పోయిన సంవత్సరం చదివిన వాటిలో ఒక మంచి పుస్తకం
''పప్పులు బెల్లాలు''.ఇది ''కోట పురుషోత్తం ''గారు పిల్లలకు
స్పూర్తి కలిగించే వివిధ పద్యాలు,కధలు,వ్యాసాలూ తో
నిండిన ఒక సేకరణ .ముందుగా పురుషోత్తం గారిని ఒక
మంచి ప్రయత్నం చేసినందుకు అభినందిస్తున్నాను.
వారే ''రెండో ప్రపంచ రచయితల సదస్సు''సావనీర్ లో నా పేరు
చూసి ఫోన్ చేసి ''అమ్మా నేను పప్పులు బెల్లాలు అనే పుస్తకం లక్ష కాపీలు
ప్రచురించి టీచర్ లకు,పిల్లల కు ఉచితంగా పంచుతున్నాను.చదవండి.
చదివించండి.పిల్లలను స్పూర్తితో నడిపించండి''అని చెప్పి
ఇరవై పుస్తకాలు పంపారు.
ఏందబ్బా ఈయన నాకన్నా పిచ్చోడి లాగా
ఉన్నాడు ఉత్తినే డబ్బులు ''పప్పులు బెల్లాలు''గా పంచేస్తున్నాడు అనుకున్న
మాట నిజం.కాని ఆ పుస్తకం చదివిన తరువాత ఆయనకు ఫోన్ చేసి
అభినందనలు తెలపకుండా ఉండలేక పోయాను.పిల్లలకు ఈ బుక్
ఇచ్చి వదిలేస్తే చాలు ఇక ఏ దారిలో వెళ్ళాలో వల్లే నిర్ణయించుకుంటారు.
(నిజం ...నా తలగడ దగ్గర పడేసి ఉన్న పుస్తకం మా పాప వదలకుండా
మొత్తం చదివి దానిలో మాటలు రిపీట్ చేస్తే నేను చాలా సంతోషించాను)
ఆయన నాకు ఇవి అమ్మటం లేదు అని చెప్పారు కాని లోపల పేజెస్
లో వంద రూపాయులు,విశాలాంద్ర,నవోదయాలలో దొరుకును అని ఉంది.
ముఖ చిత్రం ,ఆయన ముందు మాట చూడండి.సమీక్ష మళ్ళా వ్రాస్తాను
చదివారు కదా.తన తండ్రి ఇచ్చిన డబ్బు సార్ధకత చేయాలని,ఆ తండ్రి పేరు
నిలపాలి అని ఒక కొడుకు చేసిన మంచి ప్రయత్నం.(మీరు కూడా ఎవరైనా
రచయితలూ పుస్తకానికి సహాయం చేయమంటే చేసి మీ నాన్న గారి పేరు
వేయండి.ఆచంద్ర తారార్కం ఆ పుస్తకం ఉన్నంతవరకు వాళ్ళు నిలిచిపోతారు)
సరే దీనిలో విషయ సూచిక ఏమి లేదు.వరుసగా ఏమి ఉన్నాయో చెపుతాను.
చిన్న నీతి పద్యాలు పురాణాలలోవి ఇచ్చినవి , పై మెరుగులు చూసి
స్నేహం చేయకూడదు అని ,చిన్న దానం అయినా కాపాడుతుంది
అని చిన్న కధలతో పిల్లలకు పద్యాభిలాష కలిగే విదంగా వివరించారు.
ఏదైనా శ్రద్ధ తో చేస్తే ,ఏకాగ్రతతో చేస్తే గెలుపు పొందగలరు.ఇంకా గణితం లో
''పై''ఎలా కనుగొన్నారో మీరు ప్రయోగాలు చేసి తెలుసుకుంటే మర్చిపోరు.
అని వాళ్ళు ఎలా చదివితే బాగుంటుందో చక్కగా పికాసో,బాపు,నార్కే ఇలాగా
ఉదాహరణలు చూపుతూ ఇచ్చారు.
అమ్మ అంటే గొప్పది అని ''కవి వర ప్రసాద్ రెడ్డి గారు''ఇంకా ఇతరులు
ఎలా చెప్పారో పిల్లలు మనసు హత్తుకోనేలాగా చెప్పారు.
ఇంకా కధల మీద అభిరుచి పెంచేటట్లు...వాళ్ళు సొంతంగా కధలు
వ్రాయ వచ్చు అని చూపేదానికి ఖదీర్ బాబు గారి ''మా అమ్మ
పూల వ్యాపారం''అనే కధను ఇచ్చి మీరు కూడా ఇలాగ సొంత
యాస లో వ్రాయండి అని కిటుకులు చెప్పారు.(మా పాప ఈ
కధ మొత్తం చదివేసి అమ్మ మనం కూడా సన్న జాజుల చెట్టు
వేసుకున్దాము అనింది.పేదరికం లో కూడా యెంత చక్కగా గౌరవం
కాపాడుకున్నారో)
ఇంకా ''శ్రీ శ్రీ ''గారి శైశవ గీతిని,ఓల్గా రచనలను ,సుధామూర్తి
గారు తనకు ఇష్టమైన పుస్తక పటనం అందరికి అందాలి అని
లైబ్రరీలు ఎలా పెట్టారో చిన్న కధ లాగా భలే ఇచ్చారు.
ఇంకా ''ఔరంగజేబు తన గురువుకు వ్రాసిన లేఖ''
''అబ్రహం లింకన్ తన కుమారుని గురువుకు వ్రాసిన లేఖ''
టీచర్స్ చదువే కాకుండా వారి వ్యక్తిత్వాలు కూడా
తీర్చిదిద్దాల్సిన బాధ్యత ను గుర్తుచేస్తున్నాయి.
ఇక చివరిలో ''తెలుగు పద్యము...మా నాన్న ''అని ఇచ్చిన
కొన్ని పేజీలు చూస్తె వాళ్ళ నాన్న గారి మీద మనకు ఎంతో
గౌరవభావం పెరిగిపోతుంది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే
''మీకు ఈ పుస్తకం దొరికితే అదృష్టం.మీ పిల్లలకు ఇచ్చేసి
చదువుకోమని చెప్పండి.తెలుగు మీద,విలువల మీద,
పెట్టుకోవాల్సిన లక్ష్యాల మీద,అమ్మ నాన్నల మీద వారికి
యెంత గౌరవం వస్తుందో మీరే స్వయంగా చూస్తారు''
ఇది రచయితగా,ఉపాధ్యాయురాలిగా,అమ్మగా నేను
అనుభవించి చెపుతున్న మాట.
పురుషోత్తం గారు మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు
వెలువరించి అందరి హృదయాలలో నిలిచిపోవాలి.

9 comments:
పుస్తకం ఆసాంతం చదివిస్తుంది!
పిల్లకాయలకే కాదు పెద్దలకు కూడా బాగానే ఉంటుంది!
మీ పరిచయం(?) బాగుంది.
హ..హ...అనిల్ గారు థాంక్యు .
మీరు హుషారు చెయ్యక పొతే ఇంకా ఎప్పటికో వ్రాసేదాన్ని
మంచి పరిచయం. అంతర్జాలంలో ఎక్కడయినా దొరుకుతుందా ఈ పుస్తకం.
కీర్తి కోవెల ప్రచురణలు, 9-66-15A, న్యూ మారుతీ నగర్, తిరుపతి 517 502 కి వ్రాయవచ్చు. 94402 71699 కి ఫోను చేసి కూడా తెలుసుకోవచ్చు.
చదువుకోడంలో నేనెప్పుడూ చిన్నపిల్లనే ,
అందుకే ఇది నాకు నచ్చేసింది:-)
అవునా పద్మార్పిత గారు.మీకు కూడా నచ్చిందా?థాంక్యు
స్వాతి గారు ఇంకో దగ్గర మీ కామెంట్ కి ఇక్కడ సమాధానం ఇస్తునాను.''నక్షత్ర మిత్రుల గూర్చి వ్రాయాలి అనుకోలేదు.కాని మీరు అడిగారు కాబట్టి వ్రాస్తాను.కొంత సమయం పడుతుంది
చాలా మంచి పుస్తకం, ఎంతో మంచిగా పరిచయం చేసారు. ఇది ఎవరైనా చదువుకోవాల్సిందే.
జయ గారు థాంక్యు.మీరు కూడా చక్కగా వ్రాస్తారు
Post a Comment