Saturday 16 June 2012

నాన్నకు నమస్సులు....చెట్టులా చల్లగా చూడు...

''ఎందుకు పిల్లలు నాన్న దగ్గర ఉండకుండా అమ్మ దగ్గరకే 
వెళుతుంటారు''అడిగింది మా పాప వాళ్ళ తమ్ముడిని....


''ఏముంది నాన్నలు ఎప్పుడూ రూల్స్ అంటుంటారు 
అందుకని''చెప్పాడు బాబు.


మొన్న వీడు  సీనియర్ ఇంటర్ పాస్ అయ్యాడని తిరుమలకి వెళ్ళాము.
క్యు లో చిన్న,చిన్న పిల్లలతో వీళ్ళు తెగ ఆడుతున్నారు.
అప్పుడు వీళ్ళకు వచ్చిన డౌట్ ఇది.


అవును నాన్న రూలర్......నాన్న హిట్లర్......నాన్న చండ శాసనుడు....
మరి తన మనసులోని సలలితమైన హృదయం ఎవరికి తెలుసు?
కటినత్వం వెనుక ఉన్న కమ్మని భాద్యత ఎవరికి తెలుసు?
తను సర్దుకొని తన మనసులో యెంత మందికి చోటిచ్చాడో,
ఎన్ని భాద్యతలు కళ్ళ నీళ్ళు  గుండె గుమ్మం దాటి రాకుండా మోసాడో 
ఎవరికి తెలుసు?


ఎపుడు వచ్చేస్తుంది ఇంత కమ్మని భాద్యత తెలీకుండా తన జీవితం  లోకి .....


కాంతులీను నక్షత్రాలు జీవం పోసుకొని 
తన ప్రతిరూపంగా చేరపోతున్నారనే 
కమ్మని కబురు విన్నప్పుడా....


పొట్ట మీద మృదువుగా నిమిరినపుడు 
తగిలిన చిన్ని తల నీ తోడూ కావాలి అని 
కోరినపుడా......


ఏదో తెలియని అందం ఎద లోతుల్లో సుడి తిప్పుతుంటే 
తుళ్లిపడి పెదాల్ని ఇంకా రూపుదిద్దని రూపానికి అద్దినప్పుడా.....




ప్రసాదపు పొంగలి అంత  మెత్తగా,పవిత్రంగా 
తన అరచేతుల్లోకి చిన్ని ప్రాణి చేరినపుడా....


చిరు నవ్వుల జిలుగులతో ఎత్తుకొని 
ప్రపంచపు దారులు చూపమని చేతులు 
చాపినపుడా......


వేలు పట్టి నడుస్తూ మనకు  లోకాన్ని 
మరో కోణం లో చూపినపుడా.....


తనయులు తెలీకుండానే మనలో భాగమై త్యాగం లోనే 
ఆనందం  ఉన్నదని  హృదయాన్ని తృప్తితో నిమిరినపుడా....


పిల్లలే జీవితం...పిల్లల కోసమే జీవితం......
పిల్ల విజయమే తన విజయం.......


అమ్మ ప్రేమల పందిరి హత్తుకుంటే ఆనందం.....
కాని ఆ పందిరికి తండ్రే ఆలంబనం.......


తండ్రి చెట్టు.....
తల్లి చెలమ.....
దొరికిన వాళ్ళకే జీవిత మధురిమ.


HAPPY FATHERS DAY 


ఎందరో చక్కగా భాద్యత చూపించి పిల్లలను 
సమాజానికి అందించిన నాన్నలు.
వాళ్ళు అందరికి ఈ పోస్ట్ అంకితం.


ఈ రోజు సాక్షి ఫ్యామిలి లో నాన్నల పేజ్ మీ కోసం 







12 comments:

హరే కృష్ణ said...

బాగా రాసారు శశి గారు
happy fathers day!

kiran said...

శశి గారు ..నాన్న గ్రేట్..!!
హ్యాపీ హ్యాపీ ఫాదర్'స డే

మాలా కుమార్ said...

నాన్న గురించి మీరు రాసింది బాగుంది .
హాపీ ఫాదర్స్ డే .

tree said...

nice chakkani kavitha, manchi visleshana.

సీత said...

happy fathers day sasikala garu......
good article baaga vraasaaru

జ్యోతిర్మయి said...

చక్కని పదాలతో మనసును స్పృశించే అనుభూతల హారం మీ కవిత.

శశి కళ said...

అండి,పద్మర్పితగారు,కిరణ్,మాలా కుమార్ గారు
ట్రీ గారు,సిట గారు,జ్యోతిర్మాయీ గారు
అందరికి మరో సారి అభినందనలు ...థాంక్యు

Anonymous said...

/ప్రసాదపు పొంగలి అంత మెత్తగా/
కవిత్వమంటే తెలియదు కాని, ఈ లైనుల్లో మీ కవిత్వం బాగా రుచిగా వుందండి. :D

జలతారు వెన్నెల said...

నాన్న మనసు గురించి ఎంత బాగా చెప్పారో! చాలా బాగుందండి శశి కళ గారు!

Sri Valli said...

Chala bavundi me poem....Happy Fathers day :)

శశి కళ said...

శంకర్ గారు,జలతారు వెన్నెల గారు థాంక్యు

శ్రీ said...

మీ పోస్ట్ కొంచెం లేట్ గా చూసాను,,,
చాలా బాగా వ్రాసారు శశికళ గారూ!
అభినందనలు మీకు...
@శ్రీ