శైలబాల రచించిన నాన్న నావల్ గూర్చి నా సమీక్ష
(శైలబాల బ్లాగ్ లింక్ ఇక్కడ )
ఒక తరం వారు ఇంకో తరాన్ని ఆశీర్వదిస్తూ ఇవ్వవలసిన బహుమతి.
" నాన్న " నవల
'నాన్న''పుస్తకం చేతిలోకి తీసుకోగానే అక్షరాల సువాసన ,బహుశా ఆత్మీయత
కలిపినందువలన ఏమో !!
కలిపినందువలన ఏమో !!
కళ్ళు పుస్తక తలుపు మీటగానే చిన్నారి పాప నవ్వుతూ
''తల్లి భూదేవి తండ్రి ఆకాశం
''తల్లి భూదేవి తండ్రి ఆకాశం
మధ్య విరిసిన హరివిల్లులు బిడ్డలు'' అని చెపుతూ రండి మా నాన్నను
పరిచయం చేస్తాను అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది.
పరిచయం చేస్తాను అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది.
ఇది ఒక నాన్న ఆడ పిల్ల తండ్రిగా ఉప్పొంగిన ఆనందం,
అనుబంధాల ఘర్షణ లో అంతరంగం లో జరిగే మార్పులు
అనుబంధాల ఘర్షణ లో అంతరంగం లో జరిగే మార్పులు
ఒక మంచి సమాజ స్తాపన వైపు వారు నడిచే తీరు శైల బాల గారి కలం లో
అద్భుతంగా జాలు వారింది.
అద్భుతంగా జాలు వారింది.
పుస్తకం లోకి వెళితే చంద్రశేఖరం వారి భార్య ,వారికి ముగ్గురు పిల్లలు .
చివరిదైన అమ్ము పెంపకం లో తన తోడు లో తాను అనుభవించిన ఆనందం గూర్చి
చంద్ర శేఖర్ గారు మనతో పంచుకుంటారు.ఆయన ఒక మంచి నాన్న .....ఎంత అంటే ....
ఉయ్యాలలో పాప ''ఊహూ''అన్నా పాప ఆజ్ఞగా పాటించే అంత
పాపకు అక్షరాభ్యాసం తో పాటు ఆమెకు నచ్చిన పేరు అడిగి ఆ రోజే పెట్టె అంత
పాప ముగ్గు వేయమంది అని పాప కోసం గొబ్బెమ్మలు కూడా దొంగలించుకొని
వచ్చే అంత
వచ్చే అంత
చివరికి తన పాప లాగా అల్లుడు కూడా చాక్లెట్ తింటాడా తినడా
అని పెళ్ళికి ముందే పరీక్షించే అంత .....
అని పెళ్ళికి ముందే పరీక్షించే అంత .....
మంచి అమ్మ ,మంచి నాన్న ,మంచి అమ్ము,మంచి అల్లుడు ,మంచి తాతయ్య,మంచి నానమ్మ
మరి కధ ఏముంది?
అదే మరి తెలుసుకోవాల్సినది.
కూతురు కడుపుతో ఉందని చూద్దాము అని వచ్చిన ఇంత మంచి నాన్నకి అల్లుడు గొంతు
బయటే వినపడుతుంది ''మీ నాన్న ప్రవర్తన నాకు నచ్చదు''అని,
బయటే వినపడుతుంది ''మీ నాన్న ప్రవర్తన నాకు నచ్చదు''అని,
చిన్నపోయిన గుండె తట్టుకోగలదా?
చంద్రశేఖరం ఆ విషయాన్ని తేలికగా వదలదు
ఎందుకు తన ప్రవర్తన అల్లుడికి నచ్చదో తెలుసుకుంటాడు
పశ్చాత్తాపం తో తన ప్రవర్తన సరిదిద్దుకోవడమే ఈ కధ .
కాదు బంధాలను ఇంకో సారి తడిమి చూసుకోమని మనకు ఇచ్చే
ఒక కోయిల కూత.కమ్మని మనసు పాడే రాగం.
ఒక కోయిల కూత.కమ్మని మనసు పాడే రాగం.
మంచి వాక్యాలు బోల్డ్ చేయడం ,చివరి పేజ్ లో సీతా రాములు చిత్రం
రచయిత్రి అభిరుచిని తెలియ చేయడమే కాక మనను ఆత్మీయంగా పలకరిస్తాయి.
ఇంకా అమ్ము (పేరు గీతాంజలి) అమ్మా నాన్న ల సహాయంతో తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దు
కోవడమే కాక తన చుట్టూ ఉండే వారిని చేరదీయడం మనిషిగా మన బాధ్యత ను గుర్తు చేస్తాయి.
మరీ ముఖ్యంగా వాళ్ళు ''బృందావనం''అనే సామాజిక కార్యక్రమాన్ని
పరిచయం చేసేటపుడు అందరికి తమ అనుభవాలను చెప్పడం .....
ఒక్క క్షణం రచయిత్రి ఆత్మ అక్షరాలుగా కనిపించి
పరిచయం చేసేటపుడు అందరికి తమ అనుభవాలను చెప్పడం .....
ఒక్క క్షణం రచయిత్రి ఆత్మ అక్షరాలుగా కనిపించి
మన హృదయం తడి అవుతుంది.
కొని మంచి వాక్యాలు
''భర్త దగ్గర భార్యకి ''నిశ్చింత''ఉండాలిరా ఆందోళన కాదు.....
కాని భర్తే ఒక సమస్యగా మారి ఆ పిల్ల ఆందోళన చెందకూడదు''
''చిరుగాలి ఆటలాడుతూ ధడెల్మని తలుపులు తోసుకొని వచ్చినంత
స్వేచ్చగా ఇంట్లోకి రాగలిగేతేనే ......అది చక్కటి అనుబంధం అవుతుంది''
స్వేచ్చగా ఇంట్లోకి రాగలిగేతేనే ......అది చక్కటి అనుబంధం అవుతుంది''
''నాన్నా ఒక వ్యక్తి ని ఇష్టపడినపుడు,ప్రేమించినపుడు తర్వాతా
ఎన్ని ఇష్టం లేని కారణాలు బయటపడినా ఆ ఇష్టం లో ఆ ప్రేమలో
మార్పు రాకూడదు.ఆ ఇష్టం ,ప్రేమ ఇంకా పెరగాలట.
ఎన్ని ఇష్టం లేని కారణాలు బయటపడినా ఆ ఇష్టం లో ఆ ప్రేమలో
మార్పు రాకూడదు.ఆ ఇష్టం ,ప్రేమ ఇంకా పెరగాలట.
ఆప్పుడే ఆ ఇష్టం లేని కారణాలను మార్చుకొనే తాపత్రయం,
భరించే ఓర్పు పుట్టుకోస్తాయట.''
భరించే ఓర్పు పుట్టుకోస్తాయట.''
''నీ భార్య చెప్పేది పూర్తిగా విను ...
తనను పూర్తిగా గౌరవించు ....
తనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడు
సంపూర్ణంగా ప్రేమించు....''
మనసుని హత్తుకొనే మల్లెల సువాసన లా ఎన్ని మంచి వాక్యాల కూర్పు.
ప్రపంచీకరణ నేపధ్యం లో పరుగులే అవసరం,స్వార్ధమే ముఖ్యం అనుకునే ప్రపంచం లో
బంధాల విలువులు తెలిసిన వారు చదివి తప్పక దాచుకోవాల్సిన పుస్తకం.
బంధాల విలువులు తెలిసిన వారు చదివి తప్పక దాచుకోవాల్సిన పుస్తకం.
ఒక తరం వారు ఇంకో తరాన్ని ఆశీర్వదిస్తూ ఇవ్వవలసిన బహుమతి.
''నాన్న''పుస్తకం శైల బాల జీవితం లో ఒక చక్కని జ్ఞాపకం.
తన్నీరు శశికళ
4 comments:
చాలా మంచి పుస్తకం పరిచయం చేసారు శశి గారు. ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాల్సిందే. తమని తాము ఎలా పర్యవేక్షించుకోవాలో చక్కగా తెలిపే బుక్.
అమ్మాయిల ప్రేమ,ఆప్యాయతానురాగాలు
అమ్మనాన్నల అనురాగంలో సగభాగాలు
తను సగ భాగపు అనురాగంలో ఒదిగనా
మాతృత్వపు మమకారపు ఒడిలో పొదిగినా
కుదురుగా కడవరకు నిలిచేది కన్నమమకారం!
జయ గారు,శివ గారు థాంక్యు
THank u Jaya garu and Thank u sasi akka
Post a Comment