Wednesday, 6 June 2012

యెంత ఘోరం......హ్మ్మ్...

నిజంగా యెంత ఘోరం.......ఒక ముస్లిం ఆడ పిల్ల పై 
ఇచ్చిన తీర్పులో హై కోర్ట్ ముస్లిమ్స్ పదిహేను ఏళ్ళు దాటితే 
ఇష్ట పూర్వకంగా వివాహం చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిందంట.


అసలు ఏ మతం అయితే ఏమిటి ....అసలు పదిహేనేళ్ళు ఒక చిన్న
పసి మొగ్గ....నిజంగా ప్రపంచమే తెలీని ఒక చిన్ని చేప....మరి తనకు 
ఏది మంచిదో ఎలా తెలుస్తుంది.మరి ఈ తీర్పు ఎందుకు ఇలా ఇచ్చారో 
నాకు తెలీదు.....ఏది మంచిది ఏది కాదో కూడా నాకు తెలీదు.


కాని ఒక ఎదగని పసి పాప మనసే పదిహేను ఏళ్లకు ఉంటుందని 
నాకు తెలుసు.కనీసం తనను అందరు ఆడదాన్ని గా చూస్తారు
అని తెలీనంత.......తను అందరిలాగే మనిషి అనుకునేంత అమాయకత్వమే 
తనలో ఉంటుంది.ప్రపంచం అంతా రంగుల లోకం లాగే కనిపిస్తుంది.
మరి ఈ తీర్పు ఎలాగా ఆమోదించటం....ఏమో దీనిలో ఎన్ని కోణాలు 
ఉన్నాయో...కాని ఎటు వెళ్లి పోతుంది భారత దేశం ....కష్టపడి 
అమ్మాయి పెళ్లి వయసు పద్దెనిమిది అని తీసుకోచ్చాము.....కనీసం 
తను శారీరకం గా అయినా సిద్దపడుతుందని....మళ్లా దేశాన్ని 
బాల్య వివాహం లోకి తీసుకెళ్ళి పోతారా ఏంది.....


ఎన్ని గండాలు దాటి ఈ దేశానికి వస్తుంది 
ఒక ఆడపిల్ల....లోకం లో ఎన్ని రంగుల్నో 
ఊహించుకుంటూ.....ఏమి ఇస్తాము తనకి వివక్షల 
స్వాగత గీతాలు........


అవును నాకెందుకు బాధ ఇందరికి లేనిది....
వద్దు..నాకేమి తక్కువ.....నేను ఎందుకు 
బాధపడాలి.......


నా హాస్టల్ నుండి శేలవలకు వెళ్ళిన పిల్లలు వచ్చేటపుడు 
మెళ్ళో తాళి,కళ్ళలో నీళ్ళు.....అయినా నాకెందుకు?


పెళ్లి జరిగిపోయింది,వాడు తాగి తన్నితే పెటాకులు 
అయిపొయింది,పసి మొగ్గ మొగ్గగానే కలల జీవితాన్ని 
రాల్చేసుకుంది.....నేను ఎందుకు బాధపడాలి.....


తన్నులే ఇచ్జ్హ్చాడో వాడు ఆ చిన్నారికి,జబ్బులే ఇచ్చాడో....
నేను ఎందుకు బాధపడాలి.....మనసు భారం చేసుకొని 
టి.సి.ఇచ్చేస్తా అంతే......నేను చేసేది ......తనను ఎవరు 
ఈ దేశం లో పుట్టమన్నారు....అదీ ఆడపిల్లలాగా.....




''ఎన్ని గండాలు చిన్ని పాప నీకు 
మొగ్గగా చిరు ఊపిరి పోసు కుంటూ ఉంటేనే 
వివక్షల పరీక్ష గుచ్చు కుంటుంది.......


కలలను మొదలంటా తున్చేస్తూ ఊపిరిని 
తుదకంటా లాగేస్తుంది......


కాదు కూడదంటూ మొండికేస్తే 
వడ్ల గింజకు పని పెడుతుంది .....


అమ్మతనం అడ్డు పడితే ముళ్ళ కంచెకు 
ఉరి వేస్తుంది.....


కుక్కలకు భయపడితే 
కాలవలో విసిరేస్తుంది.....


కాలాన్ని ఎదిరిస్తే 
నువ్వు ఊపిరి పీలిస్తే అడుగడుగునా 
కీచకులే....
వయసుని మరిచి 
మానవత్వాన్ని విడచి 
కోరికల గుర్రాలు తొక్కి చంపుతాయి ....


ఆల్చిప్పలో ముత్యం లా 
యవ్వనం ఒలికి వస్తే 
వలపు వలలు ,ప్రేమల గాలాలు 


చిరు చేప లా చిక్కి నీవు 
ఆట బొమ్మలా అమ్మ బడుతావు 
అంగడి బజారులో కొనబడతావు....


కోరికల కొలిమి లో 
మోసపోయి రెక్కలు విరిగి 
జబ్బులతో రాలిపోతావు 


జీవితానికి విలువ లేదా అని అడిగితె 
ఆడ పిల్లగా పుడితే ఇంతే .....
ఇక పుట్ట వద్దు  అంతే.....


కంచే చేను మేస్తే కాచేదేవ్వరు ?
చట్టాలే వినకుంటే న్యాయం చెప్పెదేవ్వరు?







13 comments:

జలతారు వెన్నెల said...

What kind of nonsense అండి ఇది? ఛీ!! మీరన్నట్టు "మళ్లా దేశాన్ని

బాల్య వివాహం లోకి తీసుకెళ్ళి పోతారా"...నిజమే అలాగే ఉంది చూస్తుంటే! ముస్లిం అయితే ఎంటి , హిందు అయితే ఏంటి? మీ కవిత కదిలించేలా ఉంది..ఇలాంటివి ప్రతిఘట్టించరా ఎవ్వరు? పైగా చూడండి.. 16 to 18 years వరకు చచ్చినట్టు పడి ఉండాలి, 18 years కి major అయ్యాక she can get separated if she likes aa? ఈ లోగా విడిపోవాలనుకుంటే? అప్పుడు మాత్రం వీలు లేదా? May God save the judiciary system in India!

durgeswara said...

ఇది ఓటుబ్యాంకుల రాజ్యమమ్మా ! ఏనీతి చెప్పాలన్నా ,తప్పులెన్నాలన్నా మెజారితీలమీదనే కాని మైనారిటీలవిషయంలోకాదు.
ధర్మాన్ని ధర్మంగా చూదగలిగే దమ్ములేని దద్దమ్మల పాలన ఇలాగేఉంటూంది . మీతో పాటు మేమూ బాధపడుతున్నాము ,ఏ మీ చేయలేని చేతగానితనానికి.....

వనజ తాతినేని/VanajaTatineni said...

కళ్ళు లేని న్యాయస్థానం అంటారు అందుకే! ఆ కేసులో ఏవైనా ఇతర కోణాలు ఉన్నప్పతకి కూడా పదునైదు ఏళ్ళకి వివాహం..ప్చ్.. కసుకాయాలని కోసి.............. వద్దు ..అమాయకత్వం వీడని వారిని బలిచేయడానికి రెడీగా ఉన్నంతవరకు మనం ఏం చేయలేం. :(
బాగా స్పందించారు . మీతో నేను అంగీకరిస్తున్నాను.

జ్యోతిర్మయి said...

ఏ చట్టాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తీర్పులిస్తారో...మీ కవిత కదిలించేలా ఉంది శశిగారూ...పదిహేనేళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళా..:(((

రాజ్ కుమార్ said...

హ్మ్.... ఏమయ్యిందీ కోర్టోళ్ళకీ??
నాకేం చెప్పాలో కూడా తెలీట్లేదు..

Anonymous said...

Any thing is possible in INDIA that is BHARAT

Unknown said...

మతానికీ వయసుకీ లింక్ పెట్టి కోర్టుకి ఇలా చట్టాలు చెయ్యొచ్చో లేదో తెలీదు కానీ...ఇది మారే కాలంతో పెరిగే ఛాందస్సుకి నిదర్శనం...
కవిత తో కదిలించారు ప్రతి హృదయాన్నీ....

Anonymous said...

painful

హరే కృష్ణ said...

ridiculous :(

శశి కళ said...

jalataaru vennela gaaru..meeru cheppindi chalaa satyam.meeru naalaage aalochistunnanduku chala santosham...thaankyu

శశి కళ said...

nijame durgeswara rao garu..anta rajakeeyaalu...yevaru manchi goorchi aalochinchatame ledu...thanku

శశి కళ said...

vanajagaaru...yemi cheddamu..hmm..


jyothi gaaru chakkaga spandinchaaru thank u

శశి కళ said...

raaj,kashtepali garu ,chinni aasha gaaru ,purnapandapani garu,andy inta mandi spandinchinanduku manavatvam meeda naaku nammakam kalugutundi...thanku