అనగనగ...అనగా...చిన్న కధ
బుజ్జి కోడి పిల్ల ఉంది .అది నాన్న ను వెతుకుతూ
వెళ్ళింది.ఒక ఎద్దు కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు అడిగింది.
''కాదు మీ నాన్న ఇంకా చిన్నగా ఉంటాడు''చెప్పింది ఎద్దు.
ఇంకా ముందుకు వెళితే మేక కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు ''అడిగింది.
''కాదు మీ నాన్నకు రెండు కాళ్ళు ఉంటాయి''చెప్పింది మేక.
కొంచం దూరం వెళ్ళింది.ఒక బాతు నీళ్ళలో ఈదుతూ కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు?''అడిగింది.
''కాదు మీ నాన్న కొక్కొరోకో అని అరుస్తాడు?''చెప్పింది బాతు
''మరి తెలుసుకోవడం ఎలాగా?''అడిగింది పిల్ల.
పాపం బాతు కు జాలి వేసింది .ఆ పిల్ల తపన చూసి కళ్ళలో నీళ్ళు
వచ్చాయి.
''ఏమి లేదు బాబు నీకు మీ నాన్నకు జీన్స్ ఒకటే ఉంటాయి...
వెళ్లి డి.ఎన్.ఏ. పరీక్ష చేయించుకో''అనింది.
ఆ కోడి పిల్ల కష్టాలు పడి వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకొని,పరీక్షలు
చేయించుకొని ప్రపంచానికి నాకు నాన్న ఉన్నాడు అని గర్వంగా
చెప్పింది.
కాని అందరికి ఇది సాధ్యమా?ఇలాగా పోరాడటం.....
''పుట్టగానే ఆకలి అమ్మను చూపిస్తే....అమ్మ నాన్న ను చూపిస్తుంది''
ఇది లేకుంటే వాళ్ళు సక్రమ సంతానం కాదని ముద్ర వేసేస్తారు.
నేను బాబు పుట్టేటపుడు తండ్రి యెంత ఫీల్ అవుతాడు అనేది
ఇద్దరు ప్లస్ మిత్రులు అవినేని గారు,శ్రీనివాస్ చౌదరి గారు
ఇద్దరి పోస్ట్‌లలో చదివాను.ఆ చిన్నారి బిడ్డ కోసం ఆ కష్టాలు
ఎదుర్కొని ఒక తండ్రి ఎలా తపన్ పడుతాడో కళ్ళకు కట్టినట్లు
ఉంది.మరి ఈ ఫీలింగ్స్ ఇలా పుట్టిన వాళ్లకు ఏర్పపడవు ఏమో?
రాజిరెడ్డి గారు వ్రాసినట్లు''ఒక దగ్గర ఇది చెయ్యొద్దు అని వ్రాసి ఉంటె
అక్కడ అది జరుగుతుందనే కదా అర్ధం"
ఇక్కడ కొందరు చిన్నారులు తండ్రి వీపుపై ఊగుతూ,వేలు పట్టి నడుస్తూ
కలల ప్రపంచం లో తూగుతున్నారు అంటే ......అక్కడ కొందరు
తండ్రి తెలీక చీత్కారాలతో చిన్నపోయ్యి....చెత్త కుండీ లకో,నీళ్ళ ప్రవాహం లోకో ,
బతికి ఉంటె సిగ్గు పడుతూ వాడిపోయిన కలువలా
ముడుచుకు పోతున్నారు అనే కదా అర్ధం.
పసి పిలలు వాళ్ళు వాళ్లకు ఏమి తెలుసు ?
మగ వాళ్ళ కోరికలకు బలిగా తమ తలను ప్రపంచపు
వధ్యశిల పై పెట్టామని....
అమ్మ పాల అమృతానికి కూడా నోచుకోక
ఎంగిలి ఆకులు ఏరాలని......
తండ్రి ఇంటి పేరు,తల్లి పెట్టిన పేరు లేక
లకారాల మాద్యమం లో పిలిస్తే పలకాలని.....
చిత్తు కాగితాలు ఏరుతూ,బిచ్చం ఎత్తి బతుకుతూ
అవిటి జీవితం గడుపుతూ నలగాలని....
నాన్న వేలు పట్టి నడిచే చిన్నారుల చూసి నపుడు
పగిలే ఆశల బుడగలు రగిలే బాధతో చూడాలని....
పిడికెడు అన్నం కోసం పది మంది కాళ్ళు వట్టాలని
మద్యం సీసాలు మోయాలని ...........
చిక్కటి చీకటి లో సత్రాల వెనుక కుక్కలతో పోటీ
పడి గెలిచి ఎంగిలి ఆకులతో ఆకలికి ఆయుష్షు పోయ్యాలని
ఈ దేశపు పౌరిడిగా కాక
స్ట్రీట్ చిల్ద్రెన్ పేరుతొ కాందిశీకుల్లా బ్రతకాలని
నాన్న వీపు సింహాసనం పై కూర్చున్న యువరాజులను చూసి
నిలువ నీడ లేని బ్రతుకును పోల్చాలని
పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?
మానవత్వం కొంత చిగురించి
ఒక్క మెతుకు తన పిడికేట్లో నుండి విదిలిస్తే
చిన్నపోయిన బాల్యానికి గుండె గూటిలో చోటిస్తే
సైకో కావాల్సిన బత్రుకు సైంటిస్ట్ లా చిగురిస్తుంది అని....
సంఘ విద్రోహిగా మారకుండా విజయాలు తెస్తుందని
పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?
మేధావులే తమ పుట్టుకకు కారణం అని
ప్రజలు మారకుంటే ప్రభుత్వం ఏమి చెయ్యలేదని.....

2 comments:
పితృత్వం అన్నది అనుభవిస్తే కాని అవగతమవని అమృతతుల్యమైన భావన . తివారి లాని జఫ్ఫాలకి కాటికి పోయే వయసులో కూడా కనువిప్పు కలక్క పోవడం దురదృష్ట కరం.
కానీ వదిలేసేవారు కొందరు. కడుపులోనే చిదిమేసేవారు కొందరు. ఇలాంటివి విన్నప్పుడు బాధేస్తుంది.
అలాంటి సమాజం లోనే కానీ విధి తో పోరాడి మరీ బిడ్డలని దక్కించుకున్న తండ్రులు కూడా ఉన్నారు :)
మనది ప్రజాస్వామ్యం కదా? పెద్దలకు విపరీత స్వేచ్చ - బుడుగులకు, బడుగులకేమో ఇలా..... ప్చ్ చలా కాలం పడుతుంది మార్పుకు ! ఆలోచింపజేసే పోస్టు. అభినందనలు శశి గారు.
Post a Comment