Thursday 8 March 2012

''మహి'' లో ''మహి''ళా....ఒక దినోత్సవం

బస్ ఉన్నట్లుండి ఆగేసరికి మెలుకువ వచ్చింది.
బస్సు ను ఆపి ఎదురుగా వచ్చే కాన్వాయ్ ని పంపిస్తున్నారు.
ఎవరబ్బా?.......అదిగో చంద్రబాబు నాయుడు మా వారు చూపించారు.
ఓహో ఎలక్షన్ ప్రచారం కోసం ఎయిర్ పోర్ట్ లో దిగి వస్తున్నట్లున్నాడు.
మెలుకువ వచ్చింది కదా అని చుట్టూ పరిశీలించాను.దూరంగా 
తిరుపతి కొండలు చాలా రోజుల తరువాత వస్తున్నా నన్ను పలకరిస్తూ 
ఆప్యాయంగా ఆకాశానికి నన్ను చూపిస్తూ ఉన్నాయి.
ఇంతకూ ముందుల కాకుండా రేణు గుంట దగ్గర బైపాస్  లో  నుండి 
బస్సు లు వెళుతున్నాయి.దూరంగా కొండపై నుండి నామాలు కనపడుతూ నన్ను దీవిస్తూ ఉన్నాయి.....మామూలుగా పెళ్లి రోజుకు తిరుపతికి వచ్చేవాళ్ళం.
తిరుమల కాకపోయినా ఏదో ఒక గుడి చూసేవాళ్ళం.
ఈ సారి అంతా హడావడి.ఇప్పుడైనా కళ్యాణ్ గారి రిక్వెస్ట్ తో 
బయలుదేరాము.


బస్ స్టాండ్ కి రమాదేవి మేడం గారు వాళ్ళ స్టూడెంటే కార్ తీసుకు రావటం 
వాళ్ళపై నా గౌరవాన్ని ఎంతో పెంచింది.దారిలో మేడం గారు వాళ్ళ 
institutions గూర్చి చాలా చక్కగా వివరించారు.ప్రస్తుతం వెళ్ళేది 
''GATE'' పి.జి. కాలేజ్.M.B.A.,M.C.A,B.C.A, పిల్లలు ఒక చక్కని 
సమైక్యతతో ఈ రోజు మహిళా దినోత్సవం జరపాలని ప్లాన్ చేసుకున్నారట.
ఒక్క రోజులో ప్లాన్  చేసుకొని కూడా......రమాదేవిగారు,జ్యోత్స్న గారు,విద్యుల్లత గారు 
తమ విద్యార్దులను ఎంకరేజ్ చేస్తూ చక్కటి ప్రోగ్రాం చేయటం అభినందనీయం .
అబ్బాయిలు కూడా మహిళలపై తమ గౌరవానికి  సూచికగా చాలా చక్కగా 
హెల్ప్ చేస్తున్నారు.


నేను మా వారు లోపలకు అడుగు పెట్టగానే చుట్టూ చూసాను.ఇంతకు ముందు 
''అక్షయ మానసిక వికలాంగుల కేంద్రం'' కు వెళుతూ ఆ దారినే వెళ్ళాము.
ఒక్క సారి మానసిక వికలాంగులందరూ మెదిలి మనసు కలత పడింది.
ఒక్క సారి తల విదిలించేసి కాలేజ్ ని చూసాను.చక్కగా ఉంది కాలేజ్.
చీఫ్ గెస్ట్ వచ్చారు అనే గౌరవంతో వాళ్ళు వచ్చి చక్కగా పూలతో ,ఆప్యాయతతో 
ఆహ్వానించారు.(వాళ్ళ కళ్ళలో ఒక మంచి పని చేస్తున్నాము అనే తృప్తి....
ఏ పనైనా మేము చక్కగా నిర్వహించగలము  అనే ఆత్మ విశ్వాసం....
''మహిళల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారా నేర్పించినన్''.....స్త్రీ శక్తీ తెలిసిన 
వారి మాట)


తరువాత వైస్ ప్రిన్సిపాల్ మూర్తి గారు,ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ గారు,
కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా పలకరించారు.
జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం మొదలు అయింది.ఇక్కడ అన్నపూర్ణ  అనే 
అమ్మయి గూర్చి చెప్పాలి.ఎక్కడ అలుపు,బయం అనేదే లేకుండా అందిరిని 
ఆహ్వానించటం స్పీచ్ కి రిక్వెస్ట్ చెయ్యటం ,పది నిమిషాలే అని కన్విన్స్ చెయ్యటం 
ఎవరికి లోపం కాకుండా చూసుకోవటం .....అసలు యాంకరింగ్ చాలా బాగా 
చేసింది.మంచి కమ్యునికేషన్ స్కిల్ల్స్ ఉన్నాయి తన దగ్గర (పిల్లలో చాలా మంచి 
స్కిల్ల్స్ ని మనం సాన పెట్ట వచ్చు ఇలాంటి సందర్భాలు ఏర్పాటు చేస్తే)


ముందుగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడి మహిళలు ఆప్యాయత,ప్రేమకు 
నిలయాలు.కాని చిన్న లోపం ఉంది.పెళ్లి అయిన తరువాత అత్తామామల్ని 
కూడా మన పేరంట్స్ లాగే చూడ గలగాలి.అలాగే ముసలి తల్లి తండ్రులను 
బాగా చూసుకోవాలి.....అని చెప్పి వాళ్లకు స్పూర్తి నిచ్చారు.
తరువాత నాతొ మేడం నేను ఇంకో దగ్గరకు వెళ్ళాలి ఉండలేకపోతున్నందుకు 
సారి అని గౌరవంగా  చెప్పి వెళ్లి పోయారు.


రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లలను నవ్విస్తూ ఇప్పుడే వాళ్ళు మాట వినటం లేదు 
వాళ్ళదే అధికారం కాబట్టి మాకు జెంట్స్ డే  కావాలి అని చెప్పారు.
తరువాత అమ్మాయిలు చక్కగా పని చేస్తూ,చదువుతూ మంచి స్తాయిలోకి 
రావాలని ఆకాంక్షించారు.మూర్తి గారు మాట్లాడుతూ తన భార్య తన జీవితం 
లోనికి రావటం తన అదృష్టమని తన హృదయం లో ఆడవాళ్ళ పైన గల 
గౌరవాన్ని తెలియ చేసారు.
ఇద్దరు అమ్మాయిలూ మాట్లాడారు.వ్రాసుకొని వచ్చిన విషయమే అయినా అలా 
అందరి ముందు మాట్లాడటం వారి స్కిల్ల్స్ ను మెరుగుపరుస్తుంది.చాలా మందిలో 
ఎంతో జ్ఞానం ఉంటుంది....కాని చెప్పటం రాక పోవటం వలన తమ జ్ఞానాన్ని ,
విద్వత్తుని ఇతరులకు చూపలేక పోతారు.ఇలాటి సందర్భాలలో పాల్గొనటం వలన 
తమ సంభాషణ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు.


ఇప్పుడు నా వంతు....ఏమి చెప్పాలి....ఎదిగే పిల్లలు వాళ్ళు.మనం 
వాళ్లకి తమ జ్ఞానాన్ని  అందిస్తామని ఇలా పిలిచి సన్మానం చేసి 
దీవించమని అడుగుతున్నారు.
భారతీయ భావాల్ని ఒక్క సారి గుర్తు చేయటం కన్నా వాళ్లకు నేను ఇవ్వగలిగిన 
అమూల్యమైన కానుక లేదు అనిపించింది.అదే చెప్పాను.భారతీయులకు 
స్త్రీ శక్తి గౌరవించి వాడుకోవటం ద్వారానే జాతి గొప్పది కాగలదని తెలుసు.
అందుకే''యత్ర నార్యంతు పూజ్యంతే....తత్రే రమంతు దేవతా''.....
మీ భాగస్వామిని మీరు గౌరవంగా చూడగలిగి నపుడే మీ  ఇల్లు దేవాలయం 
కాగలదు అని చెప్పాను.
ఆడ పిల్లలకి ''వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు''మీరు వ్యక్తిత్వం 
తో నిరంతరం నేర్చుకుంటూ వెలుగుతున్నపుడే ఇతరులకు జ్ఞానాన్ని అందించగలరు.
వారికి దారి చూపగలరు.మీ ఇంటిని ఉన్నతంగా తీర్చి దిద్దుకోగలరు చని చెప్పాను.


ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి.ఒకరు మాట్లాడుతూ ఆడ వాళ్ళు బట్టలు విషయం 
లో జాగ్రత్తగా ఉండాలి తరువాత మమ్మల్ని అని ఏమి ప్రయోజనం అన్నారు.
దీని గూర్చి నేను ఏమి కామెంట్ చెయ్యను.ఎందుకంటె మా మిత్రులు  ఒకరు
చెప్పినట్లు....''ఒకరు ఒకలా మారటానికి వేయి కారణాలుంటే,ఇంకొరు ఇంకోలా 
ఉండటానికి కోటి కారణాలుంటాయి....'' (raji-fukuoka.blogspot.com )


కాని ఒక మొద్దు పిల్లవాడు ఉంటాడు.యేమిరా హోం వర్క్ చెయ్యలేదు 
అంటాము .పెన్సిల్ లేదు అంటాడు.మళ్ళా పెన్సిల్ ఇస్తాము ....ఇంకా యేమిరా 
అంటే....నోట్స్ అయిపొయింది అంటాడు....నోట్స్ ఇస్తాము....ఇంకా యేమిరా 
అంటే జ్వరం అంటాడు......వాడిలో చెయ్యాలి అనే కోరిక లేక పొతే ఒక కారణం 
తరువాత మరో కారణం పుట్టిస్తూనె  ఉంటాడు....దీనికి  అంతం ఎక్కడ?
మనిషి నైతిక విలువలకు ప్రాధాన్యం పెరిగితే తప్ప.....
కారణాలు చెపుతూనే ఉంటారు.


సన్మానం తరువాత వాళ్ళ ఆదరాభిమానాలను హృదయం లోని జ్ఞాపకాలుగా 
మార్చుకొని సంతోషంగా బస్ స్టాండ్ కి వచ్చేసాము.బ్లాగర్ కళ్యాణ్ గారు 
(kalyan gari blog link ) మాతో బస్ ఎక్కించే దాక ఉన్నారు.ఆప్యాయంగా 
''ఉంటాను అక్కా''అని వీడుకోలు ఇచ్చారు.
నాకు కాలేజ్ లోనే తెలిసింది అందరిని ఈవెంట్ పెట్టుకునేలా ఎంకరేజ్ చేసి
హెల్ప్ చేసింది కల్యాణ్ గారె అని.ఇంత  చిన్న వయసులో ఎంతటి సంస్కారం.


''అవును పైకి చెప్పక పోయినా ఇప్పటి వారిలో స్త్రీలపై గౌరవం భారతీయతా 
శ్వాస నిలిచి ఉన్నాయి''
కాని వారిని సమాజ సేవలో భాగస్తులను చేసేలా ముందుకు నడిపే 
వివేకనందులు లేక పోవటమే లోపం.

No comments: