ఆ! ఏమి రోజు సృష్టించావు స్వామి
ఆ! గురించి కాదు.అ ఆ గురించి కాదు.
ఆహా ఈ రోజు గురించి.
నిన్నటికి నిన్న నా కోసం ఇలాంటి రోజు సృష్టింపబడుతుందని
ఊహించనే లేదు.
చాలా మామూలుగా విశ్వము నాకోసం ఇంత మంచి గిఫ్ట్
పంపుతుంది అనుకోనేలేదు.
ఏమీ పెద్ద విషయం లేదు లెండి.నిన్న కోటలో ఆ! సినిమా
చూసాను. అదేమీ పెద్ద గొప్ప విషయమా!లేక ఆ సినిమా అంత
నచ్చిందా!అదేమీ లేదు.ఒక చిన్న కోరిక నిన్న తీరిపోయింది.
నేనేమి ప్లాన్ చేయకుండా అలాగ నాకోసం ఏర్పాటు చేయబడినట్లు
అంతే !
అసలు ఈ ఫిబ్రవరి లో ప్రీ పబ్లిక్ ముందు సెలవు పెట్టడమే ఎనిమిదో వింత.
సరే చిన్ననాటి స్నేహితురాలి అమ్మాయికి సీమంతం.తాను నేను
కలిసేది తక్కువ.వెళ్లాను.సరే అమ్మను చూద్దాము కోటకు వెళ్లి.
బస్ లోనుండి చూస్తూ ఉంటే ఆ! పోష్టర్.అరే ఇది నాయుడుపేటకు రాదు.
ఇక్కడ చూసెయ్యాలి ఎలా?సాయంత్రం దాకా టైం ఉంది.మాట్నీ కి
వెళ్ళాలి.
తమ్ముడికి ఫోన్ చేసాను"ప్రసాద్ మన హాల్ లో ఆ! సినిమా ఉందిరా.
తోడు లేరు"
"సినిమాహాల్ లో వదిలిపెడతాను.. అంగడి మూసి రాలేను"అన్నాడు.
సరే చూద్దాము.ఎప్పుడూ ఇలాగే ఎందుకు ఉండాలి.లేడీస్ ఉంటారులే
పక్కన కూర్చొని చూస్తే సరిపోతుంది.తిరిగి తీసుకెళ్లడానికి ఇంకో తమ్ముడు
వాసు ఎలాగూ వస్తాడు.ఒక్క మాట ఈయనకు ఫోన్ కూడా చెయ్యాలి
అనిపించలేదు.ఏమో ఈ రోజు నాదే.
విచిత్రం ఒక్కరు కూడా ఒక్కదానివే ఏమి వెళతావు అనలేదు. ఏదో
శక్తి అందరిని నాకు దారి ఇచ్చెయ్యమని చెప్పినట్లు.
తమ్ముడు చెప్పినట్లే వదిలిపెట్టి గెట్ కీపర్స్ కి చెప్పాడు. అక్క చూసుకోండి
అని.
లోపలి వెళ్లినా నాకు నమ్మబుద్ది కావడం లేదు నేను ఒక్కదానిని నేను
చూడాలి అనుకున్న సినిమాకి ఒక్కరూ అడ్డు చెప్పకుండా రావడం.
ఏదో స్వాతంత్రం వచ్చినంత హ్యాపీ గా ఉంది. అందరికీ ఇది మామూలు
విషయం కావొచ్చు,నాకు నిజంగా కల.అసలు స్వాతంత్రము అంటే ఆడది
అర్ధరాత్రి క్షేమంగా తిరిగినపుడు అంటూ ఉంటారు కానీ క్షేమం ఏముంది
పెద్ద!ఒక ఇనుప బోన్ కి చక్రాలు పెట్టి పంపిస్తే క్షేమంగా తిరిగి వస్తుంది.
నాకెందుకో ఒక్కరం మాకు ఇష్టమైన సినిమా చూడటం స్వేచ్ఛ
అనిపిస్తూ ఉంటుంది. బస్ లో వదిలినట్లు సినిమాహాలు లో కూడా
రెండు వరుసలు వారి కోసం వదలాలి. ఆమెకి సినిమా చూడాలి అని ఉంది ,
అని దారి వదిలి, మేము అన్నం వండుకుంటాము వెళ్ళు అని చెప్పగలగాలి.
మరీ అత్యాశ కదా నాది.కానీ తమాషా! విశ్వం అంతా నాకే తెలీకుండా
ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్ నా చేతిలో పెట్టింది :)))))))
లోపల చీకటి.ఎక్కడా లేడీస్ లేరు.ఇక వెనక్కి పోయే ప్రసక్తి లేదు.
కూర్చున్నాను ఒక దగ్గర.జనాలు లేరు.జనగణమణ కు లేచినపుడు
చూసాను.వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.వాళ్ళు ఊహించి ఉండరు
ఒక లేడీ ఈ సినిమాకి వస్తుందని!ఫర్లేదు ఉన్న కొంతమంది లేచి
నిలబడ్డారు.కంపల్సరీ కాదు ,ఎవరూ చూడటం లేదు.అయినా లేచి
నిలబడ్డారు.ఎవరూ చూడనపుడు నీవెలా ప్రవర్తిస్తావో అదే నువ్వు.
చిన్న సినిమా అన్నారు.కొన్ని కథల మొత్తంగా సినిమా విడివడి
పవరాఫ్ ముందు వెనుకగా నడిపించారు.ప్రతీ కథ తరువాత
ఏమి అవుతుందో అన్నంత గొప్ప స్క్రీన్ ప్లే. అసలు దీనికి నానీ నిర్మాత
ఒక డేర్ స్టెప్.ప్రతి కథ దేనికదే ఏమవుతుందో సస్పెన్స్,వీటిని ఎలా
కలపతారో అని సస్పెన్స్.ఒక పాపని మ్యుజీషియన్ ఏడిపిస్తే దేవుడు
వాడిని ఏడిపించే కథ,చేప వంటవానికి సహాయం చేస్తే వంటవాడు
అవసరానికి చెప్పాను చంపబోయే కథ,ఒక కాలయంత్రం కనుగొంటూ
ఉండే శివ కి ఇరవయ్యేళ్లు తరువాత తాను మారే పాత్ర ఇప్పుడే వచ్చి
మాట్లాడే కథ,ఒక డ్రగ్ ఎడిక్ట్ లేడీ వాళ్ళ ఫ్రెండ్ కలిసి దొంగతనం
చేయబోయే కథ,తల్లి తండ్రిని కలిసి ఒక అమ్మాయి తానూ చేసుకోబోయే
అమ్మాయిని పరిచయం చేసే కథ,మీరు సరిగానే చదివారు,అమ్మాయే
అమ్మాయిని చేసుకుంటుంది.ఇవన్నీ ఒకే హోటల్ లో జరుగుతుంటాయి.
ఇవన్నీ కాకుండా ఆత్మహత్య చేసుకోపోయే ఒక అమ్మాయి కాజల్.
తాను చనిపోవడం తో సినిమా అయిపోతుంది.ఎందుకు?
సినిమా వచ్చి కొన్ని రోజులు అయిపొయింది ఇంకా ఇది ఎవరైనా
చదివినా తెర మీద చూస్తేనే థ్రిల్ కాబట్టి చెప్పేస్తాను.అదీకాక
నాకు మా బాబు నివాస్ కి ఎండింగ్ లో ఇది చెప్పారు అనేదాని
మీద క్లారిటీ రాలేదు కాబట్టి నాకు అర్ధం అయినా వర్షన్ చెప్పేస్తాను.
కాజల్ ది మల్టీ పర్పస్ డిసార్డర్.ఇవన్నీ ఆమెలోని వ్యక్తిత్వాలు.
తాను చైల్డ్ అబ్యూజ్ కి గురి అయివునపుడు అమ్మాయిని చేసుకునే
అమ్మాయి పాత్రగా మారిపోతుంది.డ్రగ్స్ వాడేటప్పుడు డ్రగ్స్ తీసుకొని
దెయ్యాన్ని చూసే పాత్రగా మారుతుంది.అలాగే ఉద్యోగం కోసం
తిరిగేటప్పుడు స్వార్ధ పరుడైన వంటవాడిగా,ఇంకా తనలో మాజిక్
చేస్తూ దేవుడిని నమ్మే చిన్నపిల్ల ,టైం లోకి ప్రయాణించాలి అనే
కోరిక ఉన్న శాస్త్రవేత్త,అన్నీ తానే. ఒక్కో జీవిత సందర్భం లో ఒక్కొక్కరిగా
మారుతూ ఉంటుంది.ఈ పాత్రలన్నింటిలో ఏది బయటకి ఎక్స్పోజ్
చేయాలి అనే ఘర్షణ. ఏది బయటకు వెళ్లినా తప్పు చేస్తూనే ఉంటుంది.
ఎందుకంటే మనిషి తాను బయటవాళ్ళకు
పరువుగా కనపడాలి అనుకుంటాడు.అమ్మా నాన్నలకు ఇబ్బంది
రాకూడదు అన్నట్లుగా ముసుగు వేసుకొని జీవిస్తాడు.కానీ బేలెన్స్ తప్పి
ఈ చీకటి షేడ్స్ ఏవి బయటకి వచ్చినా అమ్మా నాన్న చనిపోతారు.
ఇవి రాకూడదు అంటే తానే చనిపోవాలి.అందుకే తానె చనిపోయుంది.
మ్యూజిక్,డైరెక్షన్ ,నటులు అందరు సూపర్.పేర్లు గుర్తు లేవు
మీరు ఒక మంచి సినిమాని సృష్టించారు,అభినందనలు.
నిజానికి ప్రతి మనిషిలోనూ ఎన్నో పాత్రలు ఉంటాయి.కానీ అతను
వాటిని వివేకంతో కంట్రోల్ చేస్తూ, చేయలేనపుడు చీకటిలో తప్పులు
చేస్తూ అవి కపిపుచ్చుకోవడానికి ఇంకొన్ని చేస్తూ,సింపుల్ గా
చెప్పాలి అంటే జీవితాన్ని మేనేజ్ చేస్తూ వెళ్ళిపోతాడు.
అపరిచితుడులో చూపినట్లు ఒక్కో అవసరానికి అతని ఘర్షణ నుండి
ఒక్కొక్కరు పుడతారు.అమ్మాయి లవ్ చేయగానే రెమో మాయం అయిపోతాడు.
వాస్తవం లో గమనించుకుంటే దేహం ఏ జెండర్ అయినా కావొచ్చు
మనసులో వారు చాలా పాత్రలుగా ఉంటూ దాని ఇమాజినిరీ పొడిగింపు
వాస్తవం లో చేస్తూ ఉంటారు.
'ఱ '' పుస్తకం ఇంట్రో లో పాలపర్తి ఇంద్రాణి గారు వ్రాస్తారు.
నాలో ఒక చిన్న పిల్ల ఉందిఒక యువకుడు ఉన్నాడు. అవసరం అయినపుడు
వాళ్ళు బయటకు వస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అని!
ఒక రచయిత మిత్రుడు వ్రాస్తారు తన కథ లోని స్త్రీ, భర్త నుండి
విడిపోయిన తరువాత రెండు హాండ్ రెస్ట్ ల మీద చేతులు ఉంచి హ్యాపీగా
సినిమా చూసింది అని,ఆతను ఆ పాత్రను లోపల అనుభవించకపోతే
అది అంత హ్యాపీగా ఉందని అతనికి ఎలా తెలిసింది.అది స్త్రీ విషయం ,
ఆతను మగవాడు,ఎలా తెలిసింది?అంత దాకా ఎందుకు,నేను నిన్న ఈ సినిమా
చూసినప్పటి నుండి లోపల బ్లాగర్ ని. వ్రాస్తున్నా కొట్టేస్తున్న,ఎడిట్
చేసుకుంటూనే ఉన్నాను.ఒక రచయితా మిత్రుడు వ్రాసినట్లు 'వ్రాయకుండా
ఉండలేను అన్నప్పుడు వ్రాయాలి 'అని ఆ స్థితికి వచ్చి నా ప్రపంచం లో
దీనిని వ్రాసేస్తున్నాను.
లోపల ఇన్ని పాత్రలు ఉండటం తప్పు కాదు. వాటిలో వేటికి నీరు
పోసి బ్రతికిస్తూ ఉండాలి అనే వివేకం ఉండాలి.
పక్కింటిలో ఒక చక్కని రోజా పువ్వు పూసింది.గాలికి ఊగుతూ
హాయిగా ఉంది.ప్రేమ అంటే కోయడం కాదు,నీరు పోయడం అంటూ
ఉంటారు కానీ అదే కాదు.నువ్వు నీరు పోయకపోయినా అది అలా ఎదిగింది,
దాని హాయి చూస్తూ నీకు హాయిగా ఉండాలి.అది అలాగే హాయిగా ఉండటం చూసి నువ్వు
హాయిగా ఉండటం నీ చుట్టూ ప్రపంచం కూడా ఏదో నిస్వార్ధపు హాయి
పొందగలగాలి.కారణం లేని నవ్వు అందరి పెదాలపై పూయాలి,ఆ పూవుకు
జవాబు ఇస్తున్నట్లు.
లోపల ఉన్న అన్ని పాత్రల్లో కొన్ని నీ ఇష్టం తో ఏర్పడ్డాయి. కొన్ని
నీ చుట్టూ సమాజం నిన్ను పెట్టిన కష్టం నుండి ఏర్పడ్డాయి.
చేప మరణ వేదన నుండి వంటవాడు మారినట్లు నీ కష్టం నుండి
కష్టం అంటే ఏమిటో గ్రహించుకొని ఇతరుల లోపలి పాత్రలకు కూడా
కొంచెం గాలి ఆడేటట్లు ప్రవర్తించు. వాళ్ళు హాయిగా బ్రతకడం నువ్వు
హాయిగా గమనించు.అప్పుడు కాజల్ లాగా చనిపోయే పరిస్థితి ఎవరికీ
రాదు.
నిజంగా లోపల మనకు ఇష్టమైన పాత్రలుగా వాస్తవం లో ఉండటమే మనం
జీవించినట్లు కొలత అయితే ఆడవాళ్లు మాత్రమే కాదు ఇక్కడ
మగవాళ్ళు కూడా జీవన్మృతులుగా ఉన్నట్లే లెక్క!ఎనీ డౌట్స్?:))))
@@@@@@@