ఏమి చెయ్యాలో తోచక బట్టలు ఒక్కోటే ఆరేస్తూ ఇంట్లోకి
బయటకు తిరుగుతున్నాను.ఇల్లంతా నిశ్శబ్దం .......
నన్నొక్క దానినే పెద్ద లోయ లోకి విసిరేసినట్లు ,
ఒకప్పుడు లా ఉండేది కాదు ఇంటర్ కోసం పిల్లలు
ఇద్దరు హాస్టల్ కి వెళ్లి పోయి కృత్రిమంగా నాపై కురిసిన
ఏకాంతం.ఈయన క్యారియర్ తీసుకొని ఆఫీస్ కి వెళ్లి పోయారు.
బియ్యం చేటలోకి పోసుకొని యేరుతూ కూర్చున్నాను.
ఒక్క చిన్న గ్లాస్స్ బియ్యం యెంత సేపు ఏరుతాను?
చిన్నగా వేళ్ళు చేతలు ముగ్గు వేస్తున్నాయి...అల్లి బిల్లిగా
గేసిన గీతలు నా నుదిటి పై రాతలు లాగే ఉన్నాయి...
నా జీవితం ఇక ఎవరి కోసం ఉపయోగించాలో తెలీనట్లు
ఒక నిర్వేదం పొగ మంచులా కమ్మేసుకొని....కనీసం దిగులు
కన్నీళ్ళుగా అయినా జారిపోకూడదా?ఎవరికైనా చెప్పుకున్నా
నీకేమి రోగం హాయిగా తిని కూర్చోక అంటారు.ఎలా చెప్పాలి
కష్టం అని కనపడకుండా మనసుని మెలి పెట్టె బాధని....
పిల్లలు లేక మూగ పోయిన గూడుని చూస్తె వచ్చే వేదన
పిల్లలు వదిలేసిన పక్షులకే అర్ధం అవుతుంది.
గుప్పెట్లో బియ్యం తీసుకొని చేటలోకి జారుస్తూ ఉంది....
జారుతున్న ఆలోచనలను బియ్యం లో ఏరుకుంటూ...
ఉలిక్కి పడింది.''అవును'' ఈ రోజు ఏ తేది?
''అయ్యో'' అవును కదా ....ఈయన పుట్టిన రోజు ,ఎలా
మర్చిపోయింది తను.తన ప్రాణాన్ని తన సొంత ప్రాణంగా
చూసుకొనే శ్రీవారి పుట్టిన రోజు ....ఛా ఎలా మర్చిపోయింది?
గబా గబా ఇంట్లోకి వెళ్లాను.ఈయనకి ఇష్టమైన బక్ష్యాలు,
గారెలు చెయ్యటానికి పప్పు నానపోస్తూ ఉంటె వచ్చింది ఆలోచన .
మెల్లగా పురుడు పోసుకున్నది.....మెదడు అంతా వ్యాపించి
ఒక రకమైన హుషారు,అంతలోనే సిగ్గు.
నిజమే ఈయనను మర్చిపోయి ఎన్ని రోజులు అయింది తను...
పిల్లలతో మునిగిపోయి ,ఏ రోజైనా తన అసంతృప్తిని
ఆయన నుదుటి పై బొమలు ముడి వేసి రేఖామాత్రం
కూడా చూపలేదే.ఎప్పుడు తనూ,పిల్లలు అంతే.అదే ప్రపంచం.
ఏ రోజు ఈ ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజే తన హృదయం
తనకు ఇచ్చేసినట్లు దానికి తను మహారాణి లాగే చూసాడు.
పిల్లలకు పరుపులు ఇచ్చేసి తాము చాప పై పడుకున్న
రోజులు ఎన్నో......ఇన్ని చేసిన ఆయనకు ఏదో ఒకటి
చెప్పాలి ఈ రోజును మరుపురాని రోజుగా చేయటానికి.....
ఏమి చెప్పాలి?''ఐ లవ్ యు''అనా....ఛీ ఛీ ...
ఈ వయసులోనా?అయినా ఇప్పుడు కొత్తగా చెప్పటమేమిటి?
ఏ రోజైతే పెళ్ళిలో ఈయనే మీ భర్త నమస్కారం చెయ్యి
అన్నప్పటి నుండి ఆయనను ప్రేమిస్తూనే ఉంది కదా.
అలా కాదు అలా కాదు....ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి
చేస్తున్నాయి ఏదో ఒకటి చెప్పు అని తొందరపెడుతూ.....
సరే ఎలాగోలా ఫోన్ చేసి''మీరంటే ఇష్టం అని చెప్పేస్తాను''
డైల్ చేస్తుంటే చేతులు చిత్రం ఎప్పుడూ లేనిది వణుకు,
ఎందుకంత భయం?ఎన్ని సార్లు చేసి ఉంటాను?
దేవుడా వద్దు...వద్దు...ఆపేసింది.మళ్ళా ఉండబట్టలేక
చేసింది.మోగుతూ ఉంది.చెప్పాలి ,చెప్పెయ్యాలి...ధైర్యం
పోగుచేసుకుంటూ భావాల రెక్కలు విప్పుతూ ఉంది...
అవతలి నుండి ''చెప్పు జయా?''కొత్తగా ఉంది.మాటలు
రావడం లేదు అతి కష్టంగా ''ఏమండీ''హా చెప్పు ....''
ఛా ఈ వయసులో ఏమి చెపుతాను ....''ఏమి లేదు''
అనేసింది.''సరే నువ్వు టిఫిన్ చేసావా?''అడిగాడు
''హా అయింది''....చెప్పు చెప్పు మనసు ముందుకు తోస్తూ
ఉంది.''లాండ్రీ అతను వస్తే బట్టలు వెయ్యి''''సరే''
భారంగా ఫోన్ పెట్టేసింది.
ఛీ . ..చీ ...నీకసలు బుద్ది లేదు ,యెంత మంచి అవకాశం
పోయింది.అతనికి యెంత చక్కని జ్ఞాపకం అయి ఉండేది.
ఇదేనా నువ్వు చూపే కృతజ్ఞత.....తిట్టింది మనసు.
నిజమే ఎలాగైనా ఈ రోజు ఆయనకు బహుమతిగా
ఇవ్వాల్సిందే.ఏమి చెయ్యాలో తెలీక నిస్సహాయంగా దిండు పై
వాలింది .ఇది ఎవరికి చెప్పే సమస్యా కాదు,తనకు ఫ్రెండ్స్
కూడా లేరు.అందరు ఎవరి కాపురాలు,పిల్లలు ఎవురికి
ఎవరు గుర్తు ఉన్నారు.ఆసలు పర్సనల్ జీవితాలు ఎవరికి
ఉన్నాయి?
''ఎస్''అలాగే చేయాలి...హుషారుగా లేచింది ,ఒక్కసారి
కాలేజ్ చదువు గుర్తుకు తెచ్చుకుంది.పెళ్లి కుదిరి సగం లో
మానేసినా తెలివి ఎక్కడికి పోతుంది.అవును ఒక ప్రేమ లేఖ
వ్రాసి ఇస్తాను.ఇల్లంతా వెతికి పిల్లల అలమర నుండి
తెల్ల కాగితం ,కలం తెచ్చుకుంది.మెల్లిగా పేపర్ ని నిమిరింది ,
చిన్నగా సిగ్గుతో కూడిన నవ్వు .....ముందు ఏమి వ్రాయాలి?
సంబోధన ఎలాగా?కాలేజ్ చదువుని అంతా ఒక్కసారి బుర్ర
లోనే తిరగేసింది.డియర్...ఛీ కాదు ....ప్రియమైనా ..బాబోయ్
ఇది జరిగే పని కాదు ....సంబోధన లేకుండానే వ్రాసేస్తాను.
ఛీ...సంబోధన లేకుండా ఏమిటి ,మనసు కొంచెం కూడా దయ
లేకుండా మందలించింది.సరే ''ఏమండీ'' అవును ఇదే హాయిగా
ఉంది.ఏది వ్రాస్తే ఏమిటి మనకు సంతోషంగా ఉండాలి.ఇలాగే వ్రాస్తాను.
చక్కటి ముత్యాలు గొలుసులుగా దొర్లి ''ఏమండీ''అనే అక్షరాలుగా
మారిపోయాయి.
సరే ఇప్పుడేమి వ్రాయాలి ఆలోచన లోతుల్లో నుండి అమృతపు ఘడియలను
మనసు వెతుకుతూ ఉంది.
కను రెప్పలు పైకి ఎత్తలేక తల దించుకున్న తనను చూసి ముచ్చటపడి
కట్నం విషయం లో పెళ్లి ఆగకుండా వెనక వేసుకొని వచ్చి మూడు ముళ్ళు
వేసిన విషయమా?
ఏడు అడుగులు వేస్తూ చీర తట్టుకొని పడపోయిన తనని చిరు వెచ్చగా
పొదవుకొని ఇప్పటికీ గుండెల్లో దాచుకున్న విషయమా?
కనుపాప ఊపిరి పోసుకున్నదన్న విషయం నును సిగ్గుతో చెపితే
హత్తుకొని పైకి ఎత్తుకున్న విషయమా?సిగ్గుతో ఆలోచనలు
ముందుకు పోవడం లేదు.కలం నుండి ఒక్క ముక్క రాలడం లేదు.
ఇద్దరం నలుగురమై పావురాళ్ళ లా కువ కువ లాడే ఒక పొదరిల్లులో
ప్రతి రాత్రి నువ్వంటే నాకిష్టం అని వెచ్చని ఊపిరిని తన చెవుల పై
అద్ది చెప్పిన విషయమా....ఎన్ని వ్రాయాలి.చేతులు లలో సన్నగా
వణుకు ఇదేమిటి?ఇదేమిటి?తాను ఇంకేమి చేయలేదు....నిరాశగా
దిండు కింద పెట్టి వెళ్ళిపోయింది .వంట చేయటానికి.
దిగులుగా తల వంచుకొని సాయంత్రం భర్తకు టిఫిన్ పెట్టింది.
''అరె బక్ష్యాలు,గారెలు ఏమిటి ఈ రోజు స్పెషల్?''సంతోషం తొ
తింటూ అడిగాడు.మౌనం గా వెళ్ళిపోయింది.
మెల్లిగా బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంటే అతని చేతికి తగిలింది.
ఒక తెల్ల కాగితం దానిపై రాలిన రెండు పూలు,మధ్యలో
ఏమండీ .....చిత్రం ఎందుకో అతని హృదయం ఆనందం తొ
రెక్కలు విప్పి ఆకాశం లో విహరించింది.ముచ్చటగా
తోలి రోజులకు విహరించిన మనసు ,హృదయం తేలికగా
ఎగిరిపోతూ .....తన చేతి స్పర్శను పరోక్షంగా అనుభూతించాలి
అనుకొని మెల్లగా కాగితాన్ని బుగ్గకు ఆనించుకొని కళ్ళు
మూసుకున్నాడు.....''జయా''మెల్లిగా పిలిచాడు.
వచ్చింది.''ఏమిటిది?''కొంటెగా కాగితం చూపిస్తూ
అడిగాడు.కొంటెతనం కాక పొతే గ్రహించలేదా ఏమిటి?
''నా వల్ల కాలేదు,నా వల్ల కాలేదు''నిరాశ కన్నీళ్లు గా
బుగ్గలపై జాలు వారుతూ ....మీ పుట్టిన రోజు కదా అందుకని
వెక్కిళ్ళ మద్య చెప్పింది.''పిచ్చీ''దగ్గరగా హత్తుకున్నాడు .
గుండెలకు తగిలే చెమ్మ ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలో ఎవరో
కట్నం తక్కువ తెచ్చావు అన్నారని బాధను మోసుకొచ్చి
చెప్పినట్లు ....ఈ రోజు జయ గుండెల్లోని ప్రేమ ను మోసుకోస్తూ...
వెక్కిళ్ళు ఆగటం లేదు.''మీరంటే ఇష్టం అని వ్రాద్దాము
అనుకున్నాను,కాని''వ్రాయలేని అశక్తత ,వ్రాయాలనే కోరిక
సాగర సంగమం లా నిలవలేక తీగలా అల్లుకుపోయింది.
''జయా అనీ అక్షరాలే చెప్పలేవు.నువ్వు చేసిన వంట లో లేదా
నీ ప్రేమ ,నీ స్పర్శలో లేదా నీ ప్రేమ,నీ సేవలలో లేదా నీ ప్రేమ
ఇన్ని విధాల నువ్వు తెలుపుతూ మళ్ళా వ్రాయడం అవసరమా?''
హ్మ్...ఏమిటో అందరికి చిన్న విషయం కూడా తనకు పెద్ద విషయం
అయిపొయింది.ఇంత చిన్న కోరిక కూడా తీరక పోయే...
''అయినా రోజు తినే పప్పు అన్నం కంటే పండగ రోజు
పాయసం తీపి,అది కూడా ఈయనకు అక్షరాలో
వడ్డించలేకపోతిని '' నిరాశగా అనుకొంటూ హృదయపు
పరుపు వెచ్చదనం కళ్ళను వాల్చేస్తూ ఉంటె .....తన
కలల లోకం లోకి వెళ్ళిపోయింది...అక్కడైనా వ్రాస్తుందో?లేదో?

12 comments:
hmmm.......( mee post chadivi aavariki emivvali)
chaala bagundi me post.
So sweet!
బాగా రాసారు శశి గారు, చదువుతుంటే సినిమా చూసినట్లు బొమ్మలు కళ్ళముందు కదిలాయి.
శశి గారు! చాల చాల బావుంది . ప్రేమ లేఖ రాయకపోవడంలోనే బోలెడు రాసేసింది కదా అది అర్ధం చేసుకోవాల్సిన వారికి అర్ధం అవడం ఇంకా నచ్చింది .
అనీ అక్షరాలే చెప్పలేవు.నువ్వు చేసిన వంట లో లేదా
నీ ప్రేమ ,నీ స్పర్శలో లేదా నీ ప్రేమ,నీ సేవలలో లేదా నీ ప్రేమ..
--------------------------
Chalaa bagaa rasaarandi.
అనానమస్ గారు నేను ఇవ్వడం ఏమిటి?:(
థాంక్యు.మీ పేరు?
జలతారు వెన్నెల గారు చాలా కాలం తరువాత దర్శనం
థాంక్యు
గ్రీన్ స్టార్ గారు థాంక్యు
శైలు నాకు గారు ఏమటి?థాంక్యు
రవి తేజ గారు :)) థాంక్యు
Chaala baaga rasarandi...
సాయి కిరణ్ గారు థాంక్యు
Excellent andi.........!!!
Post a Comment