Monday, 4 June 2012

ఇష్ ....ఇష్హో....ఇష్.....

ఇష్ ....ఇష్హో....ఇష్.....

ఆ మంచి నీళ్ళు ఇటు ఇవ్వండి.
ఎక్కడ ఉన్నాయి ...అయి పోయినాయి...
వచ్చే స్టేషన్ లో అయినా దిగి తీసుకుని రండి.

ఆ రోజు ''శనివారం జూన్ రెండు 
ఉదయాన్నే పది నలబై రెండూ...."
మేము బాబు ని ఇంజనీరింగ్ చేర్చటానికి విజయవాడ 
కృష్ణా ఎక్ష్ప్రెస్స్ లో వెళుతున్నాము.ఉదయం ఎనిమిది గంటలకు 
మొదలైన మా ప్రయాణం ఇదిగో ఇలాంటి మాటలు వింటూనే జరుగుతుంది.

ఎండలా అవి...బాబోయ్...ఇష్హో...ఇష్హు....అసలే ట్రైన్ ఆగేది 
రెండు నిమిషాలు.అ రెండు నిమిషాల్లో నే అందరు బాటిల్స్ 
పట్టుకొని దిగటం ...మళ్ళా ట్రైన్ కదులుతుందని ఎక్కటం.
కొన్ని స్టేషన్ ల లో అయితే నీళ్ళు కూడా లేవు.

అంతా జనాలే.సెలవల నుండి వచ్చేవాళ్ళు,తీర్ద యాత్రల 
నుండి వచ్చేవాళ్ళు .....నిలబడను కూడా స్తలం  లేదు.
మళ్ళా బయట నుండి వేడి గాలులు.విజయవాడ కు వెళ్ళేటప్పటికి 
ప్రాణం సోమ్మ సిల్లి నట్లు అయింది.

ఎలాగో ఆ కోనేరు లక్ష్మయ్య యునివర్సిటి అడ్రస్ తెలుసుకొని 
వెళ్ళాము.అడుగు పెడుతుండగానే ఎత్తుగా ఎదిగిన వక్కల చెట్లతో 
స్వాగతం పలుకుతూ చల్లగా అనిపించింది.కాలేజ్ ఇంకా కొంత 
ఎక్స్తేటెన్షన్  చేస్తునారు.ఎలాగో మాట్లాడి ఫి కొంత కట్టేసి వచ్చాము.
అంతే ఇంక వాడు కాలేజ్ లో చేరినట్లే....ఇప్పుడు కొంచం దిగులుగా 
అనిపించింది.వీడు ఎప్పుడూ మాకు దూరం గా ఉండలేదే అని...

''పదినెలలు పెట్టినా  అమ్మ 
స్పర్శను వీడను అని  ఉన్న వాడు...

పది అడుగులు వేసినా అమ్మ ఉందా వెనుక 
అని చూచిన వాడు....

చిట్టి పాదాల తో హృదయాన్ని తట్టి 
లేపిన వాడు.....

గోరు ముద్దలతో పొట్ట నింపితే 
చిరు నవ్వులతో ఇల్లు నింపిన వాడు ...

నేడు చదువుకై ప్రపంచపు దారిలో 
అమ్మను వదిలి సాగిపోతున్నాడు ...

రెక్కలు వచ్చిన పక్షి గూడు వదలకుండా 
ఉంటుందా?

నీళ్ళు నిండిన నది సాగరం వైపు కదల కుండా ఉంటుందా?

భారం గా మారిన అమ్మతనం 
అశ్రు కణం గా మారి వెలికి రమ్మంటే 
నీ వ్యక్తిత్వానికి తగదు రాను అంటుంది...

ఏమి చెయ్యగలను .....ఇంక నా బాబు కోసం ...
ఆత్మీయతను,ఆశీస్సులను 
ఆ చిన్నారి రెక్కలకు బలం గా పంపటం తప్ప...."


విజయవాడ బస్ స్టాండ్ కు వచ్చిన తరువాత ,పుస్తకాల 
షాప్ లో ఒక పుస్తకం చూసి వాడికి నా గుర్తుగా కొనిచ్చాను.
అమ్మ గుర్తుకు వస్తే చదువుకో అని.దానిలో ఏముందో 
నాకు తెలీదు.కాని నన్ను ఆకర్షించింది.దానిలో కొన్ని పేజెస్ 
మీ కోసం .మరి అందరి ఆశీసులు మా వాడికి ఉంటాయని ఆశిస్తున్నాను .












17 comments:

మాలా కుమార్ said...

రెక్కలు వస్తున్నా కొద్ది చిన్న చిన్న గా వాళ్ళ ప్రపంచం లోకి వెళ్ళిపోతారు . అది సహజం అమ్మ కళ్ళు మసకబారటమూ సహజమే !
All the best to yor son .

శశి కళ said...

హ్మ్మ్...అంతే నండి .మాల గారు ఏమి చెయ్యగలం

జలతారు వెన్నెల said...

మా పాప కూడా last year college ki వెళ్ళిపోయినప్పుడు బాధగా ఇలాగే అనిపించిందండి. My best wishes to your son!

వనజ తాతినేని/VanajaTatineni said...

ఓహ్.. బిడ్డ అమ్మకి దూరమైన తరుణం భవిత కోసమే కదా!
దిగులు పడకు శశి.
మాకు దగ్గరలోనే కదా! నేను ఉన్నాను కదా!
బాబుకి ఆశీస్సులు.విధ్యావినయ సంపన్నత తో..ఎదిగి ఒదిగి.. శశి-సురేష్ లకన్నా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ..
బాబుకి ఆశీస్సులు శశి.

శశి కళ said...

యెంత మంచి మనసు వనజక్క నీది.ఇప్పుడు నాకు కొంత ధైర్యం వచ్చింది.నేను ఇక్కడికే గా పంపాను.నువ్వు అయితే వేరే దేశానికి కూడా పంపావు మీ బాబుని.

శశి కళ said...

జలతారు వెన్నెల గారు అనుభవించారు కాబట్టే మీకు అర్ధం అయింది.థాంక్యు

sunita said...

Best wishes to your son!

శ్రీలలిత said...

మీ బాబుకి మంచి పుస్తకం ఇచ్చారు. మీ ఆశీస్సులతో, అందులోని సారాన్ని గ్రహిస్తూ, ఉన్నత విద్యావంతుడు అవడమే కాకుండా మంచి వ్యక్తిత్వం కల మనిషిగా కూడా ఎదగాలని ఆభగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. All the best..మీకూ, మీ బాబుకీ కూడా..

హరే కృష్ణ said...

ఇలాంటప్పుడే ధైర్యం గా ఉండాలి శశి గారు
అబ్బాయికి శుభాశీస్సులు, విజయోస్తు

మీరు ఇలా బాధతో కుంగిపోవడం నాకు నచ్చలా
వీధి చివర థియేటర్లో ఆడుతున్నా ఆ అధినాయకుడు సినిమా చూసి రండి కష్టాలంటే ఏంటో రెండున్నర గంటల్లో తెలుస్తాయి :)

జ్యోతిర్మయి said...

పిల్లలను వదిలిరావాలంటే చాలా కష్టం. వచ్చే సెలవల కోసం ఎదురు చూడడం గొప్ప ఆనందంగా ఉంటుంది. మీరు త్వరలో అలాంటి టపా వ్రాయాలని కోరుకుంటున్నాను. మీ బాబుకి నా ఆశీస్సుల౦డీ..

శశి కళ said...

జ్యోతి గారు అది ఎలాగుంటుందో ఇంకా అనుభవం లేదు.
మీరు చెప్పినట్లు బాగుంటే టపా వేస్తాను ...థాంక్యు...))

శశి కళ said...

హరేఏఏఏఎ....)) అధినాయకుడు చూసే బదులు...మా పాప ని కూడా హాస్టల్ లో చేర్చటం బెటర్...అయినా బాల కృష్ణా ని గుర్తు చేసినందుకు ..))

శశి కళ said...

సునీతా గారు థాంక్యు.



శ్రీ లలిలత గారు నేను కూడా అలాగే కోరుకున్తునాను.
మీ అభిమానానికి థాంక్యు

ఫోటాన్ said...

ఈ బుక్స్ నా దగ్గరా వున్నాయి..
లోన్లీ గా వున్నప్పుడు ఇవి చాలా ధైర్యాన్ని ఇస్తాయి..:)
My Best wishes to Nivas.

Anonymous said...

all the best to nivas ,mee babuni kuda mee papalo chusukoni badanu marchipondi...........

శశి కళ said...

thank u harsha


thanks anonymus garu..peru vrasi unte baagundedi.papa matram mana daggara yenni yellu untundandi.
yeppatikaina naku aayana,aayanaku nenu pilalam ante ...

Ennela said...

Dear sashee,
unnattundi konchem sunday madhyahnam time doriki, mee blog varasapetti chadivi padesaa...nice nie nice...

peddodu university hostel ki velutunnappudu akkillu gukkillu yedupulu. chinnodu velutunnappudu venakki tirigi" amma, yedo miss ayyinattundi annaadu" "yentamma ante, "neeku naakante annayya antey yekkuva ishtam" anesaadu. ledule naanna, alaa vadili undadam alavaatu chesukovaali kadaa..annayya daggaragaa untaadu kaabatti vaaram vaaram vachchestaadu, nuvvu dooram kadaa benga padathaavani amma orchukuntondi annaaru maa vaaru. modatanthaa jokes vesinaa, yee saari bhorumandam vaadi vanthayyidi....!!!bhale baadha vesindi...can never forget those moments..