Thursday, 19 January 2012

నేను...."కెవ్వు"టివిటి.....

కేవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్.......ఇలాగే అరిచాను....
వెంకటేష్ రివ్యూ రెస్పాన్సు చూసి.....

సరే నేను కెవ్వు మనిపించిన నా చిన్నతనపు 
క్రియేటవిటి .....కూసింత మీకు చూపిద్దాము అనుకున్నా....

మొన్న బోగి పండుగ రోజు మా అక్క ఫోన్ చేసింది.
ఎవరితో ఉన్నానో  చెప్పుకో అని.....మళ్ళా తనే చెప్పింది 
తన చిన్నప్పటి స్నేహితురాలితో ఉన్నాను అని.....
ఆ అక్క నాతొ మాట్లాడింది.గొంతులో సంతోషం కనిపిస్తూ 
ఉంది నాకు."శశీ....ఎలా ఉన్నావు?ఎలా ఉంది నీ క్రియేటివిటీ?

అంతే రయ్యుం...రయ్యుం....మా చిన్నతనానికి వెళ్లి పోయి 
వాళ్ళను కెవ్వు మనిపించిన .....క్రియేటివిటీ ....చెప్పి ఒకటే 
నవ్వు.....

మా అక్క ఫ్రెండ్స్ అందరికి నేనంటే 
భలే ఇష్టం.నేను ఏమి చేసిన నవ్వుకుంటారు.
నాకు మా అక్కకి రెండు ఏళ్ళు
 తేడా.వాళ్ళలో కొంత మంది 
నాకు కొలీగ్స్ గా కూడా ఉన్నారు.
మేడం అన్నా వాళ్ళని ఒప్పుకోరు.
వాళ్లకి నేను యెంత ఇష్టం అంటె...
నేను ఇప్పటికి ఏదైనా అవార్డ్ లేదా
మంచి పని చేస్తే వెంటనే నా బుగ్గపై 
తడి తుడుచు కోవాల్సిందే....
అంత ఇష్టం వాళ్లకి.

నేను సైకిల్ నేర్చుకున్నా,గ్రీటింగ్స్ చేసినా,
ముఖ్యంగా  నేను పరీక్షలు వ్రాసే పద్దతి ఇప్పటికి 
చెప్పుకొని నవ్వు కుంటారు.మరి నాకు ఫస్ట్ రావటం 
అంటె తెలీదు.అందుకని అందరికంటే ముందే రాసి వచ్చేదాన్ని.
అక్కా వాళ్ళు అడిగితె నేనే ఫస్ట్ వచ్చాను...అని 
చెప్పేదాన్ని.నాకొచ్చిన కాఫీలో చక్కేరేసినన్ని మార్కులు 
(అంటె ముప్పై ఐదు)చూసి ఇదాఆఆఆఆఅ....ఫస్ట్ 
రావటం అని కేవ్వుమనేవాళ్ళు(వాళ్లకు రాలేదని కుళ్ళు)

ఇక పదవ తరగతికి వచ్చినాక చూడాలి.స్కూల్ లో ఆడపిల్లలు 
మాత్రమే ఉంటారు కాని ట్యూషన్ లో మగ పిల్లలు కూడా 
ఉండేవారు.అందరిలోకి మేమే చిన్న(మేము అంటె 
మా పెదనాన్న కొడుకు ,నేను,మరి రెండు ఏళ్ళు ముందు 
గెంతేము కదా)

ఆడపిల్ల ల లైన్ లో చివర నేను కూర్చుంటే ,నా పక్కన 
మా తమ్ముడు కూర్చునేవాడు .(వీడికి నేను అంటె యెంత 
ఇష్టం అంటె శెలవలకి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 
కాకుండా నాతొ కావలికి వచ్చేవాడు.)

ఇప్పుడు టీచెర్ గూర్చి చెప్పాలి.ఆయన ఇంగ్లిష్,మ్యాథ్స్ 
చెప్పేవారు.ప్రతి ఆదివారం ఒక పరీక్ష.ఆ రోజు అందరికి 
గుండెల్లో బుల్ డోజేర్స్ పరిగెత్తేవి(అదెలా?అని అడగొద్దు)
అప్పుడే దిద్దేసి ఈత బెత్తాలతో .....డిషా...డిషా.....ఎలా 
కోడతాడండి రాక్షసుడు(చనిపోయారు కాబట్టి దేవుడు)

నన్ను అప్పటి దాకా మా నాన్నను చూసి  కొట్టేవాళ్ళు 
కాదు.ఈయన అలా కాదు నేను ఏడవకుండా మొండికి 
పడితే ......ఎడ్చేదాకా కొట్టేవాడు.

సరే ఇంగ్లీష్ "కెవ్వు"గూర్చి చెపుతాను.ఒక రోజు ఆయన 
పాటం చెపుతుంటే నేను ఒక పదం అర్ధం అడిగాను.....
అది అడగ కూడదని నాకేమి తెలుసు....అక్క వాళ్ళు అంతా
కేవ్వ్వవ్వ్వ్......అయినా అదేమీ పెద్ద పదం కాదు ఇప్పటి 
రోజుల్లో.....హనీ మూన్ ....అంటె నాకేమి అర్ధం కాలేదు...
అదే అడిగాను.ఇంకా బ్లాక్ మనీ ఇలాటివి .....బోల్డు 
అడిగి నా "కెవ్వు"టివిటి ఆయనకు చూపించేదాన్ని.

ఇక లెక్కల్లో అయితే నా జవాబులు చూసి ఆ సార్
ఎన్ని సార్లు కేవ్వుమనేవారో.....అసలు అలా సాల్వ్ 
చెయ్యాలని నీకెలా అనిపించింది తల్లీ....అని తల పట్టుకునే 
వారు(మరే ఈ దేశం లో అంతే....శ్రీనివాస రామానుజన్ 
గారిని ఎవరు గుర్తించారు?)అసలు ఆ జవాబులు ఎలా 
సృష్టించానో అర్ధం అయ్యేసరికి ఆయనకు తల నొప్పి 
వచ్చేసేది.....మళ్ళా చూస్తె అన్నీ కరక్టే......

ఎందుకు తల్లి "ముక్కు ఇలా ఉందని చూపించకుండా 
తల చుట్టూ వేలు తిప్పి ముక్కు పై ఉంచి చూపిస్తావు"
అనేవాళ్ళు.మా అక్కా వాళ్ళు తంటాలు పడి నా మ్యాథ్స్ 
క్రియేటివిటీ అనర్ధం చేసుకొని ......కెవ్వు మనే వాళ్ళు.....
నీ బుర్ర లోకి ఎలా వస్తాయే ఇలాంటి అవిడియాలు.....
నీళ్ళలో వడియాలు వేగించినట్లు.....అని నవ్వి దగ్గరికి 
తీసుకొనే వాళ్ళు.

హూ.....ఎలాగైతేనేమి.....పబ్లిక్ పరీక్షలు వ్రాసాను.అప్పుడే 
మా అక్క కూడా సీనియర్ ఇంటర్ వ్రాసింది.అందరు ఎలా 
వ్రాసావమ్మా?అని అడిగితె లెక్కల్లో 99 అని చెప్పేసాను.
(మరి మా అక్క అప్పటికే కాంపోజిట్ మ్యాథ్స్ లో 98 
తెచ్చుకొని ఉంది)

హమ్మయ్య రిజల్ట్స్ వచ్చేసాయి....కాని చూడాలంటే 
న్యూస్ పేపర్స్ ఏవి?ఎమైనాయంటే ....కోటకు వచ్చే 
పేపర్స్ అన్నీ ఎవరో ఎత్తుకెళ్ళి పోయారంట....అందులో 
అక్కవి ,నావి ఇద్దరి రిజల్ట్స్ ఒకే రోజు వచ్చాయి.
కాని ఇంకెలా?ఎవరో ఒక్క పేపర్ సంపాదించి తెచ్చారు.
ఊరంతా దానిలో రిజల్ట్స్ చూసారు.(పెద్ద కష్టం లేదు 
లెండి....ఊరంతటికి ఐదుగురు పాస్స్ అయితే గొప్ప)

ఇద్దరికీ ఫస్ట్ క్లాస్స్.....ఇక మా నాన్నని అందరు 
పోగిడేసారు.....(అంటె ఆడపిల్లలని చదివించిన 
సంస్కర్త కదా....మరి అప్పట్లో అదే  గొప్ప )

అనీ బాగున్నాయి కాని .....నా లెక్కల మార్కులే.....
దిద్దిన అయ్యోరు నాకు దొరకాలి.....కేవ్వుమనిపించేస్తా....

ఎమైందా.....నా క్రియేటివిటీ తట్టుకోలేక ......నేను చెప్పిన 
99 ని ....ఆయన క్రియేటివిటీ తో.....తలకిందులు చేసేసాడు...

11 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

super.. super..super..

శశి కళ said...

థాంక్స్ వనజ గారు

Sunita.R said...

మీకు నిజంగానే మంచి క్రియేటివిటీ వుందండీ. చక్కగా రాస్తున్నారు... ధన్యవాదాలు...

వేణూశ్రీకాంత్ said...

హహహ "కెవ్వు"టివిటి బాగుందండీ :-))

Kalyan said...

@శశికళ గారు కెవ్వ్ కాదు కేజీ లెక్కన కేవ్వ్వ్వవ్ మనిపించారు....చిన్నప్పుడు నాకు ఓ సందేహం వచ్చింది టీవీ చూస్తుంటే ఏంటంటే టైటిల్స్ ఎలా తెరను అంటి పెట్టుకోనున్నాయి అని.. ఏమైనా జిగురు వాడుతార లేక పలకపైన రాసి పట్టుకుంటార అని ... మంచి వేల ఎవ్వరిని అడగలే అడుగుంటే నా గువ్వా గుయ్య్యయ్య్య్యి మనేదేమో మీ కేవ్వ్వ్వవ్ లాగ... ఈ సందేహాలు ఎప్పటికి మంచివే ... అలాగే కొనసాగించండి ...

kiran said...

హహహ....
మీరే ఎప్పుడు ఫస్ట్ వస్తున్నందుకు కంగ్రాట్స్..!! :D :D ..అసలు మీరు మీ creativity గురించి మళ్లీ మాకు చెప్పాలా..ఏంటి?

శశి కళ said...

సునీత గారు....మీ ఎంకరెజ్మెంట్ కు థాంక్యు



కళ్యాన్ గారు...మీరు కూడా కెవ్వ్వ్వ్వ్వ్వ్..అన్న మాట...థాంక్యు


కిరణ్,వెణు థాంకులు....

రాజ్ కుమార్ said...

.మరి నాకు ఫస్ట్ రావటం
అంటె తెలీదు.అందుకని అందరికంటే ముందే రాసి వచ్చేదాన్ని.>>

ఈ సంగతి తెలీక కష్టపడి చదివీ, రాసీ చివరాఖర్న వచ్చేవాడిని.
అంటే మీకు లెక్కల్లో 99 వచ్చేయా? హౌ?

శశి కళ said...

రాజ్...బాగా చదువు 99 తలకిన్దులుగా వచ్చిన్ది అన్నాను...అంటె ఎంత?

Unknown said...

Akka super...wonderful..kevvulu...wow...excellent...ika nee istam...post gurinchi nenu cheppalenu kani netopatu kevvu manamante ready mari start cheddama???

శశి కళ said...

శైలు...రెడి స్టార్ట్....కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్