ఘాజీ .... గివ్ క్లాప్స్
సంకల్ప రెడ్డి ,
ఇప్పుడు మొత్తం క్రెడిట్ నీకే ఇవ్వాల్నా !
విత్తనాన్ని సంరక్షించి నీ సంకల్పంతో
అందరి సహకారాన్ని సాధించి వెండితెరకు
ఒక ఇంగ్లిష్ మూవీ తెలుగు సినిమాగా ఇచ్చావు
చూడు , ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిందే .
గుడికి వెళదాము అని గూడూరుకు వెళ్లిన మమ్మల్ని
హర్ష సిరి ఆపేసారు , పిన్ని ఘాజీ చూడాల్సిందే .
హిందీ మూవీ నా ? కాదు తెలుగు ?
ఇదేమి పేరు ? నా దృష్టిలోకి రాకుండా ఈ సినిమా
ఎలా తప్పించుకుంది అనుకున్నాను .
పిన్నీ అది పాకిస్తాన్ సబ్ మెరెన్ పేరు . దానిని ఎలా
కూల్చారో చూపించారు . ఇప్పుడే నెల్లూరు లో
చూసాను . నువ్వు చూడాల్సిందే , అంతే .
అనేశాడు మా హర్ష .
వీడి సంగతి నీకు తెలీదు , ఇంతకూ ముందు
యుగానికి ఒక్కడు అర్ధం కాకపోయినా చూపించాడు .
అంటే ఇది కూడా ఖఛ్చితంగా అర్ధం కానీ క్యూట్
వెరైటీ సినిమా అనుకున్నాను .
అది నిజం కూడా అయింది . ఎలాగూ మా నాయుడుపేటకు
బాబుల భజనలు , వాళ్ళ బిడ్డల సినిమాలు తప్ప ఇవి
రావు . ఇక్కడే చూడాలి .
కార్ లో చెప్పాడు వాడు నీ గురించి .
ఇంత చిన్న వయసులో ఈ కథను ఆవిష్కరించాలి
గురించి , 25 లక్షలతో సెట్ వేసి అందరికి నీ పట్టుదల
చూపిన సంగతి . దానిలో నీ విశ్వాసం కనిపించింది .
ఇంట్రెస్టింగ్ అనుకున్నాను .
మొదట అర్ధం కాక ఊ , ఆ , అనుకున్నవాళ్ళం ఎప్పుడు
సబ్మెరిన్ కి ముందు సీట్ పై తల ఉంచేంతగా వెళ్ళామో
మాకే తెలీదు . ఒక టైటానిక్ గుర్తుకు వచ్చింది . కానీ
దానిలో జీవితాలు అల్లుకొని కథను ముందుకు నడిపాయి .
ఇక్కడేముంది పైకి కిందకి , కిందకి పైకి , ఆ పాకిస్తాన్
కెప్టాన్ అన్నట్లు లిఫ్ట్ లాగే .
దీనిలో నువ్వు ఎన్ని కాంఫ్లిక్ట్స్ చూపగలవు ?ఎన్ని జీవిత
సత్యాలు మా ముందు నిలుపగలవు ?
కాదు కాదు , మర్రి విత్తనం లోని మహావృక్షాన్ని మా ముందు
ఆవిష్కరించావు . ఒక నీలం , చీకటి అనే రంగులు తప్ప
ఇంకేమి చూపలేని సినిమాలో ఒక మనిషి లో ఉండే
అన్ని రంగులు చూపావు .
ఒక సైనికుడి ప్రపంచం ఎంత విశాలమో
తన దేశం గెలవాలనే తపన
ఎలా ఉంటుందో చూపావు ,
డిఫెన్స్ మనస్తత్వం గల ఒక దేశం తో పనిచేస్తూ
మనిషి పడే అవస్థ , వార్ నెవెర్ ఎండ్స్ అని
చూపుతూ బులెట్లకు బలి అయిన జీవితం తన
వారిమీద ప్రభావాన్ని , కఠినమైన నిర్ణయాలు
తీసుకొనే వారు కూడా పిల్లల దగ్గర మారే పిల్లతనాన్ని ,
ఒక జీవం మరణం మధ్య గీతకు అటూ ఇటూ ఊగుతూ
కూడా తమ వాళ్ళను రక్షించాలి అని పడే తపనను
మాచే ఊపిరి తీసుకోనివ్వకుండా చూపించావు .
పాటలు లేకుండా తెలుగు సినిమా తియ్యొచ్చుఁ ,
ఇక్కడా ప్రతిభ ఉంది అని నిరూపించావు .
నాకు అనిపిస్తూ ఉంటుంది , చదువు పూర్తి అవగానే
సంపాదన లోకి యువతను తోసెయ్యకుండా కొద్ది
రోజులు ఏదో ఒక స్కాలర్షిప్ ఇచ్చి వారి సృజనాత్మకత
నిరూపించుకోమంటే యెంత బాగుంటుంది . కానీ
ఇండియా లక్ష్యం సంపాదనే . అదీ కాక మీరు బాడ్ హాబిట్స్
లో దిగే వయసు కూడా అదే కాబట్టి రిస్క్ తీసుకోలేము .
ఎలాగో లోపల ఫైర్ నిలవనీని నీలాంటి వాళ్ళు
అడ్డు వచ్చిన బండరాళ్లు సైతం పగలగొట్టుకొని పైకి
వచ్చి చిగురిస్తారు .
కొంచెం చివరిలో సినిమాటిక్ గా ఉంది , విలన్ తెలుగు
లాగే చూపారు , కొందరు ఫీలింగ్స్ చూపలేదు అని ఉన్నా
అవి ఈ సారి దిద్దుకోవచ్చూ . బాల్కనీ లో కూడా
చప్పట్లు మోగడం చూసాను . నువ్వు ఉత్సాహంగా
ముందుకు వెళ్ళవచ్చుఁ , అందరినీ కలుపుకొని .
తాప్సి ఉన్నా తనను ఏమీ వల్గర్ గా చూపలేదు .
మరీ విలువలే లేని సినిమాలు చూసి విసుగ్గా
ఉంది . మరీ ఎప్పుడూ వ్యాపారమేనా ?
కాకుంటే కాన్సెప్ట్ హై గా ఉంది . అందరికీ అర్ధం కాదు .
ఇనొంచెమ్ సబ్ మెరైన్ పని తీరు ఎవరైనా వీడియో
చూపుతున్నట్లు చూపాల్సింది . ప్రెషర్ అంటే కూడా
చాలా మందికి అర్ధం కాదు . మాన్యువల్ అంటే
తెలీదు ,
విశ్వనాధ్ గారు చూడు ,బాపు గారు చూడు ఒక
క్లాసిక్ మూవీని కూడా అందరికి దగ్గర చేసి పడవ
నడిపే వాడి చేత కూడా పాడించేస్తారు . మన
హృదయం లోకి వచ్చేసి విలువలు పాటించు
అంటారు . కళకు ఇదే కదా ప్రయోజనం .
నీలో ఫైర్ ఉంది . దానిని అందరికి దారి చూపేట్లు
వెలిగించు . వాళ్ళ దారిలోకి వెళ్లి ఒప్పించు .
నువ్వు వేసిన దారిలో నడిపించు .
సినిమా కళామతల్లికి పట్టుచీరె కట్టినంత పద్దతిగా
ఉంది . మీ అమ్మ కడుపు చల్లగా ,
ఆ అమ్మకి నమస్కరించినంత తృప్తిగా ఉంది .
ఆశీస్సులు .
ఒక బిటెక్ కుర్రవాడి అమ్మ
వాశశి

No comments:
Post a Comment