Wednesday 8 August 2012

సత్యభామ సరదాలు 3

హుషారుగా వచ్చేసాడు ఇంటికి... ఊహించినట్లే తలుపులు 
తెరిచి ఉన్నాయి.హమ్మయ్య  సత్య వచ్చేసింది.....లోపలికి వచ్చి 
షూస్ విప్పక ముందే రెండు కాళ్ళకు వేలాడారు పిల్లలు 
డాడిఅంటూ....నవ్వుకుంటూ అమ్మగారు ఏరి అని తొంగి 
చూస్తూ వాళ్ళ బుగ్గలపై మామూలు  ఇచ్చేసాడు.

ఇక మొదలు సందడే...సందడి...
ఒకరు కాళ్ళపై ఊగుతూ 
ఒకరు వీపుపై ఊగుతూ అమ్మమ్మ 
ఇంటి  ముచ్చట్లు ...
నా మాట వినాలి అంటే నా మాటలు 
వినాలిఅని మొహం వాళ్ళ వైపు 
లాగుతూ ఉన్నారు.
నవ్వుకుంటూ సముదాయిస్తూనే  
కళ్ళతో వెతుకుతూ ఉన్నాడు...
ఇంకా మబ్బు చాటు నుండి 
చంద్రోదయం కాలేదు ఏమిటా..అని .

ఓహ్...పూలపరిమళం,టీ వాసన గాజుల చిరు శబ్దం లో కలిసి 
మనసు అటు వైపు దూకేస్తూ....చేతిలో టీ తీసుకొని చిన్నగా 
నవ్వాడు.అంత కంటే చిన్నగా నవ్వుతూ పిల్ల ల వైపు చూసింది.
అబ్బ ఈ ఆడవాళ్ళకి ఏమి పెడుతారో  పుట్టినింట్లో ఒక్క రోజు వెళ్లి 
వచ్చినా మొహం కళ కళ లాడిపోతూ ఉంటుంది...మనసులోనే నవ్వుకుంటూ 
మురిపెంగా అనుకున్నాడు.
పిల్లలని పక్కకు తీసుకువెళ్ళింది.స్నానం చేయిస్తా రండి అని.

బీరువా దగ్గరకు వెళ్ళాడు పర్స్ బీరువాలో పెడుదామని...తలుపు 
తీసి చూసాడు,ఏదో తళుక్కున మెరిసింది ,బంగారు రంగులో.
మెల్లిగా తలుపు పూర్తిగా  తెరిచి చూసాడు.సత్య నిన్న రాఖి కట్టడానికి 
వెళ్లి వచ్చింది.మరి ఇదేక్కడిది  అనుకున్నాడు.
తీసి చూస్తె గోల్డ్ వాచ్ మగవాళ్లది .చూడ ముచ్చటగా....ఎన్ని 
రోజుల నుండో అనుకుంటున్నాడు ఇలాటి మోడల్ కావాలి అని బడ్జెట్ సహకరించక 
ఎప్పుడు బయట పెట్టలేదు కోరికని.అయినా ఇది ఇక్కడ ఎందుకు ఉంది....
ఏదో ఊహ మెరిసింది కళ్ళలో మెల్లిగా కోపం పాకుతూ ...''సత్య''గట్టిగా అరిచాడు .

ఉలిక్కిపడి చిన్నాడిని టవల్ లో చుట్టుకొని వచ్చింది.
చేతిలో వాచితో ఉన్నా శ్రీవారిని చూడగానే కొంత అర్ధం అయింది.
''ఎక్కడిది?''అడిగాడు కోపం తో మొహం ఎర్రగా మారిపోయింది.
ఎప్పుడు ఇంత కోపం చూడలేదు.''అదీ..అదీ...కొన్నాను'
'
భయంగా సమాధానం చెప్పింది.
''ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు,ఊరుకుంటే మరీ అతి అయిపోతున్నావు.ఈ నెల లో యెంత 
ఖర్చు అయింది నీకు తెలీదా?అప్పుల్లో ముంచి వేసేయ్యి ...నేను లేకుండా 
పొతే నీకు విలువ తెలుస్తుంది''కాలితో తలుపును తన్నేసి బయటకు 
కోపంగా వెళ్లి పొయ్యాడు.భయపపడిన పిల్లలను దగ్గరకు తీసుకొని 
వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ వాళ్లకు అన్నం పెట్టి నిద్ర పుచ్చింది.
తరువాతా దిండే దుఃఖం  పంచుకొనే నేస్తం.
ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చాడు.అన్నం వడ్డించ పొయ్యింది .
''నాకు ఆకలి లేదు''విసురుగా గ్లాస్ విసిరేసి వెళ్లి పొయ్యాడు.
ఇంత మౌనాన్ని,దుఖం ఎప్పుడు చూడని ఇల్లు చిన్నపోయ్యింది రాత్రంతా.
ఉదయం కూడా సత్య పలకరించినా విసుగ్గా పలక కుండా ఆఫీస్ కి వెళ్లి.పొయ్యాడు.
 బాక్స్ కూడా  తీసుకు వెళ్ళకుండా వెళుతున్న భర్త ను దిగులు మబ్బు చాటు 
చేసుకొని మసక చూపుతో చూస్తూ ఉండిపోయింది.
పిల్లలు బిక్కు బిక్కు మంటూ అమ్మ ఇంటికి రాని లేగా దూడల్లా....

''చ''విసుగ్గా అనుకున్నాడు మూర్తి .దీనంగా ఉన్న సత్య మొహమే కనిపిస్తూ ఉంది.
ఏమైంది?పక్కన ఉండే రవి ఎర్రగా ఉండే కళ్ళను చూసి ఏదో అనపోయ్యి ఆగిపొయ్యాడు.
''ఏమి లేదు''విషయం చెప్పేసాడు.
'నిజమే రా మన బాధలు మనకు ఉంటాయి.ఆడ వాళ్లకు  ఏమి తెలుస్తుంది.
అయినా తను ఇప్పుడు ఇలాగా ఎప్పుడైనా ఖర్చు పెట్టిందా అనవసరంగా?''అడిగాడు.
''లేదు.ఎప్పుడు నన్ను అడగకుండా షాపింగ్ చెయ్యదు.అసలు ఇంట్లోకి 
వెళ్ళ బుద్ధి కావటం లేదు.ఎన్ని మాటలన్నాను.ఎప్పుడూ ఇలాగ జరిగింది లేదు.
సత్యను సారి  ఎలా అడగాలో తెలీటం లేదు...అయినా తప్పు చేసింది తను ,
నేను ఎందుకు చెప్పాలి''విసుగ్గా అన్నాడు.తనకే ఇలాగా ఎందుకు రావాలి 
అనుకుంటూ...

''ఏమి పర్వాలేదు లేరా,సాక్షాత్తు కృష్ణ మూర్తి ఏమి చెప్పాడు,దేఖో,పకడో,లావో''
అని...''ఇదేమిటి?''అర్ధం కాక సమరం లో అర్జునిడి మొహం పెట్టుకుని అడిగాడు.
''ఏమి లేదు ఇంటికి వెళ్ళు,చూడు సత్యని,పట్టుకో కాళ్ళని,తీసుకో ప్రేమని,
మన భార్య ,మనం వేరు కాదురా ఏమి చేసినా తప్పు లేదు.అసలు అటువంటి 
సంపద ఎక్కడైనా సంపాదిన్చుకోగాలమా?''వినురా బాబు అని అభయ హస్తం చూపి 
కృష్ణ పరమాత్మ ఫోజ్  పెట్టేసాడు నిల్చొని.పక్కున నవ్వేసాడు మూర్తి .
ఎందుకో మళ్ళి సత్య తో తాను అనుకుంటే మనసుకు హుషారు వచ్చేసింది.

రాత్రి దొర్లుకుంటూ వచ్చేసింది మీ అలకలతో నాకేమి పని అనుకుంటూ...
పిలలు నిద్ర పోతునారు.పాపం భయపడి పోయినారు.
ఇందాక ఆఫీస్ నుండి వచ్చినా హోం వర్క్ పుస్తకాలనుండి
తలలు ఎత్త లేదు.పది అయినా మేడం గారి దర్శనం లేదు.

తొంగి చూసాడు హాలు లోకి.బ్యాగ్ లో పుస్తకాలు  సర్దుతూ ఉంది.
దగ్గాడు చిన్నగా.నిరశన ఝండా ఎగిరేస్తూ తల కూడా తిప్పి చూడలేదు.
''అవును పిల్లలు ఏ క్లాస్స్?
అనుకుంటూ పక్కన కూర్చొని తను కూడా పుస్తకాలు పెట్టసాగాడు.
విసురుగా లాగింది బ్యాగ్ లోవి....రెండో బ్యాగ్ లో పెట్టింది.
''ఓహ్,అయితే చిన్నాడివి అన్న మాట ఆ బుక్స్''అనుకుంటూ ''సత్యా'' 
మెల్లిగా పిలిచాడు.మొహం ఆ వైపుకు తిప్పేసరికి చెంపలపై 
ట్యూబ్ లైట్ కాంతి పడి చెంప చివర నెలవంక లాగా గమ్మత్తుగా..
చ..చ...వెదవ,వెదవా,ఎలాంటి సిచ్యువేషన్ సృష్టించుకున్నావు? 
తనను  తానె తిట్టుకున్నాడు.


పట్టుకున్న చెయ్యిని విదిలించుకొని పొయ్యి పిల్లల మద్య పడుకుంది.
ఇంక అయినట్లే..కదిలిస్తే ఏడుస్తూ లేసేస్తారు.ఏమిటి చెయ్యటం....అనుకున్నాడు.
వాగ్దేవిని నమ్ముకొని వాగ్బాణాలు మొదలు పెట్టాడు.....మన్మదుడిని కాసింత  
సాయం చెయ్యరా బాబు అని వేడుకొని......
''సత్య''పిలిచాడు.మొహం అటు తిపుకున్నా చెవులు ఇటే ఉన్నాయి.
పర్లేదు ప్రొసీడ్ ....''అసలు ఆ వాచ్ యెంత నచ్చిందో తెలుసా?అసలు అలాంటి 
వాచ్ కావాలని ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నానో''
ఊహూ ఏమి లాభం లేదు.మౌనం ఇంత గట్టిగా ఉంటుందా?
అదేమైనా ప్లాటినం తో చేస్తాడా ఈ బ్రహ్మ దేవుడు.
అసలకు ఈ పెళ్లి కనిపెట్టింది ఆయనే...
కాసేపు తిట్టుకున్నాడు.ఇలాగ బతిమిలాడటమే అలవాటు లేదే...

మళ్ళ మొదలు పెట్టాడు....
'అసలు నేనైతే ఇంత అందమైన వాచ్ సెలెక్ట్ చెయ్యలేనబ్బా?'
ఏమైనా నీ సేలేక్షనే సెలక్షన్''మొహం మీదకి తొంగి చూసాడు.
మౌనం కొంత కరిగినట్లే ఉంది.''అవును ..అవును...మీరు కూడా నా సెలక్షనే ''
పెదవి విరుపు...అబ్బ మన్మదుని చేతిలో చెరుకు గడ విరిగిపోయ్యిందా?
చటుక్కున లైట్ వెలిగింది.''ఏమిటి ఏమిటి మళ్ళా చెప్పు?నీ సేలేక్షనా అంటే 
మీ అమ్మా వాళ్ళు నచ్చలేదా,నువ్వే అడిగావా?''చిన్నగా నవ్వుతూ అడిగాడు 
దొరికావులేపో అని చిలిపిగా చూస్తూ ....చటుక్కున లేచి కూర్చుంది...
చూసి మళ్ళ సిగ్గుపడి పోతూ....అలక మాకేమి పని అని చక్కగా 
సర్దుకొని పలు వరుసల మెరుపులో కలిసిపోయింది.

''నిజమా?''అని అడిగాడు.సమాధానం లేదు.గువ్వలా ఒదిగిపోవడమే.
''సరే రేపు డబ్బులు ఇస్తాను షాప్ లో ఇచ్చెయ్యి''చెప్పాడు.
''డబ్బులు అక్కర్లేదు''చెప్పింది చిన్నగా.
''అక్కరలేదా ఎందుకు?''ఆశ్చర్యంగా అడిగాడు.
''మా అన్నయ్య రాఖీ కి ఇచ్చిన డబ్బులు పెట్టి మా బాయ్ ఫ్రెండ్ కి వాచ్ కొనేసాను''
కొంటెగా చెప్పింది.
వార్నీ అనవసరంగా రెండు  రోజులు బాధగా మోలిగింది మనసు.
'మరి నిన్నే చెప్పలేదే?''అడిగాడు గారంగా.
''ఎక్కడ చెప్పనిచ్చారు...మీకు ఏది వచ్చినా వడగళ్ళ వానే''విసురుగా 
అనింది వర్షానికి ముందు చెళ్ళు మని తాకే చల్లటి గాడ్పులాగా....
అర్ధం అయింది....''ఏమొచ్చినా''ఉడికిస్తూ  పెద్దగా నవ్వేసాడు.
ముసి ముసి నవ్వులు సిగ్గు దానికి జతగా కలిసి .....మనసులో కొత్త కొత్త 
రాగాల ప్రేమ చిగుళ్ళు....



5 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఎంత బాగుంది ఈ కథ
కథ చెప్పిన తీరు సరదాగా , సరసంగా , గడుసుగా-ఉంది .
శశి కళ లాంటి తెలుగు బ్లాగర్లు - కథ చెప్పడంలో - మనోఙ్ఞమైన ఊహాలోకాన్ని సృష్ఠించి , పాఠకులను పరశంలో ముంచెత్తు తున్నారు .
సత్యభామ సరదాలు 3 - ఒక మంచి కథానిక .
సోకాల్డ్ సాహిత్య వేత్తల మనుకుంటూ అహంకారంతో విఱ్ఱవీగే పండితులు - తెలుగు భాషను మనసుకు హత్తుకునేలా కమ్మగా ఉపయోగించడంలో - మీముందు ఎందకూ పనికిరారు .
-----సుజన-సృజన

శశి కళ said...

కష్టే ఫలి గారు థాంక్యు.


రాజా రావు గారు అదేమీ లేదు లెండి.మీరు అభిమానంతో
అలా అన్నారు.అసలు మన్మదుడి చెరుకు గడ విర్గిపోయింది...దీనికి సమస్యా పూరణం గా ఒక పద్యం వ్రాద్దాము అనుకునాను.
కాని నాకు చేత కావు అండి.మీరు బాగా వ్రాస్తారు.

Unknown said...

ఈ పోస్ట్ చదువుతుంటే రంగనాయకమ్మ గారి స్వీట్ హోం గుర్తుకు వచ్చింది
చాలా సరదాగా ఉంది.
శశి గారు చాలా రోజుల తర్వాత మనసుకి నచ్చినా పోస్ట్ ఇది .

శశి కళ said...

నీ మంచి మనసుకు తప్పకుండా నచ్చుతుంది శైలు ..థాంక్యు

రాజ్ కుమార్ said...

బాగుందండీ.. నచ్చిందీ.
అక్కడక్కడా అచ్చుతప్పులు సరిచెయ్యండీ. ఫ్లోకి అడ్డం తగులుతున్నాయ్ ;)