చే గువేరా ....... ఎవరు ?
ఇప్పుడిక మీరు అంటారు,
ఎవరేమిటి, క్యూబా విప్లవ నాయకుడు
గొరిల్లా యుద్ధ యోధుడు , మనుషుల కోసం నిరంతరం
పోరాడే హృదయమున్న మనీషి .
చూడలేదా , నీవెప్పుడూ అందరు టీషర్ట్స్ మీద
వేసుకుంటున్నారు.
నాకిది చాలడంలేదు . ఇంకేదో తెలియాలి అతని గురించి
బహుశా అతనిలోని గుణాలు ఎలా ఏర్పడ్డాయో !
అతని ఆత్మ ఇతరుల ఆత్మలతో సహానుభూతి చెందడం ఎలాగ
అబ్బిందో !
ఎందుకు క్యూబా విప్లవం తరువాత కాస్ట్రోని వదిలి వెళ్లిపోయాడో !
పారే నది గుణం , నీడనిచ్చే చెట్టు స్వభావం ఎలా వచ్చాయో !
ఇప్పుడిక మీరు అంటారు,
ఎవరేమిటి, క్యూబా విప్లవ నాయకుడు
గొరిల్లా యుద్ధ యోధుడు , మనుషుల కోసం నిరంతరం
పోరాడే హృదయమున్న మనీషి .
చూడలేదా , నీవెప్పుడూ అందరు టీషర్ట్స్ మీద
వేసుకుంటున్నారు.
నాకిది చాలడంలేదు . ఇంకేదో తెలియాలి అతని గురించి
బహుశా అతనిలోని గుణాలు ఎలా ఏర్పడ్డాయో !
అతని ఆత్మ ఇతరుల ఆత్మలతో సహానుభూతి చెందడం ఎలాగ
అబ్బిందో !
ఎందుకు క్యూబా విప్లవం తరువాత కాస్ట్రోని వదిలి వెళ్లిపోయాడో !
పారే నది గుణం , నీడనిచ్చే చెట్టు స్వభావం ఎలా వచ్చాయో !
ఒక చిన్న పిల్లవాడి లో నాటుకున్న యుద్ధ విశేషాలు పోరాటాలకు
ఎలా బలాన్నిచ్చాయో !
ఒక బలహీనమైన ఆస్మా తో బాధపడే పిల్లవాడు ,ఎప్పుడు శ్వాస అందక
ఊపిరి వదిలేస్తాడో అని ఆక్సిజెన్ బుగ్గలు ఇంట్లో ఉంచుకొనే పిల్లవాడు,
తుపాకీ కి నిర్భయంగా ఎదురునిలబడి చిరునవ్వుతో క్యూబా స్వేచ్ఛ
ను ఎలా తెప్పించగలిగాడు !
నిస్సహాయంగా వంగిన బానిస బ్రతుకులలో భయాన్ని చంపి
చేతులని కత్తులుగా యుద్ధం ఎలా చేయగలిగాడు .
అందరిని నడిపించిన నాయకుడు అధికార పీఠం చేతిలోకి
రాగానే కాదని మంత్రిగా ఉంటూ సామాన్య పౌరుడి సౌకర్యాలు
మాత్రమే ఎందుకు స్వీకరించాడు .
ఎందుకు అన్ని వదిలి ఇంకొన్ని పేదరికాల కోసం కంచెలు దాటి
కాగడాగా కదిలివెళ్ళిపోయాడు .
బహుశా ఒక మెడికో స్టూడెంట్ గా అతని ప్రయాణం లో అతనికి
కనిపించిన ప్రజల పేదరికాన్ని , దైన్యాన్నిఅతను సహానుభూతి
చెంది కదిలిపోవడమే అతని సంకల్పానికి కారణం .
అది అతనిని చిన్నతనం లో చదివిన యుద్ధ మార్గం వైపు
మళ్లిస్తే ,హృదయమే అతని బలహీన శరీరానికి బలం అయ్యింది .
అందరిని చిరునవ్వుతో నడిపించిన పోరాటయోధుడు అధికారాన్ని
వద్దు అన్నాడు . అతని నిర్మాణం పోరాటం కోసమే . అతని అవసరం
లేని దగ్గర నుండి అతని అవసరం ఉన్నదగ్గరకు
నదిలా సాగిపోతూనే ఉంటాడు .
బుద్ధుడు కూడా తన మార్గం లో చావు ముసలితనము ప్రజల బాధలు
చూసి సహానుభూతి చెందాడు . కానీ అతని మార్గం శాంతి .
చే గువేరా మార్గం యుద్ధం .
ఏది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది అంటే ఒకటే జవాబు
మని షిని మనిషిగా చేసే మార్గమే గొప్పది .
మార్గం ఏదైనా కావొచ్చూ పక్క మనుషుల కోసం తమ
సుఖాలు చూసుకోక నిలబడటం తరువాతి తరాలకు
ముందుగా మనం నేర్పాల్సిన విషయం .
@@@@@@
No comments:
Post a Comment