Wednesday 25 January 2012

బుల్లి మట్టి ఇల్లు.....చిన్న పొదరిల్లు.....

"మా ....వీడు నువ్వు పాట పాడితే కాని లేవడంట.....
నువ్వే వచ్చి నిద్ర లేపు....నీ పాట పాడినా కూడా 
అమ్మ గొంతు లాగా లేదు అంటున్నాడు"....చెప్పింది పాప.


ఇంక అయినట్లే ......వాడికి  కాలేజ్ కి టైం అవుతుంటే 
నేను ఇంకా పాట పాడి లేపాలంటే ఇక ఎప్పటికి రెడీ అవుతాడు....

మరి ఈ పాట కధ ఏమిటి?అంటారా......వాళ్ళ చిన్నప్పుడు 
రాత్రి పూట చేతిపై ఇద్దరినీ పడుకోబెట్టుకొని వాళ్ళు 
కలల లోకం లోకి జారిపోయే దాకా....
వాళ్ళ ఊహా శక్తిని పదునెక్కిస్తూ ....
అక్కా తమ్ముడు..... కష్టాలు వస్తే ఒకరికి ఒకరు.... 
భయం లేకుండా ఎదిరించటం.....ఇలా ....
కధలలోకం లో వాళ్ళను తిప్పుకోచ్చేదాన్ని.

వాటిలో వాళ్లకు నచ్చిన రెండు కధలు  ఉండేవి....

వీళ్ళను నిద్ర లేపే పాట ఒక చిన్న మేక కధ
లోది.....అందులో ఒక మేకకి బుజ్జి పిల్లలు ఉంటాయి....అది అడవికి వెళ్ళే టపుడు 
వాత్రిని తలుపు వేసుకోమని తను పాట 
పాడితేనే తీయమని చెప్పేది....తోడేలుకు 
దొరక కూడదని...ఆ పాట ఏమిటంటే.....
(కొంచం మార్చాను)


మా బుజ్జి పిల్లలు .....బంగారు పిల్లలు.....నిద్ర లేవండి....
మీ అమ్మ వచ్చింది....పాలు తెచ్చింది....అని పాడి 
ఒకటి నుండి పది  వరకు అంకెలు లెక్క పెట్టె దాన్ని....
ఎవరు వచ్చి నన్ను తాకితే (కళ్ళు తెరవక పోయినా పర్లేదు)
వాళ్ళను ఎత్తుకుంటాను.....మిగిలిన వాళ్ళు చేయి పట్టుకొని 
నడిచి రావాల్సిందే.....ఇద్దరు పరిగేట్టేవాళ్ళు....నేను ముందు
అంటూ.....

(ఇప్పుడు అంటే గొంతు....
నిద్ర పొయెవాళ్ళను  కూడా 
బయపెడుతుందికాని అప్పుడు 
బాగా పాడేదాన్ని)

కధలో తొడెలు ఆ పాట వినేసి ....
గొంతు మార్చి పాడేస్తుంది...
లోపలి వెళ్లి అన్ని పిల్లలను మింగేస్తుంది......
పాపం బుజ్జి పిల్ల దాక్కొని 
వాళ్ళ అమ్మ వస్తే ఏడుస్తూ అంతా చెప్పేస్తుంది....
అప్పుడు ఏమవుతుంది?.......ఏమిటి మీకు కూడా కధ 
నచ్చెసిందా?.....

మేక తొడెలును  షికారుకు తీసుకొని పోయి ....
మనం మంట పై నుండి దూకుదాము అని దూకుతుంది.....
అదేమో బాగా దూకేస్తుంది...
కాని తోడేలు దూకలేక మంటలో పడి దాని పొట్ట పగిలి పోయి 
పిల్లలు క్షేమంగా వస్తాయి.....అదెలా?అంటారా...
అదంతే కల్లా కపటం తెలీని పిల్లలకు కధలు చెప్పెటపుడు  
సుఖాంతమే చెయ్యాలి.....
లేకుంటే వాళ్ళు కలల  దుప్పటి కప్పుకొని హాయిగా 
నిద్రపోరు......

మరి అదే పాటా ఇప్పుడు కూడా పాడతాను....మంచి నిద్ర నుండి 
లేపాల్సి వస్తే......పది లెక్క పెట్టె లోగా లేవక పొతే ఏమవుతుంది అంటారా?ఏమి లేదు కేస్ వాళ్ళ నాయన కోర్ట్ కి వెళుతుంది....
అక్కడ నో.....బుజ్జగిమ్ప్స్.....ఓన్లీ.....లా అండ్ ఆర్డర్.....

ఇంకో కధ కావాలా....మా బంగారాలే.....మీకు కూడా 
కదల పిచ్చి పట్టిందా......
ఇంకో మంచి కధ పాప-తెల్లని కొంగలు.....

ఒక అక్క తమ్ముడు ఉంటారు....వాళ్ళ అమ్మ వాళ్ళు
పనికి వెళ్లి నపుడు మాంత్రికురాలి కొంగలు వచ్చి 
తమ్ముడిని ఎత్తుకేలుతాయి.ఆ పాప వాడిని వెతుకుకుంటూ వెళితే 
పాల హల్వా నది,యాపిల్ చెట్టు,రొట్టెల పొయ్యి ఆమెను 
తమ దగ్గర ఉన్నవి తినమంటాయి.ఆమె నాకు ఇష్టం లేదు 
తినను అంటుంది.కాని మాంత్రికురాలి నుండి తమ్ముడిని 
తెచ్చెటపుడు ....కొంగల నుండి తమ్ముడిని కాపాడటానికి 
ఆమెకు ఇష్టం లేక పోయినా అవన్నీ తింటుంది.అవన్నీ 
వాళ్ళను కాపాదుతాయి ....అబ్బో....ఏమి సస్పెన్సు....
పిల్లలు నోరు తెరుచుకొని వినాల్సిందే.....ఇప్పటికి కూడా.....

ఇప్పుడెందుకు ఇయ్యన్ని?

వేణు శ్రీకాంత్ గారి కోసం......తనేమో వాళ్ళ అమ్మని గుర్తు 
చేసుకోవటానికి ఏదో ఒకటి రాస్తాడు.....నాకేమో హృదయం 
ఎలాగో అయిపోతుంది....ఏమి చేసేది?

ఏ పిల్లలు తన తల్లిని పిలిచినా ....తల్లి తన పిల్లల తలపులు 
గుండెకు హత్తుకుంటుందేమో.....

వేణు....ఏ తల్లి అయినా తన తలపుల స్పూర్తి తో 
బిడ్డ ఎదగాలని అనుకుంటుంది......అది సాదించి 
ఆ బిడ్డ నిలిచినపుడు....తన వొడిలో వోదగాలనుకుంటుంది....

కలల లొకం  నువ్వు గెలిచి 
అమ్మ బిడ్డ గా నువ్వు నిలిచి 
ప్రపంచానికి సాయ పడితె.......
అదే తనకు నివాళి......
ధన్యవాదాలంటుంది తనకు.....జనావళీ....


ఈ పోస్ట్ రాత్రి వ్రాసాను....ఉదయాన్నే మా పాప పరిగిస్తూ 
వచ్చింది....సాక్షి పేపర్ చేతిలో పట్టుకొని......అమ్మా...అమ్మా....
అంటూ....."ఎమ్మా?"అని అడిగాను......
"మేము నార్వేలో పుట్టక పోవటం మంచిది అయింది"అంది.

ఎందుకంటారా.....వాళ్ళు అక్కడ పుట్టి ఉంటె నేను వాళ్లకు 
ఇప్పటికి పాడే లాలి పాటలకు,చేతి ముద్దలకు.....ఎప్పుడో 
వాళ్ళను ప్రభుత్వం  వాళ్ళు లాక్కెళ్ళి పోయేవాళ్ళు.....
ఏమిటీ? అంటారా?చదవండి.....మళ్ళ సాయంత్రం వచ్చి 
పోస్ట్ కంటిన్యు చేస్తాను.....మరి స్కూల్ లో నా స్పూర్తితో 
మనసు వెలిగిన్చుకోవటానికి 750 మంది వెయిటింగ్ అక్కడ.....
ఓస్లో: స్థానిక చట్టాల ధాటికి కన్నబిడ్డలకు దూరమై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎన్నారై జంట సాగరిక, అనురూప్‌లకు ఎట్టకేలకు ఊరట లభించబోతోంది. ప్రస్తుతం నార్వే చైల్డ్ వె ల్ఫేర్ సర్వీసెస్ కస్టడీలో ఉన్న వీరి పిల్లలు రెండున్నరేళ్ల అభిజ్ఞాన్, ఆర్నెల్ల పసికందు ఐశ్వర్యలను అనురూప్ సోదరుడు అరుణభాస్‌కు అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. నార్వేలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధి, నార్వే మున్సిపాలిటీ, చైల్డ్ కేర్ సర్వీసెస్, తల్లిదండ్రులు సాగరిక, అనురూప్‌లమధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది. కోర్టు వెలుపల కుదిరిన ఈ ఒప్పందాన్ని కోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. దీని ప్రకారం పిల్లల్ని అరుణ్‌భాస్ తనతోపాటు కోల్‌కతా తీసుకొచ్చేస్తారు. ఆ పిల్లల బాగోగుల్ని ఇకపై ఆయనే చూడాలి. ఇందుకు అరుణ్‌భాస్ అంగీకరించారని ఒప్పందం పేర్కొంది. నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ కూడా ఇందుకు అంగీకరించింది. సాగరిక, అనురూప్‌లకు తల్లిదండ్రులుగా ఆ పిల్లల్ని కలుసుకునేందుకు మాత్రమే హక్కులుంటాయి. నార్వే కుటుంబ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూస్తుంటుందని ఒప్పందం పేర్కొంది. పిల్లల బాగోగుల గురించి అడిగినప్పుడల్లా ఆ శాఖకు సమాచారం అందించాల్సిన బాధ్యత అరుణ్‌భాస్ కుటుంబానిదే. అభిజ్ఞాన్, ఐశ్వర్యల సంక్షేమంపై మన ప్రభుత్వం తరఫున రాయబార కార్యాలయం గ్యారంటీ ఇచ్చింది. అరుణభాస్ నార్వే వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల్ని మన ప్రభుత్వం భరిస్తోంది.

తల్లిదండ్రులిద్దరూ పిల్లలకు చేత్తో ఆహారం తినిపిస్తున్నారని, తమతోపాటు మంచంపై నిద్రపుచ్చుతున్నారని, వారికి కొనిచ్చిన ఆటబొమ్మలు కూడా వయసుకు తగ్గట్టుగా లేవని.. ఇలా చేయడం పిల్లలను సరిగా పెంచకపోవడం కిందికొస్తుందని పేర్కొంటూ అభిజ్ఞాన్, ఐశ్వర్యలను వారినుంచి నార్వే అధికారులు వేరుచేసి శిశు సంక్షేమ కేంద్రాల్లో చేర్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం వారిద్దరూ 18 ఏళ్ల వయసు వచ్చేవరకూ అక్కడే పెరగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఏడాదికి రెండుసార్లు గంటచొప్పున మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలతో దిగ్భ్రాంతిచెందిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్పగించమంటూ ఆరు నెలలుగా కోర్టుల్లో పోరాడుతున్నారు. తమ వీసా గడువు ఈ మార్చితో ముగియబోతుండటంతో వారిలో ఆందోళన రెట్టింపయింది. ఎందుకంటే, ఆ తర్వాత పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడం మరింత క్లిష్టంగా మారుతుంది. తాజా ఒప్పందం పిల్లల బాధ్యతను తమకు అప్పగించకపోయినా వారిద్దరూ నార్వే చెరనుంచి బయటపడుతున్నారని, తమకు అది చాలని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము ఇక్కడికొచ్చాక పిల్లల్ని దగ్గరుంచుకోవడంలో ఎలాంటి సమస్యా ఉండబోదని విశ్వసిస్తున్నారు.
HAPPY REPUBLIC DAY.......BYE.....

13 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

వేణూశ్రీకాంత్ గారు ,
అమ్మల మనసు కదిలించారుగా, అమ్మలేకుండా మరోయేడు నేనూచదివా. ఏమీ రాయలేకపోయా. మంచి కొడుకు యొక్క ముద్దుల తల్లి దీవనలు మీకెప్పుడూ ఉంటాయి.
శశికళ గారు, మీ బ్లాగులో స్థలం వాడినందుకు మన్నించాలి. ఇలా ప్రత్యేకంగా వ్రాసి మీరు నన్ను వ్రాయించారు.

ఫోటాన్ said...

చాలా బాగుంది శశి గారు,.. :)

రాజ్ కుమార్ said...

చాలా చాలా బాగా రాశారు శశిగారూ..
ఆ కధలు పూర్తిగా చెప్తూ పోస్ట్ వేయ ప్రార్ధన.
చివర్లో..మనసు బరువయ్యిపోయింది..

Kalyan said...

@శశికళ గారు అమ్మ ప్రేమకు సాటి లేదు అని చెప్తూ బిడ్డలుగా మన బాద్యతను గుర్తు చేస్తూ చక్కగా కధలు చెప్పేసి బుజ్జిగా టపా పెట్టేసారు... " బిడ్డ గా నువ్వు నిలిచి ప్రపంచానికి సాయ పడితె..." చాలా బాగా వివరించారు .... అ తల్లి దీవెనలు అందరికి వుండాలని కోరుకుంటూ మీకు మరియు మన స్నేహితులందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు ...

రాజ్యలక్ష్మి.N said...

"వేణు....ఏ తల్లి అయినా తన తలపుల స్పూర్తి తో
బిడ్డ ఎదగాలని అనుకుంటుంది......అది సాదించి
ఆ బిడ్డ నిలిచినపుడు....తన వొడిలో వోదగాలనుకుంటుంది"

చాలా బాగా రాశారు శశిగారూ..

వేణూశ్రీకాంత్ said...

Sooo Sweet of you చాలా బాగుందండీ. Thanks for the post. ఈ చివరి లైన్స్ మరీ బాగున్నాయ్...

కలల లొకం నువ్వు గెలిచి
అమ్మ బిడ్డ గా నువ్వు నిలిచి
ప్రపంచానికి సాయ పడితె.......
అదే తనకు నివాళి......
ధన్యవాదాలంటుంది తనకు.....జనావళీ....

మాలా కుమార్ said...

శశికళ గారు ,
బుజ్జి కథలు , పాటలు బాగున్నాయండి .
ఈ నార్వే మరీ ఘోరం గా వుంది కదా ! పాపం చిన్నపిల్లలు , తల్లి తండ్రులు ఎంత ఇబ్బంది పడ్డారో .

శశి కళ said...

మందాకిని గారు పర్వాలెదు...థాంక్యు



ఫొటాన్ గారు థాంక్యు

శశి కళ said...

రాజ్...కధలు అంటే నీకు కూడా ఇష్టమా?అమ్మ దగ్గరికి వెళ్ళీ నెను చిన్నప్పుడు యె కధ వినెవాడిని అని అడుగు...


కల్యాణ్ గారు....మీ ఎంకరెజ్ మెంట్ కి థాంక్యు

శశి కళ said...

రాజి గారు,మాల గారు థాంక్యు



వెణు ....నీకు యెప్పుడు మీ అమ్మ ఆశీస్సులు ఉంటాయి

హరే కృష్ణ said...

శశి గారు
ఏ తల్లి అయినా తన తలపుల స్పూర్తి తో
బిడ్డ ఎదగాలని అనుకుంటుంది......అది సాదించి
ఆ బిడ్డ నిలిచినపుడు....తన వొడిలో వోదగాలనుకుంటుంది

అద్భుతం గా రాసారు

Unknown said...

కల్లా కపటం తెలీని పిల్లలకు కధలు చెప్పెటపుడు
సుఖాంతమే చెయ్యాలి.....
లేకుంటే వాళ్ళు కలల దుప్పటి కప్పుకొని హాయిగా
నిద్రపోరు......

ఎంత చక్కగా చెప్పారు అక్క !
మీ పోస్ట్లు ఒకసారి చదివితే సరిపోవడం లేదు అందుకే కామెంట్ ఆలస్యం అవుతోంది.

శశి కళ said...

hammayya....andy ki nachchindochhhhh




@శైలు...నువ్వు కూడా పిల్లల కధలు చాలా వ్రాసావుగా...థాంక్యు