ఇప్పుడెందుకు ఈ డిస్కషన్ ?
కొన్ని సార్లు అనవసరమైన పనిలో కూడా ఏదో
అవసరమైన విషయం ఏదో దొరుకుతుంది .
అసలు దాని కోసమే దీనిని చేసామా అని కూడా
అనిపిస్తూ ఉంటుంది . కొంత సేపు దీని గూర్చి ఆలోచిస్తే
ఇంకేదో జ్ఞానం వస్తుందేమో ఎవరికి తెలుసు ?
భారత దేశం లో గురువు స్థానాన్నే ఉన్నతంగా
గౌరవిస్తారు . కొన్ని కష్ట సమయాల్లో గురువుని
తలచుకొని శిష్యులు వాటిని దాటడం చూస్తే గురువే
గొప్పవాడు అనిపిస్తుంది .
ఉదాహరణకు మంచి గురువు కోసం వెతికేటపుడు
వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస ను
చూసి ''మీరు దేవుడి ని చూసారా ?'' అని అడుగుతారు .
అప్పుడు రామ కృష్ణుల వారు ''ఇదిగో నిన్ను ఎంత
స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా చూసాను ''
అని చెపుతారు .
ఇంకా వివేకానందులు సైరన్ శబ్దం విని ధ్యానం
చేయలేనపుడు ,పేదరికం తో ఇబ్బందులు పడుతున్నప్పుడు
గురువే అతనికి తోడుగా ఉంటూ నడిపిస్తాడు .
చికాగో లో కూడా చేతిలో డబ్బులు లేక ముందుకు
పోలేని పరిస్థితి వివేకానందులకు వచ్చినపుడు
గురువుగారి సహాయం కోరుతారు .
పరమ హంస యోగానంద వారు కూడా తన గురువు
తనకు ఎన్ని సార్లు తోడుగా నిలిచి నడిపించారో
వ్రాసి ఉన్నారు . తన చెల్లికి బాగా లేనపుడు ముత్యం
ధరించమని చెప్పడం,తను ఆధ్యాత్మిక ప్రచారానికి
చదువు కావాలి కాబట్టి పరీక్షలో తనకు వచ్చిన
ప్రశ్నలే వస్తాయి అని చెప్పి పంపించడం ఇలాగ
వాస్తవ జీవితం లో కూడా గురువులు తోడుగా ఉండటం
కనిపిస్తుంది .
కాని రామ కృష్ణుల వారే చెప్పిన
ఒక కధ వింటే ఎవరి కోసం ఎవరు
జన్మించారు అనే సందేహం
వస్తుంది .
ఒక రోజు రామకృష్ణుల వారు
ఈ కధ చెపుతారు .
''ఆకాశం నుండి ఒక చిన్నబాబు
భూమి పై పుట్టడానికి వస్తూ
మధ్యలో సప్తర్షి మండలం లో
ఒక రుషి దగ్గర ఆగి....
''నువ్వు తప్పక నా కోసం
వస్తావు కదా ''అని అడిగి
అతను నవ్విన తరువాత
భూమికి వస్తాడు .
దీనిలో ఆ రుషి వివేకానందులు
అని తాను చిన్న బిడ్డ అని చెపుతారు .
శిష్యులు ఎప్పుడు వస్తారా అని రామ కృష్ణులు వారు
నది దగ్గరకు వెళ్లి ''నాయన లారా మీరు ఎప్పుడు వస్తారు ?
అని బిగ్గరగా అరుస్తూ దిగులుగా ఎడ్చేవారట .
ఇంకా వివేకానందు లు పెళ్లి వద్దని పారిపోదాము
అనుకుంటే రామ కృష్ణులు వారు వెళ్లి నన్ను వదిలేసి
వెళుతావా ?అని అడుగుతారు .
పరమ హంస యోగానంద గురువు యుక్తేస్వర్ గారు
శిష్యుడు కోసం శ్రీరాంపూర్ లోనే ఒక కాలేజ్
సంకల్పం తో పెట్టిస్తారు .
గురువు నేర్పిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచ మంతా
వ్యాపించింది శిష్యుల వలననే .
గురువులు శిష్యుల
కోసమే ప్రతి క్షణం తపిస్తూ ఉంటారు .
వీరిలో ఎవరు గొప్ప ?
అనే ప్రశ్న వేస్తే ....
అసలు గొప్ప అంటే ఏమిటి
అనే ఆలోచన వస్తుంది .
త్రీ డి నిర్మాణం లో ఉండే ఈ లోకం లో
కాలం ,వయసు అన్నీ రుజు మార్గం లో
పయనిస్తాయి .
అందుకని ముందు ఉండేది గొప్ప అని ,
వెనుక ఉండేది తక్కువ
అని నిర్ణయిస్తాము .
కాని కారణ జన్ములు వచ్చిన లోకం లో అభివృద్ది
అనేది 360 డిగ్రీల వృత్తాకారం లో ఉంటుంది . (అసలు వృత్తాకారం
కూడా కాదు గోళాకారం లో ఉంటుంది . అంటే ఒక ఉమ్మెత్త
కాయ ముళ్ళ లాగా ..... ఇంకా ఎక్కువ శీర్షాలతో ,అందుకే
ఆధ్యాత్మిక సంపన్నులమైతే ''సహస్ర శీర్షం దేవం ''అన్నారు .
ఒక విషయం గూర్చిన జ్ఞానం అన్ని కోణాలుగా మనం అర్ధం
చేసుకోగలం )
ఒక్కో జన్మ లో ఒక్కో కోణం . గురువు ఒక కోణం లోని జ్ఞానం
సాధిస్తే శిష్యుడు ఇంకో కోణం లోని జ్ఞానం సంపాదిస్తాడు .
ఒకే వైపు పయనించని వారి జీవితాలని ఎవరు గొప్ప
అనే ప్రశ్న ఎక్కడ ?ఎవరి జీవితం వారిదే .
ఇంకా వివరంగా చెప్పాలి అంటే విద్యుత్తు ప్రసరణం కోసం
కొన్ని లోహాలు ఆనోడ్స్ , కాతోడ్స్ గా విడిపోయినట్లు,
ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం కోసం గురు శిష్యులుగా
పుట్టిన ఆత్మలు వాళ్ళు . శరీరాలు వేరు అయినా
వచ్చిన కార్యం, చేస్తున్న కార్యం ఒకటే .
ఇన్ని గురుశిష్యుల పరంపరల లక్ష్యం మనకు
ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించడమే అని మనం తెలుసుకున్న
రోజు మనలో ఈ ఘర్షణ ఆగిపోయి అనంత జ్ఞాన
సముపార్జన లో మునిగిపోతాము .