Friday, 8 March 2013

''రెప్పల వంతెన''కవితా సంకలనం సమీక్ష

కవి ''కెక్యుబ్ వర్మ గారి '' ''రెప్పల వంతెన''
కవితా సంకలనం పై నా సమీక్ష ఈ రోజు
పుస్తకం .నెట్ లో......
''కినిగే'' లో ఈ కాపీ కూడా దొరుకుతుంది

(రెప్పల వంతెన సమీక్ష పుస్తకం.నెట్ లో లింక్ ఇక్కడ )


వ్యాసకర్త: శశికళ వాయుగుండ్ల
*******
కళ్ళు తెరిస్తే లౌకికం ….కళ్ళు మూస్తే కనిపించేది అలౌకికం…మరి రెండింటి మధ్య వంతెన మన కనురెప్పలు. లౌకిక, అలౌకిక భావనా ప్రపంచాల మధ్య అక్షరాలకు
భావాలు అద్ది కూర్చిన వంతెన ఈ ”రెప్పల వంతెన” కవితా సంకలనం. కను రెప్పల వంతెన కింద…..ఉబికే కన్నీళ్ళను ఉగ్గ బట్టుకొని నెత్తురు చిమ్మిన ఎదను ప్రమిదను చేసి ఇలా మిగిలా….ఒక్కో అక్షరం వెనుక దాగిన ఆర్తి మనను ఎంతో సేపు గాడ సుషుప్తిలోనికి తీసుకు వెళ్లి ఒంటరిని చేస్తుంది.
కవిగానే కాక ఇక్కడ ”కెక్యూబ్ వర్మ”గారు (k.k.kumaara varma) మట్టి తనాన్ని,మనిషి తనాన్ని హత్తుకొని వేదనాభరిత రేఖల మధ్య విశ్రమించని మునిలా గోచరిస్తాడు.
”విధ్వంసం ఆవలి వైపు”లో// ఇపుడు నేను కవిత్వం రాయలేక పోతున్నాను…// అంటూ గుండెలపై టన్నుల కొద్దీ ఆలోచనల మనలోకి మోసుకోస్తారు.
”//మనసులోని వ్యాకులతను పారదోలి
వెలుగును నింపే వాక్యం కోసం ….
ఎద నిండా నిబ్బరం నింపే స్నేహితుని లాంటి వాక్యం కోసం //
ఇలాంటి వాక్యం కోసం ఎదురుచూసే వాళ్ళ నిరీక్షణ ఫలించేలా ఉంటుంది అక్షరాల గమనం.వాక్యాల కూర్పు.
నాన్న ను కోల్పోయిన శూన్యమే తన అక్షరాలలో ప్రతిఫలించే వేదన అని ముందుమాటలో వ్రాసి ఉన్నారు. ఇంకా తన తండ్రి ధారపోసిన తపోఫలితమే ఈ అక్షర ప్రవాహం అని వ్రాసిఉన్నారు.
”ఎప్పుడైనా నిన్ను నీవు వడిసెల రాయిని చేసి విసిరి చూసావా? అంటూ ఎప్పుడైనా నిన్ను నీవు డప్పుపై చర్మంగా మార్చి నకజనకరి నం దరువై చూసావా?అంటూ తన విరసం నేపధ్యాన్ని మన ముందు పరిచి రోషాన్నిరగిలిస్తారు? శ్రీకాకుళం జిల్లా విరసం కన్వీనర్ గా బాధ్యతలతో ముందుకు వెళుతున్నపుడు తనకు ఆత్మీయతను పంచి ముందుకు నడిపిన
మిత్రులను కోల్పోయిన వ్యధ అక్షరాలలో అంతర్లీనంగా తొంగి చూస్తుంది.
వస్తు వైవిధ్యం ఇంకా ఉంటె బాగుంటుందేమో అనిపించినా కొన్ని వాక్య నిర్మాణాలు మళ్ళీ మళ్ళీ కనిపించినా…. భావాల లోతు, కవితా ప్రవాహపు వడి మనను చాలా సేపు
నిశ్శబ్దపు దారుల వెంట నడిపిస్తాయి. అప్సర్ గారి మాటల్లో”అటూ ఇటూ ఊపిరాడనివ్వని రెండు పరస్పర భిన్నమైన పరిస్టితుల మధ్య వంతెన కట్టుకొని దాని మీద సహనంగా,నిబ్బరంగా నిలబడి కాలం తో కరచాలనం చేసే స్నేహపూరితమైన దృష్టి వర్మ సొంతం” వర్ధమాన కవులకు,సాహిత్య ప్రియులు సొంతం చేసుకోగల మంచి పుస్తకం.
వెల:80/-
ప్రతులకు :k.k.kumara varma
H.No.11-3-11,near K.P.M.High school
parvathipuram-535501
Vizianagaram dist
ph:9493436277
books available at WWW.kinige.com

Thursday, 7 March 2013

మహిళ....ఆకాశం లోనే కాదు ఇలలో కూడా సగమే

నాకు ఎప్పుడూ ఈ రోజు గుర్తుకు వచ్చే ఒకే పేరు 
''ఝాన్సి లక్ష్మి బాయి'' ........ఇంత  కన్నా మహిళలో 
ఒక సమాజం ఏమి ఆశించగలదు.

చురకత్తి లాంటి చూపు,భార్యగానే కాక మంత్రి గా కూడా 
రాజ్య పాలనా నిర్ణయాధికారం,అందర్ని ఓదార్చి నీడన చేర్చుకొనే 
ప్రేమ,ఏ రోజు స్వార్ధం వైపు అడుగేయ్యని భారతీయత....అన్నిటికి మించి 
మగవాళ్ళు కూడా  ఎదిరించి నిలవడానికి భయపడే బ్రిటీష్ వారి ముందు 
కత్తి  దూసి ముందుండి ....ఇది మా రాజ్యం అని వేసిన పోలి కేక....
స్వాతంత్ర సంగ్రామానికే శంఖ ద్వనిలాగా....
అదిగో ఆ తెగువ కావాలి,ఆ నిస్వార్ధత కావాలి,ఎవరిని అడుక్కోకుండా 
ఇవి మావి అని సాధికారంగా గర్జించగల గొంతు కావాలి.

ఎలా ఉండగలరు వీళ్ళు తమకు కుటుంభం కూడా సమాజం తరువాతే అని,
ఎలా ప్రశించగలరు వీళ్ళు నువ్వు చేసేది తప్పు అని లోకాన్నేలే వాళ్ళను అయినా,
ఎలా పోరాడగలరు వీళ్ళు తమ చివరి ఊపిరి దాకా......
ఎక్కడ నుండి వస్తుంది వీళ్ళకి ఆ శక్తి?నిస్వార్ధంగా ఉండటంవలననా,
పూల సున్నితత్వం వలననా?సమాజం కూడా మనలాంటి మనుషులే 
అనే ప్రేమ వలననా ?
అన్నేళ్లు గృహ నిర్భంధం లో ఉంచినా ఒంటరిగానే ఎదుర్కొని 
మాకు ప్రజాస్వామ్యం కావాలి అని నినదించిన ''అంగసాసూచీ''

తనిఖీల పేరుతొ మా శరీరాలను తడిమే అధికారం లేదు అని 
మహిళల కోసం అన్న పానీయాలు మానేసిన ''ఇరోమ్షర్మిలా ''
పన్నెండేళ్ళ క్రితం ఏ గొంతుతో స్తిరంగా చెప్పిందో అదే గొంతుతో 
ఈ రోజు కూడా కోర్ట్ కి చెప్పింది ''నేను ఆత్మహత్య చేసుకునేంత 
పిరికిదాన్ని కాదు.చట్టాలు మమ్మల్ని గౌరవించేలా మారితే 
నేను నోటి ద్వారా ఆహారం తీసుకుంటాను''అని.....పెళ్లి లేదు,
సుఖం లేదు,చివరికి అన్నం లేదు......ట్యూబ్ గుండా వెళ్ళేది ఆహారం 
.........ఏమి చచిపోతే కాని ఈ దేశం లో సానుభూతి రాదా?
ఒక ఎర్ర బొట్టు ముఖపుస్తకం లో తనకు సప్పోర్ట్ గా 
ఎందుకు పెట్టలేకపోయాము?

నా బ్లాగ్ తరుపున వీళ్ళ ఇద్దరినీ తలుచుకుంటూ 
శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.

నా బుజ్జి ప్రపంచం లో నేను గమనించే ఇంకో వ్యక్తీ ''వై.ఎస్.భారతి''
గారు.రాజకీయాలు నాకు తెలీవు.కాని భర్త దూరంగా ఉన్నప్పుడు 
పిల్లలను సముదాయించడం మన గుండె పచ్చిపుండు లాగా 
 ఉన్నప్పుడు నాన్న గూర్చి ఆరా తీసే పిల్లల మాటలు 
ములుకులై పొడవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు.

ఇక అత్తగారి వైపు వాళ్ళని చూసుకోవడం,కుటుంభానికి 
మచ్చ రాకుండా చూసుకోవడం,ఆర్ధిక వ్యవహారాలూ .....
నిజం ఇవన్నీ ఒక పరిపూర్ణ మహిళ
మాత్రమె చెయ్యగలదు.చాలా మంది పారిశ్రామిక వేత్తలు 
చేసి చూపించారు కూడా.కాని రాత్రి అయ్యేసరికి 
మన పక్కన ఖాళీ లేకుండా స్ఫూర్తి తో నింపి 
ముందుకు నడిపే భర్త ఉంటె ఆ ధైర్యం వేరు.
ఆ ఖాళీ ,ఆ స్పర్శ ఇచ్చే ధైర్యం ఒకరితో చెప్పుకోగలిగినది కాదు.

రెప్పల చాటున కన్నీళ్లు దిగమింగుకొని అందరి ముందు 
ధైర్యం వహించడం సామాన్యం కాదు.
గమనిస్తున్నాను.ఇంతకు  ముందు కంటే సర్క్యులేషన్ 
పెరిగింది,ఫీచర్స్ చక్కగా ఉంటున్నాయి.
ఒకే మూసలో వెళ్లడం లేదు.
చక్కగా చేసే ఉద్యోగులు ఉంటె అదేమీ పెద్ద విషయం అనుకోవచ్చు.
కాని ఎంత మంచి ఉద్యోగులు ఉన్నా నేర్పుతో,ఓర్పుతో అందరిని 
ఒక తాటి మీదకి  తెచ్చే నైపుణ్యం లేకుంటే ఏ బండి ముందుకు కదలదు.
తను ఇంతే చక్కగా జీవితాన్ని నడుపుకుంటూ అందరికి ఆదర్శం 
కావాలి అని ఆశిస్తునాను.

శత్రువు భార్య అయినా ''సోదరా''అని పిలిస్తే పసుపు కుంకుమలతో 
గౌరవించే సంస్కృతీ మనది.
అటువంటి పసుపు కుంకుమ లు నా బ్లాగ్ తరుపున వీరి అందరికి 
కానుకగా ఇస్తున్నాను.

Saturday, 2 March 2013

ఎవరిది ఎదవ జాతి?

హ్మ్.... ఏమి చేద్దాము రెండో తేదికి నాలుగో తేదికి మధ్య మూడో తేది 
ఇరుక్కుని పోయింది . అది మామూలే కదా...... నిజమే కాని 
రెండో తేది మాథ్స్ టెన్త్ ప్రీఫైనల్,నాలుగో తేది రెండో పేపర్ ,అంటే 
మూడో తేది మొత్తం ఉదయం ఆరు నుండి రాత్రి పది వరకు స్టడీ డ్యూటీ 
లో ఉండాలి,...... అయితే ఏమి చేద్దాము ,భాద్యతలలో ఇలాంటి చేదు  రుచి
నాకు తప్పదు ..... కాని అవతల ఇంకో వ్యక్తీ చతుర్విధ పురుషార్ధములలో 
నన్ను వీడను అని  ఈ రోజున ఇరవై ఒక్కేళ్ళ క్రితం ప్రమాణం చేసి ఉన్దవచ్చు.... 
అందుకని ఈ చేదు  తనను కూడా ఎలా రుచి చూడమని చెపుదాము?

సంతోషాన్ని కాఫీ గా ఇస్తాము అని వాళ్ళు తెచ్చుకున్న కప్పు లో 
బోలెడు ఏకాంతాన్ని వంపేసి మనం ఆల్జీబ్రా,రేఖా గణితం వల్లే వేసుకుంటూ 
ఉంటె ఏమి బాగుంటుంది?సరే తప్పదు అనుకోని గమ్ముగా అయిపొయాను. 
చిత్రమ్...... 

ఆపద అని తెలిస్తే సహాయం చేసేది మిత్రుడు 
ఆకలి అని తెలుసుకొని అన్నం పెట్టేది అమ్మ..... 
అసలు మనం తలుచుకోకుండానే మనకు కావలసినవి అమర్చిపెట్టేది 
దెవుడు ...... 
ఏమి జరిగిందో తెలీదు.... రెండు లెక్కల పరీక్షలు మాత్రమె తొమ్మిది,పడకుండుకు 
వాయిదా పడి పొయినాయి.  
ఈ రోజు నా నానీల బుక్ పూర్తీ అయితే నా అక్షరానికి స్ఫూర్తి నిచ్చిన 
ఈయనకు ఇద్దాము అనుకుంటే పూర్తీ కాలేదు :(
నా ''స్వర్ణముఖీ సవ్వడులు ''సంకలనం నుండి ఈయనకు అంకితం 
ఇచ్చిన నానీ ....... 
''ఆనాడు వేసినవి 
ఏడు అడుగులే 
జీవితంతో గుణిస్తే 
లక్షల అడుగులు ..... 

(yevaridi yedava jaathi?malikalo kadha link


Friday, 1 March 2013

కనపడని అంకాలు

ఇది డిసంబర్ కౌముది ఈ పత్రిక లో నా రచన. 
''కనపడని అంకాలు''

kadhaku link ikkada )