Monday, 18 June 2012

అబధ్రత లో.....బధ్రత

హమ్మయ్య.....ముగ్గురు కూర్చొనే సీట్ లో కొంచం సర్దుకొని 
కాళ్ళు  దారిలోకి పెట్టి ....ఏదోలే సీట్ దొరికిందని ఆనంద పడ్డాను.
రైలు  క్రిక్కిరిసి ఉంది.సీజన్ తో సంభందమే లేదు.ఇది చెన్నైనుండి 
నెల్లూరు  కి వెళ్ళే మేమో.ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కిట కిట లాడుతూ.

కొందరు  కొత్త వాళ్ళు,కొందరు అప్పుడప్పుడూ ఎక్కే వాళ్ళు,కొందరు 
కాలేజ్  కి ఆఫీస్ కోసం రోజు వెళ్ళే వాళ్ళు.ఇదో ప్రపంచం.
దానిలో గమనిస్తే ఎన్నో ప్రపంచాలు.
ఒక దగ్గరే ఉంటారు...ఎవరికి వాళ్ళు గానే ఉంటారు.....
భారతీయత  ఉట్టిపడుతూ.

అపుడప్పుడూ  వచ్చేవాళ్ళు అప్పుడే మీరెక్కడ దిగుతారు అని వాకబు 
చేస్తున్నారు కూర్చున్న  వాళ్ళని .
ఎప్పుడూ వచ్చేవాళ్ళు ఇది మాకు అలవాటే అన్నట్లు 
లాఘవంగా  సర్దుకుంటున్నారు దారికి అడ్డం లేకుండా....
కొందరు కిందే కూర్చుంటున్నారు  న్యూస్ పేపర్ వేసుకోనివేసుకొని.

ఆహా  న్యూస్ పేపర్ ఎన్ని విధాలా ఉపయోగపడుతుంది....పూలకి పొట్లం లా,
కూర్చునేందుకు  పీటలా,న్యూస్ అందించే వాహకం లా,స్పూర్తి నిచ్చే టీచర్ లా...
నాలో  కవిత్వం పొంగి పోర్లుతుంది.లాభం లేదు.
వెంటనే దృష్టి వేరే వైపు మళ్లించాలి.
లేకుంటే  ఇక్కడ ఉండే వాళ్ళు బలి అయిపోతారు నా కవితలకి.

చుట్టూ  చూసాను.పక్క సీట్ లో ఫ్యామిలీ ఎక్కడికో వెళుతున్నారు.
భార్యా,భర్త ఇద్దరు పిల్లలు.చిన్న పిలాడికి నీళ్ళు తాగిస్తూ ఉంది.
నిలబడటం  కష్టం అయిపోయ్యి కాళ్ళు మార్చుకుంటున్నారు...ఇష్..అబ్బా..
అంటూ  ...ఒక దగ్గర కొత్తగా పెళ్లి అయిన జంట లాగుంది.
చిన్నగా  దగ్గరకు వంగి కిటికీ లో నుండి చూస్తూ కబుర్లు చెప్పుకుంటూనారు.

పిల్లలు,పెద్ద  వాళ్ళు  ఒకరి మీద ఒకరు పడుతూ ....
పల్లీలు ...మురుకులు...బిస్కెట్లు ...అరుపులు...
లాఘవంగా తప్పుకోమని జనాల మధ్య నుండి అరుస్తూ ,
వెళుతూ  వ్యాపారం చేసుకుంటున్నారు.ఇంత కష్టం లో 
కూడా  ఎన్ని జీవనాలు గడుస్తున్నాయో......

ఆ పక్క  సీట్ వెనుక వైపు సీట్ చూసాను.అది రెండు సీట్లది.
అందులో  ఒకతను కూర్చుని ఉన్నాడు.
మామూలుగా రెండు సీట్ల దానిలో ముగ్గురు  కూర్చుంటారు.
అందులో పిల్లల తల్లులు ఉన్నారు చుట్టూ .......
అయినా  ఎవ్వరూ అతని ప్రక్కన కూర్చో టానికి సాహసించటం లేదు.
ఏమై ఉంటుంది కుతూహలంగా పరిశీలనగా చూసాను.

పక్కన  ఉండే ఇరవై ఏళ్ళ అమ్మాయిని చూసి అడుగుతున్నాడు 
.....నీ ఫోన్ ఇటియ్యి ,నంబర్ యెంత?ఏమో చనువు ఉన్నట్లు అడుగుతున్నాడు.
ఆ  అమ్మాయి బయంతో ముడుచుకు పోతుంది.
పక్కన జరగటానికి స్తలం లేదు.
కొంచం  ముందులో కుర్రాళ్ళు.ఎలా వెళుతుంది పాపం .
తగలకుండా నిలబడటం కష్టం  కదా.
అయినా రైలు లో తగలటం పెద్ద పట్టించుకోరు కాని 
వేరే  వాళ్ళ స్పర్శ ఎవరికైనా విసుగే.....

ఆతను  తెల్ల పంచె,తెల్ల చొక్కా,
నలబై ఏళ్ళ పైనే వయసు ఉంటుంది.
ఆ  అమ్మాయికి కూతురు 
వయసు ఉంటుంది.మరి వీడి కేమి రోగం 
ఇలా ఏడిపిస్తున్నాడు?
అప్పుడు వచ్చింది ఆ వైపు నుండి 
గప్పు మని కంపు అదీ  సంగతి అయ్యగారు 
మందు మీద ఉండాడు.
ఛీ ...జుగస్సు...చూసే వాళ్లకు .

ఆ  పిల్ల ముడుచుకొనే కొద్దివాడు రేచ్చిపోయ్యి మాట్లాడుతునాడు.
ఆ అమ్మాయి అందరు తననే చూస్తున్నాడనే స్పృహతో తల 
వంచుకొని  వణికి పోతుంది.ఛా....ఏమి ఆడ పిల్లలు భయ పడుతూ...
సరేలే పాపం మళ్ళా మాట్లాడితే .....వీళ్ళు అందరు చూడు 
ఆడ పిల్ల ఎలా మాట్లాడుతుందో అని ప్రచారం చేస్తారు.
ఎందుకులే గొడవ అనుకున్నాదేమో ...అనుకున్నా 
జాలితో.

వాడు ఆ అమ్మాయిని చూసి ఇదో ఇక్కడ కూర్చో వెకిలిగా నవ్వుతూ 
పక్కకి జరిగాడు.ఆ పిల్ల అసహ్యంగా చూసి అటు తిరిగి నిలబడింది.
వాడు ఫోన్ వచ్చినట్లు...హలో..హలో..అంటూ వెకిలిగా చూస్తూ 
నిలబడ్డాడు.మధ్యలో ఒకామె నిలబడి ఉంది.పెద్దావిడ.
ఇందాకటి నుండి అన్నీ చూస్తూ ఉంది.
వాడు ఫోన్ చేసినట్లు నటిస్తూ ముందుకు ,వెనకకు వంగి ఆ పిలాని 
అన్ని కోణాల్లో తినేస్తూ చూస్తున్నాడు.తూలి  పడ  పొయ్యాడు.


అపుడు మొదలయ్యింది అసలు కధ.''దొంగ నా కొడకా''
పెద్దావిడ చొక్క పట్టుకుంది...ఇందాకటి నుండి చూస్తుండా ....
@*&%$@@()%$#@^&***(^%$# ....వరదలాగా అన్ని పక్కల నుండి 
తిట్లు.నేను లేచి నిలబడి ఆ అమ్మాటికి వత్తాసుపలికాను.
''వేదవ...నేను ఇందాకా కూర్చున్నాను వాడి పక్కన ....
కాళ్ళు  పైన పైన వేస్తాడు పక్కకు జరుగుతూ...చంటి పిల్లను 
భుజం పై వేసుకున్న ఆవిడ చెప్పింది.కళ్ళల్లో కసి తీరనట్లు చూస్తూ.


పక్కన కుర్రాళ్ళకు విషయం అర్ధం అయింది .వాడు ఇంకా నేనేమి 
చేశాను అని ఆడవాళ్ళను దబాయిస్తున్నాడు.
మనిషి స్పర్శకు....మగాడి స్పర్శకు తేడా తెలీదా?
అనుభవిస్తే తెలుస్తుంది దానిలో ఉండే నరకం.


కుర్రాళ్ళకు సహనం చచ్చిపోయింది.రెండు పీకారు వాడి వీపు పై.
పర్లేదు కుర్రాళ్ళు కొందరు మంచి వాళ్ళే ఉంటారు.
నలుగురు నాలుగు వైపులా వాయించేసారు.
దెబ్బకి నమస్కారం పెడుతూ 
''వదిలేయ్యండయ్యా...ఇంకెప్పుడూ చెయ్యను''
ఒప్పుకున్నాడు.తూలిపోతూ ఉన్నాడు.పోలీస్ స్టేషన్ లో 
అప్పగిస్తాము అనుకున్నారు తరువాత స్టేషన్ లో దిగి.
కాని అందరు చర్చించుకొని ఆడవాళ్ళు ఎలా వస్తారు స్టేషన్ కి 
అనుకొని ....చివరి సారి హెచ్చరించి ...తరువాత స్టేషన్ లో 
వాడిని బలవంతంగా దించేసారు.

ఆ సీట్ లో కూర్చుని ఆ అమ్మాయి,ఇంకో పసి పాప తల్లి హమ్మయ్య అనుకున్నారు.


నిజమే ఇలాంటి ట్రైన్ యెంత అబధ్రత అనుకున్నాను కాని 
జనాల వలన యెంత మంచి జరుగుతుంది.చెయ్యాల్సిందంతా 
ఇలాటి వాళ్ళను ఎదిరించటమే.

అభద్రత వాతావరణం లో కూడా యెంత బధ్త్రత.
ఉన్నారు  మంచి మనుషులు ఇంకా బతుకు పై ఆశ కలిపిస్తూ ....
 

13 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ చాలా బాగా రాశారు.
లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల ఒక డైలాగ్ రాశారు. నాకారులో దింపనా అని అడిగితే "వద్దుసార్ బస్సులో పోతాం నలుగురూ తోడుంటారు" అని అంటాడు. మీ అబద్రతలో బద్రత చూస్తే అది గుర్తొచ్చింది.

హరే కృష్ణ said...

హ్మ్మ్.. ఈ లోకం లో విలువలు అనేవి సంపూర్ణం గా నసించిపోతున్నాయి :(

జలతారువెన్నెల said...

మానవత్వం పరిమళించిన మంచి మనసులకు స్వాగతం... అంతే కదండి?

శేఖర్ (Sekhar) said...

ఇరగ ఇరగ.......మీరు కూడా నాలుగు తగిలించి ఉండాల్సింది
మనిషి స్పర్శకు....మగాడి స్పర్శకు తేడా తెలీదా?---ultimate

the tree said...

good observation,
annintit=ni gamaninchesarandi meeru,
keep writing.

చెప్పాలంటే...... said...

avunandi elanti vedhavalu vuntaru alane manchi vallu vuntaru....memu kudaa ardharaatri 10 mandi vedhavalu sleepar lo lights vesi adigite godava chesaru kanisam vallaku tickets kudaaa levu evaru emi anaru adigite 26 bogilu chudali mide kadu kadaa annaru midi chadivite maa anubhavaalu gurtu vachayi...

వనజవనమాలి said...

Wow.. సమూహం తలుచుకుంటే పచ్చడి పచ్చడే! బాగా బుద్ది చెప్పారు. భలే శశి నేను ఉంటే బాగుండేది అనిపించింది.
బ్లాగుల్లోనే కాదు బయట కూడా అందరికి చెప్పేయండి. భాదితులకు దైర్యం వచ్చి పని బడతారు.

శశి కళ said...

ఇది మా పాప చూసి నిన్న రైలు దిగి వచ్చి చెప్పింది.
అప్పుడే మీ కవిత విహంగ లో చదివాను కదా...బోల్డెంత ఆవేశం వచ్చి కదా వ్రాసాను వనజక్కా

శశి కళ said...

అవును చెప్పాలంటే గారు మీరు చెప్పింది నిజం .
నాకైతే అలాగా ఎదిపించే వాళ్లకు బుద్ది చెప్పేదానికి
ప్రభుత్వం ఏదైనా నెంబర్ 108 లాగా ఏర్పాటు చేస్తే బాగుండును అనిపిస్తుంటుంది.

శశి కళ said...

శేఖర్ నేను తగిలిస్తే వాడు ఇక మిగలడు...అందుకే
వదిలేసాను.

ట్రీ గారు చక్కగా చెప్పారు.థాంక్యు

జలతారు వెన్నెల గారు అవునండి.మన పిల్లలకు అయినా ఇలాటి మంచి విషయాలు నేర్పించాలి

శశి కళ said...

లేదులే అండి కొంత మంది మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా.

అవును వేణు నువ్వు చెప్పింది నిజం...థాంక్యు

లోక్ నాథ్ కోవూరు said...

ఇలాంటివి ఇంకా ఈ రోజుల్లోకూడా జరుగుతున్నాయి అంటే అమ్మాయిలు ఇంకా మారాల్సింది చాల ఉంది అని అర్ధం అవుతుంది... తనే తన్ని ఉండాల్సింది....

శశి కళ said...

జై...కొందరికి చాన్స్ ఇచ్చినా కొట్టలేరు.
అదంతే...థాంక్యు