Saturday, 7 July 2012

ఇల్లాలి ముచ్చట్లు 1

చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకోవాలి అని ఎవరికైనా 
అనిపిస్తూ ఉంటుంది.మరి సాక్షి లో ఇలాటి అవకాశం 
వస్తే వదులు కుంటామా?


సాక్షి ఫ్యామిలి లో నా ఇల్లాలి ముచ్చట్లు బుధవారం (4/7/2012)
వచ్చింది చూడండి.


ఇది నేను పంపింది.వారు కొంచం తగ్గించారు.


THANKYOU SAKSHI 


సాక్షి లింక్ ఇక్కడ.....
మొక్క జొన్న పొత్తులున్నాయి తిందువా.......సన్నగా పాట వినిపిస్తుంది దూరంగా...
నిజం గానే వాతావరణం అలాగే నల్లగా మబ్బెసుకొని .....చల్లటి గాలి చెంపలు నిమురుతుంటే...
రోడ్డు పక్కన నుండి కాలుతున్న  మొక్క జొన్న  వాసన 
ముక్కు పుటాల గుండా వెళ్లి ఆషాడం పెళ్లి కొడుకులా ఆగమని గునుస్తూ ఉంది.
లాభం లేదు తినాల్సిందే.బండి దగ్గర మొక్క జొన్న కాలుతున్న వాసన ,కింద వేడిగా 
కాలిన బొగ్గుల వెచ్చదనం చుర చురమనే జ్ఞాపకాలలోకి తీసుకెళ్ళి పోతున్నాయి.

కుంపటి ఇంట్లో ఉన్నా  దానితో ప్రత్యక్ష అనుభవం ఆరో క్లాస్ లోనే.
అమ్మ ఊరికి వెళ్లిందని అక్క వంకాయ కూర బొగ్గుల కుంపటి 
మీద పెట్టి చూస్తూ ఉండమని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.
నేను బుద్దిగా చూస్తుండి పొయ్యాను.అక్క ఇంటికి వచ్చిన 
తరువాత కరునేక్కిన కూర  చూసి ఎరుపెక్కిన తిట్లు వేడిగా పడిన తరువాత కాని 
తెలీలేదు.....చూస్తూ ఉండటం అంతే నిప్పులు అప్పుడప్పుడు కలబెడుతూ, 
బొగ్గులు వేస్తూ రాజుకోవటానికి అప్పుడప్పుడు విసన కర్రతో విసరాలి అని.

అసలు కుంపటి వెలిగించటం అంతే ఒక తపస్సు.
ముందు మధ్యలో ఒక పిడక ఉంచి దాని పై కొంచం కిరోసిన్ 
పోసి ,చుట్టూ కొంచం కొబ్బరి పీచు  ఉంచి ,
ముందుచిన్న బొగ్గులు దాని చుట్టూ పెద్ద బొగ్గులు ఉంచాలి.

పిడక వెలిగి ,చుట్టూ ఉన్నా పీచు రగులుకున్నాకా మెల్లిగా విసురుతూ 
ఉండాలి.కష్టమే కాని దాని పై వంకాయ కాల్చుకొని తొక్క తీసి నలిపి  ఉల్లిపాయలు,పచ్చి మిర్చి 
పెరుగు వేసుకొని పచ్చడి చేసుకుంటే దాని రుచి,పప్పు ఉడికితే రుచి,పాలు ఎర్రగా 
కాగితే వచ్చే వాసన ,తయారు అయ్యే పెరుగు,మీగడ ....అబ్బో లొట్టలు వెయ్యాల్సిందే.

ఇంకా అమ్మ చేసే కొత్త రకాలు వంటలు (అప్పట్లో)పాలు కాసి కోవా,క్యారెట్ హల్వా ...ఇలా..
 మధ్యాహ్నం దాకా ఉడుకుతూ  ఉంటాయి క్యారెట్లు.
తరువాత తొక్కు తీసి రుబ్బుతుంది(మిక్సి ఉండదు కదా)
తరువాత చక్కర నెయ్యి కలిపి మళ్ళా  కుంపటి మీద సన్న సెగపై ఉడకపెడుతుంది.
రంగు మారాలి అదీ లెక్క....హల్వా తయారు అయినట్లే.

ఉదయం మొదలు పెట్టిన యజ్ఞం సాయంత్రానికి  అవుతుంది.
మరి పిల్లలం ఊరుకుంటామా.....అలాగా దాని చుటూ కూర్చుని 
ఆ వాసన పీలుస్తూ కొంచం పెట్టించుకుంటాము ...చక్కర సరిపోయిందా లేదా 
అని.....అప్పుడే హల్వా తిన్నంత పొంగిపోతాము.
తిరుమల నడక దారిలో అలిపిరి మెట్లు అంత దూరమే వచ్చాము 
హల్వా తయారీలో అని తెలీక.....

తరువాత కిరోసిన్ స్టవ్ లు వచ్చినా కుంపటి స్తానం కుంపటిదే.
పాల కోసం,పప్పు కోసం అది రగులుతూ ఉండాల్సిందే.
తలక పోసుకుంటే సాంబ్రాణి వేసుకోవటానికి నిప్పులు,
దిష్టి తీసిన  ఉప్పు నిప్పుల్లో వెయ్యటం దాని అదనపు ప్రయోజనాలు.

అత్తగారింటికి వస్తే అంత మంది ఉన్నా ఇంటిలో ఒక మూల కోడి 
పెట్టలాగా కూర్చుని ఉంది ....పాలు మరపెడుతూ.పిల్లలు పుట్టినా దిగులు లేదు 
నిప్పులకు,సాంబ్రాణి దూపానికి.....ఇంకా అది అయ్యిన తరువాత ఆ నిప్పులు చిన్న 
గరిటలో ఉంచి బాలింతల మంచం కింద పెట్టె వారు వెచ్చగా ఉండాలని.

 పాలు కాగ పెట్టి,పెరుగు తోడేసి,మజ్జిగ  చిలికి వెన్న తియ్యాలి.
ఇంట్లో ఆడవాళ్ళకి అదొక పని.వెన్న తీసిన తరువాత తియ్యటి మజ్జిగ ఇంట్లో 
అందరికి ఇస్తే తాగుతారు అదొక అలవాటు.

బాబు ని కన్న తరువాత ఉద్యోగం లో పెంచలేక అమ్మకి ఇచ్చాను 
చూసుకోమని .ఒక రోజు చక్కగా మా అమ్మ మా తమ్ముడు కొడుకు నెలల 
పిల్లవాడిని వళ్ళో కూర్చో పెట్టుకొని,పక్కన వీడిని నిలుచో పెట్టుకొని 
శ్లోకాలు చెప్పిస్తూ ఉంటె....పక్కన పాలు కాచుతూ  ఉంది కుంపటి ...ఊ కొడుతూ...

ఉన్నట్లుంది మా తమ్ముడు కొడుకు కాలితో తన్నాడు తలుపుని.
తలుపు వెళ్లి కుంపటిని దొర్లించింది.ఇల్లంతా వేడి పాలు,నిప్పు కణికలు.
హడా వడిలో అమ్మ లెయ్య పొతే ...రెండేళ్ళ మా బాబు,మా తమ్ముడి కొడుకు 
పాలల్లో పడి పొయ్యారు.
వాడికేమో నడుము మీద మొల గజ్జెలు ముద్ర పడిపోయ్యాయి కాలి పొయ్యి.
వీడికేమో కుడి చెయ్యి కాలు.....ఇంకేమి చేస్తామే ammaలం ఇద్దరం 
రాత్రంతా పిల్లలను పొట్టకు కరిపించికొని  పడుకో పెట్టుకొని 
కొంగుతో కట్టుకున్నాము ...రెండో వైపు తిరిగితే బొబ్బలు చితికి పోతాయి అని.

 కుంపటి మీద కోపం రాలేదు కాని పిల్లల పరిస్తితి చూసి సుప్రీం కోర్ట్ 
ఆర్డర్ కుంపటి వెలిగించకూడదు  అని(పిల్లల తాతయ్య)
పాపం అంతే ఒక మూలకి వెళ్లి పొయ్యింది మౌనంగా ....

చివరగా ఒక రుచికరమైన జ్ఞాపకం ....మేము చిన్న పిల్లలప్పుడు 
మా నాయనమ్మ కుంపటి మీద సన్నపు సెగ బెట్టి చేసే 
ఉప్పిండి  (బియ్యం రవ్వతో చేసే ఉప్మా)ఏంటో బాగుంతున్దన్నట్లు....
కావాలంటే మ్యుజియం లోకి వెళుతున్న  కుంపటి నడగండి...ఒట్టు .


ఎడిటర్ గారికి నమస్తే.
ఈ నలబై ఏళ్ళ వయసులో నా కుంపటి కమ్మని కబుర్లు 
అందరికి చెప్పే అవకాశం వస్తుందని ఎప్పటికి అనుకోలేదు.
థాంక్యు వేరి మచ్........వాయుగుండ్ల.శశి కళ,నాయుడుపేట,

15 comments:

వనజవనమాలి said...

kmmati kaburlu..

kumpati moolaki :(

రాజి said...

"శశికళ" గారూ..
మీ ముచ్చట్లు (ఇల్లాలి ముచ్చట్లు) నేను కూడా చదివానండీ..
కుంపటి కబుర్లు బాగున్నాయి.

శ్రీనివాస్ said...

:D

మాలా కుమార్ said...

ముందుగా సాక్షి లో మీ ఆర్టికల్ వచ్చినందుకు అభినందనలండి .
మీ కుంపటి కబుర్లు మా కుంపటిని గుర్తుతెచ్చాయి . మా పెళ్ళైన కొత్తల్లో , మా అత్తగారింట్లో కుంపటి మీదే వండేవాళ్ళము.

హరే కృష్ణ said...

కుంపటి కబుర్ల దాతా సాక్షీభవ!

Ennela said...

congrats sashi...

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ.. కుంపటి కబుర్లు..
చివర లో ఆ ప్రమాదం తప్పితే.. ;(

అవును కుంపటి మీద చేసిన వంట రుచే రుచీ. మా పెద్దమ్మమ్మ ఒక్కరే కుంపటీ మీద చేసేవారు. చాలా ఇష్టం ఆవిడ వంటంటే నాకు. ఇన్నాళ్ళూ అది ఆవిడ గొప్పదనమ్ అనుకున్నా..కుంపటి గొప్పదనమా? ;)

అభినందనలతోకూడిన నమస్కారాలు ;)

శశి కళ said...

అవును రాజ్.....థాంక్యుఎన్నేలగారు,హరే థాంక్యు

శశి కళ said...

అవునా మాల గారు కుంపటి వెలిగించటం చాలా
కష్టం కదా....సీనన్నా థాంక్యు

శశి కళ said...

రాజి చదివారా?హ్యాపి టు హియర్ ....థాంక్యు
థాంక్యు వనజగారు.మీరిలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ))

Anonymous said...

meedi naidupeta?
ekkada vuntaru andi
naku mee blog istam.
maa atta garidi kuda naidupet.

హనుమంత రావు said...

కుంపటి, రుబ్బురోలు, రాతి తిరగళ్లు... ఇవన్నీ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నాయి... మ్యూజియంలో వస్తువులయిపోతున్నాయి.. వాటితోపాటు ఆ మధురరుచులు ...ప్చ్... చక్కగా ఉంది మీ కుంపటి కథ... శుభాభినందనలు.

జ్యోతిర్మయి said...

శశి గారూ అభినందనలండీ...కుంపటిని, కుంపటిలో కాలిన కుమ్మొ౦కాయని గుర్తుచేశారు. భలే భలే.

శశి కళ said...

జ్యోతి గారు మీకు కూడా ఇష్టమ...))హనుమంతరావు గారు ఆ రుచి తెలిసిన వాళ్ళు
వాటిని వదలరు లెండి

శశి కళ said...

శ్రావ్య...థాంక్యు.ప్రస్తుతం ఉద్యోగ రీత్యా అక్కడ ఉన్నాము