Saturday 28 January 2012

తెలుగోడు....తెలు"గ్గోడు"....

ఈ రోజు పేపర్ తెరవగానే....పాపం రాజా గారు 
(మ్యుజికాలిజిస్ట్)బాపు గారికి పద్మ అవార్డ్ రాకపోయినందుకు 
బాధపడుతూ వ్రాసిన అభిప్రాయం చూసాను .
తమిళియన్స్ లాగా మన తెలుగు వాళ్ళు మన వాళ్ళ 
గూర్చి అందరికి చెప్పుకోరు.....
అందుకే మన వాళ్ళ గూర్చి ఉత్తరాది వాళ్లకు తెలీటం
 లేదు అని చెప్పారు.....నాకు నిజమే 
అనిపించింది......ఎందుకంటె తమిళనాడు మా పక్కనే 
కదా....సరే తెలుగు బ్లాగ్ గుర్తు గా మన పేరు పక్కన 
ఆయన బొమ్మే పెట్టుకుందాము అనుకున్నా....ఒక్క 
సారి ఇంతకూ ముందు రాసిందే పబ్లిష్ చేస్తూ....
జై....బాపు గారు.....


పరిమళాల విరి 
నవరసాల ఝరి
మనసులోని ఆనంద లహరి 
మునగాలనిపించెను మరీ మరీ.......


కన్నయ్య బుగ్గ మీద నునుపు 
అలిగిన కన్నె కళ్ళ ఎరుపు 
చిన్ని పెదాల మధ్య విరుపు
జిగి బిగి అల్లికతో జడ చరుపు 

 

బుడుగు అల్లరి అల్లిక 
రాధ గోపాలాల ప్రేమ మల్లిక
విరహిణి అయి గోపిక 
ప్రేమామృత ధారలలో మునుగునిక...



భూమిపై పరిచిన రంగుల హరివిల్లు 
వేసవి లో తాకిన మల్లెల జల్లు 
ఎంత వర్ణించిన మిగులు 
బాపు బొమ్మల సొగసులు......


ఏంటమ్మా?ఎక్కడికో వెళ్ళిపోయావుఅంటారా?
అవునండి స్వర్గ లోకపు అంచుల దాక వెళ్ళిపోయాను.
ఏంటి అక్కడ నుండి దూకి చావు అంటారా?అనలేదా?
నాకు వినపడిందే.....క్రాస్ టాక్ అయుంటుంది......

బాపు గారి నకల్లు ,ఫోటో లు చూస్తేనే ఇలా అయిపోయానే 
ఇంక ఒరిజినల్స్ చూస్తే ఇంకేమవుతానో ...అయ్యబాపూ ఓయ్ ......
హైదరాబాద్ లో 4,5,6,june నెలలో ఒరిజినల్స్ exbhisition 
అంట.చూసి తరించు పోండి.నీకేమమ్మా నువ్వు కూడా చూడు 
పోయి అంటారా ,మేమెంత దూరం లో ఉన్నాము మాకెక్కడ 
వీలవుతుంది?అంత అదృష్టం ఉండొద్దా?

నీకే కాదమ్మా మాకు కూడా బాపు బొమ్మలు ఇష్టమే 
అంటారా?మా బంగారాలే ....(ఇలా అంటే ఏదో ఫిట్టింగ్ పెడతానని 
మా ఇంట్లో వాళ్లకి తెలుసు ,మీకు తెలీదు కదా)
పోండి...పోండి...పోయి ఆ కళని కళ్ళ నిండా నింపుకొని 
కలం లో కూర్చి అక్షరాలుగా మార్చి ఆ అమృతం తో మీ 
బ్లాగ్ లు ముంచేయండి.ముంచగానే నాకు ఒక మెసేజ్ 
కొట్టండి నేను కూడా ఆస్వాదిస్తాను.మీ ఇల్లు బాపు బొమ్మగాను......
ఎంత చక్కగా రాసారండి...అని కామెంట్ కూడా వ్రాస్తాను.


6 comments:

ఫోటాన్ said...

బాగుంది శశి గారు ... మీ ఇల్లు బాపు బొమ్మ గానూ... :))

శశి కళ said...

thank u poton gaaru...anta kante mahaa bhaagyamaa...cheppandi

రాజ్ కుమార్ said...

మీ ఇల్లు బాపు బొమ్మగాను......
ఎంత చక్కగా రాసారండి...

నైస్ పోస్ట్... బాపు గారికి పద్మశ్రీ ఇచ్చుంటే చాలా బాధ పడేవాడిని ;) థాంక్ గాడ్.

శశి కళ said...

రాజ్..అలా కొరుకొకూడదు....మన తెలుగు వాళ్ళు యెప్పుడు గొప్పగా ఉండాలి

PALERU said...

శశికళ మేడం గారు...

ఆలోచింపజేశారుగా..!!... ఏదైతేనేమి మీ శైలి అద్భుతం అండి...

జైభారత్ said...

బాపుని మించిన చిత్రకారుడు ఈ ప్రపంచలో లేడు...ఒక్క... ఎం.ఎఫ్ హుస్సేన్ తప్ప.అవార్డులు వస్తే వాటికి గౌరవం పెరుగుతుంది..అంతే ..బాపుకి కాదు..