''కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్''రూం అంతా ప్రతిద్వనించింది.
''అబ్బ చిన్నగా అరువు...నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కి
ఇంత బిల్డ్ అప్ ఎందుకు ?''
ఆఫీస్ లో దిగులుగా కళ్ళు మూసుకొని కూర్చున్న మూర్తిని
పనిమాలా కెలికినందుకు తన మీద తానె జాలి పడుతూ
అడిగాడు పణి.
మరి నేను కూడా ఆ లెవెల్ లో అరిచాను మా ఆవిడ కోరిక విని ....
ఒక్క సారి రయ్యుం....రయ్యుం...రయ్యుం....నిన్న రాత్రికి
వెళ్లి పొయ్యాడు.
''ఏమండీ''....''చెప్పండి''
''ఏమండీ''ఇంకా గోముగా....
ఎక్కడో నక్క ఊల వినిపించింది.....ఎడమ కన్ను ఆదరసాగింది.
ఛీ...ఛీ....అవన్ని అబాద్దాలు,శకునాలు నమ్మకూడదు అని
మనసులో అనుకొని...అయినా రెండు సార్లు పిలిచిందంటే
కొంప మునిగే మాటే ......అయినా వానొస్తే మునిగే కుంటల్లో
ఇల్లు కట్టుకునే వాళ్ళే బయపడకుండా ఉంటున్నారు .
నా కొంప ఎలా మునుగుతుంది అనుకొని .....చెప్పమన్నట్లు
చిన్నగా తలూచాడు ....మెల్లని మందహాసం విష్ణు మొర్తిలాగా
ఒలికిస్తూ(అసలు పేరు అదే)
వెంటనే లక్ష్మి దేవి కాళ్ళ దగ్గరకు వెళ్లి పొయ్యింది.....
మెల్లిగా కాళ్ళు ఒత్తుతూ ....అనసులో మాట బయట పెట్టింది.
వెంటనే న్యూక్లియర్ బాంబ్ పడినట్లు ఉలిక్కి పడ్డాడు.
అడ్డంగా ,నిలువుగా నానా రకాలుగా తల ఊగించాడు
విచ్చుకున్న యెర్ర పెదాలు....సున్నాలా మారిపొయ్యి
మూతి మూడు వంకరలు తిరిగింది.
''మణులు అడిగానా?మాన్యాలు అడిగానా?''
నిష్టూరాలు.....చక్కని రాత్రి వృధాగా ఎందుకు...
ప్రస్తుతానికి శాంతి ఝండా ఎగరేశాడు ....రేపు వాకాబు చేస్తాను అన్నాడు.
(మనసులో మన్మోహన్ లాంటి దిగులు పెట్టుకొని)
''వాకబు చెయ్యటం కాదు ,సాధించాలి''సుప్రీం కోర్ట్ ఆర్డర్.
రయ్యుం...రయ్యుం..ఇప్పటి కాలానికి
సరే ఇంతకీ కోరిక ఏమిటి అడిగాడు కొంచం జాలి,కొంత విసుగు కలిపి
పెరుగులో జాం కలుపోకొని తినే మొహం పెట్టి.....
''ఏముంది .....గోరింటాకు కావాలంట,శ్రావణ మాసం పెట్టుకోవాలి అంట''
''ఓస్...దాని దేముంది హెన్నా కోన్ ఒకటి కొనిచ్చేయ్యి''అన్నాడు పణి .
''మరదే నీకు తెలీని విషయం నిజం గోరింటాకే పెట్టుకోవాలంట.
అది పెట్టుకుంటేనే లక్ష్మి దేవి ఆశీర్వాదిస్తుంది అంట.పైగా
మీ కోసమే కదా ఈ వ్రతాలు అని సెంటిమెంట్''
''హూ కష్టమే పదా పర్మిషన్ పెట్టి వెదుకుదాము''చెప్పాడు స్నేహ ధర్మం తో.
అప్పుడు మొదలైంది వాస్కోడిగామా ఇండియా కనుక్కొనే ప్రయాణం....
అదిగో అక్కడ ఉంది అంటారు ,తీరా వెళితే అపార్ట్మెంట్స్ కట్టేసి ఉంటారు.
అలా అలా అడుగుతూ సుదూర తీరాలకి వెళ్లి పొయ్యారు...అంటే నగరం
పొలిమేరలకు.
''లాభం లేదు బాస్ ....పల్లెల్లో కూడా సెజ్ ల పుణ్యమా అని ,రింగ్ రోడ్లు
అని ఎక్కడా చెట్లు ఉండవు''నిరాశగా చెప్పాడు ఫణి
ఏమిటి దారి దిగులుపడుతూ దీనంగా మొహం పెట్టాడు మూర్తి
పింక్ కార్డ్ అందుకున్న సాఫ్ట్ వేర్ లాగా....రాత్రికి తలుపు తియ్యక
పొతే ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ.....
''హేయ్...హేయ్''ఎక్కడో బర్రెలు తోలుకుంటూ వచ్చాడు గోపాలకృష్ణుడు .
''బాబ్బబ్బా ...బ్బు...'అని వెంటపడ్డారు తరుణోపాయం చెప్పమని.
చిన్నగా నవ్వి హైవే వైపు వేలు చూపించాడు.
నిజమే సుమీ...ఎందుకు రాలేదు ఇంత మంచి ఐడియా....
జామ్మని వెళ్లి పొయ్యారు ......డివైడర్ మీద కాగితం పూల
చెట్లు వీళ్ళ హుషారు చూసి మెల్లిగా తలలు ఊపాయి
ఆహ్వానిస్తున్నట్లు.....
వాటిని దాటగానే కనిపించాయి ....గోరింటాకు చెట్లు డివైడర్ మీద.
వజ్రాల ఘని చూసినట్లు వెలిగిపోయ్యాయి ఇద్దరి మొహాలు.
సర్రున దూసుకెళ్ళి....కోసుకోచ్చేసారు......
@@@@@@@@@@@@@
అన్నం తిని టి.వి.చూస్తూ కూర్చుని ఉంటె మెల్లగా చేతి వేళ్ళ స్పర్శ
కళ్ళు మూస్తూ....కమ్మని గోరింటాకు వాసన వేళ్ళ నుండి
అద్భుతంగా ఉంది....చేతులు తియ్యమనకుండా ఆగ్రాణిస్తూ
కూర్చున్నాడు.
మెల్లిగా చేతి వెళ్ళు నిమిరి గర్వంగా అన్నాడు ....
''చెప్పు ఈ సారి ఏమి తెమ్మంటావు?''
కిలకిల నవ్వులకు,గాజుల సంగీతం తోడై టి.వి పాటలో
కలిసిపోయింది.
''పంచ వన్నె చిలుకా జలకాలాడగా మంచు బిందువులు సేకరిస్తా
దేవత స్నానం చేసిన జలము గంగా జలముగా సేవిస్తా...''
10 comments:
బాగుంది :)
హు హు హు. నాకు కూడా గోరింటాకు కావాలి గుప్పెడు ఆకు లేదా రుబ్బిన ముద్దయినా పంపేయండి :) అసలు గోరింటాకు గురించి చెప్పాలంటే ఎన్ని ముచ్చట్లండీ!! అప్పుడెప్పుడో దీని మీద బెంగోచ్చి బ్లాగ్లో బరికేసా. ఇప్పుడు మాత్రం మీరు పంపి తీరాల్సిందే :)
nice.
super.. Teacher.
ప్రియా ప్రియా చంపొద్దే ... నవ్వి నవ్వి మున్చోద్దె !!
జీన్స్ శ్రీనివాస్ పాట తో..ఇంకా చంపేసారుగా!
పోస్ట్ మొత్తం లో.. ఎన్ని సెటైర్లు.. హమ్మా!
Kevvvvvvvvvvvv kikikikiki
Bellam to tayaaru chestaaru gaa... Daanito kaanivvandi kikikik
చాలా బావుంది పోస్ట్
ఇలాంటి పోస్ట్ లు రాయాలి అంటే మీరే రాయాలి
శేఖర్ థాంక్యు.
రసజ్ఞ...నిజం ఎన్ని ముచ్చట్లు...ఉయ్యాల్లో పడుకున్నప్పుడు అమ్మ అరికాలుకు వ్రాసిన జ్ఞాపకాలు,
చేతికి గోరింటాకు అంటే గోరు ముద్దలు పెట్టిన జ్ఞాపకాలు...
అయినా నేను పంపటం ఏమిటి...సారోస్తారు ...వస్తారు...ఆయన వచ్చిన తరువాత అడుగు..థాంక్యు
వనజ గారు థాంక్యు.మరీ పొగిడి చంపోద్దె...అంత సీన్ లేదు లెండి.థాంక్యు.
ట్రీ గారు థాంక్యు
శైలు థాంక్యు.
రాజ్...కి...కి...వస్తుంది గా అప్పుడు చూస్తాము...ఏ గోరింటాకు పెడుతావో,తెస్తావో,అలకలు తీరుస్తావు..
థాంక్యు
అమ్మమ్మ చిన్నప్పుడు స్వహస్తాలతో రుబ్బి పెట్టే గోరింటాకు గుర్తుకు వచ్చింది. బాగుందండి శశి గారు.
Post a Comment