Thursday 7 March 2013

మహిళ....ఆకాశం లోనే కాదు ఇలలో కూడా సగమే

నాకు ఎప్పుడూ ఈ రోజు గుర్తుకు వచ్చే ఒకే పేరు 
''ఝాన్సి లక్ష్మి బాయి'' ........ఇంత  కన్నా మహిళలో 
ఒక సమాజం ఏమి ఆశించగలదు.

చురకత్తి లాంటి చూపు,భార్యగానే కాక మంత్రి గా కూడా 
రాజ్య పాలనా నిర్ణయాధికారం,అందర్ని ఓదార్చి నీడన చేర్చుకొనే 
ప్రేమ,ఏ రోజు స్వార్ధం వైపు అడుగేయ్యని భారతీయత....అన్నిటికి మించి 
మగవాళ్ళు కూడా  ఎదిరించి నిలవడానికి భయపడే బ్రిటీష్ వారి ముందు 
కత్తి  దూసి ముందుండి ....ఇది మా రాజ్యం అని వేసిన పోలి కేక....
స్వాతంత్ర సంగ్రామానికే శంఖ ద్వనిలాగా....
అదిగో ఆ తెగువ కావాలి,ఆ నిస్వార్ధత కావాలి,ఎవరిని అడుక్కోకుండా 
ఇవి మావి అని సాధికారంగా గర్జించగల గొంతు కావాలి.

ఎలా ఉండగలరు వీళ్ళు తమకు కుటుంభం కూడా సమాజం తరువాతే అని,
ఎలా ప్రశించగలరు వీళ్ళు నువ్వు చేసేది తప్పు అని లోకాన్నేలే వాళ్ళను అయినా,
ఎలా పోరాడగలరు వీళ్ళు తమ చివరి ఊపిరి దాకా......
ఎక్కడ నుండి వస్తుంది వీళ్ళకి ఆ శక్తి?నిస్వార్ధంగా ఉండటంవలననా,
పూల సున్నితత్వం వలననా?సమాజం కూడా మనలాంటి మనుషులే 
అనే ప్రేమ వలననా ?
అన్నేళ్లు గృహ నిర్భంధం లో ఉంచినా ఒంటరిగానే ఎదుర్కొని 
మాకు ప్రజాస్వామ్యం కావాలి అని నినదించిన ''అంగసాసూచీ''

తనిఖీల పేరుతొ మా శరీరాలను తడిమే అధికారం లేదు అని 
మహిళల కోసం అన్న పానీయాలు మానేసిన ''ఇరోమ్షర్మిలా ''
పన్నెండేళ్ళ క్రితం ఏ గొంతుతో స్తిరంగా చెప్పిందో అదే గొంతుతో 
ఈ రోజు కూడా కోర్ట్ కి చెప్పింది ''నేను ఆత్మహత్య చేసుకునేంత 
పిరికిదాన్ని కాదు.చట్టాలు మమ్మల్ని గౌరవించేలా మారితే 
నేను నోటి ద్వారా ఆహారం తీసుకుంటాను''అని.....పెళ్లి లేదు,
సుఖం లేదు,చివరికి అన్నం లేదు......ట్యూబ్ గుండా వెళ్ళేది ఆహారం 
.........ఏమి చచిపోతే కాని ఈ దేశం లో సానుభూతి రాదా?
ఒక ఎర్ర బొట్టు ముఖపుస్తకం లో తనకు సప్పోర్ట్ గా 
ఎందుకు పెట్టలేకపోయాము?

నా బ్లాగ్ తరుపున వీళ్ళ ఇద్దరినీ తలుచుకుంటూ 
శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.

నా బుజ్జి ప్రపంచం లో నేను గమనించే ఇంకో వ్యక్తీ ''వై.ఎస్.భారతి''
గారు.రాజకీయాలు నాకు తెలీవు.కాని భర్త దూరంగా ఉన్నప్పుడు 
పిల్లలను సముదాయించడం మన గుండె పచ్చిపుండు లాగా 
 ఉన్నప్పుడు నాన్న గూర్చి ఆరా తీసే పిల్లల మాటలు 
ములుకులై పొడవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు.

ఇక అత్తగారి వైపు వాళ్ళని చూసుకోవడం,కుటుంభానికి 
మచ్చ రాకుండా చూసుకోవడం,ఆర్ధిక వ్యవహారాలూ .....
నిజం ఇవన్నీ ఒక పరిపూర్ణ మహిళ
మాత్రమె చెయ్యగలదు.చాలా మంది పారిశ్రామిక వేత్తలు 
చేసి చూపించారు కూడా.కాని రాత్రి అయ్యేసరికి 
మన పక్కన ఖాళీ లేకుండా స్ఫూర్తి తో నింపి 
ముందుకు నడిపే భర్త ఉంటె ఆ ధైర్యం వేరు.
ఆ ఖాళీ ,ఆ స్పర్శ ఇచ్చే ధైర్యం ఒకరితో చెప్పుకోగలిగినది కాదు.

రెప్పల చాటున కన్నీళ్లు దిగమింగుకొని అందరి ముందు 
ధైర్యం వహించడం సామాన్యం కాదు.
గమనిస్తున్నాను.ఇంతకు  ముందు కంటే సర్క్యులేషన్ 
పెరిగింది,ఫీచర్స్ చక్కగా ఉంటున్నాయి.
ఒకే మూసలో వెళ్లడం లేదు.
చక్కగా చేసే ఉద్యోగులు ఉంటె అదేమీ పెద్ద విషయం అనుకోవచ్చు.
కాని ఎంత మంచి ఉద్యోగులు ఉన్నా నేర్పుతో,ఓర్పుతో అందరిని 
ఒక తాటి మీదకి  తెచ్చే నైపుణ్యం లేకుంటే ఏ బండి ముందుకు కదలదు.
తను ఇంతే చక్కగా జీవితాన్ని నడుపుకుంటూ అందరికి ఆదర్శం 
కావాలి అని ఆశిస్తునాను.

శత్రువు భార్య అయినా ''సోదరా''అని పిలిస్తే పసుపు కుంకుమలతో 
గౌరవించే సంస్కృతీ మనది.
అటువంటి పసుపు కుంకుమ లు నా బ్లాగ్ తరుపున వీరి అందరికి 
కానుకగా ఇస్తున్నాను.

3 comments:

రాజ్యలక్ష్మి.N said...

మహిళలలు మీ కానుక బాగుంది శశికళ గారూ..
మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..

జలతారు వెన్నెల said...

Title enta baagundo, writeup koodaa ante baagundandi sasi gaaru. Happy women's day!

శశి కళ said...

వెన్నెల గారు ఎక్కడకి వెళ్లారు.ఇక్కడ ప్లసర్స్ అందరు మీకోసం ఎదురు చూపులు.
మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

రాజి మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు