Thursday 26 December 2013

నవ్వుల ఎక్స్ ప్రెస్


''అమ్మా రేపు క్రిస్మస్ సెలవు కదా ,నాన్న  నువ్వు 
నెల్లూరు కి వస్తారా .... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకి 
పోదాము . భార్గవి వాళ్ళు టికట్స్  తెచ్చుకోను
 వెళుతున్నారు ,మీరు వస్తాను అంటే మీకు తెచ్చి పెడతాము ''
నెల్లూరు నుండి పాప ఫోన్ . 
వార్నీ ఈ సినిమా ఇంకా కంచికి చేరలేదా !
అంటే దీన్ని అందుకునే చాన్స్ ఇంకా ఉంది సుమా . 
బహుశా మేర్లపాక గాంధి కి ఋణం ఉందేమో 
మన డబ్బులు :) 

ఏమిటి ఇంతకు ముందు మిస్ అయ్యారా అంటే ....
 హ్మ్ అదో పెద్ద కధ  . 
కాదు లెండి చిన్న కధ . 
నివాస్ డిసంబర్ మూడో తేది వచ్చాడు
 సెం హాలిడేస్ అని . రాగానే సాయంత్రం రెడీ 
అయి పోతున్నాడు . ఎక్కడికిరా ?అని అడిగితే 
''వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ '' సినిమాకి అన్నాడు . 
నేను వస్తాన్రా అన్నాను . 
''పోమా నేను మా ఫ్రెండ్స్ తో వెళుతున్నాను ''అని వెళ్ళిపోయాడు . 
అక్కడ నుండి రాక ముందే నెట్ లో ప్లాన్ చేసుకొని ఉంటారు ,

రాచ్చసుడు .... చిన్నప్పటి నుండి వీడిని 
ఎన్ని సినిమాలకు తీసుకొని వెళ్లి ఉంటాను . 
ఇంకా నాన్నతో పో అనే సలహా పడేసి వెళ్ళాడు . 
హ్మ్ ... ఆయన గారు తీసుకెళితే వీళ్ళను ఎందుకు అడగడం . 
సరే అని పాప వచ్చాక అడిగిస్తే .... అప్పటికి ఆయన రూల్స్ .... 
అంటే మనుషులు తోసుకో కూడదు , సిగిరెట్ పొగ ఉండకూడదు , 
తల నొప్పి రాకూడదు ఇన్నిరూల్స్  ఆ సినిమా నెగ్గేసింది కాబట్టి ఒప్పుకున్నాడు . 
ఇంకేముంది ఎక్స్ ప్రెస్ ఎక్కడమే అనుకోని థియేటర్ కి వెళ్ళాము . 
తీరా చూస్తే మేము తప్ప అక్కడ ఎవరూ లేరు . 
అడిగితే సినిమా ఈ రోజే మారింది
 ''బన్నీ ఆండ్ చెర్రి '' అని చెప్పారు . చేసేదేముంది మళ్ళా ట్రైన్ మిస్ . 
తల ఎత్తి ఈయన వైపు చూడకుండా బుద్ధిగా ఆ సినిమా చూసేసి వచ్చాము . 
పోనీ ఆ ట్రైన్ ని ,ఇదేమన్న పవన్ కళ్యాణ్ సినిమానా 
నెల్లూరు కి పోయి చూడ టానికి ,నాలుగు రోజులు పోతే
 టి . వి లో వచ్చేస్తుంది అనుకున్నాను . 
ఇదిగో లేకలేక లేక లేక లేక లేక లేక సెలవు వచ్చేసరికి పాప ఫోన్ . 

సెలవు లేక ఏమిటి అంటే .... ఆ సమైఖ్యాంద్ర స్ట్రైక్ పుణ్యామా అని 
ఆదివారాలు కూడా పని . దేవుడా! ఆదివారం లేకుంటే ఇరవై ఏళ్ళు 
ఉద్యోగం చేసి ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది . ఇంకొంచెం ఉంటె 
హిమాలయాలకు వెళ్లి పోదాము అనిపిస్తూ ఉంది . ఏదో అక్కడ సినిమాలు , 
సెక్యూరిటీ లేదని ఆగాను . ఈ . ఎల్స్ కొందరు సరండర్ చేసారు ,మా ఆదివారాలు 
మేము, ఇంకా ఇంకో పదిహేను నెలలు రెండు రూపాయల అప్పు కట్టే వాళ్ళు ... 
కష్టం మొత్తం సముద్రం పాలు . అవతలి వాళ్ళు మమ్మల్ని కనీసం మనుషులుగా 
కూడా గుర్తించక పోతిరి . లోక్ సత్తా ఆయన అన్నట్లు .... మనం కలిసి ఉంటామో 
విడిపోతామో మనం మనం తెల్చుకోవాలా .... చస్ అవతలి వాళ్ళు ను 
అడగడమేమిటి .... వాళ్ళు షరతులు పెట్టడం ఏమిటి ?ఇంతా చేస్తే 
వాళ్ళు చించిన ముక్కలు ఇద్దరికీ పనికి వస్తాయో లేదో తెలీక పోతుండె . 
''అసలు తెలుగోళ్ళు అంటే ఎవరు ?.... ఎవరు సప్పోర్ట్  లాగేస్తే కేంద్రానికి 
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే తెలుగోడు '' మనమేంది వాళ్ళను 
పొగడడం ఏమిటో . కలిసున్నా విడిపోయినా పక్క పక్క న ఉండాల్సిన 
వాళ్ళం ఆవేశం లో మాటలు జారుకుంటే సాయం అవసరం అయినపుడు పరిస్థితి ఏమిటి ?

సర్లెండి సినిమాకి పోతూ ఈ కధ  ఎందుకు ? 
మొత్తానికి వెళ్ళాము . నేను ఈయన ,పాప ,చెల్లి పిల్లలు భార్గవి రమ్య గౌతం 
ఇంకా మా అక్క కూతురు కాబోయే డాక్టరమ్మ సిరి . మా కుటుంభం లో 
ఏకైక బై . పీ  . సి . ఎం . బి . బి ఎస్ మొదటి సంవత్సరం . అసలు సినిమా 
ప్లాన్ తనదేనని తెలిసింది . మా బంగారు తల్లి . మొత్తానికి హీరో ఎన్నో 
సార్లు ట్రైన్ మిస్ అయినా నేను సినిమా మిస్ కాలేదు . 

ఇదిగో ఇదే హీరో కుటుంభం . వాళ్ళ నాన్న నూరు తప్పులు చేసాడు అని 
సొంత తమ్ముడినే ఇంట్లోంచి బయటకు పంపేశాడు . ఇప్పుడు అందరి గొడవలకి 
వెళ్లి సర్ది చెప్పే హీరో గారు తొంబై తొమ్మిది తప్పులు చేసి నూరో  తప్పు 
చెయ్యకూడదు అని కష్ట పడటమే సినిమా అంతా . వాళ్ళ కుటుంభం అంతా 
వాళ్ళ అన్న పెళ్ళికి తిరుపతికి బయలుదేరితే వాళ్ళ అమ్మ తాళి తీసుకురావడం 
మరిచిపోతుంది . 
అక్కడ మొదలు అయిన కధ తాళి తేవడం లో 
హీరోయిన్ ను కూడా చేర్చుకొని ఇంకో జంట కలపడం.... 
హీరో ఏమో షాద్ నగర్ లో ,ధోన్ 
లో కర్నూలు లో ఎక్కడి కక్కడ వేరే వాళ్ళ సమస్య లలో తల దూర్చుతూ 
ట్రైన్ మిస్ అవుతూ చివరికి చేరుకుంటాడ ... వాళ్ళ నాన్న నూరు తప్పులు 
అయ్యాయి అని తరిమేస్తాడా ?అనేది కధ . ముగింపు చెప్పెస్తాలే . సినిమా 
వచ్చి చాలా రోజులు అయిందిగా . తరమడు . వేయి తప్పులకు హద్దు పెంచుతాడు . 

కొత్త వాళ్ళు బాగా చేసారు అనే కంటే డైరక్టర్ బాగా చేయించుకున్నాడు అనొచ్చు . 
ప్రతి ఫ్రేం లో ఎడిటింగ్ కాని, ఫోటోగ్రఫీ కాని తన అభిరుచి చాలా బాగా 
కనిపించింది . హోలీ బాక్ గ్రౌండ్ లో ఫైటింగ్ ఎంత కలర్ ఫుల్ గా ఉందో !
ఇంకా ''మెల్లిగా మెల్లిగా '' పాట  అయితే ప్రతి ఫ్రేం ఒక చక్కటి చిత్రకారుడు వేసినట్లే ,
పాపం ఆ అమ్మాయి దుస్తులు పొదుపుగా వేసినా ఆ ఫ్రేం లో ఒక పువ్వుగా ఒదిగిపోయింది . 

ఇక హీరో కి బాగ్ ఇచ్చినోడి (యాద్ గిరి) కామిడీ ,టి . సి కామిడీ ,తాగుబోతు 
రమేష్ కామిడీ బాగున్నాయి . ఎడిటింగ్ ఏమవుతుందా అనిపించేటట్లు ఉంది . 
కధలో పెద్దగా బలం లేక పోయినా చక్కటి సంగీతం ,కధనం డబ్బులు వేస్ట్ 
కాలేదు అనిపించింది . 
పని కట్టుకొని చూడక్కర్లేదు కాని చూసే వీలు ఉంటె ,సినిమా చూద్దాము 
అనిపిస్తే ఈ సినిమాని ఎంచుకోవచ్చు . 
సినిమా అయిపోయాక వస్తుంటే చూసాను ,సీట్ లు కోసేసి ఉన్నాయి . 
హ్మ్ సిటీ అయినా ఇంతే ,బాల్కనీ అయినా ఇంతే . కోసేవాడికి పోయేదేముంది !
ఓనర్ కి తెలుస్తుంది దాని బాధ :(

2 comments:

Guruprasad B said...

ఫ్రతి రోజు మీ బ్లాగు చూస్తాను, ఇన్ని రొజులుగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉన్నాను. ఇప్పటికి తెలిసింది. రోజూ అనుకునేవాడిని. అక్క ఎందుకు బ్లాగు రాయటంలేదు అని. ఇప్పటికి అర్థం అయ్యింది. కారణం, ఒకప్పుడు బందుల పేరు చెప్పి బడికి పోనివ్వలేదు. అప్పుడు వాల్లెవరో మనల్ని పనిచేయనివ్వనందుకు ఇప్పుడు మళ్ళీ మనల్నే కస్టపెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అసలు. ఎంతమంది దీనివల్ల యెన్నిరకాలైన ఇబ్బందులను యెదుర్కుంటున్నరో వీల్లకి పట్టదా? పిల్లలకి ఇంక సరిగా సిల్లబస్ పూర్తి కాలేదు. వాళ్ళ భవిష్యత్తు యెమౌతుంది. ఇంతా చేసి సాధించింది యీమిటొ అర్థం కావడం లేదు.

ఇదంతా పక్కన పెడితే మా శశి అక్క ఇన్ని ఇబ్బందులలొ కూడా నాలాంటి వాళ్ళకోసం బ్లాగు వ్రాశారు. నేను కూడ యీమధ్యే చూశాను, సినిమా లొ హాస్యం చాలా బాగా ఉంది. కడుపుబ్బా నవ్వుకోవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చలా టూకీగా సినిమా గురించి సమీక్ష వ్రాసరు. చాల బాగుంది.

మీకు మీ కుటుంబానికి క్రిస్టమస్ మరియూ నూతన సంవత్సర శుభాకంక్షలతో,
గురుప్రసాద్ బి

శశి కళ said...

thank you guru prasad