అలక ముత్యం లాంటి మంచు బిందువు ....
తెల్లని వన్నె గల కాంతి కిరణం లాంటి జీవితం
దాని లోకి వెళ్లి .....సప్త రంగుల ప్రేమనీ జీవితానికి
అద్దుకొని వస్తుంది..ఇద్దరినీ దగ్గరగా జరుపుతూ....
భర్త తనను ఆకారణంగా పక్కింటి ఆమె ముందు తిట్టాడు అని
అలిగి ఉంటుంది సత్య.లింక్ ఇక్కడ
ఈ లోపల జరిగిన వెనుక ఇంటి
సంగతులు సత్య మనసు గాయ పరచి ఉంటాయి.అన్నం కూడా
తినకుండా దిగులుగా పడుకొని ఉంటె సాయంత్రం అవుతుంది.
తలుపు తీస్తే ఎదురుగా భర్త.
ముభావంగా లోపలి వెళ్లి పోతుంది.పీక్కు పోయి ఉన్న
సత్య మొహం చూస్తె జాలితో మనసు నిండి పోయింది మూర్తికి.
కాని ఎలా ఆ ముభావాన్ని కరిగించాలో అర్ధం కావటం లేదు .
సత్య వెనుకాల వెళితే 'టీ' తెచ్చి టేబుల్ పై ఉంచి బయట వరండాలో
కూర్చుండి పొయ్యింది.''చా చిన్న తప్పుకు ఇంత శిక్షా ఏమిటి
పే..ద్ద మాట్లాడక పొతే పోనీ...''విసుక్కొని పనిలో మునిగి పొయ్యాడు.
దీపాలు వెలిగి అన్నం వేళ ..అయినా ఇల్లంతా మూగగానే ఉంది.
హృదయ రాగాల సంమేలంతం తో కళ కళ లాడే ఇల్లు...శ్మశాన వైరాగ్యం.
ఎవరిది తప్పు?ఎవరిది ఒప్పు?వెలగపండు పండితే తియ్యటి వాసన ....
కాని నిజానికి అది పుల్లగానే ఉంటుంది.మనం కలిపే బెల్లమే దానికి
తీయని రుచి ఇచ్చేది.దాంపత్యము అంతే...ప్రేమ కలిస్తేనే అది తియ్యగా
ఉండేది.
అన్నాలు ఏదో మొక్కుబడిగా అయ్యాయి.ఇంటిలోని మౌనం ఇద్దరి మద్య గోడగా
సత్య కనిసం ఉదయం నుండి ఉన్న బాధలోమూర్తి గూర్చి
ఆలోచించటం లేదు .మౌనంగా ఉండి పోయింది అంతే .
అలాగే హాల్ లో నేల మీద వాలి పొయ్యి..కను రెప్పలు మూతలు
పడి పొయ్యాయి....కలువ పూలు మెల్లగా ముడుచుకున్నట్లు.
యెంత సేపు గడిచిందో .....వీపుకి గుచ్చుకున్న వెచ్చని గాలి...
ఉలిక్కి పడి లేచింది.పక్కన భర్త.''లేదు ..లేదు నేను వెళ్లి పోతాను''
భయపడి చెప్పాడు.గమ్ముగా తల దించుకునింది .భావాలు కూడా
అర్ధం కాకుండా.
''సత్యా''ఆర్ద్రంగా పిలిచాడు.''ఇలా ఉండ వద్దురా ...నువ్వు ఇలా ఉంటె ఏమి
బాగా లేదు నీకెలా కావాలో అలా ఉండు...
నీ కాళ్ళు పటుకోమన్న పట్టుకుంటాను.నిజం.
అలాగైనా చేస్తాను కాని నువ్వు ఇలా ఉంటె నా గుండె ఎవరో కోసేసినట్లు ఉంది.
భరించలేక పోతున్నాను''భావాలలోని ప్రేమ తడి కన్నుల్లో ఊరుతుంది.
వింటూ ఉంది తల వంచు కొని ..కాని మొహం లో కసి లేదు ,కోపం లేదు.
ఏదో వైరాగ్యం.
'సత్య నిన్న రాత్రి కూడా ఇక్కడే కూర్చున్నాను నిన్ను లేపకుండా
రాత్రంతా దిగులుగా చూస్తూనే ఉన్నాను.ఎప్పుడూ ఇంత శిక్ష వేయకు .
నేను ఇంతలా ఎవరిని నా జీవితం లో బాధ పెట్టింది లేదు .
ఇలాగా బాధ పడింది లేదు.నువ్వు మాట్లాడక పొతే చచ్చి పోవాలనిపిస్తుంది.
ఈ రోజు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ లో కూడా అన్ని తప్పులే.
కొంచెం ఉంటె ఉద్యోగం ఊడిపోను.
ఫ్రెండ్స్ సహాయం చేసారు లేకుంటే ఏమి అయ్యేదో .
నా జీవన రాగానికి శృతి నీవే...నీవు లేకుంటే ..నీ ప్రేమ ఊపిరి తగలకుంటే
అన్ని అపశ్రుతులే...నా జీవన వేణువు మూగ పోతుంది.
నేను ఇంక జీవచ్చవాన్నే నువ్వు లేకుంటే "వడి లో తల ఉంచి
భోరుమన్నాడు.అంత బింకం ఏమయ్యిందో...
మగ వాళ్ళు చిన్న పిల్లలే....ఏకాంతం లో.
యే మాట ప్రేమ తంతువుని మీటిందోద సత్య మౌనం విడిచింది.
చిన్నగా విడివడిన రోజా రెక్కలు....పరిమళాన్ని పలికినట్లు...
''అవును అన్నీ మీరే చెపుతారు...కాని మేమంటే మనిషిని అనే స్పృహ
మాత్రం ఉండదు.
మా మనసుకు యెంత గాయం అవుతుందో అర్ధం కాదు.
నిన్నంతా నేను యెంత విల విల లాడుంటాను.
ఆమె గూర్చి మీకేమి తెలుసు?నన్ను రోజు అలాగే నీళ్ళు రాకుండా
ఎడిపిస్తుంటుంది.ఆ బాధ ఆమెకి తెలియాలి అని అలాగా చేసాను.
మీరేమో తప్పు చేసిన వాళ్ళను వదిలేసి నన్ను తిట్టారు.
ఏమి తిట్టినా పడి ఉంటామా?..మాకేమి రోషం లేదా?మనుషులం కామా?
అగ్నిపర్వతం ఎగసి పడినట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.
''అది కాదు ''వివరించాపొయాడు చేతులు పట్టుకొని...
''ఏది కాదు..మీరంతే ...మొగ వాళ్ళు అంతా రాక్షసులు.మీకు మమ్మల్ని
ఎలా చూసుకోవాలో తెలీదు.తాగి వస్తారు ...తిరిగి వస్తారు..తంతారు,నిందలు
వేస్తారు.మేము మొగుడు కాబట్టి ఓర్చుకోవాలి''కోపం తో
మూర్తి నీ దూరంగా తోసి వేయ పోయింది .చటుక్కున చేతులు
పట్టుకొన్నాడు.గింజుకుంటూ ఉంది.
''నేను చెప్పేది విను.నాకు తెలీదా నీ సంస్కారం
కాని ఆమె ను తిడితే బాగుంటుందా?
నువ్వంటే నా దానివి"ప్రేమగా గుండెల పై తల ఉంచుకున్నాడు.
''అచ్చంగా నాదనివే..నిన్ను అంటే నన్ను అనుకున్నట్లే.అయినా
ఈ సారి గొడవ జరిగితే అక్కడ ఉండకుండా పారిపోతాను ప్రామిస్''
సత్య తల పై చేయి ఉంచాడు.ప్రేమ స్పర్శ ,పాపటి లో తగులుతున్న
వేడి ఒపిరి,చెవులకు వినపడుతున్న గుండెలోని లయ ...విరహాన్ని
రేపుతూ...సత్య మెత్తబడి పోతూ ఉంది.అయినా బింకం పోవటం లేదు .
''అవును తప్పులన్నీ బాగా చేస్తారు.దరిద్రపు అలవాట్లు అనీ చేసుకొని...
పేరుకి మాత్రం ధర్మేచ ..అర్దేచ...కామేచా..మొక్షేచ...అని అగ్ని ముందు
ప్రమాణాలు"తగ్గనంటున్న వ్యక్తిత్వం ,అల్లుకోమంటున్న తాపం...
మనిషి నలిగి పోతుంది.
''నేను కాదు కదా అలా చేసింది.అయినా అవి వాళ్ళ కుటుంభ విషయాలు
సమస్యలు ఎదుర్కుంటున్న వాళ్లకి అవి ఎలా తీర్చుకోవాలో తెలుసు.
అందుకే మిమ్మల్ని క్షమయా ధరిత్రి అనేది.ఒక కుటుంభం వీదిలోకి
రాకుండా గౌరవంగా ఉంది అంటే అది మీ వల్లనే...సహాయం కావాలి
అనుకున్న రోజు అందరం మీ వెంట ఉంటాము''జీ హుజూర్''అని
మీరు మహా రాణుల్లాగా ఆజ్ఞాపించాటమే తరువాయి''
అతనన్న పద్దతితకి పక పక నవ్వేసింది.
''ఆహా ముత్యాలు,పగడాలు,వజ్రాలు''కళ్ళతోఏరాడు.
అర్ధం కాక చూసింది.వంటిపై పాకుతున్న వేళ్ళ స్పర్శ అర్ధం
చెపుతున్నట్లు,మళ్ళా పకపకలు...
మూగ అయిన ఇంటి గోడలు ప్రేమ రాగాలకు శ్రుతి
పలుకుతూ...
''ఇంకేమి వద్దు..ఇంకేమి వద్దు నువ్వే చాలు నీ ప్రేమ చాలు''
చిత్రం రెండు హృదయాలదీ ఇదే మాట ......
దాంపత్య మధురిమ ....మనస్సులో చిరు మువ్వ సవ్వడి.

6 comments:
అలక అందంగా ముగిసిందన్నమాట.
>>వెలగపండు పండితే తియ్యటి వాసన ....
కాని నిజానికి అది పుల్లగానే ఉంటుంది.మనం కలిపే బెల్లమే దానికి
తీయని రుచి ఇచ్చేది.దాంపత్యము అంతే...ప్రేమ కలిస్తేనే అది తియ్యగా
ఉండేది.>> బాగా చెప్పరు. కథ బావుంది శశి గారు.
ముగింపు బాగుంది శశి గారు.
ఇంత బాగా..ఎలా వ్రాస్తారో..నాకు చెప్పరా..? వేకువ ఝామునే లేచి ట్యూషన్ కి వస్తాను. మిస్.
మిస్సెస్ గారిని డిస్ట్రబ్ చేయకుండా.. :)
వీడియో వేస్ట్. ముచ్చటయిన వర్ణన ఎంత బావుందో..తెలుసా..!?
శశి టీచర్.. కలమా..! అది రసరాగాలు నింపిన అనుభవాల కడు సారమా..!!
థాంక్ యు టీచర్.. వైవిధ్యం నేర్పించారు.
జ్యోతి గారు మీ అభినందన ఇంకా తీయగా ఉంది
థాంక్యు వెన్నేల )))
పొ...వనజక్క...నీకు నేను ట్యూషన్ ఏమిటి
అసలు మీ అభిననదన చూస్తేనే తెలుస్తుంది మీరు యెంత చక్కగా వ్రాయగాలరో ))
Post a Comment