Thursday, 5 January 2012

నన్ను దోచుకుందువటే....గులేబ పుష్పం


గలాగే...గలగలగాలాగే.......
గులేబి...లేబి.....లేబి....లేబిబిబి......
ఏమిటండి?పే...ద్ద.....చెవులు మూసుకుంటున్నారు?
బిజినెస్స్ మ్యాన్ ....పాడితే వింటారా?
బిజి ఉమన్ ....పాడితే వినరా?అబ్బ ....చెవులపై 
 చేతులు తీయండి......కమ్మని కబురు చెపుతాను.....

ముందుగా....యెన్.టి.ఆర్.గారికి జై........ 

మరి యాబై ఏళ్ళు నిలవగలిగిన సినిమా దర్శకత్వం ,
నటించటం .....తెలుగువారి హృదయాలలో కలకాలం 
నిలవగలిగిన అద్భుతమైన కళా ఖండం.....నిర్మించటం.....
అప్పటికి ఎప్పటికి మాసిపోని విలువలు గుర్తు చేసుకోవటమే 
గులేబకావళి కధ  ను గుర్తు చేసుకోవటం....మన బాల్యాన్ని 
గుర్తు చేసుకోవటం,నాన్న వేలు పట్టుకొని తిరిగొచ్చిన 
పదునాలుగు లోకాలు,అస్తిపంజరం ఫైటింగ్స్,తండ్రి కోసం 
తపన,నీతికి నిలవటం.....వెరసి ఒక కాశి మజిలి కధ....
తేరపైకి ఎక్కించటం.........
నా కోసం....కధ ఇంకోసారి....
చంద్రసేన మహారాజుకి ఇద్దరు భార్యలు.
పెద్ద భార్య గుణవతి,
చిన్న భార్య రూపవతి
(పేర్లు చూడండి కధకి రిలేటెడ్ గా)
చిన్న భార్యకి ముగ్గురు కొడుకులు పుట్టినాక ,పెద్ద భార్యకి 
ఒక కొడుకు పుడతాడు.చిన్న భార్య తమ్ముడు వక్రకేతు
రాజ్యానికి అడ్డం వస్తాడని బాబుని అడవికి పంపి చంపించపోతాడు.
కాని ఆ బాబు (N.T.R) విజయుడిగా గొర్రెల కాపరికి దొరికి 
పెద్ద అవుతాడు.వాళ్ళ నాన్నకి కళ్ళు పొతే  వైద్యులు 
గులేభాకావళి పుష్పం ...తేవాలి అంటారు.
వాళ్ళ అన్నలు సాదించలేక పొతే ....విజయుడు యక్ష లోకం 
వెళ్లి సాదించుకొని వస్తాడు.కాని వాళ్ళ అన్నలు విజయుని 
మోసం చేసి పువ్వు తీసుకొని విజయుని బావిలో వేసి 
వెళ్ళిపోతారు.మళ్ళా విజయుడు యక్ష లోకం వెళ్లి ,యక్ష రాజుని 
మెప్పించి వాళ్ళ కూతుర్ని కూడా పెళ్ళాడి వస్తాడు.


మర్చేపోయా.....ముందు భూలోకంలో యుక్తిమతి అనే 
యువతిని తెలివిగా జూదంలో గెలిచి పెళ్లి చేసుకొని ఉంటాడు.
జమునతో పాటా......"నన్ను దోచుకుందువటే......

nannu dochukunduvate.....

"నా మదియే మందిరమై ...నువ్వే ఒక దేవుడివై 
 వెలసినావు నాలో....నే  కలిసిపోదు నీలో...."
బలే బాగుంటుంది.ఇది సి.నారాయణ రెడ్డి గారి తోలి గీతం.

ఇంకో పాట గూర్చి చెపుతాను...... 
"కలల అలలపైన తేలేను  మనసు మల్లె  పూవై"
విజయుడు యక్ష లోకం లోకి వెళ్ళినపుడు ,అక్కడ యక్ష 
రాజు కూతురు  నిద్ర పోతూ ఉంటుంది....మరి హీరో గారు 
ఊరుకుంటారా?ఎంచక్కా గంధం తీసుకొని నిద్ర పోయే 
ఆమె బుగ్గపై సుతారంగా వ్రాస్తారు....వెంటనే ఆమె ఈ పాట 
కల కంటుంది....(N.T.Raaa....మజాకా?)

"సడి సవ్వడి లేని నడి రాతిరి ఏమన్నది?

"చెలికాడిని ,జవరాలిని జంట కూడి రమ్మన్నది"

(ఇప్పుడు కూడా అదే రాతిరి....అదే ప్రక్రుతి...కాని 
యెంత మంది జీవితాన్ని తృప్తి గా గడుపుతున్నారు.....
శుభలగ్నం లో ఒక పాట ఉంటుంది...."మంగళ సూత్రం 
అంగడి సరుకా...కొనగలవా చేయి జారాకా...లాభం 
 ఎంతొచ్చిందమ్మా....సౌభాగ్యం అమ్మేసాకా....ఆమని ని 
చూసి అందరం ...అయ్యో అంటాము....మరి మనలను 
చూసి ఎవరు అయ్యో అనాలి?
జీవితం చేజారిపోయాక ....జీతం యెంత వస్తే ఏమి లాభం?
కుటుంభం తో కొంత సేపైనా గడపలేక పొతే ఎన్ని కాసులు 
వచ్చినా తృప్తి ఎక్కడిది?)
 అన్నీ....హృదయాన్ని తడిమే పాటలు.....స్క్రీన్ ప్లే ....
హాస్యం....ఇంకా లాస్ట్ ఫైటింగ్ లో .....యక్షిణి విమానం లో 
రావటం.....అబ్బ....పిల్లల సృజనాత్మకత యెంత విస్తరిస్తుంది....
చూడటం వలన....మళ్ళా ఆ కధను వేరే వాళ్లకు వివరించి 
చెప్పటం వలన.....
గుర్తుంచుకోండి.....పిల్లలు పాటాలు చదవటం వలన కాదు....
సృజనాత్మకత విస్తరింప చేయటం వలననే....
అప్లికేషను నాలడ్జ్ పెరుగుతుంది.....
సమస్యలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోగలరు.

మళ్ళా ఒక్కసారి...N.T.R. కి,విటలాచార్య గారికి.....జే..జెలు...
 ఈ సినిమా నేను బతికి ఉన్నా లేకున్నా....వందేళ్ళు పూర్తి
చేసుకోవాలని ఆశిస్తున్నాను......

ఇంకా నాకు బ్లాగ్ గూర్చి ఏమి తెలీకపోయినా.....
మౌస్ క్లిక్ చేయమంటే.....మా ఇంట్లో మౌస్ లు లేవండి....
అన్నా విసుక్కోకుండా.....అన్నీ ఓపికగా నేర్పించిన మిత్రులకు 
జే...జే....లు.....

12 comments:

శేఖర్ (Sekhar) said...

చిన్నపుడు చూసాను ....ఆ గులేబకావళి పుష్పాలు నిజం గానే ఉన్నాయేమో ...దొరికేతే బాగుండు అనుకునేవాడిని....ఊహ తెలియని రోజులు...కాని నాకు ఇప్పుడూ గురుతున్న సినిమా...

సుభ/subha said...

నేను కూడా జై.. మీరు చెప్పిన విధానానికి తర్వాత ఆ సినిమాకి..

మందాకిని said...

శశికళ గారు,
నాకెప్పుడూ అనిపించేది ఈ పేరుకి అర్థం ఏమిటో...అని. పాటలు రేడియో లో విన్నాం. కానీ ముందుతరం సినిమాలన్నీ చూడలేదు. గుండమ్మకథ, సీతారామ పట్టాభిషేకం లాంటి సినిమాలు మళ్ళా ఒకసారి విడుదలైతే మా నాన్నగారు తీసికెళ్ళి చూపించారు. ఇపుడు కథ తెల్సింది కాబట్టి డివిడి కొని చూడాలి. ఇప్పటి పిల్లలు చూడగలిగితే బాగుంటుంది.

శశి కళ said...

శెఖర్ వీలైతె మళ్ళా చూడూ...ఈ సారి జ్ఞాపకాలుగా
ఆ పూలు దొరుకుతాయెమొ...


సుభ గారు మీకు కూడా జై...


అవును మందాకిని గారు,పొయిన యెండా కాలం శెలవలలొ మా పిల్లలకు కొని చూపించాను.థాంక్యు

హరే కృష్ణ said...

jaI SASI garu
jai ntr
jai vitalacharya

శశి కళ said...

అండీ కి జై....థాంక్యు

రాజ్ కుమార్ said...

అందరికీ జేజేలు..
నేనెప్పుడో చిన్నప్పుడు చూశా.. కొంచెం కొంచేమ్ గుర్తుందీ
నాకో డౌట్.. గులేబకావళి అంటే ఏంటీ? ;) ;)
(రామాయణం అంతా వినీఈఈఈఈఈఈఈఈఈ)

వనజ వనమాలి said...

గుళేభకావళి కథ బాగుంటుంది..మీరు చెప్పింది బాగుంది. నాకు ఇంకా అదనంగా మన" అన్నగారు " వేసుకున్న హారాలు బాగా నచ్చాయి. ఎక్కడ దొరుకుతాయో కనుక్కోండి.

రాజి said...

మంచి సినిమాని గురించి చక్కగా చెప్పారండీ.
నన్ను దోచుకుందువటే పాట చాలా బాగుంటుంది.
ఈ పాటలొ జమున చాలా అందంగా వుంటుంది.

శశి కళ said...

raj...thank u...
vanaja gaaru,raaji gaaru..thank u

kiran said...

హిహి బిజినెస్ woman గారు...లాభాలు మాకు కూడా......పంచుతారా :D
పంతులమ్మ అనిపించుకున్నారు..చక్కగా కథ వర్ణిస్తూ..

kallurisailabala said...

నేను కూడా జై...నేను కూడా జై...