అర్ధం అయింది కదా ఏమి వ్రాయపోతున్నానో.
అదే తిరుపతిలో జరుగుతున్న తెలుగుసభల గూర్చి.
ప్రభుత్వం 37 ఏళ్ళ తరువాత 27,28,29 తేదిలలో మన
రాష్ట్రం లో తిరుపతి లో నిర్వహిస్తూ ఉంది.పాపం తెలుగు
ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు లేక అంపశయ్య మీద మూలుగుతూ
ఉంది.అది కాక మనకు గంట దూరం లో చేస్తుంటే వెళ్ళాలి
అని మనసు కొంచెం మూలిగింది.కాని బడి,ఇల్లు ఇవన్ని వదిలి
ఏమి పోతాము లే అనుకోని గమ్ముగా ఉన్నాను.ఇంతలో
ములుగు.లక్ష్మి ఫోన్....వస్తున్నావా?అని,తోడు ?అడిగాను.
మా వారు వస్తున్నారు చెప్పింది.హమ్మయ్య అన్నయ్య వస్తే దిగులు లేదు.
మెల్లిగా ఈయన చెవిలో ఊది సాయంత్రం వస్తాను అని ఒప్పించాను.
ఇంకేమిటి...బడికి ఫోన్ చేసి సి.ఎల్ చెప్పేసి రెండురెక్కలు విప్పేసుకొని
యెగిరి తిరుపతికి .........
రేణుగుంట ముందే బస్ బై పాస్ లోకి వెళ్ళింది.ఇక అక్కడి నుండి అన్నీ ఫ్లేక్సీలు,మామిడి తోరణాలు,అరటి చెట్లు ,
చివరికి పూల కుండీల మీద కూడా ''అ,ఆ,ఇ ,ఈ ''అని ముగ్గులు,
ఆహా భలే తీర్చారు,అక్కడక్కడా తెలుగు మహానుభావులు,
''ఇది మన సొంత ఇంటి పండుగ ...రండి ...కలిసి మెలిసి పాల్గొందాము నిండుగా ''
ముఖ్య మంత్రి గారు నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు.
అయ్యో అన్నగారు ఏరి?
''ఆవకాయ లేని అన్నమా?అన్న గారు లేని తెలుగు ఉత్సవమా ?''
హమ్మయ్య అరుగో కృష్ణుని లాగా....మనసు తృప్తి పడింది.ఇక
వివిధ వ్యాపార సంస్తల వాళ్ళు కూడా ఫ్లేక్సీలు పెట్టారు.
''అభివృద్దికి ఉండాలి నింగే హద్దు ,అది బాషాచారాలు మింగే వద్దు''
...హోటల్ బ్లిస్స్, ఇదేమిటిఅంటారా?
నాకు అర్ధం కాకనే ఇక్కడ ఉంచాను.
బస్ స్టాండ్ లో ఉచితబాస్ లో ఎక్కి పన్నెండుకు
''పశు వైద్య విశ్వ విద్యాలయం''చేరుకున్నాము.
ఎవరో అంబాజీ అంట భలే వేసారు స్టేజ్,బోజన శాల,స్టాల్స్,సైకత శిల్పం
ప్రధాన వేదిక అయితే అదిరింది.తామర పువ్వు నుండి వచ్చినట్లు భలే వేశారు.
(ఫోటోలు నేను ఫోటో బ్లాగ్ పెట్టిన తరువాత ఉంచుతాను)
ఆహ్హ్హ తెలుగు పండుగ చూస్తుంటే కళ్ళకు విందే.ఇక రక రకాల
శకటాలు,సాంస్కృతిక కళా రూపాలు ....పాండురంగ భజన,
తప్పెట్లు,బుడ బుక్కల వాళ్లు,చెంచులు,పగటి వేషగాళ్ళు వాళ్లు
కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు ఉన్నారు.భోజన ఏర్పాట్లు
బాగున్నాయి కాని చాలలేదు.
కిరణ్ గారు చాలా కష్టపడి తెలుగులో మాట్లాడారు(హమ్మయ్య మన
పరువు పోలేదు)అందరు పంచలలో చక్కగా ఉన్నారు .
నాకైతే వై .ఎస్.ఆర్ గారు గుర్తుకు వచ్చారు.మన ఆహార్యానికి
యెంత గౌరవం ఇస్తారో ఆయన.
స్టాల్స్,అక్షరం చెట్టు,సైకత శిల్పం ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను.
మధ్యాహ్నం
''రాళ్ళ బండి కవితా ప్రసాద్''గారి
ఆధ్వర్యం లో ''ఆధునిక కవి సమ్మేళనం'' జరిగింది.
ఇది ఇంకో పోస్ట్ వ్రాస్తాను.బస్ ఎక్కుతుంటే ఈయన
అంపకాలు''పుస్తకాలు కొనుక్కొని రావొద్దు''ఇంకా
అంటారు ........
ఏముంటుంది దానిలో?
ఎలా ఉంటుంది?ఎలా చెప్పాలి ?
అనుభూతిని అక్షరీకరించగలమా?
నీ గుండెలపై నా తల వాలినపుడు నీకెలా ఉంటుందో
అక్షరాలు నా కనుపాపల పై వాలినపుడు అలా ఉంటుంది .....
నా పాపటి కుంకుమ నీ పెదాల పై యెంత రుచి ఇస్తుందో
బాష వెనుక భావాలు నాకు అంత రుచినిస్తాయి .........
పాప ను తొలిసారి నీ చేతుల్లోకి తీసుకుంటే స్పర్శ ఎలా ఉందొ
ఇష్టమైన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే నా మనసుకు అలా ఉంటుంది ......
ఎలా చెప్పాలి?ఏమని చెప్పాలి?హ్మ్ .......
ఈ రోజు పేపర్ చదివినాక ఒకర్ని చూడలేదే అని మనసు బాధగా
మూలిగింది.అది ''అన్యా గారు '' ఈవిడ ఎవరు అంటే...ఎనబైల్ల్లో
ఉన్నత పాటశాల స్తాయికి వచ్చిన వాళ్లు అందరికి
విశాలాంధ్ర వ్యాన్ ద్వారా పరిచయం అయిన సోవియట్ పుస్తకాలు
''రాదుగా''''ప్రగతి'' ప్రచురణ సంస్తలలో పని చేసిన వారు.
అప్పట్లో పిల్లల తలపుల్లో సృజనాత్మకత ఈ పుస్తకాల
వలన వికసించేది.ఈ రోజుకు కూడా నాకు విశాలాంధ్ర వ్యాన్
అంటే అంత గౌరవం,ఇష్టం.మా నాన్న వేలు పట్టి వ్యాన్ లోకి
వెళ్లి కొన్న ''ఎర్ర కోడి''కధలు ,జమీల్య,రసాయనిక మూలకాల
రహస్యాలు(ఈ పుస్తకం చదివే మాకు రసాయన శాస్త్రం అంటే భలే
ఇష్టం వచ్చింది.ఊరికే చెప్పకుండా చిన్న చిన్న కవితలతో
కధలుగా ఆవిష్కరణలు చెపుతుంటే....ఈ రోజుకు కూడా నేను
దానిని చదువుతూ ఉంటాను).అసలు పెళ్లి అయినాక అత్తగారింటికి
వెళ్ళటానికి బట్టలు కంటే ముందు ఈ పుస్తకాలు సర్దుకున్నాను.
''మా నాన్న వేలు పట్టుకొని'' ''అమ్మ దిద్దించిన అక్షరాలు ''
రెండు పోస్ట్లులు వేస్తాను చూడండి.ఇప్పటికీ నా దగ్గర ఉన్న
నావి,మా పిల్లలకి కొన్నవి రాదుగా,ప్రగతి ప్రచురణలు
ఫోటోలో చూడండి.
చిత్రం ఏమంటే మా పిల్లలకు కూడా అవి భలే నచ్చాయి.
ఇప్పటికి ''బుల్లి మట్టి ఇల్లు''కధలో మేక పాట పాడి లేపి
వాళ్ళను నవ్విస్తుంటాను.దొరికితే ఒక్క సారి వాటిని చూడండి.

3 comments:
కెవ్వ్వ్వ్వ్వ్వ్..... మీరు వెళ్ళారా? అదృష్టవంతులు....
నేనిక్కడ కుళ్ళింగ్స్... ;(
కవిత కుమ్మారు....;)
"ప్రధాన వేదిక అయితే అదిరింది.తామర పువ్వు నుండి వచ్చినట్లు భలే వేశారు".
నిజంగా చాలా బాగుంది కదా, థాంక్యు.....
(థాంక్యు ఎందుకు అనుకుంటున్నారా? అదంతే )
raaj :))
స్వాతి గారు నిజంగా అడగాలి అని ఉంది.
థాంక్ యు ఎందుకో చెప్పరా ప్లీజ్
Post a Comment