Tuesday, 31 July 2012

ఒదుగు.....ఎదుగుతావు

''శశి ...శశి ..నిద్ర లే చూడు''లేపి బస్ కిటికీ గుండా చూపించాడు.
రాత్రి ఎక్కాము టూర్ బస్ కైలాసనాధ కోనకు వెళ్ళటానికి....
ఎక్కి సీట్ లో కూర్చోవటం తడువు....చల్లటి గాలి జో కొడుతూ 
బస్సు కుదుపుల ఉయ్యాలలో...పక్కన అనుకోవటానికి భుజం 
ఇంకేముంది .....కలల సయ్యాటలు ఆడేసి ఇదిగో ఇప్పుడే కళ్ళు 
తెరిచాను.
ఆసక్తిగా కిటికీ లోనుండి చూసాను.''చూడు కొండ కొన మబ్బు 
ముసుగు కప్పుకొని''చెప్పాడు.నిజమే యెంత అందంగా ఉంది 
సూర్యుడు వచ్చి లేపినా ముసుగు తీసే టట్లుగా లేదు.
ఆ రాయి చూడు ..పక్షి లాగా...నేను కూడా ఉత్సాహంగా చూస్తూ 
ఉన్నాను.మబ్బులు వెనుక వెలుగుల రేడు బయటకు వచ్చేట్లు లేడు .
ఇంకా భలే హాయి....మెల్లిగా బస్ కోనకు పొయ్యే దారికి మలుపు తిరిగింది.
పచ్చటి అడివి...తివాచి పరిచి దానిపై నీలపు పందిరి వేసినట్లు.....
ఎక్కడ చూసినా చెట్లు,ముందుగా ఒక ఆశ్రమం వచ్చింది.
తరువాత బస్ ఆపి దిగమన్నారు.మెల్లిగా ముందుకు వెళ్లి 
చూద్దును కదా ...ఓహ్...మనసు గాలిలో తెలిపోతూ వెళ్లి 
మబ్బుల్లో కూర్చుంది.కళ్ళతోనే మబ్బుని,జలపాతాన్ని,ఎత్తైన చెట్లని స్ప్రుశించాను.
ఇంకా మా వారు ఏమి మాట్లాడరు.నేనిక మౌనమే అని తెలుసు.
చూస్తూనే ఉన్నాను...చూస్తూనే ఉన్నాను...తనివి తీరదే...
యెంత మంచి చిత్రకారుడు ...ఏమి రంగులు..ఏమి చైతన్యం.....


ఎదురుగా ఒక యాబై మెట్లు ఒక చిన్న గుడిని చేరుకుంటున్నాయి.
ముందుకు వచ్చిన ఒక రాయే దానికి కప్పు .కింద శివుడు,పార్వతి.
ఎందుకో ఎక్కడ ప్రక్రుతి లోకి వెళ్ళినా వీళ్ళే దర్శనం ఇస్తారు.
గుడి పక్కనే పై నుండి హోరు అంటూ జలపాతం దుముకుతూ ఉంది.
గబా గబా మెట్లు యెక్క బొయ్యి పక్కకి చూద్దును కదా...బాబోయ్ 
దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు  పాము పుట్టలు...కొంచం భయంగానే 
కొన్ని మెట్లు ఎక్కి అక్కడ ఒక రాయి పై కూర్చున్నాం ఇద్దరం.బస్ 
లో వచ్చిన వాళ్ళు అందరు జల పాతం కింద స్నానం చెయ్యటానికి రెడి 
అవుతున్నారు.
రాయి దగ్గర నుండి జలపాతం అలాగా పడుతూ,నా మీదకి..నా లోకి...
అబ్బ ''పై నుండి చూస్తె''అన్నాను.''కుదరదు ఆడ వాళ్ళు యెక్క లేరు''
అన్నాడు.నిజమే ఎవరైనా కళ్ళు అప్పు ఇస్తే బాగుండును.
పద వెళదాము అన్నాడు....కొంచెం ఉండు అని అందరిని చూపించాను.
సరే వాళ్ళు వెళ్ళినాక వెళ్లి స్నానం చేద్దాము అన్నాడు.


చూస్తూ  కళ్ళు మూసుకున్నాను...మూసుకున్నా అదే దృశ్యం.
ఎత్తైన చెట్లచేతులు లేపి ఆకాశం తాకుతూ...కాదు ఆకాశం లో 
ఒదుగుతూ......ఒదుగుతూ ....ఒదుగుతూ....కాదు చెట్లు కాదు..
చైతన్యం...జల తరంగిణి......ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో 
జల బిందువుల మువ్వల సరళి,ఎగసి ఎగసి మిడిసిపడే 
తల వంచని తలపులతో ఆనంద తాండవం....ఎవరు ఆపగలరు?


ఎగసి పడే శక్తిని...మందాకినిని.....
''ఒదుగు''అన్నాడు శక్తి స్వరూపిణిగా నాట్యం చేస్తున్న జలాక్రుతిని ...
ఊహూ....కుదరదు....ఉవ్వెత్తున లేచి ఎగసే అలలు విశ్వ గీతికలు 
పాడుతున్నాయి....


లేచి నిలిచాడు పురుషుడు.....''నా జీవన హేతువుగా నిన్ను 
ఆహ్వానిస్తున్నాను''జట లు మూడుసార్లు మంత్రోచ్చారణ తో 
బిగించాడు.


వంగక తప్పలేదు....అలల ఊపు తగ్గింది ...విరుచుకుపడుతున్న ప్రళయాగ్ని 
పురుషుని శిరం చేరింది.చైతన్యపు జ్వాల చల్లారనే లేదు.
ఉండి...ఉండి .....మెరుస్తూ,రగులుతూ ,ఉండక దూకుతూనే 
ఉంది....అలల హోరు డమరుక నాదాన్ని మించి పోతూ...


నా జీవన సహచరి వై నన్ను దాటి పోకు....పర్వతాలను మెట్టె లుగా 
మార్చి తొడిగాడు.ప్రేమగా పాదాల స్పర్శ ...
చిగురాకులా వణికి పొయ్యింది.


అలల తాకిడి నిలిచింది.అల్లనల్ల సాగుతూ ఉంది.ఉరకలేసే 
చైతన్యం ఉండనియ్యట మే లేదు......ఎగసి ఉప్పొంగి 
పర్వతాలపై నుండి  దూకింది....ఉరుము పడినట్లే..ఒకటే 
హోరు..నేను ఒదగను....నేను ఒదగను...  మనసు తుళ్లిపడి 
దూకుతూనే ఉంది.రాళ్ళను ఒరుసుకుంటూ మృదంగ ద్వానం.


హలం తో చాలు గీసాడు పురుషుడు ''ఒదుగు''అన్నాడు.
''కుదరదు''చెప్పింది ఎత్తుగా  దూకుతూ హోరెత్తిన ఘోష...
స్వేద బిందువులను తీసి మేడలో హారంగా వేసాడు ...
చెలి రా మోడు వారిన భూమిని పచ్చని హారాలుగా మార్చి 
సస్యాలు  పండిద్దాము  .


హారపు పరిమళం వివశ ను  చేసింది.హోయల ,లయల 
చాలు వెంట సాగింది.ఏడు అడుగులుగా నడిచిన నేల...
పచ్చని తివాచీలా.....భూమికి పుట్టిన పులకలు మొలకలుగా....
చేతులు చాస్తూ ఆకాశం లో ఎదగటానికి....
పకా  పకా..నవ్వింది...వంకలోకి వెళ్లి మందాకినీ చిరు అలల 
ఊపులో ఉయ్యాలలు ఊగుతూ చేతులు చాచి ఆకాశానికి ఎదగాలని 
ప్రక్రుతి రూపంలో....


వంక లోకి వెళ్ళాడు పురుషుడు....దోసిలిలో తీసుకున్నాడు...
చల్లటి స్పర్శ మేనికి గందం  రాస్తున్నట్లు,మట్టి పరిమళం 
చెలికి వలపులు కలిగిస్తూ...తియ్యగా నవ్వింది 
కష్టాన్ని తీర్చేస్తున్నట్లు....


''ఒదుగు''దోసిలి లోని  నీళ్ళు హృదయం పై పోసుకున్నాడు.
ఇష్టంగా ఒదిగిపోయింది అంత  శక్తి ....పురుషుడి శ్రమ శక్తి ముందు 
ముచ్చటగా......
..........................................................


''శశి లే...వెళదాము''వెళ్లి నీళ్ళ కింద నిలబడి స్నానం చేసాము.
ఇందాకటి భయం ఏమయ్యిందో.....ఏదో శక్తి నీళ్ళ నుండి 
వచ్చి వంటి లోకి చేరుతున్నట్లు....మళ్ళా భయం వేసింది.
చటుక్కున చెయ్యి పట్టుకునాను.''ఏమి భయం నేను ఉన్నాను కదా''
మళ్ళా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు.
కొంచెం అర్ధం అయింది.అవును నీటి ప్రవాహానికి ఇలా ఒకే వైపు 
ప్రవహిస్తున్నందువల్ల విద్యుదయస్కాంత శక్తి వస్తుంది.
మనం కూడా  ఆయస్కాంతం  కాబట్టి మన మీద  పడినప్పుడు...
మనలొ శక్తి మెరుగుపడుతుంది.....ఇనప ముక్క పై అయస్కాంతం 
రుద్దినట్లు.ఏదో అర్ధం అయినట్లే ఉంది.


ఇద్దరం గుడికి వెళ్లి బస్ లో తిరిగి వచ్చేసాము.
కిటికీ నుండి తొంగి చూసాను....మళ్ళా  చెట్లు చేతులు చాపి 
ఆకాశం లో ఒదుగుతూ....అవును ఒదగాలి...అపుడే అందరికి 
సహాయం చేసేటట్లు ఎదుగుతాము.


కళ్ళు మూసుకున్నాను.జ్ఞాపకాల అగిపెట్టె లో మనసుని 
ప్యుపాగా మార్చి ఆవ చేతనను  శుబ్రం చేసుకుంటూ....
అవును జ్ఞానపు రెక్కలు తొడిగిన ఆత్మగా మళ్ళా  తప్పక 
బయటకు వస్తాను.


''ఎప్పుడో.....ఎందుకో?''

8 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

wonderful.. Shaashi garau.
entha baagaa vraasaarO!
avunu odigi undaali.

మాలా కుమార్ said...

కైలాసకోన , ప్రకృతి ఎతబాగా వర్ణిచారు. అక్కడ వున్నట్లే అనిపించింది .

రాజ్ కుమార్ said...

వావ్.. మీ భావుకత పీక్ కి వెళ్ళిపోయిందీ...
ఇంతకీ ఎక్కడ ఉందండీ ఆ ప్లేస్?? అంత అద్బుతం గా ఉందా??

శశి కళ said...

థాంక్యు వనజ గారు



థాంక్యు మాలా కుమార్

శశి కళ said...

ఇక్కడకు దగ్గరే రాజ్..ఇది అయితే మనం నడవకుండానే జలపాతం దగ్గరకు వెళ్ళొచ్చు.కార్తీక మాసం సూపర్ ప్లేస్.
ఆశ్రమం వాళ్ళు కూడా కావాలంటే ఆశ్రయం ఇస్తారు.

అక్కడ తెలిసిన టీచర్ ఒకరు రిటైర్ అయ్యి ఉన్నారట
మా మెడిటేషన్ వాళ్లతో ఒక సారి వేలుదాము అనుకున్నాము.అక్కడి నుండి తిరుపతి,తిరుచానూరు ,
అప్పలాయకొండా అన్నీ దగ్గరే.ఒక గంట ప్రయాణం అంతే

Meraj Fathima said...

sasi gaaroo baaga raasaaru, chakkati varnana.

శశి కళ said...

థాంక్యు...మీరజ్ ఫాతిమా గారు

Krishna said...

ohho superooo super sister aweeeeeeeeeeeeeeeeeeeeeeeeeeesommmmmmmmmmmmmmmmmmmmmmmmme