Wednesday 18 July 2012

స్నేహానికి యెంత విలువ....

స్నేహానికి యెంత విలువ ఉంది నిజంగా అందుకే
ఆద్యాత్మికత లో కూడా  దాన్ని అంత బలపరచారు.

ఒక నాటకం లో పోర్శియా  అంటుంది"దయ అనేది
వానలా మెల్లగా స్వర్గం నుండి కురుస్తుంది.అది
ఇచ్చిన వాళ్లకి,స్వీకరించిన వాళ్లకి కూడా సంతోషం
కలిగిస్తుంది " అని.......

స్నేహం  కూడా అంతే.ఎందుకో కొందరిని చూస్తె కొత్తగా
అనిపించదు.పై పెచ్చు ఎన్నో రోజుల నుండి వాళ్ళను
ఎరిగినట్లు ఉంటుంది.

ఇప్పుడే పరమహంస యోగానంద వారి విదేశాలలో చెప్పిన
ప్రసంగాల వ్యాస సంపుటి చదివాను.యెంత చక్కగా ఉందొ
స్నేహం గూర్చి.....

మచ్చుకి కొన్ని.....
''ఎవరి పట్ల అయినా నీకు దివ్యాకర్షణ కలిగితే వారితో స్నేహం చెయ్యండి.
ఏదో పూర్వ జన్మలో వారు మీకు స్నేహితులై ఉంటారు''

''హృదయపూర్వకంగా బేషరతు అయిన ప్రేమను వ్యక్తం చేసే
అవకాశాలు కల్పించటానికి అయన స్నేహితుల రూపంలో
వస్తాడు''

''నేను అందరికి మిత్రున్ని...నా శత్రువులకు కూడా...
అని చెప్పే స్తితి నీలో రావాలి''

''స్నేహం కోసం మీ కోరిక తగినంత ఉంటె ,మీతో ఆద్యాత్మిక అనుసంధానం
కలిగిన వ్యక్తీ దక్షిణ ద్రువం వద్ద ఉన్నా స్నేహం అనే అయస్కాంత
శక్తి మీ ఇద్దరినీ ఒక చోటికి ఆకర్షిస్తుంది''

ఇలాగే ఎన్నో మంచి విషయాలు.....చదవండి.....కొన్ని ఇస్తున్నాను.







10 comments:

Ramani Rao said...

"స్నేహం కూడా అంతే.ఎందుకో కొందరిని చూస్తె కొత్తగా
అనిపించదు.పై పెచ్చు ఎన్నో రోజుల నుండి వాళ్ళను
ఎరిగినట్లు ఉంటుంది."

స్నేహం విలువ అంతే నండి.. కొత్తగా పరిచయమయ్యారు అనిపించదు యుగ యుగాల పరిచయం లా ఉంటుంది వివరిస్తున్నది అద్దం మన స్నేహానికి అర్థం. నేను నీలాగ నువు నాలాగ కనిపించడమే సత్యం.. అన్నట్లు.. స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే..

oddula ravisekhar said...

స్నేహం గురించి చక్కనివాక్యాలు.అలగే నా బ్లాగులో స్నేహం గురించి వ్యాసాలు వ్రాస్తున్నాను.చదవగలరు.

oddula ravisekhar said...

స్నేహం గురించి చక్కనివాక్యాలు.అలగే నా బ్లాగులో స్నేహం గురించి వ్యాసాలు వ్రాస్తున్నాను.చదవగలరు.

జలతారు వెన్నెల said...

Sneham meeda Tapaa baagundi sasi gaaru

శశి కళ said...

అవును రమణి గారు మన స్నేహం లాగా ...ఒక్క మాట తో ఎంతగా కలిసిపోయ్యాము.అది మీ మంచి మనసు కూడా అనుకోండి

శశి కళ said...

రవి శేఖర్ గారు,శారద గారు వెల్కం.


వెన్నెల థాంక్యు)))

the tree said...

nice one.

మాలా కుమార్ said...

స్నేహం విలువ గురించి బాగా చెప్పారు .

భారతి said...

ఇంతకాలం మీ బ్లాగ్ని మిస్ అయినందుకు బాధగా అన్పించిన, ఇప్పటికైనా చూసినందుకు ఆనందంగా ఉంది.
మంచి విషయాన్ని ప్రస్తావిస్తున్నందుకు ధన్యవాదాలండి.

శశి కళ said...

భారతి గారు మీ బ్లాగ్ చూస్తె నాకు అలాగే సంతోషంగా అనిపించింది.థాంక్యు అండి