హ్మ్....ఈ వేణు శ్రీకాంత్ ఒకడు ....
ఈయన అమ్మ పోస్ట్ వెయ్యగానే నాకు మా పిల్లలు గుర్తుకు వస్తారు.
ఈయన గోవిందా అనంగానే...నేను తిరుమలా అంటాను.
ఇప్పుడేమో దెయ్యం పోస్ట్ వేసాడు?
సర్లే వేస్తె వేసాడు అంటే ఈ రాజ్ కుమార్ సప్పోర్ట్ ఒకటి.
అబ్బో అరుందతి ని చూసి కేవ్వ్వ్వ్వ్వ్వ్ మన్నోళ్ళు అని...
నేను యెంత దెయ్యాల సినిమా చూసి రాత్రిళ్ళు మేలుకొని
పక్కణ ఉన్న వాళ్ళను పిశాచి లా పీక్కొని తినేదాన్ని అయినా
నేను ఇష్టంగా(టి.వి.లో)చూసిన దెయ్యం సినిమా ఒకటి ఉంది.
(లేకుంటే జాలితో).......అదే వైశాలి .....
ఎప్పుడో అందరు చూసిందే అయిన మరొక్కసారి.....
వైశాలి అంటే మన అమ్మాయి...మన పక్కింట్లో ఆడుకునే
చుట్టూ పక్కల తిరిగే పద్దతిగా పెరిగిన మనలో ఒకటైన
అమ్మాయి.....స్వాతి ముత్యం అంత స్వచ్చంగా ఉంటుంది.
ప్రేమ అనేది చెట్టుకే తెలీకుండా వసంతం లో వేసే కొత్త చిగురులా పుట్టుతుంది,
కాబట్టి తెలీకుండానే తన వెంటబడే వాసు అనే అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది.
అతనేమీ అల్లరి చిల్లరిగా తిరిగే వాడు కాదు.ఒక ఐ.పి.ఎస్.అవ్వాలనే లక్ష్యం
తో ఉన్నవాడు.అమ్మాయి కూడా పద్దతి గల్లదే కాబట్టి ఇద్దరం
స్నేహితులుగానే ఉందాము ....నాన్నకు నచ్చితే పెళ్లి అంటుంది.
ఇక్కడ కధ మలుపు తిరుగుతుంది.వైశాలి వాళ్ళ నాన్నకి వాసు పోలీస్
కావటం ఇష్టం లేదు.వేరే జాబ్ అయితే ఇస్తాను అంటాడు.
కాని వాసు తన లక్ష్యం అదే అని చెప్పి వెళ్లి పోతాడు.
వాళ్ళ నాన్న వేరే అబ్బాయిని ఇచ్చివైశాలికి పెళ్లిచేస్తాడు.
సరే చక్కగా భారతీయ స్త్రీ లాగే వాసుని మర్చిపోయి ప్రేమగా చూసుకొనే
భర్త తో కాపురం చేస్తూ ఉంటుంది.
ఏమవుతుందో తెలీదు వైశాలి చచ్చి బాత్రూం నీళ్ళ టబ్ లో పడి ఉంటుంది.
ఇక తరువాత నుండి మొదలు అపార్ట్ మెంట్స్ లో ఒక్కొక్కరు చని పోవటం ...
మొదట పక్కింటి ఆంటీ,ఎదురింటి అంకుల్,ఇంకో అబ్బాయి.....
ఈ కేస్ లు ఇన్వెస్ట్ చెయ్యటానికి ''వాసు''పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు.
ప్రతీ హత్య జరిగినపుడు నీళ్ళు ఉండటం చూస్తాడు.కాని అతనికి
విషయం అర్ధం కాదు.అప్పుడు వైశాలి వాళ్ళ చెల్లి లోకి వచ్చి
తనను చంపిన వాళ్ళు అందరిని పగ తీర్చుకున్నాను
అని చెపుతుంది.
జరిగింది ఏమిటంటే ......ఒక మగావాడిని చంపాలంటే కత్తో,
ఏదో ఒక ఆయుదమో కావాలి....
కాని ఆడదానిని చంపాలంటే నీచపు మనస్తత్వంతో నింద వేసే
నాలుక చాలు....ఇప్పుడూ అదే జరిగింది.చక్కగా కాపురం చేసుకొనే
ఒక అమాయకపు అమ్మాయి నిందలకే బలి అయిపొయింది.
ఒక రోజు భర్త వైశాలికి తాను ఇంతకు ముందు ఒక అమ్మాయిని
ప్రేమించాను ఇప్పుడు మర్చిపోయ్యాను అని చెప్పి నీ సంగతి
చెప్పు అంటే...నేను వాసు అనే అబ్బాయిని ప్రేమించాను అయితే
మర్చిపోయ్యాను అని అమాయకంగా చెప్పేస్తుంది.
ఇక అక్కడ నుండి రగిలిపోతాడు....ఎదురింటి అంకుల్
వైశాలి గూర్చి బ్యాడ్ గా చెపుతాడు భర్తకి ...ఆతను
పనమ్మాయి తో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి
వాళ్ళ భార్యకి చెపుతాను అని వైశాలి చెప్పేసరికి.
దానికి ఆజ్యం పక్కింటి అంటి పోస్తుంది .....
నువ్వు లేనప్పుడు ఎవరు ఎవరో మగ వాళ్ళు
ఇంటికి వస్తున్నారు అని సాక్ష్యం చెప్పి (తన కూతురు కొనాల్సిన
అపార్ట్మెంట్ వైశాలి వాళ్ళు కొన్నారని కోపం తో)
ఇక ఎదురింటి అమ్మాయి ని ''మగ వాళ్ళతో తిరాగ వద్దు జాగ్రత్త ''
అని చెపుతుంది వైశాలి... అందుకు కోపం తో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్
వాచ్ మాన్ ఎవరి కోసం వచ్చావు అంటే ''వైశాలి''కోసం అని
చెప్పి ఇంకా నింద ను పెద్దగా చేస్తాడు.
భర్త రగిలి పొయ్యి చివరికి కోపం తో వైశాలిని చంపేస్తాడు.
కాని అమాయకపు ఆడపిల్ల తన కసిని చంపుకోలేక
ఆత్మ గా మారి వాళ్ళు అందరిని చంపేస్తుంది.
చివరకు వాసు వైపు సాక్ష్యం చెప్పి వాసు తన చెల్లెలిని పెళ్లి
చేసుకోనేటట్లు చేస్తుంది.
కాని ఇది యెంత మంది జీవితాలలో జరిగే విషాదం
మొన్న ఒక ప్లస్సర్ వ్రాసారు...వీకెండ్ లో కూడా పని ఉందని
ఆఫీస్ వాళ్ళు ఇంటికి వెళ్ళద్దు అని చెపితే ....లేదు నన్ను ఇక్కడ
ఉంచితే ఏమి చెయ్యలేను.ఒక్క సారి ఇంటికి వెళ్లి వస్తేనే నాకు
ఎనేర్జీ అని ఆతను అంటే ....ఇంక ఆఫీస్ వాళ్ళే అతన్ని పంపారంట
ఇంటికి వెళ్లి మళ్ళా ఆఫీస్ కు రమ్మని.నిజంగా కుటుంభ బంధాలు
యెంత బాగుంటాయి....యెంత బలాన్ని మనిషికి ఇస్తాయి.
వాటిని వృధాగా ఎవరో చెప్పారని అనుమానంతో నాశనం
చేసుకొని అమాయకపు ఆడపిల్లల ఉసురు పోసుకోకూడదు.
మనం కూడా ఆడపిల్లల గూర్చి మాట్లాడేటప్పుడు ఆలోచించి
మాట్లాడాలి.
'ముత్యాల ముగ్గు''సినిమాలో చెపుతుంది...''పెళ్లి అయ్యే
దాకా అమ్మాయి చూసుకునే అద్దం లాంటిది ...ఎందరో
పెళ్లి కొడుకులు వస్తుంటారు, చూస్తుంటారు,వెళుతుంటారు.
భర్త రాగానే అది ఫోటో ఫ్రేం అయిపోతుంది.అందులో భర్త తప్ప
ఇంక ఎవరు కనపడరు''అని.
అది నిజంగా నిజం.భర్తలే అనుమానించి నిముషం ,
నిముషం గుర్తు చేసి అమానుషంగా మానసిక
చిత్రవధ చేస్తే....ఎవరికి చెప్పుకోలేక ఎందరో ఆత్మా హత్య ల వైపు
నెట్టి వెయ్యబడుతున్నారు.
ఒక్క సారి మానవత్వం తో ఆలోచించండి.చాలు .....
'మరి దెయ్యాలు,పగలు ఉన్నాయా అంటే.....ఒకటే చెపుతాను...
నిజంగా ఏదో ఒక భయమే మనిషిని మంచి దారిలో నడపగలదు
అంటే...అది నిజంగా దెయ్యమే కాదు,పిశాచి,రక్త పిశాచి,భూతం..
ఇంకా రక రాకా లుగా మారి మీ పాపమే మిమ్మల్ని ముప్పు
తిప్పలు పెడుతుంది అని చెపుతాను''
అమాయకుల ఉసురు ఊరికినే పోతుందా?
16 comments:
బాగుందండీ మీ రివ్యూ..ఈ సినిమా చూసాను..నాకూ నచ్చింది...పాటలు చాలా మెలోడిగా అర్థవంతంగా వుంటాయి..
ఈ సినిమా నేను తమిళ్ లో చూసాను. ఈరం అనుకుంటా బాగుంటుంది
'పెళ్లి అయ్యే
దాకా అమ్మాయి చూసుకునే అద్దం లాంటిది ...ఎందరో
పెళ్లి కొడుకులు వస్తుంటారు, చూస్తుంటారు,వెళుతుంటారు.
భర్త రాగానే అది ఫోటో ఫ్రేం అయిపోతుంది.అందులో భర్త తప్ప
ఇంక ఎవరు కనపడరు''అని
bagundi
ఈ మధ్యే ఈ సినిమా చూశాను. నాకూ నచ్చింది. చక్కని వస్త్రధారణతో అందంగా వుందా అమ్మాయి.
well said! ఏంటో నాకసలు ఈ సినిమా ఉందనే తెలియదు! ఆగండి ఖాళీ దొరికినప్పుడు చూస్తాను.
జై హో మా టీ వీ
అవును వర్మ గారు సినిమా పాటలు అన్నీ బాగుంటాయి.
కాకుంటే బాధతో కధే ఎక్కువ గా చూసాను ..థాంక్యు
బంతి థాంక్యు
అవును ముత్యాల ముగ్గులో ఈ డైలాగ్ చాలా బాగా అనిపించింది ..థాంక్యు నరేష్
అవును జ్యోతి చాలా బాగుంది ఆ అమ్మాయి ...
దేవుని గుడిలో తీర్ధం లాగా...థాంక్యు
తప్పకుండా చూడు రసజ్ఞ...థాంక్యు
హరే థాంక్యు
ఈ సినిమా గురించే నాకు తెలీదు . సి డి దొరికితే కొని చూస్తాను కాని నాకు దయ్యాల కథలంటే భయమే :)
మీ రివ్యూ బాగా రాసారు .
:)) Never heard of the movie. Looks good.
btw, Thank you Sasi garu :)
Kumar N
post బాగా రాసారు... well said about girls...
కానీ మరీ one sidedగా రాసారు అని అనిపిస్తుంది..
అవునా మాల గారు.కాని ఇది మరీ భయం వెయ్య లేదులే.పక్కన ఎవరి నైనా కూర్చో పెట్టుకోనో...ఏదైనా పని చేస్తూనో చూడండి అప్పుడు భయం వెయ్యదు
థాంక్యు కుమార్ గారు
రాజేంద్రా భారత దేశం ఇంకా టు సైద కాలేదు ..ప్రస్తుతం ఎక్కువ నడిచే కధ ఇదే
అనుమానాలాకి అమ్మాయిలే ఎందుకు బలవ్వాలి ?? ప్రతి ఒక్కరికి దేవుడి చేతిలో శిక్ష ఉంటుంది
ikkada deyyam chetilo shiksha padindi kadaa chinni garu thank you
Post a Comment