Wednesday, 18 January 2012

బాడీ గార్డ్ .....ఓ...గాడ్....

ఓ...గాడ్....ఓ...గాడ్....ఎన్ని సిన్మాలు 
చూడొచ్చు ...టికెట్ లేకుండా ....ఒకే సినిమాలో....


హు....ఏదోలే ప్రముఖులంతా పూరీలు తిని 
ప్లస్ లో ......బిజినెస్స్ మ్యాన్ లో వినలేని మాటలున్నాయి 
అని ప్రవచించారని.......పండగ రోజు అవెందుకులే అని 
బాడీ గార్డ్ సీయింగ్........దెబ్బకి కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్.....ఓ...గాడ్ .


హీరో గారి పేరు వెంకటాద్రి .ఆయన చిన్నప్పుడు కార్
 ప్రమాదంలో చిక్కుకుంటే......వరదరాజుల నాయుడు 
(ప్రకాష్ రాజ్)వారిని కాపాడుతాడు.అందుకని వెంకటాద్రికి
ఆయన అంటే ప్రేమ,గౌరవం.మళ్ళా వాళ్ళ అమ్మా,నాన్న 
ఏమవుతారో మనకు తెలీదు ,వాళ్ళ మామ మోహనరావు 
దగ్గర పెరిగి పెద్ద అయి .....ఎవరు చెడ్డ పనులు చేస్తున్నా 
కొడుతుంటాడు.వాడిని దారిలో పెట్టగలిగేది వరదరాజులే 
అని వాళ్ళ మామ నమ్మి ఆయనకు బాడి గార్డ్ గా ఉద్యోగం 
వచ్చిందని అబద్దం చెప్పి ఆయన దగ్గరకు  ఒక లెటర్ ఇచ్చి 
పంపుతాడు.మొదట వరదరాజులు నాకు బాడి గార్డ్ వద్దు 
అని.....తరువాత లెటర్ చదివి తన దగ్గరే ఉంచుకుంటాడు.


ఆయనకి ఒక కూతురు ....పేరు కీర్తి(ఆడవాళ్ళ మాటలకి అర్దాలే 
వేరులే సెంటిమెంట్ తో ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు)
ఆ అమ్మాయి ఒక సారి ట్రైన్ లో వస్తుంటే ఇంకో విలన్ కొడుకు 
ఏడిపిస్తాడు.దిగిన తరువాత వాళ్ళ నాన్నకు ఏడుస్తూ 
చెపుతుంది.ఆ అబ్బాయిని వరదరాజులు తన్నపోతే వాడు 
భయపడి ట్రాక్ పైకి పారిపోబోయి .....ట్రైన్ కింద పడి
చనిపోతాడు.అందుకని విలన్ కీర్తిని చంపాలని ప్లాన్ 
వేస్తుంటాడు.
కీర్తిని వాళ్ళ బావ శంకర్ కి ఇచ్చి చెయ్యాలని అనుకుంటారు.
కాని కీర్తి ఫైనల్ ఎగ్సాంస్ వ్రాసినాక చేసుకుంటాను అంటుంది.
కాలేజ్ లో ప్రమాదం రాకుండా బాడి గార్డ్ గా వెంకటాద్రి 
ని పంపుతారు.
ఇక్కడ మన చెవిలో పెద్ద కాలి ఫ్లవర్ పెడతారు.
ఏమిటంటే హీరో ఏమి చదువు కున్నాడో 
 తెలీదు కాని కీర్తి క్లాస్స్ లో సీట్ ఇచ్చేస్తారు.


(హేమిటో అంతా తెలుగు మాయ)


ఇక ఆయన క్లాస్ లో చేసే హాస్యం అంతా.....హు...హా....
అదేనండి .......మన శంకర్ దాదా ఎమ్బిబీస్...........


కీర్తికి ఈ బాడిగార్డ్ అంటే చిరాకు.వాడి మనసు మార్చాలని 
వేరే అమ్మాయి లాగా ఫోన్ చేసి ప్రేమ లోకి దింపుతుంది.
ఇక  వేణు మాధవ్,ఆలి ,వెంకి కలిసి కష్టపడి హాస్యపు 
పులుసు చేస్తారు.మనం ఏడవలేక(డెబ్బై రూపాయలు 
పోయాయని.....పండగ పూట టికెట్ రేట్ ఎక్కువ కదా)
నవ్వుతాము అన్న మాట.


ఇక్కడ కీర్తి తో పాటు ఫ్రెండ్ సునీత కూడా ఉంటుంది....
కీర్తికి మంచి చెడు చెపుతూ ఉంటుంది.బాడి గార్డ్ ఇద్దరినీ 
తెగ చదివిస్తుంటాడు(ఈయనకి పెద్ద వచ్చినట్లు)


ఫోన్ లో ఏడిపిస్తూ నిజం గా వెంకటాద్రికి తనపై యెంత ఇష్టం 
ఉందొ తెలుసుకొని నిజం గానే ప్రేమించేస్తుంది.
వెంకటాద్రికి మాత్రం కీర్తి ఏ ఫోన్ చేస్తుందని తెలీదు.
ఇక అక్కడి నుండి.....ఆడవాళ్ళ మాటలకు అర్దాలే వేరులే....
ఏమి చేద్దాం ఎలా కలుసుకుంటారో అని ఆవలిస్తూ కూర్చోవటమే.


తరువాత వరదరాజులు కీర్తి ప్రేమ కద తెలుసుకొని 
వెంకటాద్రిని చంపటానికి వస్తాడు.కీర్తి అతనికి ఏమి 
తెలీదు అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు 
తన కోసం రైల్వే స్టేషన్ కి వెళుతున్నాడు అని చెప్పి 
పంపేస్తుంది.తరువాత ఫోన్ చేసిన అమ్మాయిగా తన 
ఫ్రెండ్ సునీతను పంపి విషయం చెప్పమంటుంది.
కాని ఆమె చెప్పకుండా వెంకటాద్రిని పెళ్లి చేసుకొని ఒక 
బాబుని కని  క్యాన్సర్ తో చనిపోతూ విషయం డైరీలో 
వ్రాసి వాళ్ళ బాబుకు ఇస్తుంది.ఏమిటో ఇక్కడ వాళ్ళు 
ఆస్ట్రేలియా లో ఉంటారు.
తరువాత ఇండియాకి వచ్చి వరద రాజులను చూడటానికి 
వెళితే కీర్తి కి ఇంకా పెళ్లి కాదు.డైరీ చదివాడు కాబట్టి 
బాబు వాళ్ళ ఇద్దరినీ పెళ్లి చేసుకోమని అడుగుతాడు.
అందరు ఒప్పుకొని పెళ్లి చేస్తారు.....ఇంకా....ఇంక చాలు 
లెండి.....బండ యెంత సాగ తీస్తారు.....కాసేపు నవ్వుకోవచ్చు 
అంతే.


మరి ఈ రోజు మా అన్నగారి వర్దంతి సందర్భంగా నాకు 
నచ్చిన ఆయన పాట...చూసేసి ఒక శాల్యూట్ కొట్టేయ్యండి.


"నీ తల్లి మోసేది నవ మాసాలేరా....
ఈ తల్లి మోయాలి కడ వరకురా 
కట్టే కాలే వరకురా.....
ఆ ఋణం తలకొరివితో తీరేనురా 
ఈ ఋణం ఏ రూపానా తీరెదిరా"
(అందుకే పెద్ద వాళ్ళు ఉదయం నిద్ర లేచి కాలు 
నేలపై పెట్టె ముందు భూమికి దణ్ణం పెట్టుకోమంటారు.
మన కాలు దానికి అంటిన పాపం లేకుండా)
జననీ.....జన్మభూమిశ్చ......

18 comments:

Unknown said...

yadhaprakaram post super...adurs...

శేఖర్ (Sekhar) said...

Hmm...songs are good...

రాజ్ కుమార్ said...

హాస్యపు పులుసు... ఇది నాకు బాగా నచ్చింది.
బాడీగార్డ్ కి బలయ్యారన్న మాట.. ;)

శశి కళ said...

శైలు,శెఖర్,రాజ్ థాంక్యు

యశోదకృష్ణ said...

chooddam anukunnanu. nannu bathikincharu balavakundaa. aina idi salman body guard cinemane kada.

Anonymous said...

హబ్బా! పండగ పూట అచ్చు మీలానే బాడీగార్డ్తో బాదించుకున్నామండి. పోతే హిందీ బాడీగార్డ్. అబ్బే ఇందులో హీరోకు షర్ట్ నిలవదు, సలమాన్ ఖానుడు లేడి. చావుతప్పి కళ్ళు, చెవులు లొట్టపోయాయనుకోండి. మాఇంట్లో ఎలా అంటే తెలుగు, హిందీ, మలయాళం, తమిల్ బాడీగార్డులు తిట్టుకుంటూనే కలిపిచూడగలరు. నా చేతకాక బెడ్రూములో తలుపులు బిడాయించుకుని నిద్రపోయా.

voleti said...

I like this song "janani..." . really good one..Thanks for remind it..

శశి కళ said...

గీతగారు,ఇది వెంకీ ది...థాంక్యు

శశి కళ said...

అనానమస్ గారు పెరు రాసుంటే బాగుండేది.
థాంక్యు...మీరు తప్పించుకున్నారు.



ఒలెటి గారు...మీకు కూడా థాంక్యు

రాజ్యలక్ష్మి.N said...

శశి కళ గారు, సినిమా పాటలు విన్నప్పుడే అనుకున్నామండీ సినిమా ఇలాగే వుంటుందని..

Kalyan said...

@शशि गारू हहह बागुन्धी मी विवरण... मामुलुगा नाकु सिनेमा चूसे अलावाटे लेदु काबट्टी नेनू सेफ .. कानी मी नेरेशन चदवालनिपिन्चिंधी ...

కష్టపడుతున్నారా చదవటానికి మరి హిందీ సినిమా ని తెలుగు చూపెట్టారు నేను తెలుగును హిందీ లో చూపెట్టా ;) సరదాకి

శశి కళ said...

రాజి గారు...అవునా...పాటలైనా వినకపొతిని...
డబ్బు కాస్తా మిగలగాఆఆఆఆఆఆఆఆఆఆ....థాంక్యు

శశి కళ said...

कल्यान...्ह..ह...मेरि हिम्दि कैसे है...ताम्क्यु

ఆ.సౌమ్య said...

బాబోయ్ నాకు తమిల్ లో ఈ సినిమా చూసినప్పుడే బొప్పి కట్టేసింది...మళ్ళీ తెలుగులో బాదించుకోలేను. ఇంతోటి గొప్ప కథ అనీ నాలుగు భాషల్లోనూ తీసేసి తగలడ్డారు. మొదట మళయాళం, తరువాత తమిళ్, ఆ తరువాత హిందీ ఇప్పుడు తెలుగు...ఖర్మ ఖర్మ!

శశి కళ said...

thank u sowmya...



ushaa gaaru...meeku mail pampaanu...kaani vellaledu...aa id tappu kaabolu....nenu mee classmate kadu...senior...malla inko id ivvandi

శ్రీ said...

నేను ఈమధ్య ఒక దిక్కు మాలిన ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యాను. ఇక్కడ నాకు దిక్కు మాలిన తెలుగు సినిమాల నుండి విముక్తి లభించింది. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది.

శశి కళ said...

శ్రి....బతికిపొయావు...థాంక్యు

kiran said...

శశి గారు....
ప్లస్సు చూడక...ఎవరో బాగుందని చెప్తే ...బిజినెస్ మాన్ కి వెళ్లి వంద వదిలించుకున్నా..!!
అయిన ఆనందంగా..ఉంది..మీకు కూడా డెబ్బై వదిలింది గా... :D
అయ్యో వెంకి సినిమా కూడా బాలేదా :(