రెండక్షారాలు ఎంత తియ్యగా ఉన్నాయి.....
సుఖం లోనే కాదు .....కష్టం లో తలుచుకుంటే కూడా
ఇంతకూ ముందు ''తెలుగు మహా సభలు''గూర్చి వ్రాసినపుడు
ఈ పోస్ట్ వ్రాస్తాను అని చెప్పాను.
ఇప్పటికి వీలు అయింది.ఎందుకంటె అమ్మ అంటే పదాల కూర్పు కాదు....
ఆత్మీయతల పేర్పు.
అమ్మ అనే పదం నా జీవితం లో పుటింది నేను పుట్టినాకే కదా ....
అమ్మ అంటూ ఉంటుంది ''శశి నువ్వు పుట్టింది నాకు తెలీదు
ఒక రకమైన మగత లోకి వెళ్లాను.నువ్వు పుట్టాక లేపారు అని.''
మరి ఎందుకు అలాగా నాకు తెలీదు.కాని అప్పుడు పెట్టాల్సిన కష్టం అంతా
నా అల్లరితో పెళ్లి వరకు పెట్టేసాను.
నాకు తెలిసి భారతదేశంలో విలువలేనిది ఏమిటంటే అక్కడ
పుట్టిన ఆడపిల్ల.అందులో రెండో పాప అంటే అసలు పట్టించుకోరు.
కాని అమ్మ నాకు చక్కని పేరు పెట్టడమే కాక ఎవరైనా పూర్తి పేరు
వ్రాయకపోయినా ఒప్పుకోదు.మొత్తం పేరు ''శశి కళ''అని వ్రాయి.
అప్పుడే కళ గా ఉంటుంది అంటుంది.
అక్షరం అంటే క్షరం కానిది.అది అన్ని కోణాలలో అమ్మ ఇచ్చే జ్ఞానం
కూడా....అదే ఈ రోజు నా ఎదుగుదల కింద ఉన్న బలం.
అమ్మ నేర్పిన జ్ఞానం నాకు ఉహ తెలిసి వినాయక చవితితోనే ....
మా అమ్మ పిల్లలు అందరిని కూర్చోపెట్టి ,పుస్తకాలు ఆయన
ముందు ఉంచి శ్లోకాలు మా చేత పలికిస్తూ ,ఒక్కో పత్రీ వేయిస్తూ
పూజ చేయించేది.మరి ఊరికినే పలికేస్తే నేను ఎలా అవుతాను?
ఆమె మొదలు పెడుతుంది''శుక్లాం భరధరం''
నేను ''చుక్లాం బలదలం ''ఆమె ''విష్ణుం''నేను''విషుం''
ఆమె ''శశి వర్ణం''నేను.....హయ్య నా పేరు నా పేరు అని యెగిరి
గంతులు.నీ పేరే లెమ్మ పలుకు.''శశి అంటే స్వచ్చమైన తెలుపు''
మంచిగా అలా ఉండాలి అని బతిమిలాడి పూజ చేయించేది.
అలా శ్లోకాలతో నాలుక తిరిగే దాక వల్లే వేయించేది.
తరువాత అక్షర జ్ఞానం .....మా ఇంట్లో చిన్న పిల్లల పుస్తకాలు
''చందమామ''''బుజ్జాయి''''బాల జ్యోతి''ఇలా సమస్త
పుస్తకాలు మా నాన్న కొనేవారు.ఆయనకు నిద్రపోయే ముందు
చదువుతూ దిండు కింద పెట్టుకొని నిద్ర పోయేవారు.నాకు ఇప్పటికీ
అదే అలవాటు.
ఆ పుస్తకాలు చూసే వాళ్ళం.రంగు రంగు బొమ్మలు...గుర్రాలు,
రాక్షసులు,రాకుమార్తెలు...ఇలాగ....మరి మాకు చదవడం రాదు.
ఇంక ఎవరు శరణు....అమ్మే....
'అమ్మా అమ్మా చెప్పమ్మా''అని తిరిగే వాళ్ళం.అయితే మీరు
అక్షరాలు గుర్తుపట్టి చెపితే చెపుతాను అనేది.ఇంక చేసేదేమీ లేదు.
చచ్చినట్లు గుర్తు పట్టి కూడి కూడి చదివేవాళ్ళం.అప్పుడు ఆ కధ అక్కడ ఉన్న దానికి
మించి చెప్పి ఊహా లోకం లో తిప్పుకొచ్చేది.ఆ వర్ణనలో మేము ఎక్కడ
ఉండేది మర్చిపోయేవాళ్ళం ...
అయ్యో అప్పుడే అయిపోయిందా అని నిరాశ,బెలూన్ లో
గాలి తీసేసినట్లు.....అక్క,తమ్ముడు,చెల్లి నలుగురం ...అమ్మ అందరికి
అన్నం కలిపి ముద్దలు పెట్టేది....ముద్దలతోటి కధలు,కొన్ని సార్లు కధ సగం
చెప్పి తరువాత ఏమి అవుతుందో చెప్పండి అనేది.
మా చెల్లి మరీ చిన్న పాప, కాని మేము పోటీలు పడి
ఊహించి చెప్పేవాళ్ళం.ఇక బడికి వెళ్ళే తరుణం.
(తరువాత ఈ కధలు అల్లే జ్ఞానం తో హై స్కూల్ కి వెళ్ళినాక
బొమ్మల పుస్తకాలకు కధలు పంపెదాన్ని....అందుకే అంటారు
ఏదైనా చిన్నప్పుడే రావాలి అని)
బడి అంటే .....నేను బడికి వెళ్ళలేదు.స్కూల్ కి వెళ్లాను.
అవును మా ఊరిలో ఒక రెడ్డి గారి అమ్మాయి కోసం
ఒక బుజ్జి స్కూల్ ఒక ఆంగ్లో ఇండియన్ మేడం,వారి భర్త ఉండేవాళ్ళు .
మేడం ఎప్పుడూ గౌన్స్ వేసుకునే వాళ్ళు.వాళ్లకు సహాయంగా
కుమారి టీచర్.అసలు ఆ స్కూల్ లో ఎంత మంది పిల్లలు అనుకుంటున్నారా?
నేను మా పెదనాన్న పిల్లలు ఇద్దరు ఇంకో ఐదారుమంది బయట పిల్లలు.
నా కే.జి.అయ్యేసరికే స్కూల్ మూసేసారు.అప్పుడు కుమారి మేడం
మళ్ళా స్కూల్ లాంటిది పెట్టి మమ్మల్ని లాక్కోచ్చింది.తరువాత
హై స్కూల్ మామూలు జెడ్.పి.స్కూల్ లో.
ఒకటి రెండు తరగతులు అంతా ఇంగ్లీష్.అమ్మను ఒప్పచెప్పించుకోమంటే
ఆమెకు రాదు.ముందు నా దగ్గర చదవడం నేర్చుకొని ఒప్పచెప్పించుకునేది.
నేను ఒకటో తరగతి లోనే మా అమ్మమ్మకు లెటర్ వ్రాసాను,
అడి చూసి మురిసిపోయింది.ఏ చిన్న మంచి విషయం చేసినా భలే
ప్రోత్సహిస్తుంది.ఎక్కడ సైకాలజీ నేర్చుకుందో.....
ఇంకా ఎన్ని పోస్ట్లు ఉన్నాయో....అమ్మ నేర్పించిన విషయాలు వ్రాస్తే
అందుకే ఇంకో పోస్ట్ వరకు సశేషం :)
ఒక్కసారి మీ అమ్మని తలుచుకొని,మీ బుడి బుడి అడుగులు చూసి మురిసిపోయిన
అమ్మను తలుచుకోనినవ్వుకోండి వారాంతం లో....
అంత కన్నా మనకు తృప్తి ని ఇచ్చేది ఇంకేది లేదు .

5 comments:
అమ్మనూ మరచిపోలేము .... అమ్మతో బాల్యం జ్ఞాపకాల ఆనందాలను మరచిపోలేము. బాగుంది పోస్టు.
వీర లైకు ఈ పోస్టుకు :)
పల్లా అన్నయ్య థాంక్యు
నాగార్జున గారు థాంక్యు
ఈ పోస్ట్ చదివాకా నాకు అనిపిస్తోంది
అమ్మ ని దేని నుంచి కూడా వేరు చేయలేము కదా
అమ్మ అంటే బాల్యం
అమ్మ అంటే అక్షరం
అమ్మ అంటే చందమామ
అమ్మ అంటే బాలజ్యోతి
అమ్మ అంటే ఒక రాజు ఏడుగురు కొడుకులు కధ
అమ్మ అంటే లాలి పాట
ఇంకా చాల చాల
అన్ని శశి అక్క పోస్ట్ లో కనిపించాయి.
మీ అమ్మ గారికి నా తరపున నమస్కారాలు తెలియచేయండి.
shaila thank you very much
Post a Comment