అమ్మా మేమందరం మిగిలిన కాలేజ్ వాళ్ల తో కలిసి
డిల్లీ అమ్మాయి విషయం లో ఏదైనా నిరసన తెలియచేస్తే
ఎలా ఉంటుంది?అడిగింది పాప.
నా మనసులో ఉన్నది అదే ....మేము ఏదో చెప్పడం,
అభిప్రాయాలు తెలపడం కాదు, ఎవరి దగ్గర నుండి చైతన్యం
రావాలో అక్కడ నుండి రావాలి.వాళ్ళ విషయాలను ,హక్కులను
పరిరక్షించుకునే చైతన్యం తప్పని సరి వాళ్లకు.ఎప్పుడూ ఎవరో
ఒకరు వచ్చి కాపాడరు.అసలు ఆ అమ్మాయికి తోడు ఉన్నారు
కూడా ,ఏమి అయింది?ఎవరు పిలిస్తే అంత మంది వచ్చారు?
తప్పు ఒప్పులు నిర్ణయించగల విచక్షణే అంత మందిని అక్కడకు
రప్పించింది.
నేను ఇక్కడ అభిప్రాయాలు ఏమి చెప్పను.కొంచెం విశ్లేషిస్తాను.
ఎందుకంటె అభిప్రాయాలు అనేవి ఏనుగు పరిశీలించే గుడ్డి వాళ్ళ
మాటలు లాంటివి.కాలు పట్టుకున్నవాళ్ళు స్థంభం లాగుంది అంటారు.
తోక పట్టుకున్న వాళ్లు సన్నగా తాడు లాగా ఉంది అంటారు.విజ్ఞతతో
మనం అన్నీ విని ఒక నిర్ణయానికి రావాలి .
అందరు ఒకే గొంతుతో చెప్పే మాట ''వాళ్లకు పెద్ద శిక్ష పడాలి
అపుడే మిగిలిన వాళ్లకు భయం ఉంటుంది''అని.నిజమే
కానీ అదే పరిష్కారం కాదు.తీసుకోవాల్సిన చాలా చర్యలలో
అది ఒకటి.
రెండోది ......మీరు చదివే ఉంటారు.పక్క రోజు వాళ్ళల్లో కొంత
మంది తమ తప్పు ఒప్పుకొని తమకు శిక్ష వేయమని ఒప్పుకున్నారు.
మరి ఆ తెలివి ముందు రోజు ఏమి అయింది?సమాధానం అందరికి
తెలుసు...మద్య పానం .అది మనిషి లోని మృగాన్ని బయటకు తెస్తుంది.
ఆ మృగానికి మనం వేసిన శిక్షలు అప్పుడు భయం కలిగించవు.
ముందు చేయాల్సింది .....దీని గురించిన ఎరుక అందరిలోకి
తీసుకుని రావడం .తాగడం అనేది మామూలే అని తాగడం అలవాటు
అయిన వాళ్లు అనవచ్చు.అందరికి అలవాటు అయినంత మాత్రాన
అది తప్పు కాకుండా పోదు.ఖచ్చితంగా వాళ్లు దానిలోనుండి బయటకి
రావాల్సిందే.
మేము ''లీడ్ ఇండియా''ట్రైనింగ్ లో మానసిక నైపుణ్యాలు అనే
క్లాస్స్ లో ఏమి చెపుతాము అంటే....ఆలోచనలు>>మాటలు>>
చేతలు>>అలవాటు>>వైఖరి .....ఇలాగ ఒక వరుసలో మనం
మంచి అలవాట్లు వైపు అయినా,చెడు వైపు అయినా వెళ్ళిపోతాము.
ఆలోచనలు అనే స్టేజ్ లో విచక్షణ అనేది ఉపయోగిస్తే మనం
మంచి వైపుకు వెళ్లి పోతాము.మనం దీనిని చిన్న పిల్లలు అప్పటి
నుండి అభివృద్ది చేయాలి.
దీనితో పాటు అమ్మాయిలూ కొంత వరకు ఆత్మ రక్షణ విద్యలు
నేర్చుకోవాలి.మన పురాణాలలో స్త్రీలు కూడా నేర్చుకొనేవారు.
అసలు వీళ్ళు ఎందుకు బయటకి రావడం అనేవాళ్లకు చిన్న
విన్నపం .....స్త్రీ పురుష శక్తులు పరస్పరాశ్రితాలు.తెలివి గల
సమాజం వాళ్ళలోని జ్ఞానాన్ని కూడా చక్కగా వినియోగించుకొని
ముందుకు వెళ్ళాలి.సగం లోకం లో నిండిన శక్తిని చదువుకున్న
సంస్కారవంతులుగా ఉన్న మనం చిన్న చూపు చూడ కూడదు.
''ఆడవాళ్ళు కూడా చక్కగా పనులు నిర్వహించగలరు.
సమాజ నిర్మాణం లో వారి భాగం కూడా ఉండాలి
అనుకొనే వాళ్లు ఈ క్రింది మేటర్ చదవండి''

3 comments:
మీరు చెప్పినదానితో.. నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
ఢిల్లీ దారిలోనే గల్లీ, గల్లీ నడవాలి.
thank you vanaja akka
bongiri garu thank you
Post a Comment