ఎవరు?కళ్ళు విప్పార్చుకొని.....కళ్ళు నులుముకొని
మరీ చూసాను....శ్రీ కాళహస్తి లో జ్ఞాన ప్రసూనాంబా
దర్శనానికి గర్భగుడి లోకి వెళుతున్నాము అందరం.
ఎదురుగా అవధాని "మేడసాని మోహన్"గారు వెలుపలికి
వస్తున్నారు.ఆయనను ఇంటర్లో నేను తెలుగు అసోసియేషన్
లో ఆఫీస్ బెరేర్ గా ఉన్నప్పుడు చూసాను.అప్పుడు ఆయన చేత
అవధానం జరిపించాము మా కాలేజ్ లో.అప్పటినుండి
అవధానం అన్నా ,ఆయన అన్నా చాలా గౌరవం నాకు.
వెంటనే అక్కడ ఉన్న గార్డ్ ను "ఆయన ఎందుకు వచ్చారు"
అని అడిగాను.ఈ రోజు ఉగాది కదా ....కవిసమ్మేళనం
జరుగుతుంది.(2009 విరోధి నామ ఉగాది) అంతే పిల్లల ఆకలి
మా ఆయనకు వదిలేసి ....రయ్యన .....కవి సమ్మేళనానికి
వెళ్ళిపోయాను.(అప్పుడప్పుడు ఈయన అలా గాలిపటం లా
నన్ను వదిలేస్తారు.......నా కిష్టమైన వాటికోసం)
మొదటి లైన్లో కూర్చున్నాను.....మేడసాని గారు నిర్వహణ
చేస్తున్నారు.....ఒక్కొక్కరో కవితలు చదువుతున్నారు.....
విశేషణాలు,పదవిరుపులు ......కొత్త పల్లవములతో పోటీ
పడుతున్నాయి......(ఈయన పాపం ప్రసాదాలు కొనుక్కొచ్చి
పిల్లల ఆకలి తీర్చే పనిలో ఉన్నారు).....నాకైతే సంతోషం
ఉప్పొంగిపోతుంది......నా ముందు వరుసలో దేవస్థానం
పాలక మండలి వారు కూర్చుని ఉన్నారు(అప్పుడు నాకు
చైర్ మాన్ శాంతరాం పవార్ గారు అని తెలీదు)
అప్పుడు వచ్చింది ఒక ఆలోచన.....ఒక్క చాన్సు ఎందుకు
ఉపయోగించుకోకూడదు .....అంతే ఒక కవిత వ్రాసేసి
ముందు కూర్చున్న వాళ్ళని పిలిచాను...."ఏమ్మా?"
అన్నారాయన...."సార్ నేను ఒక కవిత చదవొచ్చా?
నాకు మేడసాని గారి ముందు ఒక కవిత చదవాలని ఉంది"
అన్నాను...."దానికేమమ్మా"అని వెళ్లి ఆయనతో
నన్ను చూపించి ఏదో చెప్పారు.నేను వెళ్లి నిలుచున్నాను.
(ఇక్కడ మా వారికి ఏమి జరుగుతుందో తెలీక
బుర్ర గోక్కుంటున్నారు)
అప్పుడు మేడసాని గారు నన్ను సభకు పరిచయం చేస్తూ
"శశి గారు ఈ రోజు కవిత చదవటానికి ఇక్కడకు వచ్చారు.
నేను ఇన్ని రోజుల నుండి కవిసమ్మేళనాలు నిర్వహిస్తున్నాను....
కాని ఇక్కడ ఎప్పుడు మహిళలు రాలేదే అనేది కొరతగా
ఉండేది...సాక్షాత్తు ఆ జ్ఞాన ప్రసూనాంబ ఈమెను పంపించింది
అనుకుంటున్నాను"అన్నారు(అలా అనటం ఆయన
నిర్వహణలో భాద్యత కావొచ్చు....కాని నాకు భలే సంతోషం
వేసింది)
తరువాత అందరు చాలా శ్రద్ధగా నా కవిత వినటమే కాక
చందన మాలతో,ఈశ్వరుని శాలువాతో వారందరితో
పాటు నన్ను కూడా సత్కరించారు......ఇక ఆ చందన కర్పూర
వాసనలతో ఆ జ్ఞాపకం.....మా అందరిలో నిలిచి పోయింది.
ఆ ఒక్క చాన్స్ వచ్చినపుడు నేను భయపడి ఉంటె.......
సంక్రాంతి కాబట్టి .....ఇంకో సంక్రాంతి జ్ఞాపకం పంచుకుంటాను.
2011 సంక్రాంతి ముందు ఆదివారం
నగలు కొనాలని నెల్లూరికి వెళ్ళాము.
నగలు కాబట్టి జాగ్రత్త కావాలని
మా వారు కూడా తోడు వచ్చారు.
అక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లి తనను
తీసుకొని షాపింగ్ కి వెళ్ళాలి.అక్కడ నాకు ఒక కాగితం దొరికింది.దానిలో యేముందంటే ఆ రోజు
మధ్యాహ్నం మా చెల్లి వాళ్ళ పక్కన గల సత్రం లో
మూడు నుండి...ఐదు గంటల వరకు ముగ్గుల పోటి అని
వ్రాసిఉంది.వెంటనే వాళ్లకు ఫోన్ చేసి నా పేరు నమోదు
చేసుకున్నాను.నగల షాపింగ్ అయ్యేటప్పటికి నాలుగున్నార
అయింది.మా వారి ఇంకేమి పోతావులే అన్నారు.
అయినా పటు వదలని ముగ్గిణి ......లా ముగ్గు,రంగులు
తీసుకొని బయలుదేరాను.వాళ్ళు ఆశ్చర్యంగా చూసారు.
ఇంకా పదిహేను నిమిషాలే ఉంది అని......అయినా వేస్తాను
అన్నాను.సరే అన్నారు వాళ్ళు.చాలా మంది వెళ్లి పోతున్నారు.
ముందు ఒక్క నిమిషం చుట్టూ చూసాను.వాళ్ళు చాలా
ఏర్పాట్లతో పూలతో,పూసలతో...అలా ముగ్గులు వేసి ఉన్నారు.
పోటి వదిలేస్తే మనం మొండి రాక్షసి .....ఎలా అవుతాము?
సరే ఇప్పుడు చుక్కలు పెట్టలేము.....ఆర్ట్ వేయాలి....అది కూడా
ముగ్గు సగంలో వదిలేసినా కొరత కనపడకూడదు.....ఇంకా
రంగులు కూడా నింపుకుంటూ పోవాలి అని
నిర్ణయించుకున్నాను.
మొదట సంక్రాంతి స్పూర్తి కనపడాలని మధ్యలో సూర్యుని
వేసి రంగులు వేసాను.తరువాత దాని చుట్టూ చక్రం వేసి
దానిపై భోగి కుండలు.....చెరుకుగడలు వేసాను....రంగులు
వేసాను.....అంటే ఇక్కడ ఆపేసినా ముగ్గు పూర్తిగా ఉన్నట్లే
ఉంటుంది.ఇంకా మూడు నిమిషాలు ఉన్నది.సరే గుమ్మడి
కాయలు నాలుగు వైపులా వేసి రంగులు వేసాను......
వాళ్ళు అందరిని వెళ్లి పోమని అరుస్తూ ఉన్నారు.....
గబా గబా...నాలుగు ద్వారాలు వేయకుండా ఎలా? అని
నాలుగు వైపులా గాలిపటాలు వేసి వాటి తోకలు ద్వారాలుగా
మార్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు .....అని వ్రాసి వచ్చేసాను.
కిందకు వచ్చేసరికి మా చేల్లిలి ఇద్దరు కూతుళ్ళు,కొడుకు
నా ముగ్గు చూడటానికి వచ్చి ఉన్నారు.సరే తొందరగా వెళ్ళండి.....
అని ముగ్గు ఎలా ఉంటుందో చెప్పి పంపాను(అంటే ముగ్గుకు
నెంబర్ ఉంటుంది...పేరు ఉండదు కదా)
ఇంటికి వచ్చి నేను మావారు ఊరికి వెళ్ళటానికి సర్దుకుంటూ
ఉన్నాము...అప్పుడు మా చెల్లి కొడుకు పరిగిస్తా వచ్చాడు....
"పెదమ్మా.....నువ్వు పోవాక ....నీకు ప్రైజ్ వచ్చింది"
నీకెలా తెలుసురా అని అడిగాను.వాడు ముగ్గు దగ్గర నెంబర్
గుర్తు పెట్టుకొన్నాడు......అది జడ్జేస్ మూడవ బహుమతి
అని వ్రాయటం చూసేసాడు......మా వారు నవ్వి .....
సాదిస్తావే తల్లి.....సరే పోయి రాపోండి......అన్నారు.
నేను పిల్లలు ముగ్గురిని తీసుకొని వెళ్ళాను.
నిజంగానే బహుమతి వచ్చింది....చీర ...హయ్యా సూపేర్......
ఇటు తిరిగి చూసేసరికి అంత మంది జనాలలో మా వారు
నవ్వుతూ చూస్తున్నారు.అంటే మేము రాగానే చూడాలి
అనిపించి వచ్చారు అన్న మాట.....అయితే ఇప్పుడు భలే
తమాషా జరిగింది.
వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చిన్న విందు ఏర్పాటు చేసి
చిన్న ప్రశ్నలు అడగటం ప్రారంబించారు....వెంటనే దానికి
చిన్న బహుమతులు కూడా....అంటే కీ చైన్స్,పౌచేస్,
చిన్న కప్స్ ,ఇంకా వాల్ క్లోక్స్ అలాటివి.....ప్రశ్నలు
కూడా చిన్నవె ....సూర్యుడి రధ సారధి ఎవరు? అలాగా....
ఎవరు చెప్పటంలేదు.అన్నీ నేనే చెపుతుంటే ప్రైజెస్ అన్నీ
నాకే వస్తునాయి.అలాగా కాదు అని పిల్లలకు వచ్చినవి
వాళ్ళ చేత చెప్పించాను.మధ్యలో అటు నుండి మా వారు
వీర లెవెల్ లో చెప్పి బహుమతులు సాదిస్తున్నారు.
ఇలా కాదని పాటలు పాడించి ప్రైజెస్ ఇచ్చారు.
మొత్తానికి ఇంటికి పే....ద్ద...మోపెడు
బహుమతులు తెచ్చి ఇల్లంతా పరిచేసాము.మా వాళ్లకి
అందరికి సంతోషమే.....ఒరె ఇక్కడ ఇంత జరుగుతుందని
మాకు తెలీదే.....మొత్తానికి ముగ్గు బలే పని చేసింది....
అని ఇప్పటికి నవ్వుకుంటాము.
కాబట్టి నేను చెప్పొచ్చేదేమంటే......ఒక్క చాన్సు ఏ...ప్పుడో
వస్తుంది.....దాన్ని బయపడకుండా ఉపయోగించుకుంటే
మంచి జ్ఞాపకాలు మిగిలి పోతాయి......

25 comments:
బహుమతులు నాకే వచ్చినంత సంబరంగా ఉంది...
హలో .........చాలా బగుందనండి!
దిని తరువయి భాగంలొ చాన్స్ క్రీయేట్ చెయ్యడం ఏలాగో చెప్పండీ........ pzzzzzzzzzz
మీరొక కవయిత్రి..
ఒక ముగ్గిణి
ఒక బ్లాగరి.. ఇంకా...ఇంకా చాలా అన్నమాట.
ఆ కవితా, ముగ్గూ ఫోటోలు లేవా శశిగారూ??
సంక్రాంతి శుభాకాంక్షలు.. ;)
I liked this post very much...ur write up's becoming addictive's...keep up...
I am not blessing :p
"God" bless u
Wow !Very Nice Sasi gaau !
Keep rocking with tons of success in future too !
చాలా మంచి ప్రోత్శాహ పూర్వక బహుమతులు అందుకున్నారు. ప్రైజ్ గెలుచుకున్నామా..లేదా అన్నది సంగతి కాదు. అంతర్గతంగా ఉన్న నైపుణ్యం..బహిర్గతం కావడమే కావాలి. చాలా సంతోషం.. అభినందనలు. మంచి జ్ఞాపకం పంచుకున్నారు.ఆనందం.
జ్యొతి గారు మీరిలా నా సంతొషం పంచుకొవటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది....థాంక్యు
అనానమస్ గారు థాంక్యు....
రాజ్,,,,ఇంకా కవిత వ్రాస్తె అందరు పారిపొతారని వ్రాయలెదు
శెఖర్ ...థాంక్యు
sraaaaaaaaaavya..thanku soooooo much
మీరు వ్రాసిన్ది చదివితె ఇంకా హుషారు వచ్చెస్తుంది
వనజ గారు....అవును...నెను అదె పిల్లలకు చెపుతూ ఉంటాను
వావ్ చాలా బాగుందండీ.. నిజంగా మీరు రాసినది చదువుతుంటే మేం కూడా మీతో పాటు ఆ ప్రదేశాల్లో ఉండి మీ సంతోషాన్ని పంచుకున్నట్లు అనిపించింది.
కాబట్టి నేను చెప్పొచ్చేదేమంటే......ఒక్క చాన్సు ఏ...ప్పుడో
వస్తుంది.....దాన్ని బయపడకుండా ఉపయోగించుకుంటే
మంచి జ్ఞాపకాలు మిగిలి పోతాయి......
WoW!
Claps Sasi garu
Wishing very best of the luck!
హృదయపూర్వక అభినందనలు.
శ్రీకాళహస్తిలో అమ్మవారు భ్రమరాంబికా దేవి కాదు. జ్ఞానప్రసూనాంబికా దేవి.
బాగుందండీ మీ ఉత్సాహం. వెళ్ళిన చోటల్లా మీకే బహుమతులన్నమాట.
>>>> రాజ్,,,,ఇంకా కవిత వ్రాస్తె అందరు పారిపొతారని వ్రాయలెదు
భయం లేదు. మీరు ఆ కవిత ఇక్కడ వ్రాయండి. నేను బ్లాగు ముఖం లో కాపలా కాస్తాను...... దహా
venu,thanks for sharing my happiness
andy....claps for u also
అనానమస్ గారు మంచి విషయం గుర్తు చెసారు థాంక్యు
బులుసు గారు....మీరు కాపలా ఉంటారా?
స.ద.హా....అంటె సంతొష దరహాసం...థాంక్యు
విజయ మొహన్ గారు....థాంక్యు
ఆ సమయంలో మీరు ఎంత సంబరపడి ఉంటారో ఆ సంబరం అంతా మీ పోస్ట్ లో తెలుస్తోంది.
ఆ కవితా, ముగ్గూ ఫోటోలు కావాలి అని డిమాండ్ చేస్తున్నాం
nice one andi......
కాబట్టి నేను చెప్పొచ్చేదేమంటే......ఒక్క చాన్సు ఏ...ప్పుడో
వస్తుంది.....దాన్ని బయపడకుండా ఉపయోగించుకుంటే
మంచి జ్ఞాపకాలు మిగిలి పోతాయి......keka
మీరు రచ్చ...రచ్చ... :)
పోస్టు కేక...
multi talented మీరు... ..!!!
ఎన్ని బహుమతులోఒ ....అబ్బో..సూపరు :)
sailu,kiran,hanoo gaaru..andariki thank u
మీరు సూపరండీ.. నైస్ జ్ఞాపకమ్స్.. :)
ముందస్తుగ సంక్రాంతి శుభాకాంక్షలు..
భలే చెప్పారండీ...నాకు భలే మొహమాటం...ప్రతీదానికి వెనకాల నుంచి ఎవళ్ళో తొయ్యాలి...మీలంటి వాళ్ళని చూస్తే బోల్డు అసూయ నాకు...:)
మీ బ్లాగు ఇవాళే చూడటం..శైలబాల గారి బ్లాగురోలు లో చూసి వచ్చా...ఇంక చూడాలి మీ పాత టపాలన్నీ
స్పురిత గారు మీరు చాలా బాగా యెంకరెజ్ చెసారు
థాంక్యు
గిరీష్ గారు థాంక్యు
@శశి గారు మొట్ట మొదటి సారి ఉక్కు గాలిపటం గురించి వింటున్నాను అదేనండి దానినే "నిశ్చయం,పట్టుదల" అంటారు . అది మీలో మెండు . చాలా బాగుంది ఛాన్స్ వచినప్పుడు తీసేస్కోవాలి మళ్ళి మళ్ళి రాదు నిజమే బాగుందండి .
thanks for ur encouragement kalyan gaaru
Post a Comment