Saturday, 28 January 2012

తెలుగోడు....తెలు"గ్గోడు"....

ఈ రోజు పేపర్ తెరవగానే....పాపం రాజా గారు 
(మ్యుజికాలిజిస్ట్)బాపు గారికి పద్మ అవార్డ్ రాకపోయినందుకు 
బాధపడుతూ వ్రాసిన అభిప్రాయం చూసాను .
తమిళియన్స్ లాగా మన తెలుగు వాళ్ళు మన వాళ్ళ 
గూర్చి అందరికి చెప్పుకోరు.....
అందుకే మన వాళ్ళ గూర్చి ఉత్తరాది వాళ్లకు తెలీటం
 లేదు అని చెప్పారు.....నాకు నిజమే 
అనిపించింది......ఎందుకంటె తమిళనాడు మా పక్కనే 
కదా....సరే తెలుగు బ్లాగ్ గుర్తు గా మన పేరు పక్కన 
ఆయన బొమ్మే పెట్టుకుందాము అనుకున్నా....ఒక్క 
సారి ఇంతకూ ముందు రాసిందే పబ్లిష్ చేస్తూ....
జై....బాపు గారు.....


పరిమళాల విరి 
నవరసాల ఝరి
మనసులోని ఆనంద లహరి 
మునగాలనిపించెను మరీ మరీ.......


కన్నయ్య బుగ్గ మీద నునుపు 
అలిగిన కన్నె కళ్ళ ఎరుపు 
చిన్ని పెదాల మధ్య విరుపు
జిగి బిగి అల్లికతో జడ చరుపు 

 

బుడుగు అల్లరి అల్లిక 
రాధ గోపాలాల ప్రేమ మల్లిక
విరహిణి అయి గోపిక 
ప్రేమామృత ధారలలో మునుగునిక...



భూమిపై పరిచిన రంగుల హరివిల్లు 
వేసవి లో తాకిన మల్లెల జల్లు 
ఎంత వర్ణించిన మిగులు 
బాపు బొమ్మల సొగసులు......


ఏంటమ్మా?ఎక్కడికో వెళ్ళిపోయావుఅంటారా?
అవునండి స్వర్గ లోకపు అంచుల దాక వెళ్ళిపోయాను.
ఏంటి అక్కడ నుండి దూకి చావు అంటారా?అనలేదా?
నాకు వినపడిందే.....క్రాస్ టాక్ అయుంటుంది......

బాపు గారి నకల్లు ,ఫోటో లు చూస్తేనే ఇలా అయిపోయానే 
ఇంక ఒరిజినల్స్ చూస్తే ఇంకేమవుతానో ...అయ్యబాపూ ఓయ్ ......
హైదరాబాద్ లో 4,5,6,june నెలలో ఒరిజినల్స్ exbhisition 
అంట.చూసి తరించు పోండి.నీకేమమ్మా నువ్వు కూడా చూడు 
పోయి అంటారా ,మేమెంత దూరం లో ఉన్నాము మాకెక్కడ 
వీలవుతుంది?అంత అదృష్టం ఉండొద్దా?

నీకే కాదమ్మా మాకు కూడా బాపు బొమ్మలు ఇష్టమే 
అంటారా?మా బంగారాలే ....(ఇలా అంటే ఏదో ఫిట్టింగ్ పెడతానని 
మా ఇంట్లో వాళ్లకి తెలుసు ,మీకు తెలీదు కదా)
పోండి...పోండి...పోయి ఆ కళని కళ్ళ నిండా నింపుకొని 
కలం లో కూర్చి అక్షరాలుగా మార్చి ఆ అమృతం తో మీ 
బ్లాగ్ లు ముంచేయండి.ముంచగానే నాకు ఒక మెసేజ్ 
కొట్టండి నేను కూడా ఆస్వాదిస్తాను.మీ ఇల్లు బాపు బొమ్మగాను......
ఎంత చక్కగా రాసారండి...అని కామెంట్ కూడా వ్రాస్తాను.


Wednesday, 25 January 2012

బుల్లి మట్టి ఇల్లు.....చిన్న పొదరిల్లు.....

"మా ....వీడు నువ్వు పాట పాడితే కాని లేవడంట.....
నువ్వే వచ్చి నిద్ర లేపు....నీ పాట పాడినా కూడా 
అమ్మ గొంతు లాగా లేదు అంటున్నాడు"....చెప్పింది పాప.


ఇంక అయినట్లే ......వాడికి  కాలేజ్ కి టైం అవుతుంటే 
నేను ఇంకా పాట పాడి లేపాలంటే ఇక ఎప్పటికి రెడీ అవుతాడు....

మరి ఈ పాట కధ ఏమిటి?అంటారా......వాళ్ళ చిన్నప్పుడు 
రాత్రి పూట చేతిపై ఇద్దరినీ పడుకోబెట్టుకొని వాళ్ళు 
కలల లోకం లోకి జారిపోయే దాకా....
వాళ్ళ ఊహా శక్తిని పదునెక్కిస్తూ ....
అక్కా తమ్ముడు..... కష్టాలు వస్తే ఒకరికి ఒకరు.... 
భయం లేకుండా ఎదిరించటం.....ఇలా ....
కధలలోకం లో వాళ్ళను తిప్పుకోచ్చేదాన్ని.

వాటిలో వాళ్లకు నచ్చిన రెండు కధలు  ఉండేవి....

వీళ్ళను నిద్ర లేపే పాట ఒక చిన్న మేక కధ
లోది.....అందులో ఒక మేకకి బుజ్జి పిల్లలు ఉంటాయి....అది అడవికి వెళ్ళే టపుడు 
వాత్రిని తలుపు వేసుకోమని తను పాట 
పాడితేనే తీయమని చెప్పేది....తోడేలుకు 
దొరక కూడదని...ఆ పాట ఏమిటంటే.....
(కొంచం మార్చాను)


మా బుజ్జి పిల్లలు .....బంగారు పిల్లలు.....నిద్ర లేవండి....
మీ అమ్మ వచ్చింది....పాలు తెచ్చింది....అని పాడి 
ఒకటి నుండి పది  వరకు అంకెలు లెక్క పెట్టె దాన్ని....
ఎవరు వచ్చి నన్ను తాకితే (కళ్ళు తెరవక పోయినా పర్లేదు)
వాళ్ళను ఎత్తుకుంటాను.....మిగిలిన వాళ్ళు చేయి పట్టుకొని 
నడిచి రావాల్సిందే.....ఇద్దరు పరిగేట్టేవాళ్ళు....నేను ముందు
అంటూ.....

(ఇప్పుడు అంటే గొంతు....
నిద్ర పొయెవాళ్ళను  కూడా 
బయపెడుతుందికాని అప్పుడు 
బాగా పాడేదాన్ని)

కధలో తొడెలు ఆ పాట వినేసి ....
గొంతు మార్చి పాడేస్తుంది...
లోపలి వెళ్లి అన్ని పిల్లలను మింగేస్తుంది......
పాపం బుజ్జి పిల్ల దాక్కొని 
వాళ్ళ అమ్మ వస్తే ఏడుస్తూ అంతా చెప్పేస్తుంది....
అప్పుడు ఏమవుతుంది?.......ఏమిటి మీకు కూడా కధ 
నచ్చెసిందా?.....

మేక తొడెలును  షికారుకు తీసుకొని పోయి ....
మనం మంట పై నుండి దూకుదాము అని దూకుతుంది.....
అదేమో బాగా దూకేస్తుంది...
కాని తోడేలు దూకలేక మంటలో పడి దాని పొట్ట పగిలి పోయి 
పిల్లలు క్షేమంగా వస్తాయి.....అదెలా?అంటారా...
అదంతే కల్లా కపటం తెలీని పిల్లలకు కధలు చెప్పెటపుడు  
సుఖాంతమే చెయ్యాలి.....
లేకుంటే వాళ్ళు కలల  దుప్పటి కప్పుకొని హాయిగా 
నిద్రపోరు......

మరి అదే పాటా ఇప్పుడు కూడా పాడతాను....మంచి నిద్ర నుండి 
లేపాల్సి వస్తే......పది లెక్క పెట్టె లోగా లేవక పొతే ఏమవుతుంది అంటారా?ఏమి లేదు కేస్ వాళ్ళ నాయన కోర్ట్ కి వెళుతుంది....
అక్కడ నో.....బుజ్జగిమ్ప్స్.....ఓన్లీ.....లా అండ్ ఆర్డర్.....

ఇంకో కధ కావాలా....మా బంగారాలే.....మీకు కూడా 
కదల పిచ్చి పట్టిందా......
ఇంకో మంచి కధ పాప-తెల్లని కొంగలు.....

ఒక అక్క తమ్ముడు ఉంటారు....వాళ్ళ అమ్మ వాళ్ళు
పనికి వెళ్లి నపుడు మాంత్రికురాలి కొంగలు వచ్చి 
తమ్ముడిని ఎత్తుకేలుతాయి.ఆ పాప వాడిని వెతుకుకుంటూ వెళితే 
పాల హల్వా నది,యాపిల్ చెట్టు,రొట్టెల పొయ్యి ఆమెను 
తమ దగ్గర ఉన్నవి తినమంటాయి.ఆమె నాకు ఇష్టం లేదు 
తినను అంటుంది.కాని మాంత్రికురాలి నుండి తమ్ముడిని 
తెచ్చెటపుడు ....కొంగల నుండి తమ్ముడిని కాపాడటానికి 
ఆమెకు ఇష్టం లేక పోయినా అవన్నీ తింటుంది.అవన్నీ 
వాళ్ళను కాపాదుతాయి ....అబ్బో....ఏమి సస్పెన్సు....
పిల్లలు నోరు తెరుచుకొని వినాల్సిందే.....ఇప్పటికి కూడా.....

ఇప్పుడెందుకు ఇయ్యన్ని?

వేణు శ్రీకాంత్ గారి కోసం......తనేమో వాళ్ళ అమ్మని గుర్తు 
చేసుకోవటానికి ఏదో ఒకటి రాస్తాడు.....నాకేమో హృదయం 
ఎలాగో అయిపోతుంది....ఏమి చేసేది?

ఏ పిల్లలు తన తల్లిని పిలిచినా ....తల్లి తన పిల్లల తలపులు 
గుండెకు హత్తుకుంటుందేమో.....

వేణు....ఏ తల్లి అయినా తన తలపుల స్పూర్తి తో 
బిడ్డ ఎదగాలని అనుకుంటుంది......అది సాదించి 
ఆ బిడ్డ నిలిచినపుడు....తన వొడిలో వోదగాలనుకుంటుంది....

కలల లొకం  నువ్వు గెలిచి 
అమ్మ బిడ్డ గా నువ్వు నిలిచి 
ప్రపంచానికి సాయ పడితె.......
అదే తనకు నివాళి......
ధన్యవాదాలంటుంది తనకు.....జనావళీ....


ఈ పోస్ట్ రాత్రి వ్రాసాను....ఉదయాన్నే మా పాప పరిగిస్తూ 
వచ్చింది....సాక్షి పేపర్ చేతిలో పట్టుకొని......అమ్మా...అమ్మా....
అంటూ....."ఎమ్మా?"అని అడిగాను......
"మేము నార్వేలో పుట్టక పోవటం మంచిది అయింది"అంది.

ఎందుకంటారా.....వాళ్ళు అక్కడ పుట్టి ఉంటె నేను వాళ్లకు 
ఇప్పటికి పాడే లాలి పాటలకు,చేతి ముద్దలకు.....ఎప్పుడో 
వాళ్ళను ప్రభుత్వం  వాళ్ళు లాక్కెళ్ళి పోయేవాళ్ళు.....
ఏమిటీ? అంటారా?చదవండి.....మళ్ళ సాయంత్రం వచ్చి 
పోస్ట్ కంటిన్యు చేస్తాను.....మరి స్కూల్ లో నా స్పూర్తితో 
మనసు వెలిగిన్చుకోవటానికి 750 మంది వెయిటింగ్ అక్కడ.....
ఓస్లో: స్థానిక చట్టాల ధాటికి కన్నబిడ్డలకు దూరమై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎన్నారై జంట సాగరిక, అనురూప్‌లకు ఎట్టకేలకు ఊరట లభించబోతోంది. ప్రస్తుతం నార్వే చైల్డ్ వె ల్ఫేర్ సర్వీసెస్ కస్టడీలో ఉన్న వీరి పిల్లలు రెండున్నరేళ్ల అభిజ్ఞాన్, ఆర్నెల్ల పసికందు ఐశ్వర్యలను అనురూప్ సోదరుడు అరుణభాస్‌కు అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. నార్వేలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధి, నార్వే మున్సిపాలిటీ, చైల్డ్ కేర్ సర్వీసెస్, తల్లిదండ్రులు సాగరిక, అనురూప్‌లమధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది. కోర్టు వెలుపల కుదిరిన ఈ ఒప్పందాన్ని కోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. దీని ప్రకారం పిల్లల్ని అరుణ్‌భాస్ తనతోపాటు కోల్‌కతా తీసుకొచ్చేస్తారు. ఆ పిల్లల బాగోగుల్ని ఇకపై ఆయనే చూడాలి. ఇందుకు అరుణ్‌భాస్ అంగీకరించారని ఒప్పందం పేర్కొంది. నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ కూడా ఇందుకు అంగీకరించింది. సాగరిక, అనురూప్‌లకు తల్లిదండ్రులుగా ఆ పిల్లల్ని కలుసుకునేందుకు మాత్రమే హక్కులుంటాయి. నార్వే కుటుంబ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూస్తుంటుందని ఒప్పందం పేర్కొంది. పిల్లల బాగోగుల గురించి అడిగినప్పుడల్లా ఆ శాఖకు సమాచారం అందించాల్సిన బాధ్యత అరుణ్‌భాస్ కుటుంబానిదే. అభిజ్ఞాన్, ఐశ్వర్యల సంక్షేమంపై మన ప్రభుత్వం తరఫున రాయబార కార్యాలయం గ్యారంటీ ఇచ్చింది. అరుణభాస్ నార్వే వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల్ని మన ప్రభుత్వం భరిస్తోంది.

తల్లిదండ్రులిద్దరూ పిల్లలకు చేత్తో ఆహారం తినిపిస్తున్నారని, తమతోపాటు మంచంపై నిద్రపుచ్చుతున్నారని, వారికి కొనిచ్చిన ఆటబొమ్మలు కూడా వయసుకు తగ్గట్టుగా లేవని.. ఇలా చేయడం పిల్లలను సరిగా పెంచకపోవడం కిందికొస్తుందని పేర్కొంటూ అభిజ్ఞాన్, ఐశ్వర్యలను వారినుంచి నార్వే అధికారులు వేరుచేసి శిశు సంక్షేమ కేంద్రాల్లో చేర్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం వారిద్దరూ 18 ఏళ్ల వయసు వచ్చేవరకూ అక్కడే పెరగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఏడాదికి రెండుసార్లు గంటచొప్పున మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలతో దిగ్భ్రాంతిచెందిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్పగించమంటూ ఆరు నెలలుగా కోర్టుల్లో పోరాడుతున్నారు. తమ వీసా గడువు ఈ మార్చితో ముగియబోతుండటంతో వారిలో ఆందోళన రెట్టింపయింది. ఎందుకంటే, ఆ తర్వాత పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడం మరింత క్లిష్టంగా మారుతుంది. తాజా ఒప్పందం పిల్లల బాధ్యతను తమకు అప్పగించకపోయినా వారిద్దరూ నార్వే చెరనుంచి బయటపడుతున్నారని, తమకు అది చాలని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము ఇక్కడికొచ్చాక పిల్లల్ని దగ్గరుంచుకోవడంలో ఎలాంటి సమస్యా ఉండబోదని విశ్వసిస్తున్నారు.
HAPPY REPUBLIC DAY.......BYE.....

Thursday, 19 January 2012

నేను...."కెవ్వు"టివిటి.....

కేవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్.......ఇలాగే అరిచాను....
వెంకటేష్ రివ్యూ రెస్పాన్సు చూసి.....

సరే నేను కెవ్వు మనిపించిన నా చిన్నతనపు 
క్రియేటవిటి .....కూసింత మీకు చూపిద్దాము అనుకున్నా....

మొన్న బోగి పండుగ రోజు మా అక్క ఫోన్ చేసింది.
ఎవరితో ఉన్నానో  చెప్పుకో అని.....మళ్ళా తనే చెప్పింది 
తన చిన్నప్పటి స్నేహితురాలితో ఉన్నాను అని.....
ఆ అక్క నాతొ మాట్లాడింది.గొంతులో సంతోషం కనిపిస్తూ 
ఉంది నాకు."శశీ....ఎలా ఉన్నావు?ఎలా ఉంది నీ క్రియేటివిటీ?

అంతే రయ్యుం...రయ్యుం....మా చిన్నతనానికి వెళ్లి పోయి 
వాళ్ళను కెవ్వు మనిపించిన .....క్రియేటివిటీ ....చెప్పి ఒకటే 
నవ్వు.....

మా అక్క ఫ్రెండ్స్ అందరికి నేనంటే 
భలే ఇష్టం.నేను ఏమి చేసిన నవ్వుకుంటారు.
నాకు మా అక్కకి రెండు ఏళ్ళు
 తేడా.వాళ్ళలో కొంత మంది 
నాకు కొలీగ్స్ గా కూడా ఉన్నారు.
మేడం అన్నా వాళ్ళని ఒప్పుకోరు.
వాళ్లకి నేను యెంత ఇష్టం అంటె...
నేను ఇప్పటికి ఏదైనా అవార్డ్ లేదా
మంచి పని చేస్తే వెంటనే నా బుగ్గపై 
తడి తుడుచు కోవాల్సిందే....
అంత ఇష్టం వాళ్లకి.

నేను సైకిల్ నేర్చుకున్నా,గ్రీటింగ్స్ చేసినా,
ముఖ్యంగా  నేను పరీక్షలు వ్రాసే పద్దతి ఇప్పటికి 
చెప్పుకొని నవ్వు కుంటారు.మరి నాకు ఫస్ట్ రావటం 
అంటె తెలీదు.అందుకని అందరికంటే ముందే రాసి వచ్చేదాన్ని.
అక్కా వాళ్ళు అడిగితె నేనే ఫస్ట్ వచ్చాను...అని 
చెప్పేదాన్ని.నాకొచ్చిన కాఫీలో చక్కేరేసినన్ని మార్కులు 
(అంటె ముప్పై ఐదు)చూసి ఇదాఆఆఆఆఅ....ఫస్ట్ 
రావటం అని కేవ్వుమనేవాళ్ళు(వాళ్లకు రాలేదని కుళ్ళు)

ఇక పదవ తరగతికి వచ్చినాక చూడాలి.స్కూల్ లో ఆడపిల్లలు 
మాత్రమే ఉంటారు కాని ట్యూషన్ లో మగ పిల్లలు కూడా 
ఉండేవారు.అందరిలోకి మేమే చిన్న(మేము అంటె 
మా పెదనాన్న కొడుకు ,నేను,మరి రెండు ఏళ్ళు ముందు 
గెంతేము కదా)

ఆడపిల్ల ల లైన్ లో చివర నేను కూర్చుంటే ,నా పక్కన 
మా తమ్ముడు కూర్చునేవాడు .(వీడికి నేను అంటె యెంత 
ఇష్టం అంటె శెలవలకి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 
కాకుండా నాతొ కావలికి వచ్చేవాడు.)

ఇప్పుడు టీచెర్ గూర్చి చెప్పాలి.ఆయన ఇంగ్లిష్,మ్యాథ్స్ 
చెప్పేవారు.ప్రతి ఆదివారం ఒక పరీక్ష.ఆ రోజు అందరికి 
గుండెల్లో బుల్ డోజేర్స్ పరిగెత్తేవి(అదెలా?అని అడగొద్దు)
అప్పుడే దిద్దేసి ఈత బెత్తాలతో .....డిషా...డిషా.....ఎలా 
కోడతాడండి రాక్షసుడు(చనిపోయారు కాబట్టి దేవుడు)

నన్ను అప్పటి దాకా మా నాన్నను చూసి  కొట్టేవాళ్ళు 
కాదు.ఈయన అలా కాదు నేను ఏడవకుండా మొండికి 
పడితే ......ఎడ్చేదాకా కొట్టేవాడు.

సరే ఇంగ్లీష్ "కెవ్వు"గూర్చి చెపుతాను.ఒక రోజు ఆయన 
పాటం చెపుతుంటే నేను ఒక పదం అర్ధం అడిగాను.....
అది అడగ కూడదని నాకేమి తెలుసు....అక్క వాళ్ళు అంతా
కేవ్వ్వవ్వ్వ్......అయినా అదేమీ పెద్ద పదం కాదు ఇప్పటి 
రోజుల్లో.....హనీ మూన్ ....అంటె నాకేమి అర్ధం కాలేదు...
అదే అడిగాను.ఇంకా బ్లాక్ మనీ ఇలాటివి .....బోల్డు 
అడిగి నా "కెవ్వు"టివిటి ఆయనకు చూపించేదాన్ని.

ఇక లెక్కల్లో అయితే నా జవాబులు చూసి ఆ సార్
ఎన్ని సార్లు కేవ్వుమనేవారో.....అసలు అలా సాల్వ్ 
చెయ్యాలని నీకెలా అనిపించింది తల్లీ....అని తల పట్టుకునే 
వారు(మరే ఈ దేశం లో అంతే....శ్రీనివాస రామానుజన్ 
గారిని ఎవరు గుర్తించారు?)అసలు ఆ జవాబులు ఎలా 
సృష్టించానో అర్ధం అయ్యేసరికి ఆయనకు తల నొప్పి 
వచ్చేసేది.....మళ్ళా చూస్తె అన్నీ కరక్టే......

ఎందుకు తల్లి "ముక్కు ఇలా ఉందని చూపించకుండా 
తల చుట్టూ వేలు తిప్పి ముక్కు పై ఉంచి చూపిస్తావు"
అనేవాళ్ళు.మా అక్కా వాళ్ళు తంటాలు పడి నా మ్యాథ్స్ 
క్రియేటివిటీ అనర్ధం చేసుకొని ......కెవ్వు మనే వాళ్ళు.....
నీ బుర్ర లోకి ఎలా వస్తాయే ఇలాంటి అవిడియాలు.....
నీళ్ళలో వడియాలు వేగించినట్లు.....అని నవ్వి దగ్గరికి 
తీసుకొనే వాళ్ళు.

హూ.....ఎలాగైతేనేమి.....పబ్లిక్ పరీక్షలు వ్రాసాను.అప్పుడే 
మా అక్క కూడా సీనియర్ ఇంటర్ వ్రాసింది.అందరు ఎలా 
వ్రాసావమ్మా?అని అడిగితె లెక్కల్లో 99 అని చెప్పేసాను.
(మరి మా అక్క అప్పటికే కాంపోజిట్ మ్యాథ్స్ లో 98 
తెచ్చుకొని ఉంది)

హమ్మయ్య రిజల్ట్స్ వచ్చేసాయి....కాని చూడాలంటే 
న్యూస్ పేపర్స్ ఏవి?ఎమైనాయంటే ....కోటకు వచ్చే 
పేపర్స్ అన్నీ ఎవరో ఎత్తుకెళ్ళి పోయారంట....అందులో 
అక్కవి ,నావి ఇద్దరి రిజల్ట్స్ ఒకే రోజు వచ్చాయి.
కాని ఇంకెలా?ఎవరో ఒక్క పేపర్ సంపాదించి తెచ్చారు.
ఊరంతా దానిలో రిజల్ట్స్ చూసారు.(పెద్ద కష్టం లేదు 
లెండి....ఊరంతటికి ఐదుగురు పాస్స్ అయితే గొప్ప)

ఇద్దరికీ ఫస్ట్ క్లాస్స్.....ఇక మా నాన్నని అందరు 
పోగిడేసారు.....(అంటె ఆడపిల్లలని చదివించిన 
సంస్కర్త కదా....మరి అప్పట్లో అదే  గొప్ప )

అనీ బాగున్నాయి కాని .....నా లెక్కల మార్కులే.....
దిద్దిన అయ్యోరు నాకు దొరకాలి.....కేవ్వుమనిపించేస్తా....

ఎమైందా.....నా క్రియేటివిటీ తట్టుకోలేక ......నేను చెప్పిన 
99 ని ....ఆయన క్రియేటివిటీ తో.....తలకిందులు చేసేసాడు...

Wednesday, 18 January 2012

బాడీ గార్డ్ .....ఓ...గాడ్....

ఓ...గాడ్....ఓ...గాడ్....ఎన్ని సిన్మాలు 
చూడొచ్చు ...టికెట్ లేకుండా ....ఒకే సినిమాలో....


హు....ఏదోలే ప్రముఖులంతా పూరీలు తిని 
ప్లస్ లో ......బిజినెస్స్ మ్యాన్ లో వినలేని మాటలున్నాయి 
అని ప్రవచించారని.......పండగ రోజు అవెందుకులే అని 
బాడీ గార్డ్ సీయింగ్........దెబ్బకి కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్.....ఓ...గాడ్ .


హీరో గారి పేరు వెంకటాద్రి .ఆయన చిన్నప్పుడు కార్
 ప్రమాదంలో చిక్కుకుంటే......వరదరాజుల నాయుడు 
(ప్రకాష్ రాజ్)వారిని కాపాడుతాడు.అందుకని వెంకటాద్రికి
ఆయన అంటే ప్రేమ,గౌరవం.మళ్ళా వాళ్ళ అమ్మా,నాన్న 
ఏమవుతారో మనకు తెలీదు ,వాళ్ళ మామ మోహనరావు 
దగ్గర పెరిగి పెద్ద అయి .....ఎవరు చెడ్డ పనులు చేస్తున్నా 
కొడుతుంటాడు.వాడిని దారిలో పెట్టగలిగేది వరదరాజులే 
అని వాళ్ళ మామ నమ్మి ఆయనకు బాడి గార్డ్ గా ఉద్యోగం 
వచ్చిందని అబద్దం చెప్పి ఆయన దగ్గరకు  ఒక లెటర్ ఇచ్చి 
పంపుతాడు.మొదట వరదరాజులు నాకు బాడి గార్డ్ వద్దు 
అని.....తరువాత లెటర్ చదివి తన దగ్గరే ఉంచుకుంటాడు.


ఆయనకి ఒక కూతురు ....పేరు కీర్తి(ఆడవాళ్ళ మాటలకి అర్దాలే 
వేరులే సెంటిమెంట్ తో ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు)
ఆ అమ్మాయి ఒక సారి ట్రైన్ లో వస్తుంటే ఇంకో విలన్ కొడుకు 
ఏడిపిస్తాడు.దిగిన తరువాత వాళ్ళ నాన్నకు ఏడుస్తూ 
చెపుతుంది.ఆ అబ్బాయిని వరదరాజులు తన్నపోతే వాడు 
భయపడి ట్రాక్ పైకి పారిపోబోయి .....ట్రైన్ కింద పడి
చనిపోతాడు.అందుకని విలన్ కీర్తిని చంపాలని ప్లాన్ 
వేస్తుంటాడు.
కీర్తిని వాళ్ళ బావ శంకర్ కి ఇచ్చి చెయ్యాలని అనుకుంటారు.
కాని కీర్తి ఫైనల్ ఎగ్సాంస్ వ్రాసినాక చేసుకుంటాను అంటుంది.
కాలేజ్ లో ప్రమాదం రాకుండా బాడి గార్డ్ గా వెంకటాద్రి 
ని పంపుతారు.
ఇక్కడ మన చెవిలో పెద్ద కాలి ఫ్లవర్ పెడతారు.
ఏమిటంటే హీరో ఏమి చదువు కున్నాడో 
 తెలీదు కాని కీర్తి క్లాస్స్ లో సీట్ ఇచ్చేస్తారు.


(హేమిటో అంతా తెలుగు మాయ)


ఇక ఆయన క్లాస్ లో చేసే హాస్యం అంతా.....హు...హా....
అదేనండి .......మన శంకర్ దాదా ఎమ్బిబీస్...........


కీర్తికి ఈ బాడిగార్డ్ అంటే చిరాకు.వాడి మనసు మార్చాలని 
వేరే అమ్మాయి లాగా ఫోన్ చేసి ప్రేమ లోకి దింపుతుంది.
ఇక  వేణు మాధవ్,ఆలి ,వెంకి కలిసి కష్టపడి హాస్యపు 
పులుసు చేస్తారు.మనం ఏడవలేక(డెబ్బై రూపాయలు 
పోయాయని.....పండగ పూట టికెట్ రేట్ ఎక్కువ కదా)
నవ్వుతాము అన్న మాట.


ఇక్కడ కీర్తి తో పాటు ఫ్రెండ్ సునీత కూడా ఉంటుంది....
కీర్తికి మంచి చెడు చెపుతూ ఉంటుంది.బాడి గార్డ్ ఇద్దరినీ 
తెగ చదివిస్తుంటాడు(ఈయనకి పెద్ద వచ్చినట్లు)


ఫోన్ లో ఏడిపిస్తూ నిజం గా వెంకటాద్రికి తనపై యెంత ఇష్టం 
ఉందొ తెలుసుకొని నిజం గానే ప్రేమించేస్తుంది.
వెంకటాద్రికి మాత్రం కీర్తి ఏ ఫోన్ చేస్తుందని తెలీదు.
ఇక అక్కడి నుండి.....ఆడవాళ్ళ మాటలకు అర్దాలే వేరులే....
ఏమి చేద్దాం ఎలా కలుసుకుంటారో అని ఆవలిస్తూ కూర్చోవటమే.


తరువాత వరదరాజులు కీర్తి ప్రేమ కద తెలుసుకొని 
వెంకటాద్రిని చంపటానికి వస్తాడు.కీర్తి అతనికి ఏమి 
తెలీదు అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు 
తన కోసం రైల్వే స్టేషన్ కి వెళుతున్నాడు అని చెప్పి 
పంపేస్తుంది.తరువాత ఫోన్ చేసిన అమ్మాయిగా తన 
ఫ్రెండ్ సునీతను పంపి విషయం చెప్పమంటుంది.
కాని ఆమె చెప్పకుండా వెంకటాద్రిని పెళ్లి చేసుకొని ఒక 
బాబుని కని  క్యాన్సర్ తో చనిపోతూ విషయం డైరీలో 
వ్రాసి వాళ్ళ బాబుకు ఇస్తుంది.ఏమిటో ఇక్కడ వాళ్ళు 
ఆస్ట్రేలియా లో ఉంటారు.
తరువాత ఇండియాకి వచ్చి వరద రాజులను చూడటానికి 
వెళితే కీర్తి కి ఇంకా పెళ్లి కాదు.డైరీ చదివాడు కాబట్టి 
బాబు వాళ్ళ ఇద్దరినీ పెళ్లి చేసుకోమని అడుగుతాడు.
అందరు ఒప్పుకొని పెళ్లి చేస్తారు.....ఇంకా....ఇంక చాలు 
లెండి.....బండ యెంత సాగ తీస్తారు.....కాసేపు నవ్వుకోవచ్చు 
అంతే.


మరి ఈ రోజు మా అన్నగారి వర్దంతి సందర్భంగా నాకు 
నచ్చిన ఆయన పాట...చూసేసి ఒక శాల్యూట్ కొట్టేయ్యండి.


"నీ తల్లి మోసేది నవ మాసాలేరా....
ఈ తల్లి మోయాలి కడ వరకురా 
కట్టే కాలే వరకురా.....
ఆ ఋణం తలకొరివితో తీరేనురా 
ఈ ఋణం ఏ రూపానా తీరెదిరా"
(అందుకే పెద్ద వాళ్ళు ఉదయం నిద్ర లేచి కాలు 
నేలపై పెట్టె ముందు భూమికి దణ్ణం పెట్టుకోమంటారు.
మన కాలు దానికి అంటిన పాపం లేకుండా)
జననీ.....జన్మభూమిశ్చ......

Sunday, 15 January 2012

సహస్ర స్క్వైర్ అవధానం .....ఈ రోజుదా?

వంట,పిల్లలు,ఇల్లు,కాపురం,
ఉద్యోగం.....హూ....ఇన్ని....


అబ్బో మాకు లేవేటి?అందరు ఆడోల్లు చేస్తారు 
పే....ద్ద........మీరోక్కరేనా........


చూడండి.....మాలిక సంక్రాంతి సంచికలో 
నా ఆర్టికల్..........




అవధానం.....చదువుడీ.....


Monday, 9 January 2012

ఒక్క ఛాన్స్....ఒకే ఒక్క ఛాన్స్....

ఎవరు?కళ్ళు విప్పార్చుకొని.....కళ్ళు నులుముకొని 
మరీ చూసాను....శ్రీ కాళహస్తి లో జ్ఞాన ప్రసూనాంబా  
దర్శనానికి గర్భగుడి లోకి వెళుతున్నాము అందరం.
ఎదురుగా అవధాని "మేడసాని మోహన్"గారు వెలుపలికి 
వస్తున్నారు.ఆయనను ఇంటర్లో నేను తెలుగు అసోసియేషన్ 
లో ఆఫీస్ బెరేర్ గా ఉన్నప్పుడు చూసాను.అప్పుడు ఆయన చేత 
అవధానం జరిపించాము మా కాలేజ్ లో.అప్పటినుండి 
అవధానం అన్నా ,ఆయన అన్నా చాలా గౌరవం నాకు.


వెంటనే అక్కడ ఉన్న గార్డ్ ను "ఆయన ఎందుకు వచ్చారు"
అని అడిగాను.ఈ రోజు ఉగాది కదా ....కవిసమ్మేళనం  
జరుగుతుంది.(2009 విరోధి నామ ఉగాది) అంతే పిల్లల ఆకలి 
మా ఆయనకు వదిలేసి ....రయ్యన .....కవి సమ్మేళనానికి 
వెళ్ళిపోయాను.(అప్పుడప్పుడు ఈయన అలా గాలిపటం లా 
నన్ను వదిలేస్తారు.......నా కిష్టమైన వాటికోసం)


మొదటి లైన్లో కూర్చున్నాను.....మేడసాని గారు నిర్వహణ 
చేస్తున్నారు.....ఒక్కొక్కరో కవితలు  చదువుతున్నారు.....
విశేషణాలు,పదవిరుపులు ......కొత్త పల్లవములతో పోటీ 
పడుతున్నాయి......(ఈయన పాపం ప్రసాదాలు కొనుక్కొచ్చి 
పిల్లల ఆకలి తీర్చే పనిలో ఉన్నారు).....నాకైతే సంతోషం 
ఉప్పొంగిపోతుంది......నా ముందు వరుసలో దేవస్థానం 
పాలక మండలి వారు కూర్చుని ఉన్నారు(అప్పుడు నాకు 
చైర్ మాన్ శాంతరాం పవార్ గారు అని తెలీదు)


అప్పుడు వచ్చింది ఒక ఆలోచన.....ఒక్క చాన్సు ఎందుకు 
ఉపయోగించుకోకూడదు .....అంతే ఒక కవిత వ్రాసేసి 
ముందు కూర్చున్న వాళ్ళని పిలిచాను...."ఏమ్మా?"
అన్నారాయన...."సార్ నేను ఒక కవిత చదవొచ్చా?
నాకు మేడసాని గారి ముందు ఒక కవిత చదవాలని ఉంది"
అన్నాను...."దానికేమమ్మా"అని వెళ్లి ఆయనతో 
నన్ను చూపించి ఏదో చెప్పారు.నేను వెళ్లి నిలుచున్నాను.
(ఇక్కడ మా వారికి ఏమి జరుగుతుందో తెలీక
 బుర్ర గోక్కుంటున్నారు)


అప్పుడు మేడసాని గారు నన్ను సభకు పరిచయం చేస్తూ
"శశి గారు ఈ రోజు కవిత చదవటానికి ఇక్కడకు వచ్చారు.
నేను ఇన్ని రోజుల నుండి కవిసమ్మేళనాలు నిర్వహిస్తున్నాను....
కాని ఇక్కడ ఎప్పుడు మహిళలు రాలేదే అనేది కొరతగా  
ఉండేది...సాక్షాత్తు ఆ జ్ఞాన ప్రసూనాంబ ఈమెను పంపించింది 
అనుకుంటున్నాను"అన్నారు(అలా అనటం ఆయన 
నిర్వహణలో భాద్యత కావొచ్చు....కాని నాకు భలే సంతోషం 
వేసింది)


తరువాత అందరు చాలా శ్రద్ధగా నా కవిత వినటమే కాక 
చందన మాలతో,ఈశ్వరుని శాలువాతో వారందరితో 
పాటు నన్ను కూడా సత్కరించారు......ఇక ఆ చందన కర్పూర 
వాసనలతో ఆ జ్ఞాపకం.....మా అందరిలో నిలిచి పోయింది.


ఆ ఒక్క చాన్స్ వచ్చినపుడు నేను భయపడి ఉంటె.......


సంక్రాంతి కాబట్టి .....ఇంకో సంక్రాంతి జ్ఞాపకం పంచుకుంటాను.
2011 సంక్రాంతి ముందు ఆదివారం 
నగలు కొనాలని నెల్లూరికి వెళ్ళాము.
నగలు కాబట్టి జాగ్రత్త కావాలని 
మా వారు కూడా తోడు వచ్చారు.
అక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లి తనను
తీసుకొని షాపింగ్ కి వెళ్ళాలి.అక్కడ నాకు ఒక కాగితం దొరికింది.దానిలో యేముందంటే ఆ రోజు 
మధ్యాహ్నం మా చెల్లి వాళ్ళ పక్కన గల సత్రం లో 
మూడు నుండి...ఐదు గంటల వరకు ముగ్గుల పోటి అని 
వ్రాసిఉంది.వెంటనే వాళ్లకు ఫోన్ చేసి నా పేరు నమోదు 
చేసుకున్నాను.నగల షాపింగ్ అయ్యేటప్పటికి నాలుగున్నార 
అయింది.మా వారి ఇంకేమి పోతావులే అన్నారు.
అయినా పటు వదలని ముగ్గిణి ......లా ముగ్గు,రంగులు 
తీసుకొని బయలుదేరాను.వాళ్ళు ఆశ్చర్యంగా చూసారు.
ఇంకా పదిహేను నిమిషాలే ఉంది అని......అయినా వేస్తాను 
అన్నాను.సరే అన్నారు వాళ్ళు.చాలా మంది వెళ్లి పోతున్నారు.


ముందు ఒక్క నిమిషం చుట్టూ చూసాను.వాళ్ళు చాలా 
ఏర్పాట్లతో పూలతో,పూసలతో...అలా ముగ్గులు వేసి ఉన్నారు.
పోటి వదిలేస్తే మనం మొండి రాక్షసి .....ఎలా అవుతాము?


సరే ఇప్పుడు చుక్కలు పెట్టలేము.....ఆర్ట్ వేయాలి....అది కూడా 
ముగ్గు సగంలో వదిలేసినా కొరత కనపడకూడదు.....ఇంకా 
రంగులు కూడా నింపుకుంటూ పోవాలి అని 
నిర్ణయించుకున్నాను.


మొదట సంక్రాంతి స్పూర్తి కనపడాలని మధ్యలో సూర్యుని 
వేసి రంగులు వేసాను.తరువాత దాని చుట్టూ చక్రం వేసి 
దానిపై భోగి కుండలు.....చెరుకుగడలు వేసాను....రంగులు 
వేసాను.....అంటే ఇక్కడ ఆపేసినా ముగ్గు పూర్తిగా ఉన్నట్లే 
ఉంటుంది.ఇంకా మూడు నిమిషాలు ఉన్నది.సరే గుమ్మడి 
కాయలు నాలుగు వైపులా వేసి రంగులు వేసాను......
వాళ్ళు అందరిని వెళ్లి పోమని అరుస్తూ ఉన్నారు.....
గబా గబా...నాలుగు ద్వారాలు వేయకుండా ఎలా? అని 
నాలుగు వైపులా గాలిపటాలు వేసి వాటి తోకలు ద్వారాలుగా 
మార్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు .....అని వ్రాసి వచ్చేసాను.


కిందకు వచ్చేసరికి మా చేల్లిలి ఇద్దరు కూతుళ్ళు,కొడుకు 
నా ముగ్గు చూడటానికి వచ్చి ఉన్నారు.సరే తొందరగా వెళ్ళండి.....
అని ముగ్గు ఎలా ఉంటుందో చెప్పి పంపాను(అంటే ముగ్గుకు 
నెంబర్ ఉంటుంది...పేరు ఉండదు కదా)


ఇంటికి వచ్చి నేను మావారు ఊరికి వెళ్ళటానికి సర్దుకుంటూ 
ఉన్నాము...అప్పుడు మా చెల్లి కొడుకు పరిగిస్తా వచ్చాడు....
"పెదమ్మా.....నువ్వు పోవాక ....నీకు ప్రైజ్ వచ్చింది"
నీకెలా తెలుసురా అని అడిగాను.వాడు  ముగ్గు దగ్గర నెంబర్ 
గుర్తు పెట్టుకొన్నాడు......అది జడ్జేస్ మూడవ బహుమతి 
అని వ్రాయటం చూసేసాడు......మా వారు నవ్వి .....
సాదిస్తావే తల్లి.....సరే పోయి రాపోండి......అన్నారు.
నేను పిల్లలు  ముగ్గురిని తీసుకొని వెళ్ళాను.


నిజంగానే బహుమతి వచ్చింది....చీర ...హయ్యా సూపేర్......
ఇటు తిరిగి చూసేసరికి అంత మంది జనాలలో మా వారు 
నవ్వుతూ చూస్తున్నారు.అంటే మేము రాగానే చూడాలి
అనిపించి వచ్చారు అన్న మాట.....అయితే ఇప్పుడు భలే 
తమాషా జరిగింది.


వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చిన్న విందు ఏర్పాటు చేసి 
చిన్న ప్రశ్నలు అడగటం ప్రారంబించారు....వెంటనే దానికి 
చిన్న బహుమతులు కూడా....అంటే కీ చైన్స్,పౌచేస్,
చిన్న కప్స్ ,ఇంకా వాల్ క్లోక్స్ అలాటివి.....ప్రశ్నలు  
కూడా చిన్నవె ....సూర్యుడి రధ సారధి ఎవరు? అలాగా....
ఎవరు చెప్పటంలేదు.అన్నీ నేనే చెపుతుంటే ప్రైజెస్ అన్నీ 
నాకే వస్తునాయి.అలాగా కాదు అని పిల్లలకు వచ్చినవి 
వాళ్ళ చేత చెప్పించాను.మధ్యలో అటు నుండి మా వారు 
 వీర లెవెల్ లో చెప్పి బహుమతులు సాదిస్తున్నారు.
ఇలా కాదని పాటలు పాడించి ప్రైజెస్ ఇచ్చారు.
మొత్తానికి ఇంటికి పే....ద్ద...మోపెడు 
బహుమతులు తెచ్చి ఇల్లంతా పరిచేసాము.మా వాళ్లకి 
అందరికి సంతోషమే.....ఒరె  ఇక్కడ ఇంత జరుగుతుందని 
మాకు తెలీదే.....మొత్తానికి ముగ్గు బలే పని చేసింది....
అని ఇప్పటికి నవ్వుకుంటాము.


కాబట్టి నేను చెప్పొచ్చేదేమంటే......ఒక్క చాన్సు ఏ...ప్పుడో 
వస్తుంది.....దాన్ని బయపడకుండా ఉపయోగించుకుంటే 
మంచి జ్ఞాపకాలు మిగిలి పోతాయి......

Thursday, 5 January 2012

నన్ను దోచుకుందువటే....గులేబ పుష్పం


గలాగే...గలగలగాలాగే.......
గులేబి...లేబి.....లేబి....లేబిబిబి......
ఏమిటండి?పే...ద్ద.....చెవులు మూసుకుంటున్నారు?
బిజినెస్స్ మ్యాన్ ....పాడితే వింటారా?
బిజి ఉమన్ ....పాడితే వినరా?అబ్బ ....చెవులపై 
 చేతులు తీయండి......కమ్మని కబురు చెపుతాను.....

ముందుగా....యెన్.టి.ఆర్.గారికి జై........ 

మరి యాబై ఏళ్ళు నిలవగలిగిన సినిమా దర్శకత్వం ,
నటించటం .....తెలుగువారి హృదయాలలో కలకాలం 
నిలవగలిగిన అద్భుతమైన కళా ఖండం.....నిర్మించటం.....
అప్పటికి ఎప్పటికి మాసిపోని విలువలు గుర్తు చేసుకోవటమే 
గులేబకావళి కధ  ను గుర్తు చేసుకోవటం....మన బాల్యాన్ని 
గుర్తు చేసుకోవటం,నాన్న వేలు పట్టుకొని తిరిగొచ్చిన 
పదునాలుగు లోకాలు,అస్తిపంజరం ఫైటింగ్స్,తండ్రి కోసం 
తపన,నీతికి నిలవటం.....వెరసి ఒక కాశి మజిలి కధ....
తేరపైకి ఎక్కించటం.........
నా కోసం....కధ ఇంకోసారి....
చంద్రసేన మహారాజుకి ఇద్దరు భార్యలు.
పెద్ద భార్య గుణవతి,
చిన్న భార్య రూపవతి
(పేర్లు చూడండి కధకి రిలేటెడ్ గా)
చిన్న భార్యకి ముగ్గురు కొడుకులు పుట్టినాక ,పెద్ద భార్యకి 
ఒక కొడుకు పుడతాడు.చిన్న భార్య తమ్ముడు వక్రకేతు
రాజ్యానికి అడ్డం వస్తాడని బాబుని అడవికి పంపి చంపించపోతాడు.
కాని ఆ బాబు (N.T.R) విజయుడిగా గొర్రెల కాపరికి దొరికి 
పెద్ద అవుతాడు.వాళ్ళ నాన్నకి కళ్ళు పొతే  వైద్యులు 
గులేభాకావళి పుష్పం ...తేవాలి అంటారు.
వాళ్ళ అన్నలు సాదించలేక పొతే ....విజయుడు యక్ష లోకం 
వెళ్లి సాదించుకొని వస్తాడు.కాని వాళ్ళ అన్నలు విజయుని 
మోసం చేసి పువ్వు తీసుకొని విజయుని బావిలో వేసి 
వెళ్ళిపోతారు.మళ్ళా విజయుడు యక్ష లోకం వెళ్లి ,యక్ష రాజుని 
మెప్పించి వాళ్ళ కూతుర్ని కూడా పెళ్ళాడి వస్తాడు.


మర్చేపోయా.....ముందు భూలోకంలో యుక్తిమతి అనే 
యువతిని తెలివిగా జూదంలో గెలిచి పెళ్లి చేసుకొని ఉంటాడు.
జమునతో పాటా......"నన్ను దోచుకుందువటే......

nannu dochukunduvate.....

"నా మదియే మందిరమై ...నువ్వే ఒక దేవుడివై 
 వెలసినావు నాలో....నే  కలిసిపోదు నీలో...."
బలే బాగుంటుంది.ఇది సి.నారాయణ రెడ్డి గారి తోలి గీతం.

ఇంకో పాట గూర్చి చెపుతాను...... 
"కలల అలలపైన తేలేను  మనసు మల్లె  పూవై"
విజయుడు యక్ష లోకం లోకి వెళ్ళినపుడు ,అక్కడ యక్ష 
రాజు కూతురు  నిద్ర పోతూ ఉంటుంది....మరి హీరో గారు 
ఊరుకుంటారా?ఎంచక్కా గంధం తీసుకొని నిద్ర పోయే 
ఆమె బుగ్గపై సుతారంగా వ్రాస్తారు....వెంటనే ఆమె ఈ పాట 
కల కంటుంది....(N.T.Raaa....మజాకా?)

"సడి సవ్వడి లేని నడి రాతిరి ఏమన్నది?

"చెలికాడిని ,జవరాలిని జంట కూడి రమ్మన్నది"

(ఇప్పుడు కూడా అదే రాతిరి....అదే ప్రక్రుతి...కాని 
యెంత మంది జీవితాన్ని తృప్తి గా గడుపుతున్నారు.....
శుభలగ్నం లో ఒక పాట ఉంటుంది...."మంగళ సూత్రం 
అంగడి సరుకా...కొనగలవా చేయి జారాకా...లాభం 
 ఎంతొచ్చిందమ్మా....సౌభాగ్యం అమ్మేసాకా....ఆమని ని 
చూసి అందరం ...అయ్యో అంటాము....మరి మనలను 
చూసి ఎవరు అయ్యో అనాలి?
జీవితం చేజారిపోయాక ....జీతం యెంత వస్తే ఏమి లాభం?
కుటుంభం తో కొంత సేపైనా గడపలేక పొతే ఎన్ని కాసులు 
వచ్చినా తృప్తి ఎక్కడిది?)
 అన్నీ....హృదయాన్ని తడిమే పాటలు.....స్క్రీన్ ప్లే ....
హాస్యం....ఇంకా లాస్ట్ ఫైటింగ్ లో .....యక్షిణి విమానం లో 
రావటం.....అబ్బ....పిల్లల సృజనాత్మకత యెంత విస్తరిస్తుంది....
చూడటం వలన....మళ్ళా ఆ కధను వేరే వాళ్లకు వివరించి 
చెప్పటం వలన.....
గుర్తుంచుకోండి.....పిల్లలు పాటాలు చదవటం వలన కాదు....
సృజనాత్మకత విస్తరింప చేయటం వలననే....
అప్లికేషను నాలడ్జ్ పెరుగుతుంది.....
సమస్యలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోగలరు.

మళ్ళా ఒక్కసారి...N.T.R. కి,విటలాచార్య గారికి.....జే..జెలు...
 ఈ సినిమా నేను బతికి ఉన్నా లేకున్నా....వందేళ్ళు పూర్తి
చేసుకోవాలని ఆశిస్తున్నాను......

ఇంకా నాకు బ్లాగ్ గూర్చి ఏమి తెలీకపోయినా.....
మౌస్ క్లిక్ చేయమంటే.....మా ఇంట్లో మౌస్ లు లేవండి....
అన్నా విసుక్కోకుండా.....అన్నీ ఓపికగా నేర్పించిన మిత్రులకు 
జే...జే....లు.....

Monday, 2 January 2012

రాజన్నా....నీకు నువ్వే....సాటన్నా.......



"నిగమా నిగమాంత వర్ణిత .......
పైపైన సంసార బంధముల కట్టేవు.....
సినిమాల సంగతేంటి నారాయణా..."


అలా ఒక్కో సారి మర్చిపోయి దేవుడి దగర కూర్చుని 
పాడేసుకుంటూ ఉంటాను.....ఒక మంచి రోజున మా వారు 
వినేసి నవ్వేసుకొని.....సరేపో న్యు ఇయర్ రోజు నిన్ను సినిమాకి 
తీసుకేళుతాను అనేసారు.....మాట ఇచ్చిందే మహా ప్రసాదం 
అనుకోని సాయంత్రం ఎన్ని వంకలు చెప్పినా వినకుండా
పట్టు పట్టి ...చేయి పట్టి(ఏమిటి చొక్కా బట్టా) లాక్కేళ్లి పోయాను...


ఎక్కడికా?"అమ్మా ..అవని ...నేల తల్లి....ఎన్ని సార్లు పిలిచినా 
తనివి తీరదేన్డుకని "ఈ క్షణం తలుచుకుంటే కూడా హృదయపు 
తడి కంటి పాపపై ఊరుతూ  ఉంది......


"మాట తూటా అయితే .....పాట ఫిరంగి ......
కోటి భావాలని ఒక్క పల్లవిగా ఆలపిస్తుంది...."


ఆసెంబ్లీ లో నేను పాడుదమా స్వేచ్చా గీతం .....అనగానే 
అది 750 మది గొంతుగా పల్లవించి.....
స్కూల్ యావత్తూ జులియాన్వాలా బాగ్ దురంతాల వెంట పరిగెడుతుంది....
రక్తాన్ని మరిగిస్తుంది......అదీ పాట కుండే పవర్........


కధలోకి వస్తే.....రాజన్న....తన స్నేహితులు నలుగురితో కలిసి 
బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు.....మనకు 
మొదట్లో తన సమాదినే చూపించి తన భార్యగా లక్ష్మమ్మ ని ,
తన వళ్ళో పురిటికందుగా కూతురు మల్లమ్మని ....దొరలు 
చంపటానికి తరుముతుండగా రెల్లు పొదలలలో దాక్కున్నట్లు చూపిస్తారు.పాపం ఆడ మనిషి ఎలా కాపాడగలదు బిడ్డని...
తల్లి మనసు చంపుకొని కన్నీళ్ళతో బిడ్డని నీళ్ళలో తాడి దుంగ 
పై పెట్టి వదిలేస్తుంది(అంతే ఏమిటో వెర్రి దేముడు మాకు ఇంత శక్తిని ఇచ్చి మమకారం అనే బలహీనతని పెట్టేశాడు)
దొరలూ రాజన్న మీద కసితో భార్యను కూడా తరిమి చంపేస్తారు.
అప్పుడు బిడ్డ లేదని తెలుసుకొని దొర నీళ్ళలో ఉన్న బిడ్డని 
చంపపోతే గుర్రం కింద పడేస్తే చచ్చి పోతాడు.సాంబయ్య ఆ 
బిడ్డని క్షేమంగా తీసుకొని తన మనవరాలి లాగ పెంచుతాడు.
అది చూసి లక్ష్మమ్మ ఆనందంగా దణ్ణం పెట్టి చనిపోతుంది.


పాపకి వాళ్ళ ఇంటి పక్కన ఉండే సమాది రాజన్నది అని ,
తను వాళ్ళ నాన్న అని తెలీదు.అక్కడ దెయ్యాలున్నాయి
అనిచేపుతాడు తాత(అయ్య బాబోయ్ మళ్ళా దెయ్యాల సినిమానా 
అని బయపడిపోయా) .ఆ ఊరిలో ఎవరు చదువుకోవాలన్న 
దొరసానికి చెప్పి చదువు పన్ను కట్టాలి.వాళ్ళు పన్ను కట్టటానికి 
వెళ్ళినప్పుడు దొర రాజన్న వలన చనిపోయాడని ,దొరసాని 
కోపంగా ఉంటుంది.ఎవరు చూసినా ఆమెకి "నీ కాళ్ళు మొక్త
బాంచన్"అనాల్సిందే...(నేను తెలంగాణలో ఇదే చూసాను.
వాళ్ళు హాస్టల్లో పిల్లల కు పర్మిషన్ కోసం వస్తారు....నీ కాల్మొక్త 
జరా పంపించు తల్లి అంటారు....నాకైతే ఇదేమిటి పర్మిషన్ 
కోసం కాళ్ళు మొక్కటం అని బాధ వేసేది)


అక్కడ దొర గాడీలో కులకర్ణి అనే సంగీత విద్వాంసుడు దొరసాని 
కూతురికి సంగీతం నేర్పుతుంటాడు.ఆమెకి ఏమి రాదు..కాని 
మల్లమ్మ ఒక్క సారి విని పాడేస్తుంది.....పాట వినగానే 
దొరసాని బయటకు వచ్చి మల్లమ్మ చిన్న పాప అనికూడా 
చూడకుండా కొరడాతో కొట్టేస్తుంది.....ఎందుకంటె 
రాజన్న పాటలతోనే ఫ్లాష్ బ్యాక్ లో ప్రజల హృదయాన్ని 
మరిగించి దొరలపై ప్రజలు వారే తిరుగుబాటు చేసేటట్లు చేస్తాడు.
తరువాత వాళ్ళు పన్ను ఆడవాళ్ళపై వెయ్యాలని స్నేహాని  అవమానిస్తుంటే కత్తి తీసుకొని దొర చెయ్యి నరికేస్తాడు.
(ఇక్కడ నాకు యెంత కోపం వచ్చిందంటే రాజన్న రాకుంటే 
నేనే వాడి తల నరికేయ్యలని పించింది.అది కధ మనలో దూసుకుపోయిందీ అని గుర్తు....విజిల్స్ అయితే హాల్ లో 
చెప్పక్కర్లేదు......అందరు తామే ప్రతీకారం తీర్చుకున్నట్లు 
ఫీల్ అయ్యారు....ఉంది భారతీయత ఇంకా....)తరువాత తానె 
లక్షుమమ్మ ను పెళ్లి చేసుకుంటాడు.మల్లమ్మ ను నిండు నెలలతో
ఉన్నప్పుడు ,నిజాం  దొరలూ దొంగ సమాచారం ఇచ్చి తే 
అందరు వేరే దగ్గరకు వెళ్లి యుద్ధం చేయటానికి కాచుకొని 
ఉంటారు.కాని వాళ్ళని దారి మళ్ళించి ,దొరలూ ఊరిపై దాడి
చేస్తారని తెలిసి మల్లన్న ఒక్కడే తన నలుగురు స్నేహితులతో 
కలిసి అందరిని చంపి ఉదయం వరకు కాపలా ఉండి
చనిపోతాడు.ఆ ఊరి వాళ్ళు సమాది కట్టి పూజ చేసుకుంటూ 
ఉంటారు.అబ్బ ఈ లాస్ట్ సీన్ ....అసలు ప్రతి సీన్ ఎందుకులెండి
మళ్ళా చూడాలి అనిపిస్తాయి....రక్తాన్ని మరిగిస్తాయి.....


(నాకైతే వీలయితే మళ్ళ హైదరాబాద్   dts లో చూడాలి అనిఉంది)


ఒక సీన్లో రాజన్న వాళ్ళ ఊరికి మొదట వస్తాడు ...అప్పుడే 
అమ్మ అవని పాట....ఊరి చివర ఒకామె వళ్ళో పాపను 
పడుకోబెట్టుకొని లాలి పాడుతూ ఉంటుంది.ఆమెని నువ్వు 
ఊరి చివర ఎందుకు ఉన్నావు ?అని అడుగుతాడు.
అప్పుడు ఆమె..."ఊరిమీద రజాకార్లు పడి మగోల్లను  
చంపిన్రు....ఆడవాళ్ళను.....అని వాళ్ళు ఎలా పాడు చేసింరో చెపుతుంది......(నిజమే ఆ సంఘటనలు అంత ఘోరంగానే 
 ఉంటాయి...యెంత కసి ఆడవాళ్ళలో రేగకుంటే తమ మానాలు 
అడ్డుపెట్టైనా విప్లవ కారులను కాపాడాలని అనుకుంటారు....
షర్మిలా చాను ఇంతవరకు నిరాహారంగా ఎందుకు దీక్ష 
చేస్తుంది.....చివరకి కోర్ట్ కూడా ఆడవాళ్ళు అభిమానం కోసం 
చంపామంటే శిక్ష వేయదు.....అవును ఆ ఘటనలు 
 అంత ఘోరంగా ఉండి ఉంటాయి)


తరువాత ఆమె ఒక మాట అంటుంది....అప్పుడు ఏడ్చి నిద్ర 
పోయిన బిడ్డ ఇంతవరకు కళ్ళు తెరవలేదన్నా.....అంటుంది.
అంటే ఆ బిడ్డ చనిపోయింది......అంటే హాల్ల్లో మొత్తం అందరి 
కళ్లపై కన్నీటి పొర......భాదని కమ్మేస్తూ.......


పాప కధలోకి వస్తే పాప రాజన్న బిడ్డ అని దొరసానికి 
తెలిసి ...వాళ్ళ తాతని చంపేసి పాపని ఇంట్లో ఉంచి 
కాల్చేస్తుంది.


కాని కులకర్ణి,ఊరివాళ్ళు పాపను కాపాడుతారు.
పాప డిల్లీ కి  బైలుదేరుతుందినెహ్రూ ని
కలిసి ఊరిని కాపాడాలని....అబ్బ అప్పుడు 
ఊరివాళ్ళంతా డబ్బులు వేసుకొని ఈయటం,
మట్టి తీసుకొని వెళ్ళటం,నడిచి వెళ్ళటం....
ఎంతవారినైన ఎక్కిళ్ళు పెట్టించింది పాప నటన.


తరువాత ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నెహ్రు ముందు 
పాటల పోటిలోకి పాల్గొనటానికి దొరసాని నుండి 
తప్పించుకొని వెళుతుంది.కాని అప్పటికే అందరు ఆడిటోరియం
నుండి వెళ్ళిపోతారు.అయినా బయపడకుండా
మైక్ తీసుకొని...అమ్మ అవని ...పాడుతుంది....
నెహ్రు గారితో సహా అందరు వెనక్కి వచ్చి వింటారు.
వాళ్ళ ఊరికి మేలు చేస్తాడు.


ఒక్క పాట ఏమిటి ప్రతి..పాట ...మాట...
మట్టి పరిమళాన్ని మనకు పులుముతుంది....
హృదయాన్ని తడుముతుంది......నిద్ర పట్టని 
కనుపాపలుగా మారి ఆలోచింపచేస్తుంది.


(తెలంగాణా బాష కొంచం తగ్గించారు కాబట్టి 
అందరికి అర్ధం అయింది.మూడేళ్ళు హన్మకొండ లో 
ఉన్నాను.ఆడపడుచులా ఆదరించి మా వంశాంకురాన్ని 
వడి లో  నింపి పంపారు.....తడి నిండిన తల్లి హృదయంతో 
చెపుతున్నా .....తెలంగాణా వాళ్ళు ఎక్కడున్నా సల్లగుండాలే)


ఇంకా చెప్పెడిది ఏముంది?


మనిషికి 
మట్టేంటే ఇష్టం 
బూడిద గా నైన 
దానిలో కలుస్తాడు....


రాజన్నా....కళామతల్లికి శిరసు వంచి కాల్మొక్త ....బాంచెన్.....