Saturday 25 February 2012

వహ్వా.....చదువుల ''తల్లి''

తానె ఒక పాప.....తన వడిలో ఒక ముక్కు పచ్చలారని 
పసిపాప........ఏమి అందం.....అది తనలో పట్టుదల.


ఆడవాళ్ళకు  ఏమి అందం ......
చల్లని ప్రేమను కురిపించే నల్లని కళ్ళా
హరివిల్లుని దించి సంతోషాన్ని విరజల్లె కను బొమ్మలా 
చిగురాకు ఎరుపును చూచాయగా అద్దిన బుగ్గలా 
సింగారపు వన్నెలు నిండిన చీరలా 
మెరుపులు కురిపించే సొమ్ములా......


కాదు.....కానే కాదు.....


పట్టుదలతో వచ్చిన  జ్ఞానపు వికాసం ......
దానితోటి వెల్లి విరిసే ఆత్మా విశ్వాసం......


చూడండి ఆ పాపని(పాపే ....పెద్ద అమ్మాయి కాదు)
పట్టుదలతో తన వడిలోని చిన్నారితో 
పరీక్ష వ్రాస్తున్న పసిపాపను.......


నీళ్ళు  నిండిన మీ కళ్ళకి ........
తను భారత దేశపు మూడ విశ్వాసాలు,ఆడపిల్ల పై వివక్ష 
అనే పంకం నుండి వికసించిన పంకజం లో 
జ్ఞాన తేజస్సుతో వెలిగే చదువుల ''తల్లి'' లాగా 
కనపడటం లేదా.......


''అవును ఆడ పిల్ల  చదువుకోవాలి
తన కాళ్ళ పై తాను నిలబడటానికే కాదు 
తన తరువాతి తరాలను కూడా మంచి 
మార్గం లో నడపటానికి''
ఈ రోజు పేపర్ లోని ఫోటో నా హృదయాన్ని ఎంతో
కలచివేసింది.యెంత పసి బిడ్డ.....తనకు ఇంకో బిడ్డ....
ఇంతేనా భారత దేశం....మనమేమి చెయ్యలేమా .....



11 comments:

ఫోటాన్ said...

హమ్మ్...
పేదరికం కూడా ఇలాంటివాటికి కారణం కావచ్చు...

Anonymous said...

దీక్షా పట్టుదలా ఉంటే ఎదగడానికి ఏదీ ఆటంకం కాదు అని నిరూపించేలా వుంది .

Unknown said...

దీక్ష, పట్టుదలా, ఒడిలో పసి బిడ్డతో పరీక్ష రాస్తున్న "చదువుల తల్లి"...కవర్ చేసిన జర్నలిస్టూ...చూసి చలించి పోస్ట్ రాసిన మీరూ అభినందనీయులు. తప్పక ఆ తల్లికీ, ఆ బిడ్డకీ మంచి భవిష్యత్తుని ఆ "అపర సరస్వతే" తప్పక ఇస్తుంది.

Anonymous said...

good post,inspiring

రాజ్ కుమార్ said...

హ్మ్మ్...:(

సుభ /Subha said...

Intresting!!

శశి కళ said...

హర్షా...పెదరికమె కాదు ,ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.



అవును లలితగారు


చిన్ని ఆశ గారు...చదివి మంచి కామెంట్ తొ అభినందించిన మీరు కూడా అభినందనీయులు...నాకసలు
ఆ జర్నలిస్ట్ ను అభినందించాలని బాధలొ గుర్తు రాలెదు.థాంక్స్

శశి కళ said...

అనానమస్ గారు,రాజ్,సుభ థాంక్యు

Kalyan said...

అవధులేని వికాసానికి ఈ సబలే ఒక సాక్ష్యము ..... దేశాలు మారితే ప్రపంచ పటం మారుతుందేమో కాని.. మనుషులు మారితేను దేశ ప్రగితిలో మార్పువస్తుంది...

జైభారత్ said...

(ఇంతేనా భారత దేశం....మనమేమి చెయ్యలేమా .....)చాలానే చేయాలి...కానీ...ఇప్పుడు చూసారు కదా మన వాళ్ళ స్పందన..అంతే..ఎవరో చేయాలి మనం చూస్తూ ఉంటాము..అంతే..మారదు లోకం.

శశి కళ said...

avunu lokanaadh gaaru