పకడో...పకడో...పకడో....లాయి...
లాయి...
వదలకుండా పట్టుకున్నాను స్వాతంత్రం వచ్చింది కాబట్టి వెళ్ళాల్సిందే
అని....సరే పద ..ఏమి చేస్తాము?
ఎలాగైతే మనకు ఎందుకు మన కోరిక తీరింది.పిల్లలు ముందు వెళ్లి పొయ్యారు.
వెళ్ళటమే మేలు అయింది.హాల్ నిండి ఉంది.నేల ఖాళీ.వీళ్ళు ముటామేస్త్రి లాంటి
సినిమాలు లేక పోయేసరికి రావటం లేదో...లేక మన్మోహన్ దెబ్బకి అందరు దారిద్ర
రేఖ ఎగువకు వెళ్లి పొయ్యారో.బెంచ్ పర్వాలేదు.
చైర్స్ అన్నీ పిల్లల అల్లరితో కువ కువ లాడుతున్నాయి.హమ్మయ్య ఎన్నాళ్ళకి
అందరు కలిసి మెలిసి నవ్వుకుంటూ....
కధ లోకి వస్తే ''రవి పని పాట లేని జులాయి.వాళ్ళ నాన్న,అమ్మ,చెల్లి ఇది
కుటుంభం.నాన్న లెక్కలు మాష్టారు.రవీ ఎప్పుడూ ఈజీ మనీ సంపాదించాలి అని
చూస్తూ ఉంటాడు.వాళ్ళ నాన్న దగ్గర పది వేలు తీసుకొని గంటలో
లక్ష చేస్తాను అని బయలుదేరుతాడు.
అక్కడ వ్యాన్ లో ఒక దొంగల ముటా దోపిడీ కి బయలుదేరుతుంది.
రవి వాళ్ళ నాన్న కూడా అ బ్యాంక్ లో ఐదు లక్షలు డిపాజిట్ చేసి ఉంటాడు.
అసలు ఆబ్యాంక్ చైర్ మాన్ వరద రాజులే ,బిట్టు అనేవాడిని పెట్టి ఆ
దొంగ తనానికి పంపిస్తాడు.మొత్తం ఎనిమిది మంది.వాళ్ళలో ఒక చెవిటి,మూగ
అమ్మాయి కూడా ఉంటుంది,ఇంకా బిట్టు తమ్ముడు లల్లా కూడా.
రవి కి తెలీక ఆ వ్యాన్ లో లిఫ్ట్ అడుగుతాడు.వాళ్ళు ఎక్కడకు వెళుతున్నావు?
అని ఆరా తీస్తారు.బెట్టింగ్ కి వెళుతున్నాను అంటాడు.మరి పోలీస్ లకు తెలీదా..
అని అడిగితె తెలిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు కదా అని చెప్పేసి అది ఎక్కడో అడ్రెస్స్
చెప్పి వెళ్ళిపోతాడు.ఈ దొంగతనం చేసేవాళ్ళు పోలీస్ లకు బెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
వాళ్ళను అక్కడకు పంపేసి చక్కగా బ్యాంక్ లోకి దూరి పోతారు.
ఇక్కడ మొదలైంది బాబు...ఎందుకులే...ఒకరిని ఒకరు డమాల్...డిష్యుం...
పక్కనుండి ఈయన ...ఎవరు ఎవర్ని కొడుతున్నారు శశి అని...సర్లెండి సంబరం
రెగ్యులర్ తెలుగు సినిమా వ్యూయర్ ని నాకే అర్ధం కావటం లేదు ఇక్కడ...
ఏదో మొత్తానికి బిట్టు ఒక్కడు మిగిలాడు.అంతా గందర గోళం.
డబ్బులు అలాగా ఒక పెద్ద బాక్స్ లాగా కట్టేసి ఉంటారు.
లల్లా వచ్చి పెద్ద కంటైనర్ వ్యాన్ తో గోడ పగల కొట్టి మరీ
ఆ డబ్బుని తీసుకెళ్ళి పోతాడు.
ఈ లోపల అక్కడ బెట్టింగ్ (అంటే ఏమిటో అనుకున్నా ..అదేదో క్రికెట్ నాకేమి
అర్ధం కాలేదు)దగ్గర పోలీస్ రైడ్...వాళ్ళు మాట్లాడే టప్పుడు రవి నవ్వుతాడు.
''ఏమి రా నవ్వావు?''అంటే నా మాటలే మీరు చెపుతున్నారు అంటే
ఎక్కడో బ్యాంక్ దొంగతనం జరుగుతూ ఉంది ఉంటుంది అని వ్యాన్ లో
చూసినవి చెప్పి ఏ దొంగ ఎక్కడ ఉంటాడు,డబ్బు ఎక్కడ ఉండొచ్చు అనీ
ఊహించి చెప్పేస్తాడు.(బన్నీ ని చూసి మీకు విచిత్రం అనిపించవచ్చు
కాని మేము టి.వి.లో అప్పుడప్పుడు సి.ఐ.డి.అని ఒక సీరియల్ చూస్తుంటాము
పనేమీ లేక పొతే...దానిలో ఆ పెద్దాయన ఇలాగే చెప్పేస్తుంటాడు...)
ఈ లోపల లల్లా ఆ వానలోనే ఒక డంపింగ్ యార్డ్ లో డబ్బుండే కంటైనర్
ఆపి దాని మీద చెత్త పోస్తుంటాడు.ఈ లోపల పోలీస్,రవి అక్కడకు అస్తారు.
గొడవలో లల్లా రవి చేతిలో చనిపోతాడు.పోలీస్ డబ్బులు మళ్ళా చూడవచ్చు...
ముందు నువ్వు హైదరాబాద్ లో ఏ.సి.పీ.సీతారాం(రాజేంద్ర ప్రసాద్)దగ్గరకు
వెళ్ళు బిట్టూకి దొరకకుండా అని పంపేస్తాడు.ఇక్కడ నుండి రాజేంద్ర ప్రసాద్,
బన్ని,బ్రేహ్మి సందడే సందడి....మధ్యలో ఇలియానాను ప్రేమించటం...
వాళ్ళ నాన్నను,సవతి తల్లిని ఒప్పించటం....
మా పిల్లలు అయితే ''అమ్మా ఇలియానా...యాక్""అనేసారు.నాకు నచ్చలేదు.
పిల్లలు నాకు''నాది అన్నది నేదేలే...నీది అన్నది నాదే''టైప్ ఫ్రెండ్స్ కాబట్టి
ఏదైనా అందరం షేర్ చేసుకుంటాము.
ఇక అమాయకుడైనా సీతారాం గారి సహాయం తో ఆ డబ్బులు మరలా
అందరికి తిరిగి ఇప్పించటం,మధ్యలో చేసింగులు,డిష్యుం,డిష్యుం,
ముఖ్యంగా ఒక సారి కార్ ని బిల్డింగ్ మీదకు దూకించి అవతలి రోడ్ లోకి
వెళిపోతాడు బన్ని...కేవ్వ్వ్వవ్వ్వ్వవ్....బన్ని నువ్వు టైటానిక్ లో
ఉండకూడదా?ఇక బిట్టూ,బన్ని ప్లాన్లె,ప్లాన్లు...ఏమిటి గందర గోళం అంటే...
''ఏదో సముద్రం నుండి తిమింగలం బయటకు వచ్చి గాలి పీల్చుకున్నట్లు
సంసారం నుండి తొంగి చూసేవాళ్ళం...మాకు లాజిక్ లు వద్దు...మేజిక్ లే
కావాలి"
కాకుంటే లాస్ట్ లో ఇంతా చేసి ...విలన్ ని చంపెయ్యకుండా డిస్కషన్ పెట్టి
తేల్చేసాడు.మళ్ళా రాజేంద్ర ప్రసాద్ గారి చేత కాల్పించాడు.
సిగిరేట్ పెట్టి మీద చిన్న అక్షరాలతో ''పొగ త్రాగటం హానికరం ''
అని వ్రాసినట్లు...ఈసీ మనీ వద్దు కష్టాలు వస్తాయి అని చెప్పాడు.
పాటలు కేక...పకడో..పకడో...అయితే నేను సూపర్ ఉంటుందనుకున్నాను.
పాట బాగుంది కాని డ్యాన్స్ లేదు.బన్ని లెవెల్ కి తగ్గ స్టెప్స్ లేవు.
రాజేంద్ర ప్రసాద్ నవ్వుల ఉయ్యాలలో ఊపేసాడు.
ఇక డి.ఎస్.పి.మనలను జోష్ లో ఊపేసాడు.
ఒకటి నచ్చలేదు.రాజేంద్ర ప్రసాద్ ,బన్ని తో కలిసి ఇంట్లో తాగటం .
పర్సనల్ అయితే వేరే విషయం...పబ్లిక్ గా ...పిల్లలు,భార్య ఇంట్లో ఉంటె
పిల్లల మీద యెంత ప్రభావం చూపుతుంది.పోనీ ఆ సీన్స్ కధకు
పనికి వస్తాయా అంటే లేదు.
''అసలు ఇల్లు అంటే ఒక బేషరతు ప్రేమకు నిలయం అయిన దేవాలయం.
దానిలోకి చెప్పులతో కూడా వెళ్ళం.అలాటిది ఇలాగా చూపించటం మనసుకు
చివుక్కుమనిపించింది''
ఒకటి నచ్చింది. వరద రాజులు బిట్టు పక్కన ఉండే మూగ,చెవిటి అమ్మాయిని
యెగతాళి చేస్తాడు.బిట్టు వాడిని చంపెటపుడు ''పిజికల్లి డిసేబుల్డ్ వాళ్ళను యెగతాళి
చేయకూడదు''అంటాడు.
నాకు బాబు పుట్టినపుడు కొంచెం చెవులు డమాల్....
మెడిటేషన్ నేర్చుకోక ముందు ఎవరైనా యెగతాళి చేస్తే బాధ పడేదాన్ని .
కాని నేర్చుకున్న తరువాత తెలిసింది అది నాకు ఇచ్చిన వరం అని
(అందరికి ఒకటి వస్తుందంట ప్రాబ్లెం...మనకు రెండు బ్లెస్సింగ్స్...గాడ్ ఇస్
గ్రేట్)
ఎందుకంటె ఇప్పుడు నేను మనుషులను చక్కగా విబజించు కోగలుగుతున్నాను ....
నా లోపాన్ని పట్టించుకోని వారు నా వారు....మిగిలిన వారు ''మీకు మీరే ...
మాకు మేమే''సింపుల్.యెంత మంచి మెజర్మెంట్ ఇచ్చాడు నాకు దేవుడు.
మీరు ఎవరి మీద జాలి పడక్కర్లేదు.వాళ్ళను మనుషులు అని గుర్తిస్తే చాలు.ప్రతీ
ఒక్కరి పుట్టుకకి ఏదో కారణం ఉంటుంది.వాళ్ళ ఉనికి ఇక్కడ అవసరమే.
కావాలంటే క్రింది మ్యాటర్ చదవండి.
6 comments:
kikiki సినిమా మళ్ళీ చూడండి అర్ధమ్ అవుతాది..
మీరు ఇలా కధంతా చెప్పెయ్యకూడదు.. ;)
లాస్ట్ పేరాలు బాగున్నాయండీ..
సినిమా కథ బాగా చెప్పారు .నేనైతే మీ కథ విన్నాకా ఆ సినిమా చూసే ధైర్యం చేయను :)
రాజ్ కధ చెపితేనే రివ్యు అంటారు.
అయినా మీరు ఇలా రూల్స్ పెడతారు అని నేను రివ్యు కాకుండా ..కదా కాకుండా...ఏదో మనకు తోచింది
వ్రాసేస్తునాను )))
మాలా గారు చూడండి ఒక సారి పర్లేదు...పాటలు బాగున్నాయి
మీ విశ్లేషణ బాగుంది..చివరి వాక్యాలు హత్తుకున్నాయి...
వర్మ గారు థాంక్యు...మీరు చదివారు అని తెలిసి
సంతోషం గా ఉన్నది
Post a Comment