్తే
ఆహా మన లైఫ్ కు యెంత బద్రత అని చి.హా

వాడు మనం చూపించిన కాగితాలు అన్నీ పనికి రావు
అని చెప్పి వేరే కాగితాలు అండమాన్ నికోబార్ దీవిలో
తెమ్మని చెప్పినపుడు కిం.ప.దొ.న ......

భళి భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ...
బహు బాగున్నదయా నీ  మాయ......అనుకొని
జీవితం నేర్పే సహనం అనే పాటాన్నినేర్చుకోవడమే
అంతకన్నా చేసేదేమీ లేదు.

(జ.హా =జయ హాసం
వి.హా =వికటాట్టహాసం
మొ.హా=మొహమాటపు హాసం
మ.హా=మధ్య తరగతి మందహాసం
వి.హా=విరక్తి హాసం
కిం.ప.దొ.న=కిందపడి దొర్లి నవ్వడం
వీటిలో చాలా బ్లాగర్ బులుసు సుబ్రమణ్యం గారు చెప్పినవి)


5 comments:

జ్యోతిర్మయి said...

చాలా బాగా రాశారు శశి కళ గారు. మహర్షి గారి ఆర్టికల్ లింక్ ఇచ్చిందుకు ధన్యవాదాలు.

Srini said...

భలే రాశారు శశి గారు వివిధ రకాల 'హా' ల గురించి :)

శశి కళ said...

జ్యోతి గారు థాంక్యు

శ్రీనివాస్ గారు థాంక్యు

కిరణ్ కుమార్ కే said...

జ.హ, వి.హ ... అంటే ఏంటో అడగాలని చదువుతూ చివరికి వచ్చేసరికి అవేంటో మీరే రాసారు. బులుసు సుబ్రమణ్యం గారు అక్కడక్కడ 'ద.హ' అని రాస్తుంటారు, అదేంటో మీకు తెలిస్తే చెప్పండి.

శశి కళ said...

గ్రీన్ స్టార్ గారు ధ.హా అంటే దరహాసం