బాబోయ్ ...ఎనిమిదో వింత ఇప్పుడే జరిగింది.
''నీకెందుకు రేపు నిన్ను గూడురుకు తీసుకు వెళ్లి
ఓనమాలు సినిమా చూపిస్తాను''అంటున్నాడు మా అయ్యోరు.
విషయం ఎంటంటే శనివారం కదా మంచి సినిమా అంటున్నారు
వెళదాము అని గంట ముందే వచ్చి రెడీ అవుతున్నాను.అప్పుడు
తెలిసింది ఆ సినిమా నాయుడుపేటలో లేదని.....ఇంకేమి చేద్దాము
గమ్మున కూర్చొని ఉండిపోయ్యాను.అది చూసి పాపం అనిపించిందేమో
ఈయనకి ఇలా భరోసా ఇచ్చేసారు.ఎందుకు బాబు అంట వరం అంటే...
''నా కళ్ళలో వెలుగు చూడాలి అంట ''
(ఆయన ఎవరో సూరి బావ కళ్ళలో వెలుగు చూడాలి అన్నట్లు )
హమ్మయ్య సినిమాకి ఆదివారం వచ్చేసాము.సూక్ష్మం గా
కధ చెప్పాలంటే.......నారాయణ రావు మాష్టారు పెద్దవాడై
భార్య పోయిన తరువాత అమెరికా లో కొడుకు ఇంట్లో
మనవడు,మనవరాలుతో గడుపుతూ ఉంటాడు.
అయినా అతని మనసు తన పల్లెటూరు లోనే ఉంటుంది.
ఆ వెలితి భరించలేక ఇంట్లో చెప్పకుండా ఊరికి వెళ్లి
పోతాడు.విషయం తెలుసుకున్న వాళ్ళ అబ్బాయి తన కోసం
టాక్సి కి ఫోన్ చేసి అరెంజ్ చేస్తాడు.
దానిలో ఊరికి వెళ్ళే దారిలో తన ఉద్యోగం,తనదగ్గర పదో తరగతి
చదువుకున్న పిలలు,బావ,అక్కల లాగా ఆదరించిన
మునసబు గారు....పేద గొప్ప,హిందూ ముస్లిం తేడా లేకుండా
అందరు ఒకరి పండుగలకు ఒకరు అభినందిన్చుకోవడం....
అందరు సహాయం చేసుకోవటం...ఇలాటివన్నీ గుర్తుకు వస్తాయి.
ఇక కోటి గారి సంగీతం ,సిరి వెన్నెల గారి పాటలు ''సూరీడు
వచ్చిండు చూడయ్యో''పల్లెటూరి వాతావరణానికి జీవం పోశాయి.
ఇక్కడ పిల్లలు,మాష్టారి అనుభందం మన చిన్నప్పటి జ్ఞాపకాలు
తడుముతాయి.(ప్రబుత్వ పాట శాల లో చదివి ఉంటె)
కొన్ని సందర్బాలలో కంటి తడి పెటిస్తాయి ,రాజేంద్ర ప్రసాద్
గారి నటనే కాదు,ఖదీర్ బాబు గారి మాటలు కూడా.
ముఖ్యంగా సరళ అనే అమ్మాయి బాగా చదువుతుంది కాని పేదరాలు.
కనీసం మార్చుకోను మారు బట్టలు లేనంత.అది చూసి
మాష్టారు చాల బాధ పడి ''పల్లెటూరి పచ్చదనానిక్లి చిరుగులు
పడ్డాయమ్మ ....వాటిని కుట్టే సూది దారం ఏమిటో తెలుసా
అక్షరాలు"అంటాడు.నిజం గా మనసు ఉంటె కళ్ళ నీళ్ళు
వచ్చేస్తాయి.
మిగిలిన సగం లో తిరిగి వచ్చిన మాష్టారు పల్లె యెంత పాడై పోయిందో
చూసి బాధ పడతాడు.బావ చనిపోయి అక్క ఓల్డ్ ఏజ్ హోం లో
ఉందని తెలుసుకొని తీసుకొచ్చి పల్లెలో ఉంచుతాడు.
తన దగ్గర చదివిన పిల్లలను అందరిని కలుసుకొని ,ఇప్పటి
పబ్ సంస్కృతీ ,పక్క వాళ్ళను పట్టించుకోక పోవటం,స్వార్ధం
చూసి బాగా బాధ పడుతాడు.
వీళ్ళందరినీ కలిపి ఆప్యాయతల ఓనమాలు దిద్దించి పల్లెటూరి కి
మళ్ళీ కళ తేవాలని తన శిష్యురాలు ,టీచర్ అయిన సరళ చేత
పాత విద్యార్ధులు అందరికి ఉత్తరాలు వ్రాయించి ఊరికి
రప్పిస్తాడు.ఇక్కడ అందరు బాధతో తమ తమ అనుభవాలు చెపుతుంటే
మన మనసులు మన ఊరికి ఇలాంటి గతి పట్టకూడదు
అని బాధతో మూలుగుతుంది.
లింక్ చూడండి
చివరికి మాష్టారు మాట్లాడుతూ ఇలాగే మనం మన స్వార్ధానికి
కాలం తో పరిగెడుతుంటే పిల్లలు పాలు ప్యాకెట్స్ లో నుండి
వస్తాయని అంటారు అని ,మనిషి మూలాలు ఎప్పుడు
మట్టిలోనే ఉంటాయని మనకు నీడ నిచ్చి పెంచిన పల్లె ను
ఎప్పుడూ మర్చి పోకుండా అక్టోబర్ రెండు వెళ్లి గ్రామాలను
చూసుకొని సహాయం చేస్తే బాగుంటుందని
వాళ్ళ మనసులు మార్చి పల్లె బాగుకై ఓనమాలు దిద్దిస్తాడు.
చక్కగా హృదయానికి హత్తుకొనే సినిమా .కాని రెండో భాగం లో
ఎన్నో కోణాలు స్ప్రుసించాలి అనుకోవటం వలన పరిగేత్తినట్లు
అయిపొయింది.అందరు కలిసి చూడవలసిన ఒక మంచి సినిమా.
ఇది చేసిన వాళ్ళు అందరికి ఒక మంచి జ్ఞాపకం గా మిగిలిపోతుంది అనటం
వాస్తవం.
ముఖ్యంగా మనసుని హత్తుకొనే సంభాషణలు
అందించిన ఖదీర్ బాబు గారికి అభినందనలు
సంస్థ: సన్ షైన్ సినిమా
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, కల్యాణి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు...
దర్శకత్వం: క్రాంతి మాధవ్
కథ: తమ్ముడ సత్యం
సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
సంగీతం: కోఠి
పాటలు: సిరివెన్నెల
మాటలు: ఖదీర్ బాబు
ఎడిటింగ్: గౌతం రాజు
మీకు ఎవరికైనా మీ ఊరికి ఏమైనా చెయ్యాలి అనిపిస్తే
ముందు మీ ఊరి స్కూల్ కి టాయిలెట్స్ కట్టించి నీటి వసతి
ఏర్పాటు చెయ్యండి ....ప్లీజ్
పాపం పిల్లలు యెంత ఇబ్బందో చూడండి

13 comments:
మంచి సినిమా గురించి మంచి మాటలు చెప్పారండీ...
నేను ఇంకా చూడలేదు..తప్పకుండా చూస్తాను..
ఈ సినిమ యూనిట్ అందరికీ అభినందనలు..
చాలా బాగుంది.. శశి గారు. మంచి సినిమా చూపించారు.
క్రింద చూపిన సామాజిక సమస్య ..సిగ్గుచేటు:(
Inspied by onamalu reviews :pPalle padukonnappudu nenu lecha anukonnaPalle lechinappudu nenu padukonna ani kuda anukonnaKani ipude ardham ayindi nenu padukonna lechanu ani anukontunna ani palle lechina padundi ani anukonna aniKani evaru lechina evaru padukonnaPagilina palaka meeda diddaleni aksharalu ee onamalu
నాకుకూడా బాగా నచ్చిందండీ సినిమా. బాగారాశారు.
మా ఊరిలో ఈ సినిమా రాలేదండి. వచ్చే వారం వస్తుందేమో, చూడాలి.
బాగుంది. ఇలాంటి మంచి సినిమాలను ఇలాగే అందరూ ప్రమోట్ చేయాలి. మూలాలు మట్టిలోనే ఉంటాయనేది మరవకూడని విషయం. అభినందనలు శశి గారు.
'ఓనమాలు' అనే సినిమా గురించి విన్నాను మంచి సినిమా అని. వీలు వెంబడి చూడాలి.
మీరు చూపిన బడిపిల్లలసమస్య హృదయవిదారకంగా ఉంది. దొరతనాలు యేదో ఉధ్ధరిస్తాయిని యెదురు చూడకుండా ఊరిజనమే చందాలు వేసుకుని సమస్యను పరిష్కరించుకోవటం మేలు ఇప్పటికైనా.
ఓనమాలు సినిమా పై మీ సమీక్ష కాని సమీక్ష నాకు చాలా నచ్చింది. బాగా వ్రాశారు శశి గారు.
రాజ్,వనజ గారు,వేణు థాంక్యు
శ్రీ ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు...అయినా లో బడ్జెట్
సినిమా కదా కొన్ని సెంటర్ లలోనే విడుదల చేసారు ...థాంక్యు
కొండల రావ్ గారు,నిరంతరం వసంతములే గారు థాంక్యు
శ్యామలీయం గారు తప్పకుండా చూడండి
గంగాధర్ గారు చాలా చక్కగా చెప్పారు థాంక్యు
నేను ఇపుడు డాలస్ లో ఉన్నాను. ఓనమాలు సినిమా అమెరికాలో డిజిటల్ ప్రింట్ వచ్చింది. డాల్లస్ లో మన సినిమాలు వేసే థియేటర్లు సాంకేతికంగా డిజిటల్ స్థాయికి ఎదగలేదు. వచ్చే వారం రెగులర్ ప్రింట్ వస్తే తప్ప మేము ఈ సినిమా చూడలేము.
అవునా శ్రీ ఎప్పుడు వెళ్లావు?వీలయితే మళ్ళీ ఒక
సినిమా హాల్ లీజ్ కు తెసుకొని నువ్వే ఈ సినిమా విడుదల చెయ్యి )))
Post a Comment