Thursday, 12 July 2012

ఎలాగున్న సంతోషంగా ఉండాలని అనుకుంటే....

''నువ్వు ఎలా ఉన్నా సంతోషంగా ఉండటానికే 
నిర్ణయించుకొని జీవిస్తుంటే అదే ధ్యానం ''......ఓషో.

ఇపుడే సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు మొత్తం 
దేశం లో గల అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఉన్న 
అందరం కలసి సామూహిక ధ్యానం చేసాము.
సంకల్పం ఏమిటంటే దేశం లో సకాలం లో సరిగా వర్షాలు పడాలి.
అది పత్రీజి గారి మేస్సేజ్.బహుశా మాస్టర్స్ ఎవరైనా 
ఆయనకు ఇచ్చి ఉంటారు.
ఇంత కంటే మంచి అవకాశం రాదులే ....
ఒక మంచి సంకల్పం తో గంట ఉండటానికి అని వెళ్లి వచ్చాను.

మనకు మన జీవితం లో కొన్ని విషయాలు లేక 
వ్యక్తులు నచ్చక పోవచ్చు.కాని అవన్ని మనకు సమతుల్యతలోనే 
ఉన్నాయని అవి మనకు మంచి చేస్తాయి అని భావిస్తే 
జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది.అప్పుడు జీవితం ఎలాగా 
ఉంటుందంటే ''కమ్మని పాటకు రూపం వస్తే అది నీలాగే 
ఉంటుందని ''అని సంతోషంగా అన్ని ఇబ్బందుల్లో కూడా 
పాడుకోగలం.

ఇబ్బందిని కూడా మన జీవితం లోకి ఎలా తీసుకోవాలో 
వివేకానందుని కధలో ఉంది.
దక్షిణేశ్వరం లో పంచవటి అనే చోట వివేకానందుల వారు 
ధ్యానం చేసుకొనే వారు.అక్కడ సాయంత్రం సైరన్ మోగేది పెద్దగా.
దాని వలన అతనికి ధ్యాన భంగం అయ్యేది.

ఒక సారి రామ కృష్ణుల వారితో చెప్పుకొని బాధ పడ్డారు.
అప్పడు రామ కృష్ణుల వారు''ఆ శబ్దాన్ని కూడా నీలోకి తీసుకో 
అప్పుడు అది నిన్నేమి చెయ్యలేదు'' అన్నారు.
అలాగే ఆయన చేసారు.
మనం కూడా  ఇబ్బంది కరం అనిపించేవి మనలో 
తీసుకుంటున్నాము అనుకొని ....వాటి నుండి వచ్చే 
పాఠాలు నేర్చుకుంటే అవి మనలను ఏమి చెయ్యవు.

మీ కోసం ఓషో గారి బుక్ ''నిత్య జీవితం లో ధ్యానం ''
నుండి కొన్ని పేజెస్....... 





4 comments:

Anonymous said...

pathriji andhra osho.

జలతారు వెన్నెల said...

మంచి టాపిక్ తీసుకున్నారు.
బాగుందండి టపా!

హనుమంత రావు said...

సంతోషం కోసం చుట్టూ వెతకడంకాదు.. మన స్థితి తెలుసుకోగలిగితే అది సంతోషస్థితే.. మీ పోస్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా వివేకానందుని విషయం. అభినందనలు.

శశి కళ said...

హనుమంత రావ్ గారు,వెన్నెల,అనానమస్ గారు థాంక్యు